ముంబై: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ పోలీస్ ఉన్నతాధికారిపై కేసు నమోదైన 9 నెలల తర్వాత చార్జిషీటు దాఖలైంది. డీఐజీ సునీల్ పరాస్కర్ (57) పై బోరివలీ కోర్టులో 724 పేజీల చార్జిషీటు దాఖలు చేసినట్లు క్రైం బ్రాంచ్ అధికారులు తెలిపారు. 58 మంది సాక్ష్యులు, ఫిర్యాదుదారుల వాంగ్మూలాలతో కూడిన అభియోగపత్రాన్ని మంగళవారం మెజిస్ట్రేట్ ముందుంచారు. తదుపరి విచారణ కోసం కేసును సెషన్స్ కోర్టుకు బదిలీ చేశారు. జూన్ 12న కోర్టుకు సునీల్ పరాస్కర్ వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. 2013 డిసెంబర్‌లో తనపై పరస్కార్ అత్యాచారం చేశారని 25 ఏళ్ల మోడల్ ఆరోపించింది.
ఈ మేరకు గతేడాది జూలైలో పరాస్కర్‌పై మాల్వాణీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ పలు సెక్షన్ల కింద నమోదైంది. అయితే అరెస్ట్‌కు ముందే మహిళా ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. ఈ కేసు ఉద్దేశపూర్వకంగా పెట్టినట్లుందని ఆ బెయిల్ ఇచ్చే సమయంలో కోర్టు పేర్కొంది. వివరాలు.. 2012లో పరాస్కర్ అదనపు కమిషనర్‌గా ఉండగా ఓ కేసుకు సంబంధించి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.
అత్యాచారం కేసులో డీఐజీపై చార్జిషీటు
Published Wed, May 13 2015 12:11 AM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM
Advertisement