London Police Files Chargesheet On Kevin Spacey Over Sexual Assault Charges, Details Inside - Sakshi
Sakshi News home page

Kevin Spacey Sexual Assault Charges: పురుషులపై లైంగిక వేధింపులు, నటుడుపై చార్చ్‌షీట్‌ దాఖలు

Published Fri, May 27 2022 8:05 PM | Last Updated on Fri, May 27 2022 9:24 PM

London Police Files Chargesheet On Actor Kevin Spacey Over Molestation - Sakshi

ప్రముఖ బ్రిటిష్‌ నటుడు, ఆస్కార్‌ అవార్డు గ్రహిత కెవిన్ స్పేసీ లైంగిక దాడి కేసు నమోదైంది. ముగ్గురు పురుషులపై నాలుగు సార్లు లైంగిక​ దాడికి పాల్పడినట్టు కెవిన్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో బ్రిటిన్‌ పోలీసులు లైంగిక దాడి ఆరోపణలు రుజువైనందున ఆయనపై తాజాగా చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. బలవంతంగా లైంగిక చర్యలకు పాల్పడం చట్టరిత్యా నేరమని, అందుకే నటుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.   

చదవండి: అందుకు క్షమాపణలు చెప్పిన కమల్‌ హాసన్‌..

2005లో మార్చి మీటూ ఉద్యమం సమయంలో తొలిసారిగా ఆయనపై లండన్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత 2008 అగష్టులో, 2013 ఏప్రిల్‌లో పశ్చిమ ఇంగ్లాండ్‌లో ఆయనపై ముగ్గురు లైంగిక ఆరోపణలు చేశారు. ముగ్గురు పురుషులపై కెవిన్ నాలుగు సార్లు వేధింపులకు పాల్పడినట్టు ద క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ తెలిపింది. ఒక వ్యక్తిపై వేధింపులకు పాల్పడ్డాడని... ఇద్దరు వ్యక్తులతో లైంగిక చర్యల్లో పాల్గొన్నాడని పోలీసులు తమ ఛార్జ్ షీట్‌లో  పేర్కొన్నారు. అయితే ఇంగ్లీష్ చట్టాల ప్రకారం బాధితులను, వారి పేర్లను మీడియాకు వెల్లడించలేదు. 

చదవండి: ‘థ్యాంక్‌ యూ’ టీజర్‌, నాగ చైతన్యపై రానా ఆసక్తికర వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement