సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వం సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఫిబ్రవరి నెలలో జరిగిన అల్లర్లలో 53 మంది మరణించిన విషయం తెల్సిందే. వీటికి సంబంధించి ఢిల్లీ పోలీసులు సెప్టెంబర్ నెలలో ఏకంగా 17 వేల పేజీల చార్జీషీటును దాఖలు చేశారు. ముందస్తు కుట్ర ప్రకారమే ఈ అల్లర్లు చెలరేగాయని, ఈ కేసులో మొత్తం 21 మంది అనుమానితులను అరెస్ట్ చేయగా, వారిలో 15 మందిని నిందితులుగా పేర్కొంటూ వారి చేసిన నేరాలు ఏమిటో విఫులంగా వివరిస్తూ ఢిల్లీ పోలీసులు ఈ చార్జీ షీటును దాఖలు చేశారు. చదవండి: ఢిల్లీ అల్లర్లు: 'వాట్సాప్ గ్రూప్'పై కేసు
ఈశాన్య ఢిల్లీలో జరిగిన ఈ అల్లర్ల గురించి ఢిల్లీ పోలీసు విభాగంలోని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మార్చి ఆరవ తేదీన తొలి ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేశారు. 59–2020 నెంబర్‌తో నమోదయిన ఈ ఎఫ్‌ఐఆర్‌లో జవహర్ లాల్ నెహ్రూ మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్‌ను ప్రధాన కుట్రదారుగా పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24–25 తేదీల్లో ఢిల్లీకి వచ్చినప్పుడు రోడ్లను దిగ్బంధం చేయాల్సిందిగా ప్రజలను రెచ్చ గొడుతూ ఉమర్ ఖలీద్ ప్రసంగించారు. మైనారిటీలను వేధిస్తున్నారంటూ అంతర్జాతీయ స్థాయిలో భారత్ పరవు తీయడమే ఖలీద్ లక్ష్యం. ఆయన తన సహచరులతో కలసి పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మహిళలను, పిల్లలను సమీకరించారు. వారు ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని కూడా సేకరించి ఇళ్లలో దాచి పెట్టారు. చదవండి: ఢిల్లీ అల్లర్లు: సల్మాన్ ఖుర్షీద్‌కు షాక్..!
టెర్రరిజమ్ నిరోధక చట్టం కింద అభియోగాలు
ఫిబ్రవరి 23వ తేదీన జఫ్రాబాద్ మెట్రో స్టేషన్ వెలుపల నిందితులు రోడ్డును బ్లాక్ చేశారు. ఆ ప్రాంతం ప్రజలకు ఇక్కట్లు కలిగించడం ద్వారా అల్లర్లకు వారిని సిద్ధం చేయడమే కుట్రలో భాగం. ఖలీద్ సహచరుడిగా ఎఫ్‌ఐఆర్‌లో ఈశాన్య ఢిల్లీకి చెందిన డానిష్‌ను పేర్కొన్నారు. వారిద్దరిపై అల్లర్లు, చట్ట విరుద్ధంగా సమావేశమవడం, నేరపూరిత కుట్ర అభియోగాలను ముందుగా మోపిన పోలీసులు, ఆ తర్వాత చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం, టెర్రరిజమ్ నిరోధక చట్టం కింద అభియోగాలను జోడించారు. ఈ రెండు అభియోగాల కింద నిందితులకు బెయిల్ దొరకడం అసాధ్యం. మార్చి 9వ తేదీన అరెస్టయిన నాలుగు రోజుల అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటికీ ఆయనపై అదనపు అభియోగాలు నమోదు కానందున బెయిల్ దొరికింది. సెప్టెంబర్ 13వ తేదీన అరెస్టయిన ఉమర్ ఖలీదుకు అదనపు అభియోగాల కారణంగా ఇప్పటికీ బెయిల్ లభించలేదు. చదవండి: ఇది ఆమోదయోగ్యం కాదు: సుప్రీంకోర్టు
వీరితోపాటు ఇదే కేసులో అరెస్ట్ చేసిన మిగతా 13 మంది నిందితులపై భారతీయ శిక్షాస్మతిలోని హత్యా, దేశద్రేహం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం లాంటి 26 సెక్షన్లతోపాటు ఆయుధాల చట్టంలోని రెండు సెక్షన్లు, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంలోని నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ కౌన్సిలర్లు, రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన స్థానిక నాయకుడు, జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీకి చెందిన రిసర్చ్ స్కాలర్ సఫూర్ జార్గర్ నిందితుల్లో ఉన్నారు. నిందితుల్లో 80 శాతం మంది మైనారిటీ వర్గానికి చెందిన వారే.
Comments
Please login to add a commentAdd a comment