
నటుడు సుశాంత్ ఆత్మహత్య బాలీవుడ్‌ను కుదిపేసింది. ఇది ఆత్మహత్య కాదని అనుమానాలు వ్యక్తం కావడం, డ్రగ్స్ కోణం కూడా బయటపడటంతో సుశాంత్ ప్రియురాలు, నటి రియా చక్రవర్తి మెడకు ఈ కేసు చుట్టుకుంది. పోలీసులు రియాతో పాటు ఆమె సోదరుడిని కూడా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో జైలు జీవితం గడిపిన ఈ నటి కొన్ని వారాల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చింది. తాను ఏ తప్పూ చేయలేదని చెప్తున్నా ఆమెపై వ్యతిరేకత మాత్రం పోవడం లేదు.
ట్రోలింగ్ దాదాపు తగ్గింది.. కానీ..
అంతేకాదు, తన కెరీర్ సైతం దెబ్బతిందని, ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదని వాపోయింది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. 'భయం, ట్రోలింగ్.. ఇలా చాలా ఫేస్ చేశాను. పరిస్థితి కొంత సద్దుమణిగింది. త్వరలోనే వాతావరణం అంతా మామూలైపోతుందనుకుంటున్నాను. ముఖ్యంగా ట్రోలింగ్ అయితే చాలావరకు తగ్గిపోయింది. గతంలో అయితే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న వ్యక్తిగా నేను మొదటి స్థానంలో ఉన్నాను.
నాకు ఛాన్సులు ఇవ్వడానికి భయపడుతున్నారు
ఆ స్థాయిలో నాపై విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో నా స్నేహితులు, కుటుంబం ఇచ్చిన అండదండల వల్లే బలం కూడగట్టుకుని నిలబడ్డాను. కానీ నాకు బాలీవుడ్‌లో అవకాశాలు రావడం లేదు. ఎవరూ ఛాన్సులు ఇవ్వడం లేదు. నన్ను సినిమాలోకి తీసుకునేందుకు భయపడుతున్నారు' అని బాధపడింది. కాగా రియా చక్రవర్తి 2021లో వచ్చిన చెహర్ సినిమాతో చివరిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తర్వాత బుల్లితెరపై ప్రసారమైన ఎమ్‌టీవీ రోడీస్: కరమ్ యా ఖాంద్ అనే రియాలిటీ షోలో గ్యాంగ్ లీడర్‌గా మెప్పించింది.
చదవండి: నెలసరి ఆలస్యం.. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్
Comments
Please login to add a commentAdd a comment