న్యూఢిల్లీ: కడుపులో కొకైన్ దాచుకుని విదేశాల నుంచి వస్తున్న ఒక మహిళను కస్టమ్స్ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఆ మహిళ ఉగాండ దేశస్థురాలిగా గుర్తించారు. ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు ప్రయాణికులను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో సదరు మహిళ కదలికలు అనుమానాస్పదంగా ఉండటాన్ని అధికారులు గుర్తించారు. తొలుత అధికారులు.. సదరు మహిళ గర్భవతి కాబోలు అని భావించారు. ఆమెను సహయం చేయడానికి ఆమెవైపు చేరుకున్నారు. అయితే.. ఆ మహిళ మాత్రం అధికారులను చూడగానే భయంతో వణికిపోయింది.
అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు తమదైన శైలీలో విచారించారు. ఆ తర్వాత... మహిళను ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్‌లో సదరు మహిళ కడుపులో ఒక కేజీ కొకైన్ క్యాప్సుల్స్ ఉన్నట్లు గుర్తించారు. కాగా, వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆమె కడుపులో నుంచి 91 కొకైన్ క్యాప్సుల్స్‌లను బయటకు తీశారు. వాటి బరువు 993 గ్రాముల వరకు ఉన్నట్లు తెలిపారు. దీని విలువ దాదాపు రూ. 14 కోట్లు ఉంటుందని తెలిపారు.
ఈ సంఘటనను చూసి అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాధారణంగా ఇప్పటి వరకు 400 గ్రాముల వరకు కొకైన్‌ను రవాణా చేయడం మాత్రమే చూశామన్నారు. ఇంత భారీ ఎత్తున కొకైన్ రవాణా చేయడం చూడలేదన్నారు. ఇది కడుపులో విస్ఫోటనం చెందితే మహిళ ప్రాణాలకే ప్రమాదమన్నారు. బాధిత మహిళ కోలుకోవడానికి మరో నాలుగు రోజులు పడుతుందని వైద్యులు తెలిపారు.
మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఇదేం ఐడియారా బాబు..’, ‘వీడొక్కడే సినిమా గుర్తొచ్చిందంటూ..’ కామెంట్‌లు చేస్తున్నారు.
Correction: The estimated value of the drug is Rs. 14 crores. This is the 24th case of seizure of NDPS covered drugs at Delhi airport this year. 32 passengers have been arrested so far. The estimated value of drug seizures would go into more than Rs. 845* crores: Customs Dept pic.twitter.com/nSgyZQo79U
— ANI (@ANI) December 29, 2021
Comments
Please login to add a commentAdd a comment