seazed
-
వీడొక్కడే సినిమాలో లాగా.. మహిళ కడుపులో.. అధికారులు షాక్..
న్యూఢిల్లీ: కడుపులో కొకైన్ దాచుకుని విదేశాల నుంచి వస్తున్న ఒక మహిళను కస్టమ్స్ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఆ మహిళ ఉగాండ దేశస్థురాలిగా గుర్తించారు. ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు ప్రయాణికులను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో సదరు మహిళ కదలికలు అనుమానాస్పదంగా ఉండటాన్ని అధికారులు గుర్తించారు. తొలుత అధికారులు.. సదరు మహిళ గర్భవతి కాబోలు అని భావించారు. ఆమెను సహయం చేయడానికి ఆమెవైపు చేరుకున్నారు. అయితే.. ఆ మహిళ మాత్రం అధికారులను చూడగానే భయంతో వణికిపోయింది. అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు తమదైన శైలీలో విచారించారు. ఆ తర్వాత... మహిళను ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్‌లో సదరు మహిళ కడుపులో ఒక కేజీ కొకైన్ క్యాప్సుల్స్ ఉన్నట్లు గుర్తించారు. కాగా, వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆమె కడుపులో నుంచి 91 కొకైన్ క్యాప్సుల్స్లను బయటకు తీశారు. వాటి బరువు 993 గ్రాముల వరకు ఉన్నట్లు తెలిపారు. దీని విలువ దాదాపు రూ. 14 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ సంఘటనను చూసి అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాధారణంగా ఇప్పటి వరకు 400 గ్రాముల వరకు కొకైన్‌ను రవాణా చేయడం మాత్రమే చూశామన్నారు. ఇంత భారీ ఎత్తున కొకైన్ రవాణా చేయడం చూడలేదన్నారు. ఇది కడుపులో విస్ఫోటనం చెందితే మహిళ ప్రాణాలకే ప్రమాదమన్నారు. బాధిత మహిళ కోలుకోవడానికి మరో నాలుగు రోజులు పడుతుందని వైద్యులు తెలిపారు. మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఇదేం ఐడియారా బాబు..’, ‘వీడొక్కడే సినిమా గుర్తొచ్చిందంటూ..’ కామెంట్లు చేస్తున్నారు. Correction: The estimated value of the drug is Rs. 14 crores. This is the 24th case of seizure of NDPS covered drugs at Delhi airport this year. 32 passengers have been arrested so far. The estimated value of drug seizures would go into more than Rs. 845* crores: Customs Dept pic.twitter.com/nSgyZQo79U — ANI (@ANI) December 29, 2021 -
ఆసుపత్రి నిర్వాకం..పెరిగిన కరోనా కేసుల సంఖ్య
భువనేశ్వర్ : కోవిడ్ -19 మార్గదర్శకాలను ఉల్లంఘించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ ప్రైవేటు హాస్పిటల్ని అధికారులు బుధవారం సీజ్ చేశారు. ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్య ధోరణితో ఇప్పటిరకు 27 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి. మాంచెస్టర్‌లోని బ్లూ వీల్ హాస్పిటల్లో ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ నిబంధనల్ని గాలికొదిలేశారు. కరోనా సోకిన బాధితుల్ని కూడా మిగతా సాధారణ రోగులతో కలిపి ఉంచారు. (కరోనాను అడ్డుకునే అత్యవసరాలు రైల్వే స్టేషన్లో లభ్యం ) సాధారణంగా అయితే వైరస్ సోకిన బాధుతుల్ని ఐసోలేషన్ వార్డుకు తరలించి ప్రత్యేకంగా చికిత్స అందిస్తారు. అంతేకాకుండా పీపీఈ కిట్, ఎన్95 మాస్క్ సహా పలు జాగ్రత్తలు పాటించి వైద్యం అందించాల్సి ఉంటుంది. కానీ బ్లూవీల్ ఆస్పత్రి వైద్యాధికారులు మాత్రం ఈ నిబంధనల్ని గాలికొదిలేసి సాధారణ రోగులతో సహా వీరిని కూడా ఒకే వార్డులో ఉంచారు. ఆకస్మిక తనఖీలు చేపట్టిన అధికారులు సైతం యాజమాన్యం ప్రదర్శించిన నిర్లక్ష్య ధోరణికి నివ్వెరపోయారు. మిగతా వారికి కూడా పరీక్షలు నిర్వహించగా 27 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆస్పత్రిని సీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.. (రక్తం అవసరం ఉన్నవారికి ఇకపై సులభంగా ) -
తిరుపతిలో ఎర్రచందనం పట్టివేత
సాక్షి, తిరుపతి: తిరుపతి నగరంలోని హరిత కాలనీలో మంగళవారం పోలీసులు దాడిచేసి ఎర్రచందనం దుంగలను స్వాదీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు ఓ వాహనంలో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా వెళ్ళి పట్టుకున్నారు. పోలీసులను చూసిన స్మగ్లర్లు ఎర్రచందనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ సందర్బంగా 12 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారైన స్మగ్లర్ల కోసం గాలింపుచర్యలు చేపట్టారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం
సాక్షి, శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆదివారం భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి షార్జా వెళుతున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా విదేశీ కరెన్సీ బయటపడింది. అనంతరం ఆ వ్యక్తిని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
250 కిలోల ఎర్రచందనం సీజ్,15 మంది అరెస్ట్
సాక్షి, కడప : వైఎస్సార్ జిల్లా సుండుపల్లి శేషాచల అడవుల్లో తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 250 కిలోల ఎర్రచందనం దుంగలను పోలీసులు బుధవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 15 మంది స్మగ్లర్లను అరెస్టుచేశారు. పట్టుకున్న ఎర్రచందనం విలువ 15 లక్షల రూపాయలు ఉంటుందని వారు చెప్పారు. స్మగ్లర్ల నుంచి 8 మొబైల్ ఫోన్లు, రూ.30 వేల నగదు, ఒక టెంపో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కడప డీఎస్పీ మాసూమ్‌బాషా తెలిపారు. -
144 సబ్సిడీ గొర్రెలు పట్టివేత
సాక్షి, జనగామ : రాష్ట్ర ప్రభుత్వం గొల్ల, కురుబలు ఆర్ధికాభివృద్ధి సాధించేందుకు ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం పక్కదారిపడుతోంది. రైతులకు దక్కాల్సిన గొర్రెలను బ్రోకర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్థరాత్రి హైదరాబాద్ రోడ్డు కళింగ ధాబా వద్ద హన్మకొండ నుంచి రెండు డీసీఎం వాహనాలలో 281 గొర్రెలను హైదరాబాద్‌కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ పరమేశ్ కాపుకాసి గొర్రెలను తరలిస్తున్నరెండు వాహనాలను పట్టకున్నారు. జిల్లా కేంద్రంలోని బీరప్పగడ్డ ఆలయ సమీపంలో వాటిని ఉంచారు. ఇందులో 144 సబ్సిడీ గొర్రెలు ఉన్నట్లు పశుసంవర్దక శాఖ వైద్యులు గుర్తించారు. వైద్యులు సబ్సిడీ గొర్రెలు ఉన్నట్లు నిర్దారించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రెండు ప్రైవేట్ బస్సులు సీజ్
అనంతపురం సెంట్రల్ : నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపించారు. శనివారం జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగానే అనంతపురం నగర సమీపంలోని తపోవనం, గుత్తి టోల్‌ప్లాజా వద్ద చేసిన తనిఖీల్లో నిబంధనలు పాటించని 10 బస్సులపై కేసులు నమోదు చేసినట్లు మోటర్ వెహికల్ ఇ¯Œ్సపెక్టర్ వరప్రసాద్ తెలిపారు. ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించకుండా బెంగుళూరు టూ హైదరాబాద్‌కు తిరుగుతున్న ఆరంజ్ ట్రావెల్స్, పుట్టపర్తి నుంచి హైదరాబాద్‌కు తిరుగుతున్న బీఎల్ఆర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. -
తమిళనాడు రేషన్ బియ్యం పట్టివేత
సూళ్లూరుపేట : తడ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ప్రాంతం నుంచి నెల్లూరుకు అక్రమంగా తరలిస్తున్న 400 బస్తాలు తమిళనాడు రేషన్ బియ్యాన్ని స్థానిక ఎస్సై జీ గంగాధర్‌రావు సోమవారం అర్ధరాత్రి పట్టుకుని సీజ్‌చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు అందించిన సమాచారంతో సూళ్లూరుపేట స్వర్ణ టోల్‌గేటు వద్ద నిఘా వేసి లారీని పట్టుకున్నారు. వివరాలు.. నాయుడుపేటకు చెందిన జమాల్ అనే వ్యక్తికి చెందిన లారీలో వాటంబేడుకు చెందిన కొంతమంది బియ్యాన్ని లోడ్ చేసుకుని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మరో వర్గంతో వివాదం చోటుచేసుకోవడంతో పోలీసులకు సమాచారం అందింది. వారు లారీని పట్టుకుని ఎస్పీ, డీఎస్పీ కార్యాలయానికి సమాచారం అందించి కేసు నమోదుచేశారు. సీఐ, ఎస్సై మధ్య కోల్డ్‌వార్.. స్థానిక సీఐకు, ఎస్సైకు మధ్య కోల్డ్‌వార్ నడుస్తుండటంతోనే లారీని పట్టుకున్నట్లుగా చెబుతున్నారు. తడ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో గత కొంతకాలంగా బియ్యం స్మగ్లింగ్ కేంద్రం నడుస్తోంది సీఐ తడ మండలానికి చెందిన టీడీపీ యువజన నాయకుడ్ని ప్రత్యేకంగా వసూళ్ల కోసం నియమించుకున్నట్టుగా తెలుస్తోంది. సోమవారం రాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన గొడవను సర్దుబాటు చేసేందుకు సీఐ టీడీపీ నాయకుడ్ని పంపించారు. అతను Ðð ళ్లాక గొడవ ఇంకా పెద్దదై ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి Ðð ళ్లింది. ఈ గొడవల నేపథ్యంలో సూళ్లూరుపేట ఎస్సైకు సమాచారం అందించడంతో ఆయన లారీని పట్టుకుని సీజ్ చేశారు. మామూళ్లు మొత్తం సీఐ తీసుకుంటుండంతో ఎస్సై లారీని పట్టుకుని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. -
9 ట్రాక్టర్లు, 6 ఆటోలు సీజ్
కోవూరు: నిబంధనలకు విరుద్ధంగా, సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న 9 ట్రాక్టర్లు, 6 ఆటోలను సోమవారం సీజ్ చేసి కోవూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎస్ఐ అళహరి వెంకట్రావు కోవూరులో తనిఖీలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ వాహనాలు నడిపే వారికి లైసెన్స్ లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లైసెన్స్ లేకపోతే బాధితులకు ఎటువంటి ఆర్థిక భరోసా ఉండదన్నారు. దీన్ని దష్టిలో పెట్టుకుని వాహన చోదకులు సరైన పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. -
10 బస్తాల బియ్యం పట్టివేత
ఆర్వో లేకుండా తరలిస్తున్న వైనం కావలిఅర్బన్: ఆర్వో లేకుండా తరలిస్తున్న బియ్యపు బస్తాలను తహసీల్దార్ పట్టుకున్న సంఘటన బుధవారం పట్టణంలోని చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక మద్దూరుపాడు 32వ రేషన్‌షాపునకు ఆర్వో లేకుండా 10 బస్తాల బియ్యాన్ని ఆటోలో తరలిస్తున్నానే సమాచారం తహసీల్దార్ సాంబశివరావుకు అందింది. ఆయన వెంటనే స్పందించి ఆటోను పట్టుకుని బియ్యం ఎక్కడ నుంచి తరలిస్తున్నావని డ్రైవర్‌ను ప్రశ్నించారు. అతను ఏఎంసీలోని పీడీఎస్ గోడౌన్ నుంచి తీసుకువస్తున్నానని సమాధానమిచ్చాడు. అనంతరం తహసీల్దార్ గోడౌన్‌కు వెళ్లి రికార్డులు తనిఖీ చేయగా అందులో 10 బస్తాలు తరలిస్తున్నట్లు నమోదు చేయబడిఉంది. విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో ఆర్వో ఇవ్వలేకపోయామని పీడీఎస్ గోడౌన్ ఇన్చార్జి శంకర్రావు వివరణ ఇచ్చారు. రేషన్‌షాపును తహసీల్దార్ పరిశీలించారు. దీంతో విషయాలు బయటపడ్డాయి. మరో డీలర్‌కు అప్పగింత ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ ఆర్వో బిల్లులు లేకుండా బియ్యాన్ని తరలిస్తున్న ఆటోను సీజ్ చేస్తున్నామన్నారు. సరుకులు పొందాల్సిన కార్డుదారులు ఇంకా మిగిలి ఉండగా షాపులో బియ్యం ఇతర వస్తువులు కొంతమేరకు లేకపోవడంతో ఆ షాపును మద్దూరుపాడులోనే ఉన్న మరో డీలర్‌కు అప్పగిస్తున్నామని తెలిపారు. కార్డుదారులకు ఇంకా సరుకులు పంపిణీచేయని కారణంగా షాపు డీలర్‌పై 6ఏ కేసు నమోదుచేసినట్లు చెప్పారు. ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. ఆయన వెంట ఆర్ఐలు వలివియ రాబిన్సన్, అశోక్ ఉన్నారు. -
రేషన్ సరుకుల స్వాధీనం
సత్తుపల్లి(ఖమ్మం): రేషన్ సరుకులను అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారంతో రంగంలోకి దిగిన పౌర సరఫరా అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 7 క్వింటాళ్ల బియ్యం, 1.40 క్వింటాళ్ల కందిపప్పు, ఒక క్వింటాల్ పంచదారను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో అక్రమ నిల్వలు ఉన్నాయనే సమాచారంతో పౌరసరఫరాల అధికారి డీటీ జగదీశ్ దాడులు నిర్వహించి నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. -
అక్రమంగా తరలిస్తున్న బంగారం, నగదు పట్టివేత
నంద్యాల టౌన్(కర్నూలు జిల్లా): లెక్కలు చూపకుండా, ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న నగదు, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన సోమవారం రాత్రి కర్నూలు జిల్లా నంద్యాల టౌన్లో జరిగింది. వివరాలు..పట్టణంలో పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానం వచ్చిన ఒక స్విఫ్ట్ కారు అడ్డుకున్నారు. కారును తనిఖీ చేయగా రూ.2.50లక్షల నగదు, 20.3 తులాల బంగారు ఆభరణాలను లెక్కల్లో చూపకుండా తరలిస్తున్నపోలీసులు గుర్తించారు. దీంతో కారును సీజ్ చేసి నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని బండి ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన రాజేష్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
70 కిలోల గంజాయి స్వాధీనం
రామచంద్రాపురం(మెదక్):హైదరాబాద్ నగరం నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని రామచంద్రాపురం పోలీసులు ఆదివారం సాయంత్రం వాహన తనిఖీల్లో పట్టుకున్నారు. రామచంద్రాపురం డీఎస్పీ సురేందర్‌రెడ్డి పర్యవేక్షణలో రామచంద్రాపురం, పటాన్చెరు, బీడీఎల్, భానూర్, బొల్లారం పోలీసులు ఇక్రిశాట్ సమీపంలో వాహనాలను తనిఖీ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో మహారాష్ట్రకు చెందిన ఖాలిద్ అనే వ్యక్తి కారులో 70 కిలోల గంజాయిని కారులో పెట్టుకొని వెళ్తున్నాడు. ఆ కారును ఆపి పరిశీలించగా గంజాయి బయటపడింది. దీంతో ఖాలిద్‌ను అదుపులోకి తీసుకొని, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని వాహనంతోపాటు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
950 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
బొమ్మలరామారం: నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండలం చీకటి మామిడి గ్రామంలో తిరుమల రైస్ మిల్లులో 950 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 950 క్వింటాళ్ల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్న అధికారులు మిల్లు యజమాని సుదర్శన్‌పై కేసు నమోదు చేశారు.