10 బస్తాల బియ్యం పట్టివేత
10 బస్తాల బియ్యం పట్టివేత
Published Wed, Aug 10 2016 11:31 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
ఆర్వో లేకుండా తరలిస్తున్న వైనం
కావలిఅర్బన్: ఆర్వో లేకుండా తరలిస్తున్న బియ్యపు బస్తాలను తహసీల్దార్ పట్టుకున్న సంఘటన బుధవారం పట్టణంలోని చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక మద్దూరుపాడు 32వ రేషన్‌షాపునకు ఆర్వో లేకుండా 10 బస్తాల బియ్యాన్ని ఆటోలో తరలిస్తున్నానే సమాచారం తహసీల్దార్ సాంబశివరావుకు అందింది. ఆయన వెంటనే స్పందించి ఆటోను పట్టుకుని బియ్యం ఎక్కడ నుంచి తరలిస్తున్నావని డ్రైవర్‌ను ప్రశ్నించారు. అతను ఏఎంసీలోని పీడీఎస్ గోడౌన్ నుంచి తీసుకువస్తున్నానని సమాధానమిచ్చాడు. అనంతరం తహసీల్దార్ గోడౌన్‌కు వెళ్లి రికార్డులు తనిఖీ చేయగా అందులో 10 బస్తాలు తరలిస్తున్నట్లు నమోదు చేయబడిఉంది. విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో ఆర్వో ఇవ్వలేకపోయామని పీడీఎస్ గోడౌన్ ఇన్‌చార్జి శంకర్‌రావు వివరణ ఇచ్చారు. రేషన్‌షాపును తహసీల్దార్ పరిశీలించారు. దీంతో విషయాలు బయటపడ్డాయి.
మరో డీలర్‌కు అప్పగింత
ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ ఆర్వో బిల్లులు లేకుండా బియ్యాన్ని తరలిస్తున్న ఆటోను సీజ్ చేస్తున్నామన్నారు. సరుకులు పొందాల్సిన కార్డుదారులు ఇంకా మిగిలి ఉండగా షాపులో బియ్యం ఇతర వస్తువులు కొంతమేరకు లేకపోవడంతో ఆ షాపును మద్దూరుపాడులోనే ఉన్న మరో డీలర్‌కు అప్పగిస్తున్నామని తెలిపారు. కార్డుదారులకు ఇంకా సరుకులు పంపిణీచేయని కారణంగా షాపు డీలర్‌పై 6ఏ కేసు నమోదుచేసినట్లు చెప్పారు. ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. ఆయన వెంట ఆర్‌ఐలు వలివియ రాబిన్‌సన్, అశోక్ ఉన్నారు.
Advertisement