తమిళనాడు రేషన్ బియ్యం పట్టివేత
తమిళనాడు రేషన్ బియ్యం పట్టివేత
Published Tue, Sep 6 2016 11:04 PM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM
సూళ్లూరుపేట : తడ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ప్రాంతం నుంచి నెల్లూరుకు అక్రమంగా తరలిస్తున్న 400 బస్తాలు తమిళనాడు రేషన్ బియ్యాన్ని స్థానిక ఎస్సై జీ గంగాధర్‌రావు సోమవారం అర్ధరాత్రి పట్టుకుని సీజ్‌చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు అందించిన సమాచారంతో సూళ్లూరుపేట స్వర్ణ టోల్‌గేటు వద్ద నిఘా వేసి లారీని పట్టుకున్నారు. వివరాలు.. నాయుడుపేటకు చెందిన జమాల్ అనే వ్యక్తికి చెందిన లారీలో వాటంబేడుకు చెందిన కొంతమంది బియ్యాన్ని లోడ్ చేసుకుని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మరో వర్గంతో వివాదం చోటుచేసుకోవడంతో పోలీసులకు సమాచారం అందింది. వారు లారీని పట్టుకుని ఎస్పీ, డీఎస్పీ కార్యాలయానికి సమాచారం అందించి కేసు నమోదుచేశారు.
సీఐ, ఎస్సై మధ్య కోల్డ్‌వార్..
స్థానిక సీఐకు, ఎస్సైకు మధ్య కోల్డ్‌వార్ నడుస్తుండటంతోనే లారీని పట్టుకున్నట్లుగా చెబుతున్నారు. తడ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో గత కొంతకాలంగా బియ్యం స్మగ్లింగ్ కేంద్రం నడుస్తోంది సీఐ తడ మండలానికి చెందిన టీడీపీ యువజన నాయకుడ్ని ప్రత్యేకంగా వసూళ్ల కోసం నియమించుకున్నట్టుగా తెలుస్తోంది. సోమవారం రాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన గొడవను సర్దుబాటు చేసేందుకు సీఐ టీడీపీ నాయకుడ్ని పంపించారు. అతను Ðð ళ్లాక గొడవ ఇంకా పెద్దదై ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి Ðð ళ్లింది. ఈ గొడవల నేపథ్యంలో సూళ్లూరుపేట ఎస్సైకు సమాచారం అందించడంతో ఆయన లారీని పట్టుకుని సీజ్ చేశారు. మామూళ్లు మొత్తం సీఐ తీసుకుంటుండంతో ఎస్సై లారీని పట్టుకుని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
Advertisement
Advertisement