kavali
-
బాలికల హాస్టల్ లో ఆగంతకుడు హల్ చల్
-
కావలి టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
సాక్షి, నెల్లూరు: కావలి తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై మాజీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైల్లో ఉంటే టపాసులు కాల్చిన నేతలకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దగదర్తి మండలంలో తన వర్గాన్ని కొందరు ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని చంద్రబాబు,లోకేష్ వద్దే తేల్చుకుంటానని కార్యకర్తల సమావేశంలో మాలేపాటి వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం రూ.17 కోట్లు ఖర్చు పెట్టానంటూ మాలేపాటి వ్యాఖ్యానించారు.జనసేనలో లుకలుకలు మరోవైపు, ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేనలో లుకలుకలు బయటపడ్డాయి. నెల్లూరు సిటీ జనసేన నేత వేములపాటి అజయ్ కుమార్‌పై వెంకటగిరి జనసేన నేత వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు సిటీ పాయింట్ ఆప్ కాంటాక్ట్‌గా ఉన్న వేములపాటి అజయ్ కుమార్ పెత్తనం చేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఉమ్మడి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు జనసేన ఇంచార్జ్‌లకు గౌరవం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో జెండా మోసిన తనను పార్టీకి దూరం చేయాలని అజయ్ కుమార్ చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: కాదంబరి కోరాలే గానీ.. -
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
ఆయన విసిరేసిన డబ్బుకు పచ్చపార్టీ టిక్కెట్ ఇచ్చింది. అదే కావరంతో ఎన్నికల్లో గెలుపు కోసం ఓటర్లకు డబ్బులు వెదజల్లారు. డబ్బుంటే ఏదైనా నా దాసోహం అవుతుందనుకున్న ఆ పచ్చనేత అహంకారానికి నియోజకవర్గ ప్రజలు తెలివిగా సమాధానమిచ్చాని టాక్. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల మనసులో నిలవాలని ఓటింగ్‌తో ఆయనకు బుద్ధి చెప్పారని స్తోంది. అంతేకాదు ఆ పచ్చనేత బెదిరింపులకు భయపడేది లేదంటోన్న ఆ నియోజకవర్గం ఎక్కడుంది ? 2024 ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని విపక్షకూటమి చేయని ప్రయత్నం లేదు. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో మాఫియాడాన్‌గా పేరున్న కావ్య కృష్ణారెడ్డికి టిక్కెట్ ఇచ్చింది. ఎప్పుడూ ప్రజల కష్టాలను కానీ, నియోజవర్గంలోని అభివృద్ధి గురించి కానీ ఈయన గారు పట్టించుకున్నది లేదు..చేసింది కూడా ఏమీ లేదు. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ఏం చేస్తామన్నది కూడా ఓటర్లకు ఈయన చెప్పింది కూడా లేదు. నామమాత్రంగా ప్రచారాన్ని ముగించి పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్నప్పుడు కుట్ర రాజకీయాలు మొదలెట్టాడు. ఎన్నికల్లో గెలవాలి..అధికారం అందుకోవాలన్న తాపత్రయతంతో ఓటర్లను కొనేయాలని డిసైడ్ అయ్యారు. అనుచరులతో డబ్బులు పంపిణీ చేశారు. ఓటుకు రెండు వేలు చొప్పున పంచారు. పోలింగ్ రోజున కూడా ఈ ఓటుకు నోటు యవ్వారం నడిచినట్లు సమాచారం. కావలి నియోజకవర్గంలో 2 లక్షల 3853 ఓట్లు ఉండగా.. వాటిల్లో లక్షా 98 వేల ఓట్లు పోలయ్యాయి. 97,916 ఓట్లు పురుషులు, లక్ష ఓట్లు మహిళలు వేశారు. గత ఎన్నికల కంటే ఈసారి ఆరు శాతం అధికంగా పోలింగ్ నమోదయింది. ఈ భారీ పోలింగ్‌ను చూసి కావ్యకృష్ణారెడ్డి మైండ్ బ్లాక్ అయ్యిందని సమాచారం. సర్కార్ సానుకూల ఓటు పోటెత్తిందనే విషయం తెలియడానికి ఆయనకు ఎంతో సమయం పట్టలేదు. తన దగ్గర నోట్లు తీసుకొని ఓటు మాత్రం ఫ్యాన్‌కు గుద్దారని తెలుసుకుని రగిలిపోయారు. అనుచరులను పంపి ఓటర్ల నుంచి తిరిగి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నించడమే కాదు బెదిరింపులకు దిగిన కాల్ రికార్డింగ్స్ బయటకొచ్చాయి. ఈ వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సంక్షేమపాలనను మరోసారి జనం కోరుకుంటూ తీర్పునివ్వడాన్ని చంద్రబాబు కూటమి జీర్ణించుకోలేకపోతోందని ఆరోపించారు.వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో మరోసారి కావలిలో గెలవనున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రజలతో మమేకమై సమస్యలను పరిష్కరించే నేత కావడం వల్లే ఆయన గెలవబోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
గ్లాసుతో సైకిల్‌కు గుబులు
వరుస షాకులతో కొట్టుమిట్టాడుతున్న టీడీపీకి కావలిలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రెబల్ అభ్యర్థిగా, ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచిన పసుపులేటి సుధాకర్ పక్కలో బల్లెంలా తయారయ్యారు. పోటీలో ఆయన ఉండటంతో ఓట్లు భారీగా చీలుతాయనే ఆందోళనతో ఉన్న కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి తాజా పరిణామం అశనిపాతంలా పరిణమించింది. సుధాకర్‌కు అనూహ్యంగా జనసేన గాజు గ్లాస్ గుర్తు లభించడంతో కావ్య శిబిరం ఒక్కసారిగా డీలాపడిపోయింది.కావలి: టీడీపీ రెబల్‌గా, స్వతంత్య్ర అభ్యర్థిగా కావలి నుంచి రంగంలోకి దిగిన పసుపులేటి సుధాకర్‌కు ఎన్నికల కమిషన్ గ్లాస్ గుర్తును కేటాయించడంతో టీడీపీ శిబిరంలో కలకలం రేగింది. ఈ పరిణామంతో ఓట్లు భారీగా చీలిపోతాయనే భయంతో కావ్య శిబిరం ఒక్కసారిగా కుదుపునకు గురైంది. బీసీల ప్రతినిధిగా రాజకీయాల్లోకి.. బీసీల ప్రతినిధిగా.. పీఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కావలి రాజకీయాల్లో పసుపులేటి సుధాకర్ అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున గ్లాస్ గుర్తుపై పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం బీజేపీలో చేరి కొంతకాలం రాష్ట్ర పదవిలో కొనసాగారు. ఈ క్రమంలో ఆయన్ను టీడీపీ అధినేత చంద్రబాబు పిలిపించుకొని కావలిలో పార్టీ కోసం పనిచేయాలని కోరారు. ఈ తరుణంలో బీజేపీకి రాజీనామా చేసి టీడీపీ కోసం పనిచేశారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో సుధాకర్ తన వర్గీయులతో నిరసన ప్రదర్శనలతో పాటు రాజమహేంద్రవరంలో ర్యాలీలను చేపట్టారు. దీంతో కావలి టీడీపీ టికెట్ సుధాకర్కేనని అందరూ భావించారు. అప్పటి వరకు కావలి ఇన్చార్జిగా ఉన్న మాలేపాటి సుబ్బానాయుడు సైతం సుధాకర్ అభ్యరి్థత్వాన్ని బలపర్చారు. రెబల్‌గా పోటీకి సై.. ఈ తరుణంలో కావ్య కృష్ణారెడ్డి ఆర్థిక బలంతో కావలి టికెట్‌ను దక్కించుకున్నారు. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు, కేడర్ తీవ్రంగా వ్యతిరేకించినా, ఆయనవైపే చంద్రబాబు మొగ్గు చూపారు. దీంతో కంగుతిన్న పసుపులేటి సుధాకర్ కావలిలో రెబల్‌గా పోటీ చేసేందుకు డిసైడయ్యారు. ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలు, టీడీపీ, జనసేన కేడర్ అండగా నిలుస్తుందనే నమ్మకంతో సొంత మేనిఫెస్టోను రూపొందించుకొని బరిలోకి దిగారు. దీంతో టీడీపీ, జనసేన నేతలు, పవన్ కల్యాణ్ అభిమానులు సైతం పసుపులేటికి మద్దతు తెలిపి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో సుధాకర్‌కు గ్లాస్ గుర్తు కేటాయించడంతో ఆయన వర్గీయుల్లో హర్షం వ్యక్తమవుతోంది. భగ్గుమంటున్న కావ్య పసుపులేటి సుధాకర్‌కు గ్లాస్ గుర్తు కేటాయించడంతో కావ్య కృష్ణారెడ్డికి మైండ్ బ్లాౖకైంది. ప్రెస్‌మీట్ పెట్టి మరీ పసుపులేటిపై తిట్ల దండకం అందుకున్నారు. ఆయనపై ఎనిమిది కేసులున్నాయని, 420 అంటూ నోరుపారేసుకున్నారు. ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పసుపులేటి సుధాకర్ ఇద్దరూ కలిసి తనపై పోటీకి దిగారని ఆరోపించారు. రామనారాయణరెడ్డికి గ్లాస్ గుర్తు ఆత్మకూరు: అదేంది.. రామనారాయణరెడ్డికి గ్లాసు గుర్తు కేటాయించారా.. ఈ మతలబేమిటబ్బాననే సందేహం కలగక మానదు. అయితే దీన్ని కేటాయించింది ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డికి కాదండోయ్. అక్కడే స్వతంత్ర అభ్యరి్థగా పోటీలో నిలిచిన ధనిరెడ్డి రామనారాయణరెడ్డికి గ్లాసు గుర్తు కేటాయించడంతో ఓట్లు ఎక్కడ చీలుతాయోననే ఆందోళన తమ్ముళ్లలో నెలకొంది. -
కావలిలో టీడీపీ ఖాళీ..వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు
-
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఫోన్ కాల్ పై మహిళల రియాక్షన్
-
మోసానికి మారుపేరు చంద్రబాబు అని ధ్వజమెత్తిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అబద్ధాలు, వెన్నుపోటు, మోసం, కుట్రలు కలిపితే చంద్రబాబు అవుతారని మండిపాటు..ఇంకా ఇతర అప్డేట్స్
-
సాయన్న సౌమ్యుడు.. అన్నిటికన్నా ముఖ్యంగా...!
-
మేము చేసిన మంచి కొనసాగాలంటే వాళ్లని చిత్తుచిత్తుగా ఓడించాలి.
-
వీళ్ళే మన అభ్యర్థులు .. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత మీదే
-
కావలిలో ఇసుకవేస్తే రాలనంతగా జనసునామీ నాకు కనిపిస్తుంది
-
జనంలోకి జగనన్న..!
-
సీఎం జగన్ డైనమిక్ ఎంట్రీ @ కావలి
-
సీఎం జగన్ ఋణం తీర్చుకోవడానికి కావలి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
-
ఎవరెన్ని కుట్రలు చేసినా... మా ఓటు జగనన్నకే
-
కావలిలో చంద్రబాబుకి కోలుకోలేని దెబ్బ
-
అక్రమ మైనింగ్ తో వేల కోట్లు నొక్కేసిన కావలి టిడిపి ఇన్ ఛార్జ్ కృష్ణారెడ్డి
-
నెల్లూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. పలువురు మృతి
కావలి: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కావలిలోకి టోల్‌ప్లాజా వద్ద రెండు లారీ, ఓ ప్రైవేటు బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటక రెండు గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 14 మందికి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదంలో మొదట ఆగి ఉన్న లారీని వెనక నుంచి మరో లారీ ఢీకొట్టింది. అదేసమయంలో ఎదురుగా ప్రైవేట్ బస్సు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందినే వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇక, ప్రైవేట్ బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇక, బస్సు కావేరీ ట్రావెల్స్‌కు సంబంధించినదిగా గుర్తించారు. Update.. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య తాజాగా ఏడుకు చేరుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. రెండు లారీ డ్రైవర్లు, బస్సు డ్రైవర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులు మృతిచెందారు. నెల్లూరు ప్రమాదంపై కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి నెల్లూరు బస్సు ప్రమాదంపై కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి స్పందించారు. ప్రమాద పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఇప్పటికే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్ది కామెంట్స్ ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ఉన్నారు. గాయపడిన వారిని నెల్లూరు, ఒంగోలు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించాం. బాధితుల సమాచారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. 9440796383 ద్వారా సమాచారం ఇస్తున్నాం. ప్రమాదానికి కారణం ఏమిటన్నది విచారణలో తెలుస్తుంది. గాయపడిన వారి వివరాలు.. చంద్ర శేఖర్(37).. సురేష్..(32) గోపి నాథ్ (23) మనోజ్ (23) రాజ్ కుమార్ (38) ఎస్.రమణ (38) పవన్ (23) ధనవేశ్వర్ (28) రణధీర్ (31) త్రికరణ్ (46) శ్వేతా (19) అజిత (30) కన్నన్ (50) రూప( 30) మైథిలి (35) అక్షయ్ (34) గణేష్(51) నితీష్ (20).. లోకేష్ (35) లక్ష్మీ (34) కమలమ్మ (63) నిర్మల(49) కేశవ్(39). -
డ్యాన్స్ అదరగొట్టిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే
-
‘ఆంధ్రజ్యోతి’పై భగ్గుమన్న బాలయ్య ఫాన్స్
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, సాక్షి: వేమూరి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిపై నందమూరి అభిమానులు భగ్గుమన్నారు. ఏకంగా ఆ పత్రిక పేపర్లను తగలబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. కావలిలో బాలకృష్ణ ఫ్యాన్స్ ఈ పని చేశారు. ఇందుకు కారణం ఏంటంటే.. తాజాగా నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభను విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో యువగళం- నవశకం పేరిట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. అయితే.. ఆయన పేరునుగానీ, ఫోటోగానీ ఆంధ్రజ్యోతిలో ప్రచురించలేదట. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కావలి ట్రంక్ రోడ్డులో ఆంధ్రజ్యోతి పేపర్‌ను ఆయన అభిమానులు తగలబెట్టారు. ఇదిలా ఉంటే.. ఆంధ్రజ్యోతి పేపర్, ఏబీఎన్ ఛానెల్ నందమూరి బాలకృష్ణ పట్ల గత కొంతకాలంగా వివక్షత చూపుతోందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని వెన్నుపోటు ద్వారా చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నాడు. కనీసం ఇప్పుడైనా నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నాడా? అని అదీ లేదు. దీనికి తోడు.. ఇప్పుడు యెల్లో మీడియా కూడా కేవలం నారా కుటుంబాన్నే హైలెట్ చేస్తుండడాన్ని తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. ఇదీ చదవండి: పవన్ తమ్ముడా?.. వీళ్లు మారరా? -
చంద్రబాబుని ఏకిపారేసిన మహిళా..వైఎస్సార్సీపీలో చేరిన మహిళలు
-
చంద్రబాబు కంటి జబ్బు దొంగ నాటకం..కావలి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
-
బావ మీద ఎప్పుడు లేని ప్రేమ ఇప్పుడు..రామిరెడ్డి ప్రతాప్ కౌంటర్
-
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర.. 12వ రోజు షెడ్యూల్ ఇదే
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్రకు విశేష ప్రజాదరణ లభిస్తోంది. ఈరోజు(గురువారం) సామాజిక సాధికారిత బస్సుయాత్ర అనకాపల్లి, పామర్రు, కావలి నియోజకవర్గాల్లో జరుగనుంది. అనకాపల్లిలో మంత్రి అమర్నాథ్ ఆధ్వర్యంలో సాధికార యాత్ర కొనసాగనుంది. ఉదయం గం. 10:30 ని.లకు మారేడుపూడిలో యాత్ర ప్రారంభం కానుంది. మారేడుపూడి నుంచి తేగడ గ్రామం వరకూ భారీ ర్యాలీగా బస్సుయాత్ర జరుగనుంది. 11 గంటకు తేగడ గ్రామంలో జగనన్న హౌసింగ్ కాలనీని పరిశీలించనున్నారు. 12 గంటలకు తేగడలో ఏపీ మోడల్ స్కూల్ పరిశీలన, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వైఎస్సార్సీపీ నాయకులు మీడియా సమావేశం ఉంటుంది. అనంతరం తేగడ గ్రామం నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకూ భారీ బైక్ ర్యాలీ ఉండనుంది. మూడ గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కృష్ణాజిల్లా పామర్రులో ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రియా టవర్స్ వద్ద నాయకుల ప్రెస్ మీట్.. గం. 2:30ని.లకు ప్రియా టవర్స్ వద్ద నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. గం. 3:30 ని.లకు పామర్రు సెంటర్లో బహిరంగ సభ ఉండనుంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, మంత్రి జోగి రమేష్, ఎంపీ నందగం సురేష్ సురేష్, ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి తదితరులు పాల్గొననున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో విలేకర్ల సమావేశం ఉంటుంది. ఈ కార్యక్రమం అనంతరం ఒంగోలు బస్టాండు సెంటర్లోని అబ్దుల్ కలాం విగ్రహానికి వైఎస్సార్సీపీ నేతలు నివాళులు అర్పించనున్నారు. ఆపై దర్గాని సందర్శించి, మార్కెట్ సెంటర్ వరకూ పాదయాత్ర ఉండనుంది. సాయంత్రం గం. 4:30కి మార్కెట్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. -
దాడి చేసింది టీడీపీ రౌడీలే
సాక్షి, అమరావతి: ఆర్టీసీ డ్రైవర్‌పై కావలిలో దాడి చేసిన రౌడీలు విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీకి చెందినవారేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. దాడి చేసిన రౌడీలు ‘ఐ సపోర్ట్ బాబు..’ బ్యానర్లు పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరు జనసేన జెండా కప్పుకోగా మరొకరు బీజేపీ నేత అనుచరుడిగా ఉన్నట్లు చెప్పారు. ఆధారాలతో సహా రౌడీ మూకల ఫోటోలను మీడియాకు ఆయన విడుదల చేశారు. ప్రశాంత ప్రాంతం కావలిలో ఎవరు ఎటువంటి వారో ప్రజలకు బాగా తెలుసన్నారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వాస్తవాలు తెలుసుకోకుండా లోకేశ్, పవన్ కల్యాణ్ బుర్రలేని మాటలు మాట్లాడారని విమర్శించారు. దొంగలే.. దొంగ దొంగ అంటూ దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో కలసి తాను ఆర్టీవో కార్యాలయాన్ని ప్రారంభించి వెళ్తుండగా సంఘటన స్థలం వద్ద ఏం జరిగిందో వివరాలు సేకరించాలని పోలీసులకు సూచించినట్లు చెప్పారు. టీడీపీ, దాని తోక పార్టీలు ప్రతి విషయాన్ని వైఎస్సార్ సీపీకి ఆపాదించే యత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. డ్రైవర్‌పై దాడి చేసిందెవరో కావలి ప్రజలందరికీ తెలుసని చెప్పారు. నిందితుడు సుధీర్‌పై నాలుగు రాష్ట్రాల్లో వందల కేసులున్నాయని, అవన్నీ బయటకు తీస్తామని తెలిపారు. ఈ ఘటనలో తమ పార్టీకి చెందిన వారు ఒక్కరున్నా రాజకీయాల నుంచి తప్పుకుంటానని మరి లోకేశ్ అందుకు సిద్ధమేనా? అని సవాల్ చేశారు. ప్రధాన ముద్దాయి సుధీర్ గతంలో తన కారుపై కూడా దాడి చేసినట్లు పేర్కొన్నారు. టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న పసుపులేటి సుధాకర్ అనే వ్యక్తి పక్కన నిందితుడు గుర్రంకొండ అరుణ్ కుమార్ ఉన్నట్లు వెల్లడించారు. గతంలో జనసేన తరఫున తనపై పోటీ చేసిన సుధాకర్ వద్ద ఇలాంటి గ్యాంగులు చాలా ఉన్నాయని, వాటిని హైదరాబాద్‌లో మోహరించి ఏం చేస్తున్నాడో తమకు సమాచారం ఉందన్నారు. అరుణ్ కుమార్ అనే వ్యక్తి ‘ఐ సపోర్ట్ బాబు’ అనే బ్యానర్ పట్టుకున్నాడని చెప్పారు. శివారెడ్డి జనసేన కార్యకర్తే అనే విషయాన్ని పవన్ తెలుసుకుంటే మంచిదన్నారు. ఎవరు రౌడీ షీటర్లను పక్కన పెట్టుకుని తిరుగుతున్నారో గుర్తు పెట్టుకోవాలన్నారు. -
కావలి ఎమ్మార్వో కార్యాలయంలో టీడీపీ నేతల రచ్చ
-
ఆవేదన విని.. అక్కున చేర్చుకున్న జగనన్న
సాక్షి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: సాయం కోసం చూసే ఎదురు చూపులు ఎక్కడున్నా జననేతను కదిలిస్తాయి. అంత గజిబిజి షెడ్యూల్లోనూ వాళ్ల కోసం సమయం కేటాయించి.. అక్కడికక్కడే వాళ్ల సమస్యలను పరిష్కరించడం నిజంగా ఆయన గొప్పతనం. అక్కడితోనే ఆగకుండా దీర్ఘకాలికంగానూ సాయం అందేలా చూడడంలో జగనన్న ప్రభుత్వం వెనుకంజ వేయదు. తాజాగా.. కావలి పర్యటనలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ సమస్యలతో వచ్చిన కొందరిని అక్కున చేర్చుకున్నారు. తనను కలిసి సమస్యలను వివరించేందుకు వచ్చిన దివ్యాంగులను ప్రత్యేకంగా హెలిపాడ్ ప్రాంగణంలోకి పిలిపించుకున్నారాయన. సావధానంగా వాళ్ల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆపై అందరికీ తక్షణసాయంగా లక్ష రూపాయలు అందించి, అవసరమైన వైద్య సేవలు సత్వరమే అందించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు కూడా. 👉 ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం మెదరమెట్లపాలెం గ్రామానికి చెందిన మర్రిపూడి సుబ్బారావు.. రోడ్డు ప్రమాదంలో కాలు దెబ్బతిని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. తన ఆపరేషన్ కోసం సీఎం జగన్‌కు విన్నవించుకోగా, సాయంగా లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు. 👉 కలిగిరి మండలానికి చెందిన బత్తిన షణ్ముఖ కుమార్ జన్యుపరమైన సమస్యతో ఎదుగుదల లేక ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఆర్థిక సాయంగా లక్ష రూపాయలు అందించారు. 👉 ఇక ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం కలవల్ల గ్రామ సర్పంచ్ అయిన దుగ్గిరాల రాఘవ.. సీఎం జగన్‌ను కలిసేందుకు కావలికి భార్యాబిడ్డలతో పాటు వచ్చాడు. రాఘవ రెండు కిడ్నీలు చెడిపోయాయి. వాటి ఆపరేషన్ చేయాల్సి ఉంది. అందుకే ఆర్థిక సాయం కోసం ముఖ్యమంత్రిని కలిసి తన బాధను చెప్పుకున్నాడు. వెంటనే సీఎం జగన్ లక్ష రూపాయల సాయం అందించారు. 👉 సర్వేపల్లికి చెందిన నోసం అమూల్య అరుదైన వైద్యంతో బాధపడుతోంది. రాయవేలూరులో చికిత్స అందుతోంది. అయితే నాలుగు సంవత్సరాలుగా ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతోందట. ఈ విషయం దృష్టికి రావడంతో.. అమూల్యను జగన్ ఓదర్చారు. తక్షణ సాయంగా లక్ష రూపాయలు అందించారు సీఎం జగన్. 👉 అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం వేల్పుచర్ల వారి పల్లి గ్రామానికి చెందిన పిడతల నాగరాజు ఒక కాలు, ఒక చెయ్యి పూర్తిగా కోల్పోయి ఎటువంటి పని చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు. సీఎం జగన్‌ను కలిసి తన గోడును వెల్లబోసుకునేందుకు కావలి వచ్చాడు. నాగరాజు దీనావస్థను అర్థం చేసుకుని లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు. 👉 కావలి చెంచుగారిపాలెంలో ఉండే పోసిన వెంకట్రావు షుగర్ పేషెంట్. అయితే మందులకు ప్రతినెల ఎక్కువగా ఖర్చు అవుతుంది. అంత భారం భరించలేని స్థితిలో ఉన్నట్లు సీఎం జగన్ దృష్టికి తన ఇబ్బంది తీసుకెళ్లాడాయన. వెంటనే స్పందించిన సీఎం జగన్ లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు. 👉 పొదలకూరు మండలం ఊట్లపాలెం గ్రామానికి చెందిన చెందిన వెంకట అఖిల్ వెన్నెముక ఆపరేషన్ కారణంగా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో మరింత మెరుగైన ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారట. అయితే అంత ఆర్థిక స్తోమత తన దగ్గర లేకపోవడంతో ప్రభుత్వ సాయం కోరడానికి కావలి వచ్చాడు. అతని పరిస్థితి తెలిసి.. తక్షణ సాయంగా లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు సీఎం జగన్. ఈ ఏడుగురికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరి నారాయణన్, ఆర్డీవో సీనా నాయక్ సమక్షంలో తక్షణ సాయంగా ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ ప్రత్యేకంగా వికలాంగుల వద్దకు వెళ్లి వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తానే స్వయంగా నమోదు చేసుకుని, ప్రభుత్వపరంగా అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇదీ చదవండి: చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ఆగినట్టే! -
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని..: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు చేస్తూ రూ. 20,000 కోట్ల విలువ కలిగిన 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ హక్కును అందించే కార్యక్రమాన్ని నేడు లాంఛనంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అయితే ఇందుకోసం ఇవాళ కావలిలో పర్యటించిన ఆయన.. ఆ పర్యటనపై ట్వీట్ చేశారు. దశాబ్దాలుగా నెలకొన్న సమస్యకు పరిష్కారం చూపేలా నేడు రాష్ట్రంలోని 2,06,171 ఎకరాల చుక్కల భూములపై 97,471 మంది రైతన్నలకు సర్వ హక్కులు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మన ప్రభుత్వంలో వారికి అన్ని విధాలా అండగా నిలుస్తున్నాం అని సభలో ప్రసంగించిన వీడియోను పోస్ట్ చేశారాయన. దశాబ్దాలుగా నెలకొన్న సమస్యకు పరిష్కారం చూపేలా నేడు రాష్ట్రంలోని 2,06,171 ఎకరాల చుక్కల భూములపై 97,471 మంది రైతన్నలకు సర్వ హక్కులు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మన ప్రభుత్వంలో వారికి అన్ని విధాలా అండగా… pic.twitter.com/qZfUgBDoqM — YS Jagan Mohan Reddy (@ysjagan) May 12, 2023 -
కావలిలో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ (ఫొటోలు)
-
నెల్లూరు జిల్లా కావలిలో సీఎం జగన్ పర్యటన
-
AP: చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం
సాక్షి, అమరావతి: దశాబ్దాల సమస్యకు చరమగీతం పాడుతూ.. చుక్కల భూముల చిక్కులకు జగనన్న ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించింది. ఇంకేం.. రైతన్నలకు ఇక నిశ్చింత.. సర్వ హక్కులూ వారికే..!. రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు చేస్తూ 2,06,171 ఎకరాల చుక్కల భూములకు.. సంపూర్ణహక్కును అందించే కార్యక్రమాన్ని శ్రీపొట్టిశ్రీరాములునెల్లూరు కావలిలో రేపు (శుక్రవారం) లాంఛనంగా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. చుక్కల భూముల నేపథ్యం.. బ్రిటీష్ వారి కాలంలో సుమారు వంద సంవత్సరాల క్రితం భూసర్వే జరిగినప్పుడు ‘ప్రభుత్వ భూమి‘ లేదా ‘ప్రైవేటు భూమి‘ అని నిర్ధారణ చేయని కారణంగా రెవెన్యూ రికార్డులలో (రీ సెటిల్మెంట్ రిజిస్టర్ ఆర్ఎస్ఆర్) పట్టాదారు గడిలో ‘చుక్కలు‘ పెట్టి వదిలేశారు. సదరు భూములే ‘చుక్కల భూములు‘. వీటి వల్ల సంపూర్ణ హక్కులు లేక దశాబ్దాలుగా రైతులు ఆ భూములు అనుభవిస్తున్నా వాటిని అమ్ముకునే స్వేచ్ఛ లేక, సర్వ హక్కులు లేక ఇబ్బంది పడుతున్న దుస్థితి.. అదనంగా రైతులకు మరింత ఇబ్బంది కలిగేలా 2016లో అప్పటి ప్రభుత్వం వీరికి పూర్తిగా అన్యాయం చేసిన పరిస్థితి. గత ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల ఈ భూములన్నీ ఒక్క కలం పోటుతో నిషేధిత భూముల జాబితాలో చేర్చడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ పరిస్థితిని సమూలంగా మారుస్తూ ప్రతి రైతన్న కుటుంబానికి మేలు జరగాలని, వారి ఆస్థిపై పూర్తి హక్కులు వారికే చెందాలని రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ రైతన్నలు తిరిగే అవసరం లేకుండా, వారికి ఒక్క పైసా ఖర్చు కూడా లేకుండా దశాబ్దాల కాలం నాటి ఈ చుక్కల భూముల సమస్యలకు పరిస్కారం చూపిన వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం. జగనన్న ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు లక్ష మంది రైతన్నల కుటుంబాలకు రూ.20,000 కోట్ల లబ్ది సంవత్సరాల తరబడి తమ స్వాధీనంలో ఉండి కూడా ఏ అవసరాలకు (క్రయవిక్రయాలు, రుణం, తనఖా, వారసత్వం, బహుమతి మొదలగు) వాడుకోలేని దుస్థితి నుంచి వారి వారి భూములకు వారిని పూర్తి హక్కుదారులను చేసి నేడు సుమారు 97,471 కుటుంబాలకు దాదాపు రూ. 20,000 కోట్ల మేర లబ్ది చేకూర్చింది సీఎం జగన్ నేతృత్వంలోని సర్కార్. ఈ ప్రభుత్వ నిర్ణయంతో సర్వ హక్కులు కూడా లభించేలా నిషేధిత భూముల జాబితా నుండి తొలగించబడింది సుమారు 2,06,171 ఎకరాల భూమి. పేదలకు మేలు చేస్తూ జగన్ ప్రభుత్వం రెవెన్యూ విభాగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే సుమారు 22,000 మంది పేద రైతన్నలకు మేలు జరిగేలా నిషేధిత భూముల జాబితా నుండి సుమారు 35,000 ఎకరాల ‘‘షరతులు గల పట్టా భూముల‘ తొలగించింది. దేశంలోనే మొదటి సారిగా అనేక రకాల భూ సమస్యలకు శాశ్వతపరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో వందేళ్ల తర్వాత చేపట్టిన ‘‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష‘ ద్వారా ఇప్పటివరకు 2000 గ్రామాల్లో 7,92,238 కి పైగా భూహక్కు పత్రాలు రైతులకు అందజేసింది. భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కరించాలనే దృక్పథంతో డిసెంబర్ 2023 నాటికి దశలవారీగా రాష్ట్రంలో ఉన్న మొత్తం 17,584 గ్రామాలు, పట్టణాల్లో భూముల రీసర్వే పూర్తి అయ్యి.. శాశ్వత భూహక్కుపత్రాల జారీ చేసింది. ఇప్పటికే దాదాపు 1,27,313 మంది గిరిజనులకు సుమారు 2.83 లక్షల ఎకరాల అటవీ హక్కుపత్రాల పంపిణీ జరిగింది. పేద గిరిజనులందరికీ కనీసం రెండు ఎకరాల భూమి కేటాయింపుతో పాటు కుటుంబంలోని అక్కాచెల్లెమ్మల పేరున పత్రాలు జారీ అయ్యాయి. ఇప్పటికే దాదాపు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడంతో పాటు ఇళ్లు కూడా నిర్మిస్తోంది జగనన్న ప్రభుత్వం. గత ప్రభుత్వంలో.. చిన్న మెమో ద్వారా రైతుల ఆధీనంలో ఉన్న చుక్కల భూములన్నింటిని 2016లో ఏకపక్షంగా నిషేధిత భూముల జాబితా క్రింద సెక్షన్ 22ఏ(1)(ఈ)పరిధిలోకి తీసుకురావడంతో.. దశాబ్దాలుగా తమ సాగుబడిలో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు లేదా మరే ఇతర లావాదేవీలు చేసుకోలేని దయనీయ పరిస్థితి. అప్పటి నుంచి పిల్లల చదువుల కోసమో, బిడ్డల పెళ్లి కోసమో, జబ్బు చేసినప్పుడు వైద్యం కోసమో విక్రయించాలన్నా వీలు కాని దుస్థితి ఏర్పడింది. పైగా రెవెన్యూ ఆఫీసులు, కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు.. వ్యయప్రయాసలు, వృధా ఖర్చులతో ఇబ్బందుల పాలయ్యారు రైతన్నలు. అయితే.. మరి వైఎస్ జగన్ ప్రభుత్వంలో.. రైతన్నలకు హక్కు భద్రత కల్పించాలనే లక్ష్యంతో చుక్కల భూములకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా అడుగులేసింది సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం. కలెక్టర్ల ద్వారా చుక్కల భూమి గుర్తింపుతో పాటు రైతులకు సంబంధించిన ప్రైవేట్ భూములను చుక్కల భూముల స్టేటస్ నుండి తొలగించి పట్టా భూములుగా మారుస్తూ 22ఏ(1)(ఈ) నుండి డీ నోటిఫికేషన్ చేసింది. తద్వారా 97, 471 కుటుంబాలకు మేలు చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. జగనన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల.. ఈ భూములను సర్వ హక్కులతో క్రయ విక్రయాలకు, రుణాలు పొందడానికి, తనఖా పెట్టుకోవడానికి, బహుమతిగా ఇవ్వడానికి, వారసత్వపు ఆస్తిగా అందించడానికి వెసులుబాటు కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 97,471 కుటుంబాలకు మేలు చేస్తూ దాదాపు రూ.20,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 2,06,171 ఎకరాల భూములకు పూర్తి హక్కుల కల్పన అందించింది. రైతన్నలు రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఒక్క పైసా కూడా చెల్లించే పని లేకుండా చుక్కల భూముల సమస్యలకు స్వస్తి పలికింది సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం. రెవెన్యూ సమస్యలు, సలహాల కోసం సంప్రదించాల్సిన టోల్ ఫ్రీ నంబర్ 1902 -
నెల్లూరు కావలిలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవం
-
ఈనాడు రాతలు ఇంత దుర్మార్గమా!?
కావలి: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామానికి చెందిన సీహెచ్ జనార్దనరెడ్డి (42) నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించిన ఉదంతంపై ఈనాడు వక్రభాష్యం ఇస్తూ దుష్ప్రచారం చేయడంపై మృతుని కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. కుటుంబ, ఆరోగ్యపరమైన సమస్యలు ఈ ఘటనకు కారణమైతే ఈనాడు పత్రిక మాత్రం ప్రభుత్వం నుంచి బిల్లులు రాక అతను ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచురించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జనార్దనరెడ్డి గ్రామంలో సచివాలయన్ని నిర్మించాడు. దాని తాలూకా రూ.27 లక్షలు అతనికి ప్రభుత్వం చెల్లించేసింది. ఇంకా రూ.6 లక్షలు మాత్రమే బకాయి ఉంది. అయితే, అతనికి మద్యం తాగే అలవాటు ఉంది. భార్య దూరమైంది. పైగా అతనికి ఆరోగ్యపరమైన సమస్యలున్నాయి. ఈ నేపథ్యంలో.. తండ్రితోపాటు ఉంటున్న జనార్దనరెడ్డి ఈనెల 16వ తేదీన మద్యం తాగి ఇంటికి రాగా తండ్రి మందలించాడు. దీంతో మేడపై ఉన్న తన గదిలోకి వెళ్లి పురుగుమందు తాగి బయటకు వెళ్లాడు. అతను పురుగుమందు తాగినట్లు గ్రామస్తులు కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు హుటాహుటిన కావలిలోని ఒక ఆస్పత్రికి తరలించారు. రెండ్రోజులు ఆస్పత్రిలో ఉండి ఇంటికొచ్చిన జనార్థనరెడ్డికి చాలా ఏళ్లుగా ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలు ఒక్కసారిగా తీవ్రమయ్యాయి. దీంతో అతనిని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించినప్పటికీ జనార్దనరెడ్డి శనివారం మరణించాడు. వాస్తవం ఇలాగుంటే.. ‘ఈనాడు’ మాత్రం సచివాలయం -
కావలి వద్ద రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం!
సాక్షి, నెల్లూరు: రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రైలు చక్రాల నుంచి పొగలు రావడంతో లోకోపైలట్ అప్రమత్తమయ్యారు. దీంతో, వెంటనే రైలును కావలి రైల్వేస్టేష్టన్‌లో నిలిపివేశారు. వివరాల ప్రకారం.. రాజధాని ఎక్స్‌ప్రెస్ ఆదివారం ఉదయం కావాలి రైల్వేస్టేషన్ వద్దకు రాగానే బీ-5 బోగీ వద్ద చక్రాల నుంచి పొగలు వచ్చాయి. అది గమినించిన లోకోపైలట్ వెంటనే రైలును నిలిపివేశాడు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రయాణీకులకు ప్రమాదం తప్పింది. ఇక, స్వల్ప మరమ్మతుల అనంతరం అరగంట తర్వత రైలు బయలుదేరింది. ఇక, రాజధాని ఎక్స్‌ప్రెస్.. నిజాముద్దీన్ నుంచి చెన్నైకి వెళ్తుండగా కావలి సమీపంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
మరోసారి విషం చిమ్మిన ‘ఈనాడు’.. మంత్రి కాకాణి ఫైర్
సాక్షి, నెల్లూరు: వ్యవసాయశాఖపై ‘ఈనాడు’ మరోసారి విషం చిమ్మిందని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. విలువలు, విషయ పరిజ్ఞానం లేకుండా కథనాలు రాస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో వ్యవసాయ రంగంలో 13.18 శాతం వృద్ధి రేటు నమోదైందని తెలిపారు. గత ప్రభుత్వంలో వృద్ధి రేటు పెరగలేదని.. ఉత్పత్తి తగ్గిందని గుర్తు చేశారు. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు అందించామని.. పొలం బడి ద్వారా రైతులకు అవగాహన కల్పించామని చెప్పారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో భూగర్భ జలాలు అడుగంటిపోయి 1,623 కరువు మండలాలను ప్రకటించారని, తమ ప్రభుత్వంలో ఒక్క కరువు మండలం కూడా ప్రకటించలేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి కరువు రావాలని, రైతులు విలవిలలాడాలని రామోజీ కోరుకుంటున్నారని నిప్పులు చెరిగారు. మహిళలను మోసం చేసిన ఘనత చంద్రబాబుది అయితే మహిళలను అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం వైఎస్ జగన్‌ది’ అని స్పష్టం చేశారు. చదవండి: జగన్ అంటే అభిమానం, అంత కంటే మించి ప్రాణం ‘చంద్రబాబులాంటి పనికి మాలిన వ్యక్తులు తిడితే పట్టించుకోం. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రతి ఇంటికి వెళ్తే జనాలు చెబుతారు. అక్కడికి వెళ్ళి బాబు సెల్ఫీ తీసుకోవాలి. మా ప్రభుత్వంలో వ్యవసాయం లాభసాటిగా మారింది. మేము తీసుకున్న విధానాలు వల్ల ఉత్పత్తి పెరిగింది. రైతులకు గిట్టుబాటు వస్తుంటే చంద్రబాబు, సోమిరెడ్డి కడుపు మండుతుంది. గత ప్రభుత్వంలో సోమిరెడ్డి మిల్లర్ల వద్ద ముడుపులు తీసుకుని వారిని మోసం చేశారు. పారదర్శకంగా పరిపాలన చేశానని చంద్రబాబు చెప్పలగలరా? మేము చేసిన అభివృద్దిని చూపిస్తూ చంద్రబాబు సెల్పీలు తీసుకోవడం సిగ్గు చేటు. జిల్లాలో టీడీపీ భూస్థాపిమైనదని నిన్న జరిగిన సమీక్షలో చంద్రబాబు ఒప్పుకున్నారు. చంద్రబాబుకు పాజిటివ్ ఓటు బ్యాంక్ లేదు.. ఆయన అంతంటి మోసగాడు లేడని టీడీపీ నేతలే చెబుతున్నారు. చంద్రబాబు పర్యటనల వల్ల మా పార్టీకి ఎలాంటి నష్టం ఉండదు’ అని మంత్రి కాకాణి అన్నారు. -
ఆర్టీసీ బస్సు బీభత్సం.. కండక్టర్ భర్తపై దూసుకెళ్లి..
సాక్షి, నెల్లూరు జిల్లా: కావలి ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ కండక్టర్ భర్తపై బస్సు దూసుకెళ్లింది. భార్య సుభాషిణిని గ్యారేజీలో వదిలి తిరిగి బైకుపై వెళ్తుండగా బస్సు ఢీకొంది. ఈ ఘటనలో అక్కడికక్కడే సుబ్బారాయుడు మృతి చెందాడు. ఆర్టీసీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. చదవండి: హెల్త్ వర్కర్‌తో అనుచిత ప్రవర్తన.. ఒక్కసారిగా షాకైన మహిళ! -
నెల్లూరు జిల్లా కావలిలో దారుణం
-
కావలిలో రాష్ట్రాస్థాయి ఓపెన్ షటిల్ బ్యాడ్మింటన్ పోటిలు ఫ్రారంభం
-
దాతృత్వాన్ని దోచేశారు..
వందల మైళ్ల దూరమైనా కాలి నడకనే వెళ్లాల్సిన రోజులవి.. బాటసారులు దారి దోపిడీలు, క్రూరమృగాలతో భయాందోళన చెందుతూ ముందుకు సాగాల్సిన పరిస్థితి.. అలాంటి రోజుల్లో బాటసారుల సౌకర్యార్థం ఓ మాతృమూర్తి కొంత స్థలం ఇచ్చి సత్రం ఏర్పాటు చేయగా కొంతమంది దానిపై కన్నేశారు.. ప్రజాహితం కోసం ఇచ్చిన స్థలాన్ని నిర్లజ్జగా కబ్జా చేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. ఇళ్లు నిర్మించుకున్నారు. అదేమని అడిగేవారు లేకపోవడంతో అక్కడ మద్యం దుకాణాన్ని సైతం నిర్వహిస్తున్నారు. రూ.కోట్ల విలువ చేసే స్థలం ఆక్రమణలకు గురైనా సంబంధింత దేవదాయ, రెవెన్యూశాఖల అధికారులు పట్టించుకుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు పట్టణంలో విలువైన ప్రభుత్వ భూములను దర్జాగా ఆక్రమించి రియల్ ఎస్టేట్ వెంచర్ వేసేస్తున్నారు. సాక్షి, కావలి (నెల్లూరు): వందేళ్ల క్రితం వాహనాలు లేని రోజుల్లో ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి రాకపోకలు సాగించే బాటసారులు అలిసిపోతే సేద తీరేందుకు, అవసరరమైతే వంట చేసుకొని భోజనాలు చేయడానికి, రాత్రులు దొంగలు, క్రూర జంతువుల నుంచి రక్షణ నిమిత్తం దాతలు సత్రాలను నిర్మించేవారు. ఈ నేపథ్యంలో కావలి పట్టణంలోని ముసునూరు మీదుగా ఉండే కాలిబాటలో సత్రం నిర్మించి, దానిని నిర్వహించేందుకు బ్రాహ్మణులకు దేవరపల్లి అన్నపూర్ణమ్మ అనే దాత 200 అంకణాలు స్థలాన్ని ముసునూరులో ఇచ్చారు. ఆ స్థలంలో సత్రానికి అవసరమైన భవనాన్ని ఆ రోజుల్లోనే పూర్తిగా బొంతరాయితో నిర్మించారు. అలాగే సత్రాన్ని నిర్వహించడానికి 3.15 ఎకరాల భూమిని కూడా ఇచ్చారు. ఈ భూమిని కౌలుకు ఇవ్వడం ద్వారా వచ్చే రాబడితో సత్రాన్ని నిర్వహించాలనేది దాత లక్ష్యం. కాలక్రమంలో రవాణా సౌకర్యాలు మెరుగై కాలినడకన రాకపోకలు సాగించే బాటసారులు తగ్గిపోయి అక్కడ వసతి పొందేవారు లేక సత్రం శిథిలమైపోయింది. దీంతో ఈ సత్రంపై ఆక్రమణదారుల కన్నుపడింది. ముసునూరులో సర్వే నంబర్ 146/2లో ఉన్న 200 అంకణాల స్థలానికి కొందరు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి 100 అంకణాల స్థలాన్ని కబ్జా చేశారు. ఇక్కడ అంకణం ధర రూ.లక్షకు పైగా ఉంది. అంటే రూ.కోటికి పైగా విలువ చేసే ఈ స్థలాన్ని కబ్జా చేసి దర్జాగా ఇళ్లు నిర్మించుకున్నారు. అలాగే సత్రం స్థలంలో కొంత, రోడ్డు భాగంలో కొంత స్థలాన్ని కబ్జా చేసి మద్యం షాపును నిర్వహిస్తున్నారు. మిగిలిన 100 అంకణాల స్థలాన్ని కబ్జా చేయడానికి ముసునూరులో ఉన్న ఒక వ్యక్తి తాను సత్రానికి ట్రస్టీగా ఉన్నానంటూ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి శరవేగంగా ఏర్పాట్లు చేసుకొంటున్నాడు. ఇక ఈ సత్రానికి సంబంధించి సర్వే నంబర్ 753–756లలో 3.15 ఎకరాల భూమి ఉంది. మాగాణి భూమి అయిన ఈ పొలానికి కౌలు రూపంలో ఏడాదికి కనీసం రూ.50,000 వస్తుంది. 40 ఏళ్లుగా ఈ భూమిని ముసునూరుకు చెందిన చిన్నబ్బాయ్ అనే టీడీపీ నాయకుడు ఆక్రమించుకొని దర్జాగా అనుభవిస్తున్నాడు. ఎకరా కనీసం రూ.50 లక్షలు ధర ఉంటుంది. సత్రానికి సంబంధించిన విలువైన స్థలాన్ని, భూమిని కాపాడాల్సిన దేవదాయశాఖ, రెవెన్యూశాఖలు అసలు దాని గురించి పట్టించుకోకపోవడంతో కబ్జాదారులు అడ్డూఅదుపూ లేకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కావలికి వచ్చిన సమయంలో సత్రం స్థలాన్ని కబ్జా చేసిన విషయం, పొలాన్ని టీడీపీ నాయకుడి ఆక్రమణలో ఉన్న అంశాన్ని కావలి బ్రాహ్మణ సంఘం నాయకులు తీసుకెళ్లారు. సత్రం స్థలాన్ని, పొలాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, తాను ఉన్నతాధికారులతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. సత్రం స్థలంలో బ్రాహ్మణ కల్యాణ మండపం నిర్మించేందుకు రూ.50 లక్షలు నిధులు మంజూరు చేయిస్తానని డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. ప్రభుత్వ స్థలంలో వెంచర్.. ముసునూరులోనే పమిడి స్కూలును ఆనుకొని సర్వే నంబర్ 179లో 1.04 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ అంకణం కనీసం రూ.లక్ష ధర పలుకుతోంది. అంటే సుమారు రూ.5 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జాదారులు ధైర్యంగా ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వెంచర్‌ను వేస్తున్నారు. ఈ విషయం రెవెన్యూ శాఖకు తెలిసినప్పటికీ కిందిస్థాయి ఉద్యోగులు కబ్జాదారుల వద్ద మామూళ్లు తీసుకొని వారి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాలను, భూములను తమ తాతలు ముత్తాల ఆస్తులుగా కబ్జాదారులు చెర పెడుతుండడం కావలిలో నిత్యకృత్యమైపోయింది. అలాగే పట్టణంలో ఉన్న మందాటి చెరువుకు కట్ట కింద నెల్లూరు వైపు వెళ్లే ప్రధాన రోడ్డు వైపు కబ్జాలు ప్రారంభమయ్యాయి. సుమారు 20 అంకణాల స్థలాన్ని ఆక్రమించుకోవడానికి రాళ్లు పాతారు. ఇక్కడ కూడా అంకణం రూ.లక్షకు పైనే పలుకుతోంది. అంటే రూ.20 లక్షల విలువ చేసే స్థలాన్ని కబ్జా చేయడానికి భూకబ్జాసురులు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. -
కావలిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రచారం
-
కావలి: ఎగసిన జనకెరటం
-
ఐదేళ్లలో చెప్పుకోవడానికి ఏమీ చేయలేదు
-
కావలిలో ముస్లింల ఆత్మీయ సమ్మేళనం
-
చరిత్రను చెరిపే పచ్చనేతల ప్రయత్నం
సాక్షి, కావలిః నియోజకవర్గ టీడీపీ నాయకుడు బీద మస్తాన్‌రావు ఉత్తుత్తి శిలాఫలకాలను ఆవిష్కరించే జాతరను కొనసాగించే క్రమంలో కావలి పట్టణంలో చరిత్రగా మిగిలి ఉన్న ఆనవాళ్లను ధ్వంసం చేయడానికి సిద్ధమయ్యారు. అయితే పట్టణ ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవడంతో, ప్రజాగ్రహానికి భీతిల్లి శిలాఫలకాన్ని వారే ధ్వంసం చేశారు. నియోజకవర్గంలో ఎన్నికల్లో ఉచిత ప్రచారం కల్పింస్తుందనే ఆశతో టీడీపీ నాయకుడు బీద మస్తాన్‌రావు ప్రజలు రాకపోకలు సాగించే ప్రదేశాల్లో ఇబ్బడిముబ్బడిగా శిలాఫలకాల్ని హడావుడిగా ఆవిష్కరిస్తున్నారు. అందులో భాగంగా పట్టణంలో 120 సంవత్సరాల చరిత్ర ఉన్న వాయునందన ప్రెస్‌వీధి పేరును చెరిపేసే ప్రయత్నం చేశారు. 1875–1900 కాలంలో పట్టణంలోని 33, 34, 37, 40వార్డుల పరిధిలో వాయునందన ప్రెస్‌ను ప్రారంభించారు. స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటీష్ సామ్రాజ్య పాలకుల నిరంకుశ విధానాలపై పోరాటానికి, ప్రజలను సంఘటితం చేయడానికి అవసరమైన కరపత్రాలు ఈ వాయునందన ప్రెస్లోనే ప్రచురించేవారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలోని ప్రధాన వీధికి వాయునందన ప్రెస్ వీధిగా స్థిరపడిపోయింది. అయితే టీడీపీ నాయకులు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోగా 1,000 శిలాఫలకాలను ఆవిష్కరించాలని నిర్ణయం తీసుకొన్నారు. అందులో భాగంగానే వాయునందన ప్రెస్‌వీధి అనే పేరును తొలిగించి కొత్త పేరు పెట్టాలని, అందుకు ఆ ప్రాంతంలో శిలాఫలకాన్ని కూడా హడావుడిగా నిర్మించారు. ఇక బీద మస్తాన్‌రావు వచ్చి ఆ శిలాఫలకాన్ని ఆవిష్కరించాల్సి ఉందనగా, ఈ విషయం పట్టణ ప్రజల్లో విస్తృతంగా చర్చ జరిగింది. చరిత్రకు ఆనవాళ్లును ధ్వంసం చేసే హక్కు టీడీపీ నాయకుడు బీద మస్తాన్‌రావుకు ఎవరిచ్చారు అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో పరిస్థితిని గమనించిన టీడీపీ నాయకులు వాయునందన ప్రెస్ వీధి పేరును మార్పు చేసే శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తే, అక్కడ స్థానికులతో వివాదం జరిగే ప్రమాదం ఉందని నిర్ధారించుకొన్నారు. ఈ వ్యవహరంలో పార్టీకి జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయిందని, ఇంకా శిలాపలకాన్ని ఆవిష్కరిస్తే పట్టణ ప్రజలు సెంట్‌మెంట్‌గా భావించి పార్టీని బజారుకీడ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ నాయకుడు తన శిలాఫలకాల ఆవిష్కరణ సంఖ్యలో ఒక్కటి కోల్పోయాననే భాదతోనే, వాయునందన ప్రెస్ వీధి పేరు మార్పు శిలాఫలకాన్ని ఆవిష్కరణను విరమించుకొన్నారు. వెంటనే ఆ శిలాఫలకాన్ని ధ్వసం చేశారు. దీంతో బీద మస్తాన్‌రావు వ్యవహారశైలి పట్ల పట్టణ ప్రజల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. -
సమస్యల్లో ఇందిరమ్మ
కావలిఅర్బన్: పట్టణంలోని ముసునూరులో ఇందిరమ్మ పేరుతో కాలనీ ఉంది. గొప్ప నాయకురాలి పేరు మీద ఉన్న ఈ కాలనీ ప్రజలు మాత్రం నిత్యం సమస్యల చుట్టూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు గడచిన ఐదేళ్లుగా కాలనీ అభివృద్ధిపై కనికరం కూడా చూపలేదు. ముసునూరులోని ఇందిరమ్మ కాలనీలో సుమారు 5 వందల కుటుంబాలు జీవిస్తున్నాయి. కాలనీలో సుమారు 15,00 మంది ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పట్టణంలోని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. అన్ని కాలనీలను శరవేగంగా అభివృద్ధి చేస్తున్న క్రమంలో ఆయన అకాల మరణం చెందారు. ఆ తరువాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం వారిపైన నిర్లక్ష్యం ప్రదర్శించాయి. రూ. కోట్లాది మున్సిపల్ నిధులను అధికారపార్టీ ప్రజాప్రతినిధుల వార్డులలో వెచ్చించుకుంటున్నారు. బాగున్న రోడ్లపైనే రోడ్లు వేసుకుంటూ ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చూపారు. మౌలిక వసతుల కొరత కాలనీ ఏర్పడి సుమారు 10 సంవత్సరాలు దాటుతున్నా ఇందిరమ్మ కాలనీ అభివృద్ధిపై శ్రద్ధ చూపడంలేదు. ఇళ్లు కట్టుకుని ఈ ప్రభుత్వంపై ఆశలు పెట్టుకుని ఇళ్లలోకి కాపురాలు వచ్చారు. కాని ఎటువంటి అభివృద్ధి చేయకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు. కొన్ని కుటుంబాలు అక్కడ జీవించలేక తిరిగి కావలికి వెళ్లి బాడుగ ఇళ్లలో నివాసం ఉంటున్నారు. కాలనీలో రోడ్లు నిర్మించాలని స్థానికులు అనేకసార్లు మున్సిపల్ అధికారులకు మొరపెట్టుకున్నారు. అదేవిధంగా తాగునీరు కల్పించాలని కోరారు. డ్రైనేజీ, విద్యుత్ సదుపాయం, శ్మశానవాటిక ఏర్పాటు చేయాలని కోరారు. కాలనీలో ఒక బోరు మాత్రమే పనిచేస్తుంది. దాని నుంచి అనేక కుటుంబాల ప్రజలు నీటిని తెచ్చుకుంటున్నారు. వేసవిలో భూగర్భ జలాలు అడుగంటి ఆ నీరు కూడా రాదని అంటున్నారు. ఓవర్ హెడ్ ట్యాంకుకు దక్షిణ బజారులో ఒక బోరు నిర్మిస్తే ఆ ప్రాంత ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ఇంకా అనేక వసతులు కల్పించాలని మొర పెట్టుకున్నా అభివృద్ధి చేయడంలో ముందుకు రాలేదు. మరమ్మతుకు నోచుకోని బోర్లు కాలనీలో కొన్ని బోర్లు మరమ్మతులకు గురికాగా మరికొన్ని బోర్లు అపరిశుభ్రంగా ఉన్నాయి. వాటి చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వలన విషసర్పాలకు ఆవాసాలుగా మారుతున్నాయి. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న కాలనీలో రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని అధికారులు తగిన ఏర్పాటు చేయాల్సి ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు సున్నా కాలనీలో నివశిస్తున్న నిరుపేద ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు మంజూరు చేయడంలేదు. ఇందిరమ్మ కాలనీలో ఉన్నవారికి వీటిని వర్తింపజేయడంలేదంటూ వాపోతున్నారు. జన్మభూమి కమిటీల సభ్యులు పథకాలు రాకుండా అడ్డుకుంటున్నారంటూ ఆవేదన చెందుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న వార్డులలో మాత్రమే అభివృద్ధి పథకాలను అందజేస్తున్నారంటూ వాపోతున్నారు. అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిడులకు తలొగ్గకుండా అర్హులైన పేదలందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించాలని కోరారు. రోడ్లు నిర్మించండి ఇందిరమ్మ కాలనీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వీధులు గుంతలమయంగా ఉన్నాయి. వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు నిర్మించి ఆదుకోండి. – పోట్లూరు రవి, ఇందిరమ్మ కాలనీ, ముసునూరు, కావలి దక్షిణ బజారులో బోరు నిర్మించండి కాలనీలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. ఎండాకాలంలో నీటి ఎద్దడి తలెత్తుతుంది. భూగర్భ జలాలు అడుగంటుతాయి. తాగునీటి సరఫరా అంతంత మాత్రం గానే ఉంటుంది. దక్షిణ బజారులో బోరు నిర్మిస్తే కొంతవరకు తాగునీటి సమస్య తొలగుతుంది. –ఎస్కే ఖాలీబీ, ఇందిరమ్మ కాలనీ, ముసునూరు, కావలి -
కావలిలో నవరత్నాల ప్రచార రథాలు
-
కావలిలో యువకుడి దారుణ హత్య
-
కావలి విశ్వోదయ ఇంజనీరింగ్ కాలేజి వద్ద ఉద్రిక్తత
-
నెల్లూరు జిల్లా కవలిలో ఉద్రిక్తత
-
కావలిలో హోదా కోసం ఎందాకైనా
-
ప్రత్యేకహోదా కోరుతూ జర్నలిస్టుల ర్యాలీ
-
కావలిలో ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
-
లారీని ఢీకొట్టిన ఇన్నోవా: ముగ్గురి మృతి
గుడ్లూరు: ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం మోచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఇన్నోవా వాహనం ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన ఘటనలో.. ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా కావలి వెళ్తున్న వాహనం మోచర్ల వద్ద ప్రమాదానికి గురైంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. మృతులంతా కావలికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. -
ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
బిట్రగుంట : బోగోలు మండలం కొండబిట్రగుంట బిలకూట క్షేత్రం కొండ దిగువన సూళ్లూరుపేటకు చెందిన మద్దిక వేణుగోపాల్ రెడ్డి (62) ఆదివారం తెల్లవారుజామున వేపచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బిట్రగుంట పోలీసుల కథనం మేరకు.. సూళ్లూరుపేటలోని పొట్టిశ్రీరాములు వీధికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి మూడు రోజుల క్రితం కొండబిట్రగుంటకు వచ్చి కొండ వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో కొండ దిగువన ఉన్న వేప చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి వద్ద లభించిన ఆధార్‌కార్డ్, ఫోన్ నంబర్ల ఆధారంగా ఎస్ఐ గిరిబాబు విచారణ చేపట్టగా మృతుడి వివరాలు వెల్లడయ్యాయి. కడపకు చెందిన వేణుగోపాల్ రెడ్డి పదేళ్ల క్రితం వెంకటగిరికి వచ్చి స్థానికంగా హోటల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అనారోగ్య కారణాలతో నాలుగు నెలల క్రితం అక్కడ పనిమానేసి వెళ్లిపోయాడు. జిల్లాలో పలు ప్రాంతాల్లో తిరుగుతూ కొండబిట్రగుంటకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బాల కార్మికులకు విముక్తి
కావలిఅర్బన్: నెల్లూరు జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఆదివారం కావలి మండలంలోని రుద్రకోటలో ఏసురత్నం, ఇసాక్ అనే ఇద్దరు చిన్నారులకు విముక్తి లభించింది. ఈ సందర్భంగా ఎన్డీసీఆర్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు జయరాజ్, డివిజన్ ఇన్చార్జి గగనకుమారి మాట్లాడతూ నెల్లూరు 4వ మైలులో కాపురం ఉంటూ చిత్తు కాగితాలు ఏరుకుని జీవనాన్ని సాగిస్తున్న అబ్రహాము, ఏసేబుల పిల్లలు బాల కార్మికులుగా ఉంటున్నారని చెప్పారు. మండలంలోని రుద్రకోటలో నివాసం ఉంటున్న పొండెయ్య ఇద్దరు పిల్లలను తమ తల్లిదండ్రుల నుంచి నెల జీతానికి కుదుర్చుకున్నాడని తెలిపారు. బాతులు మేపుకునే పనిలో భాగంగా నెలకు రూ.2 వేలు చొప్పున పిల్లల తల్లిదండ్రులకు చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. పిల్లలను శనివారం గుర్తించిన తాము రూరల్ పోలీసుల సాయంతో గ్రామస్తులతో మాట్లాడామన్నారు. పిల్లలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అల్లూరు మండలం గొల్లపాళెం చైల్డ్ ఆశ్రమపాఠశాల నిర్వాహకులు శరత్‌కు అప్పగించామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు అబ్దుల్ అలీమ్, గూడూరు డివిజన్ ఇన్చార్జి నరేంద్ర బాబు, నాయుడుపేట ఇన్చార్జి చంద్రశేఖర్, రూరల్ పోలీసులు పాల్గొన్నారు. -
కేసు పెట్టినా మాకేం కాదు
ఆటోను ఢీకొన్న టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని బంధువుల కారు నలుగురికి గాయాలు ఆటోడ్రైవర్, స్థానికులపై ఎమ్మెల్యే బంధువులు, గన్మెన్ల దౌర్జన్యం కారు నుంచి కిందకు దిగని ఎమ్మెల్యే కావలి రూరల్: గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బంధువులకు చెందిన కారు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రుద్రకోట సమీపంలో జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం ఆటోను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం కొత్తపేటకు చెందిన టి.లక్ష్మమ్మ తలకు బలమైన గాయాలు కాగా గుడ్లూరుకు చెందిన వెంకటరావు, బ్రహ్మయ్య, సింహాద్రిలకు స్వల్పగాయాలయ్యాయి. బాధితుల వివరాల మేరకు.. గుడ్లూరు నుంచి కావలికి వస్తున్న ఆటో జాతీయ రహదారిపై రుద్రకోట పాలిటెక్నిక్ కాలేజి వద్దకు రాగానే ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆగింది. ఈ సమయంలో ఏపీ07సీయు5555 నంబరుగల కారు వెనుక నుంచి వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో కారుపల్టీలు కొట్టడంతో ఆటోలో ఉన్న ప్రయాణికులు గాయపడ్డారు. వీరిని స్ధానికులు 108 సహాయంతో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ వీరికి చికిత్స నిర్వహిస్తున్నారు. పోలీసులకు సమాచారమందించారు. బాధితులపైనే దౌర్జన్యం గుంటూరు జిల్లా గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బంధువులతో కలిసి తిరుపతి వెళుతున్నాడు. ఈక్రమంలో అతని బంధువులు ప్రయాణిస్తున్న కారు వేగంగా వచ్చి ఆటోను ఢీకొంది. దీంతో కారులోని వ్యక్తులు కిందకు దిగి ఆటో డ్రైవర్ పైన దౌర్జన్యానికి దిగారు. కనీసం గాయపడ్డవారికి సహాయం కూడా చేయకుండా దాడికి దిగడంతో అక్కడికి చేరుకున్న స్ధానికులు వారిని అడ్డుకున్నారు. దీంతో తాము అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే మనుషులమని కేసులు పెట్టినా తమకు ఏమీకాదని స్ధానికులను దబాయించారు. ముందు కారులో వున్న ఎమ్మెల్యే కారు నుంచి దిగలేదు. ఆయన గన్మెన్లు కారుదిగి స్ధానికులతో వాగ్వావాదానికి దిగారు. బాధితులపైనే కేసులు పెడుతామని బెదిరించారు. స్ధానిక రుద్రకోటకు చెందిన యువకులు, జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు వాగ్వాదానికి దిగడంతో వారు అక్కడినుంచి వెళ్లిపోయారు. అధికారపార్టీ ఎమ్మెల్యే కారు కావడంతో దీనిపై కేసు నమోదు చేసుకునేందుకు రూరల్ పోలీసులు వెనుకాడుతున్నారు. -
రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
కావలిరూరల్ : రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ సమాచారం మేరకు.. ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం మక్కెనవారిపాళెంకు చెందిన పల్లపు రవికుమార్ (27) బేల్దారి పనులు చేస్తుంటాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్థాపం చెంది, శుక్రవారం మధ్యాహ్నం కావలికి వచ్చాడు. ఉదయగిరి బ్రిడ్జి సమీపంలో రైలు పట్టాల మీద తల పెట్టడంతో తల మొండెం వేరు పడ్డాయి. రైల్వే కీమెన్ గుర్తించి జీఆర్పీ పోలీసులకు సమాచారమందించారు. హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడి వద్ద లభించిన ఆధారాల మేరకు కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. -
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
బిట్రగుంట : విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కోళ్లదిన్నెలో బుధవారం జరిగింది. స్థానికులు, మృతుడి బంధువుల కథనం మేరకు.. బోగోలు పాతదళితవాడకు చెందిన ఆలూరి మదన్ (19) తల్లి లక్ష్మి ఆరేళ్ల క్రితం, తండ్రి మల్లి నాలుగేళ్ల క్రితంమృతి చెందటంతో మదన్, చెల్లెలు మౌనిక కోళ్లదిన్నెలోని బంధువుల వద్ద ఉంటున్నారు. మౌనిక కళాశాలలో విద్యనభ్యసిస్తుండగా మదన్ చిన్నచిన్న ఎలక్ట్రికల్ పనులకు Ððవెళ్తున్నాడు. ఈ క్రమంలో మదన్ బుధవారం కోళ్లదిన్నెలో వైరింగ్ పనులు చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మదన్ సంరక్షణ బాధ్యతలు చూస్తున్న బంధువులు బిట్రగుంట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఓవరాల్ చాంపియన్‌షిప్ జేబీ కైవశం
కావలిఅర్బన్ : పట్టణంలోని జవహర్ భారతి కళాశాల ప్రాంగణంలో నాలుగురోజులుగా సాగుతున్న జిల్లా జూనియర్ కళాశాలల ఆటల పోటీల్లో కావలి జవహర్ భారతి జూనియర్ కళాశాల క్రీడాకారులు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవశం చేసుకున్నారు. గురువారం పోటీలు హోరాహారీగా సాగాయి. క్రీడాకారులు ఉత్కంఠభరితంగా ఆటల్లో తలపడ్డారు. ఈ కార్యక్రమంలో విశ్వోదయ రెక్టార్ దొడ్ల వినయకుమార్‌రెడ్డి, దొడ్ల లక్ష్మీరెడ్డి, ప్రిన్సిపల్ పోతురాజు, పీడీలు డాక్టర్ మాల్యాద్రి, ప్రసాద్‌రెడ్డి, ఆయా కళాశాలల పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు. బాలుర విభాగం షటిల్ బ్యాట్మింటన్‌లో వెంకటగిరి ఏపీడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాల విన్నర్స్‌గా, నెల్లూరు కేఏసీ ప్రభుత్వ జూనియర్ కళాశాల రన్నర్‌గా నిలిచాయి. బాల్ బ్యాట్మింటన్‌లో కావలి సాయి కో-ఆపరేటివ్ కళాశాల విన్నర్‌గా, కావలి చైతన్య జూనియర్ కళాశాల రన్నర్‌గా నిలిచాయి. హ్యాండ్‌బాల్‌లో కోట ఏపీడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాల, కావలి పీహెచ్ఆర్ జేబీ జూనియర్ కళాశాల విన్నర్స్‌గా నిలిచాయి. కొండాపురం ఏపీ మోడల్ స్కూలు రన్నర్‌గా నిలిచింది. బాస్కెట్‌బాల్‌లో కావలి పీహెచ్ఆర్ జేబీ జూనియర్ కళాశాల విన్నర్‌గా, కావలి శ్రీసాయి కళాశాల రన్నర్‌గా నిలిచింది. ఫుట్‌బాల్‌లో బిట్రగుంట జీజేసీ విన్నర్కాగా, కావలి పీహెచ్ఆర్ జేబీ కళాశాల రన్నర్‌గా నిలిచింది. వాలీబాల్‌లో కావలి జేబీ జూనియర్ కళాశాల విన్నర్స్ కాగా బిట్రగుంట జీజేసీ రన్నర్స్‌గా నిలిచింది. కబడ్డీలో ఇనమడుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల విన్నర్స్‌గా, కావలి శ్రీసాయి జూనియర్ కళాశాల రన్నర్స్‌గా నిలిచింది. -
ట్రాక్టర్ బోల్తా : డ్రైవర్ దుర్మరణం
కావలిఅర్బన్ : ట్రాక్టర్ అదుపుతప్పి పడి డ్రైవర్ దుర్మరణం పాలైయ్యాడు. ఈ సంఘటన మండలంలోని వ్యవసాయ పొలాల్లో బుధవారం జరిగింది. కావలి రూరల్ పోలీసుల కథనం మేరకు.. మండలంలోని ఆనెమడుగు పంచాయతీ ఆకుతోట గిరిజన కాలనీకి చెందిన చిట్టేటి సురేష్ (25) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రుద్రకోటకు చెందిన జగదీశ్వరరెడ్డి వద్ద ట్రాక్టర్ తీసుకుని నారుమడులు దున్నేందుకు వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి పొలాల్లో వేసిన రోడ్డుపై వస్తుండగా ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నిప్పంటించుకుని విద్యార్థిని ఆత్మహత్య
కావలిరూరల్ : చదువుకోమని తల్లి మందలిండంతో క్షణికావేశంలో కిరోసిన్ పోసుకుని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం జరిగింది. మండలంలోని కొత్తసత్రం గ్రామానికి చెందిన పామంజి మంగమ్మ, శ్రీనివాసులు దంపతులు పట్టణంలోని పాతవూరు గట్టుపల్లివారివీధిలో నివాసం ఉంటున్నారు. వీరి చిన్న కుమార్తె భువనేశ్వరి (16) స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. చదువు మీద ఆసక్తిలేని భువనేశ్వరి తరచూ కళాశాలకు సెలవులు పెడుతుంది. ఇటీవల చదువుకోమని తల్లి ఒత్తిడి చేయడంతో అలిగి కొత్తసత్రంలో ఉన్న అక్క దగ్గరకు వెళ్లింది. అక్కడి నుంచి బుధవారం తిరిగి ఇంటికి వచ్చింది. గురువారం ఉదయం భువనేశ్వరిని తల్లి కాలేజీకి వెళ్లమని మందలించడంతో ఇంట్లో ఎవరూలేని సమయం చూసుకుని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన స్థానికులు 108కు సమాచారమందించారు. గాయపడిన భువనేశ్వరిని కావలి ఏరియా వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఒకటో పట్టణ ఎస్ఐ జి.అంకమ్మ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సెంట్రల్ లైటింగ్ ప్రారంభం
కావలి : పట్టణంలోని ఉదయగిరి రోడ్డుపై ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను మంత్రి పి.నారాయణ గురువారం రాత్రి ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత 6వ వార్డులో సిమెంటు రోడ్డుకు శంకుస్థాపన చేశారు. బాలికల హాస్టల్ భవనాల ప్రారంభం ఆలస్యంగా జరిగింది. రెడ్‌క్రాస్ భవనంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నేమాల సుకుమార్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ కనమర్లపూడి వెంకటనారాయణ, రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శి కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, జిల్లా జిల్లా అధికార ప్రతినిధి పందిటి కామరాజు, కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
డివైడర్‌ను ఢీకొన్న బైక్
యువకుడి దుర్మరణం మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ఉలవపాడు/ కావలి రూరల్ : వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జాతీయ రహదారిపై మండలంలోని చాగల్లు పోలేరమ్మ గుడి సమీపంలో బుధవారం జరిగింది. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంవ బ్రహ్మారెడ్డిపాళెంకు చెందిన గుమ్మడి కుమార్ (25) చీరాలకు చెందిన టి.రాము, మనోజ్‌కుమార్‌తో కలిసి ఒకే బైక్‌పై నెల్లూరు నుంచి చీరాలకు బయల్దేరారు. నెల్లూరు జిల్లాలోని బ్రహ్మరెడ్డిపాళెంలో దశదిన కర్మకు వచ్చిన చీరాల వాసులు తమ మిత్రుడైన కుమార్ బైక్‌పై చీరాల తీసుకెళ్తున్నాడు. కుమార్ బైక్ నడుపతున్నాడు. చాగల్లు వద్దకు వచ్చే సరికి లారీని ఓవర్టేక్ చేయబోయి కుడి వైపున డివైడర్‌ను ఢీకొట్టారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ సిబ్బంది కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కుమార్ మృతి చెందాడు. మృతుడికి ఇంకా వివాహం కాలేదు. ఒక్కడే కుమారుడు. పోలీసులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎస్ఐ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతానికి యువకుడి బలి
కావలిరూరల్ : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన బుధవారం పట్టణంలో సంకులవారితోట సాయిబాబా మందిరం వీధిలో జరిగింది. ఒకటో పట్టణ ఎస్ఐ జి.అంకమ్మ కథనం మేరకు.. జౌళి రాజశేఖర్ అరుణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. ఇద్దరూ చదువు మధ్యలోనే ఆపేసి స్థానికంగా కరెంటు, ప్లంబింగ్ పనులకు వెళ్తుంటారు. బుధవారం ఓ కుమారుడు మీరయ్య (20) స్థానిక పాతూరు అరటి తోటలో కరెంటు మరమ్మతుల కోసం తన బాబాయ్ భద్రయ్యతో కలిసి వెళ్లాడు. కనెక్షన్ సరి చేస్తుండగా అతను విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన తోటి పనివారు వెంటనే మెయిన్ ఆఫ్ చేసి హుటాహుటి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో ఏరియా వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. యువకుడి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. చేతికెక్కొచ్చిన కుమారుడు ఇలా అర్ధాంతరంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థులకు ఏకాగ్రత తప్పనిసరి
1600 మంది విద్యార్థులకు యోగా శిక్షణ అల్లూరు : మండల కేంద్రంలోని రామకృష్ణ విద్యాసంస్థలలో శుక్రవారం గణపతి సచ్చిదానంద ఆశ్రమం వారి ఆధ్వర్యంలో దత్త క్రియా యోగా ఫౌండేషన్ వారు 1600 మంది విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. అంతర్జాతీయ యోగా శిక్షకుడు రాజారామ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఏకాగ్రత తప్పనిసరి అని, యోగాతో ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో యోగా శిక్షకులు నిర్మలా నందా, సుబ్రమణ్యం శాస్త్రి, రామ నిర్మల, డాక్టర్.కామేశ్వరీ, చాయాదేవి, రేబాల శైలకుమారి, బాలకృష్ణశాస్త్రి, రామకృష్ణ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు పప్పు శ్రీనివాసులు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. -
మెకానిక్ షాపులో చోరీ
రూ.లక్ష నగదు అపహరణ కావలిరూరల్ : మెకానిక్ షాపులో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. పట్టణంలోని బృందావనం కాలనీ ఎదురుగా ఉన్న ఎస్2 కేఎండబ్ల్యూ బైక్ మెకానికల్ అండ్ స్పేర్ పార్ట్స్ షాపునకు గురువారం రాత్రి యజమాని బాలకృష్ణ తాళంవేసి వెళ్లారు. శుక్రవారం ఉదయం వచ్చి తాళాలు తీసి చూడగా వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. షాపు వెనుక గోడకు ఉన్న వెంటిలేటర్ పగలగొట్టి ఉంది. టేబుల్ డ్రా లాక్ తీసి ఉంది. టేబుల్లో స్పేర్‌పార్ట్స్ కోసం ఉంచిన రూ.లక్ష నగదును దుండగులు అపహరించారు. రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గతంలో షాపులో పని చేసి వెళ్లిన ఇద్దరు యువకులపై బాలకృష్ణ అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. -
యువత కళల్లో రాణించాలి
కావలి : యువత కళల్లో రాణించాలని యువజన సర్వీసుల శాఖ సీఈఓ డాక్టర్ సీ సుబ్రమణ్యం అన్నారు. పట్టణ పరిధిలోని మద్దూరుపాడులో ఉన్న డీబీఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం జరిగిన డివిజన్ స్థాయి యువజనోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే జనవరిలో జాతీయ యువజనోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. డివిజన్ స్థాయిలో పోటీలు జరిగిన తరువాత జిల్లాస్థాయిలో ఉత్సవాలు జరిపి కళాకారులను ఎంపిక చేస్తామని తెలిపారు. అనంతరం రాష్ట్రస్థాయి, తరువాత జనవరి 12 నుంచి 16 వరకు జాతీయ స్థాయిలో యువజనోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాల్లో డివిజన్ నుంచి జాతీయ స్థాయి వరకు యువ కళాకారులను ఎంపిక చేసి అవార్డులు అందజేస్తామన్నారు. సంప్రదాయ నృత్యాలు, జానపద నృత్యాలలో యువకులు ప్రతిభ చూపాలన్నారు. అనంతరం యువకులు వివిధ నృత్యాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి డీబీ.సురేష్‌బాబు, డైరెక్టర్ దామిశెట్టి సుధీర్‌నాయుడు, కౌన్సిలర్ అలేఖ్య, ప్రిన్సిపల్ టీవీ, రావు, ఏఓ రమేష్‌బాబు, డ్యాన్స్ మాస్టార్ ఉమామహేశ్వరరావుతోపాటు యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆక్వా రైతులకు అవగాహన
కావలిఅర్బన్ : ఆక్వా ల్యాబ్‌ను రైతులు సద్వినియోగం చేసుకుని ఆక్వా రంగంలో లాభాలు గడించాలని అవంతి ఫీడ్స్ జనరల్ మేనేజర్ పీకే శెట్టి సూచించారు. స్థానిక ఉదయగిరి బ్రిడ్జి క్రిస్టియన్‌పేట 3వ లైనులో బుధవారం అవంతి ఆక్వాల్యాబ్‌ను ప్రారంభించారు. అంతరం ల్యాబ్‌ను పరిశీలించి ఆక్వా రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఆయన మాట్లాడుతూ ల్యాబ్‌లో పీహెచ్, సెలినిటీ, అమ్మోనియా, ఆల్కాలినిటి, హార్డ్నెస్, విబ్రియో లోడ్స్ తదితర పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అవంతి ఫీడ్స్ డీజీఎం ఎస్.మొహంతి, కావలి ఏరియా మేనేజర్ కె.మురళీకృష్ణ, నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎ.రమేష్ రెడ్డి, విజయశంకర్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బోరు నిర్మిస్తూ యువకుడి మృతి
మరొకరికి గాయాలు కావలిరూరల్ : పొలంలో బోరువేస్తూ విద్యుత్ షాకుకు గురై యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. మండలంలోని రుద్రకోట పంచాయతీ గుమ్మడిబొందలకు చెందిన దద్దాల పిచ్చయ్య గౌడ్ మామిడితోటలో బోరు వేస్తున్నారు. బోరు నిర్మాణ పనులను ఒడిశా రాష్ట్రం నవరంగ్‌పూర్ జిల్లా రాయగఢ్‌కు చెందిన వికాస్ (29), ఒబ్బిగోండ్ అనే కూలీలు చేస్తున్నారు. ఈ క్రమంలో పైపులు పైకి లాగుతుండగా పైన ఉన్న కరెంటు తీగలు పైపునకు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యారు. వీరిలో వికాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఒబ్బిగోండ్ గాయపడటంతో అతన్ని 108లో కావలికి తరలించి ఒక ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. మృతుడు వికాస్ అవివాహితుడు. వికాస్ తండ్రి ఇటీవలే మరణించగా అతను ఉపాధి కోసం ఇక్కడకు వచ్చాడు. అతని తల్లిదండ్రులకు నలుగురు సంతానం కాగా వికాస్ చివరివాడు. కావలి రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తాళం వేసిన ఉన్న ఇళ్లలో చోరీ
బాపూజి నగర్లో రిటైర్డ్ పోస్ట్‌మాస్టర్ ఇంట్లో ఒకటి పాతవూరు హైమావతమ్మ మిల్లు వీధిలో మరొకటి వరుస దొంగతనాలపై ఎమ్మెల్యే ఆరా కావలిరూరల్ : పట్టణంలో రెండు దొంగతనాలు జరగడంతో మంగళవారం ఒక్కసారిగా కలకలం రేగింది. వివరాలు..రిటైర్డ్ పోస్టుమాస్టర్ షేక్ కాలేషా పట్టణంలోని బాపూజి నగర్లో నివాసం ఉంటున్నాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి కుటుంభసభ్యులతో కలిసి ఈ నెల 17న మదనపల్లికి వెళ్లాడు. సోమవారం రాత్రి పొద్దుపోయాక తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చి చూస్తే తలుపులు బద్దలు కొట్టి ఉన్నాయి. లోపల బీరువా పగులగొట్టి ఉంది. బీరువాలో బట్టలు, అలమరాలో వస్తువులు చిందరవందరగా పడిఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారమందించగా 2టౌన్ ఎస్సై అన్వర్‌బాషా సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనలో మూడున్నర సవర్ల బంగారం, రెండు వెండి గ్లాసులు, ఒక స్మార్ట్‌ఫోన్ చోరీకి గురైనట్లు గుర్తించారు. నెల్లూరు నుంచి క్లూస్‌టీం వచ్చి పరిశీలించి ఆధారాలు సేకరించారు. రెండో పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పట్టపగలు, ఇళ్లమధ్యలో పట్టణంలోని పాతవూరు హైమావతమ్మ రైస్‌మిల్లు వీధిలోని సాయినాథ స్కూలు పక్కన సందులో ఉన్న లక్ష్మీ కాంతమ్మ ఇంట్లో దొంగలు పడ్డారు. ఉదయం 11 గంటలకు పశువులను తోలుకొని పొలం వెళ్లి తిరిగి సాయంత్రం ఐదుగంటలకు ఇంటికి వచ్చిన లక్ష్మీకాంతమ్మ ఇంటి తలుపు రెండుముక్కలై ఉండడం చూసి షాక్‌కు గురయింది. వెంటనే పోలీసులకు సమాచారమందించగా ఒకటో పట్టణ సీఐ ఎన్.వెంకట్రావు, ఎస్సైలు నాగరాజు, అంకమ్మ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ఈ ఘటనలో బీరువా పగులకొట్టి అందులో ఉన్న లక్షా ఇరవై ఎనిమిది వేల రూపాయల నగదు, రెండు సవర్ల బంగారు నగలు దోచుకెళ్లారని బాధితురాలు తెలిపింది. నెల్లూరు నుంచి వచ్చిన క్లూస్‌టీం ఆధారాలు సేకరించారు. ఒకటో పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోరీ విషయం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి తెలియడంతో వెంటనే పాతవూరులోని నలగర్ల లక్ష్మీకాంతమ్మ నివాసానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడున్న ఎస్సైలు గుంజి నాగరాజు, అంకమ్మలతో మాట్లాడారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్సీపీ నాయకులు మన్నెమాల సుకుమార్‌రెడ్డి, కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, కుందుర్తి కామయ్య, జనిగర్ల మహేంద్ర, మునిసిపల్ వైస్ చైర్మన్ జి.భరత్‌కుమార్, కౌన్సిలర్ శివప్రసాద్, పరుసు మాల్యాద్రి, ఉప్పాల శ్రీనివాసులు, సుగుణకుమార్రెడ్డి, కలికి శ్రీహరిరెడ్డి తదితరులు ఉన్నారు. -
రైలు ఢీకొని యువకుడి మృతి
కావలి అర్బన్ : పట్టాల వైపు బహిర్భూమికి వెళ్లిన యువకుడిని రైలు ఢీకొనడంతో మృతి చెందిన సంఘటన గురువారం స్థానిక వైకుంఠపురం రైల్వే గేటు సమీపంలో జరిగింది. స్థానిక వైకుంఠపురానికి చెందిన వల్లూరు రమణారెడ్డి కుమారుడు బ్రహ్మారెడ్డి (25)పట్టణంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బోయ్‌గా పని చేస్తున్నాడు. ఉదయం బహిర్భూమికని రైలు పట్టాల వైపు వెళ్లి తిరిగి ఇంటికి ఫోనులో మాట్లాడుతూ వస్తున్న సమయంలో చెన్నై వైపు వెళ్లే రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని కీమ్యాన్ గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. -
వివాహిత ఆత్మహత్య
కావలి అర్బన్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన స్థానిక వైకుంఠపురం పెక్కుల ఫ్యాక్టరీ రోడ్డులో బుధవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. పెంకుల ఫ్యాక్టరీ గిరిజనకాలనీ సమీపంలోని పోలేరమ్మ గుడి వద్ద యనమల నరసింహం, అనూష (23) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. పిల్లలను ప్రకాశం జిల్లా పెద్దపవనిలో జరుగుతున్న బంధువుల వివాహానికి నరసింహం తల్లిదండ్రులతో పంపించారు. గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. నరసింహం మార్కెట్‌కు వెళ్లి చేపలు తెచ్చి భార్యకు ఇచ్చి మళ్లీ బజారుకు వెళ్లాడు. ఇంతలో ఆమె ఇంటి తలుపునకు లోపల గడి పెట్టుకుని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఒళ్లు కాలుతున్న సమయంలో ఆమె పెద్ద పెద్దగా కేకలు వేయడంతో స్థానికులందరూ తలుపు పగలగొట్టి తీసి చూడగా తీవ్రంగా కాలిపోయి అక్కడిక్కడే మృతి చెంది. ఈ విషయాన్ని స్థానికులు ఆమె భర్తకు తెలియజేయడంతో ఇంటికి చేరుకున్నాడు. బంధువులు, కుటుంబ సభ్యులు, పిల్లలు ఇంటికి చేరుకుని కన్నీరు మున్నీరుగా రోదించారు. సమాచారం అందుకున్న రెండో పట్టణ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రతి విద్యార్థి శాస్త్రవేత్త కావాలి
విజయవాడ (గుణదల) : ప్రతి విద్యార్థి శక్తివంతమైన శాస్త్రవేత్త కావాలని మాజీ డీజీపీ ప్రసాదరావు అన్నారు. ప్రముఖ శాస్త్రవేత్తల ఆవిష్కరణలు తెలుసుకోవడటం వల్ల నూతన ఆలోచనలు వస్తాయని చెప్పారు. ఇంటర్మీడియెట్ సైన్స్ విద్యార్థుల్లో శాస్త్రీయ దక్పథాన్ని పెంపొందించేదుకు నగరంలోని ఆంధ్రా లయోలా కళాశాలలో కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యాన రాష్ట్ర స్థాయిలో మూడు రోజులపాటు నిర్వహించే ‘ఇన్సై ్పర్–16’ కార్యక్రమాన్ని అయన సోమవారంప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తి పెంచుకోవాలని చెప్పారు. దేశ అభ్యున్నతికి ఉపయోగపడే హేతుబద్ధమైన, వివరణాత్మకమైన ప్రయోగాలను చేయాలని సూచించారు. ప్రతి విద్యార్థిలో ప్రశ్నించే తత్వం ఉండాలన్నారు. ప్రశ్నల ద్వారానే నూతన ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఏఎస్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ భూమి మీద మొక్కలు చాలా ముఖ్యమైనవని, ప్రతి ఒక్కరికి ఆహారం, గాలి, ఆరోగ్యం, ఆయిల్, సువాసన, సంతోషాన్ని అందిస్తాయని వివరించారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి వచ్చిన మహేంద్రకుమార్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు శరీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని సూచించారు. మానసిక అనారోగ్యం వల్ల ఎక్కువ పనులు చేయలేరన్నారు. అనంతరం విద్యార్థులకు భౌతిక, రసాయన, గణిత, వక్ష, జంతు శాస్త్ర విభాగాల నిపుణులు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. తొలుత కాలేజీ ఆవరణలో ప్రసాదరావు మొక్కలు నాటారు. ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డి.వెంకట సతీష్, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. -
ప్రియాంకకు కన్నీటి వీడ్కోలు
కావలి అర్బన్: అమెరికా వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ నగరంలో వారం క్రితం హైక్స్ సరస్సులో పడి మృతి చెందిన గోగినేని ప్రియాంక చౌదరి(25)అంత్యక్రియలు బుధవారం నిర్వహించారు. అమెరికా నుంచి విమానంలో చెన్నైకి చేరుకున్న ప్రియాంక మృతదేహాన్ని ప్రభుత్వం అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో మధ్యాహ్నం కావలి వైకుంఠపురంలోని ఆమె స్వగృహానికి తరలించింది. మృతదేహం తరలింపులో నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్(నాటా), తానా అధ్యక్షుడు వేముల సతీష్, టెక్సాస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి సుబ్రహ్మణ్యం సహాయపడ్డారు. ప్రియాంక మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, సత్యవతి, సోదరుడు శరత్చంద్ర, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదించారు. అధిక సంఖ్యలో పట్టణ ప్రజలు కూడా మృతదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించి ఆమె కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. అనంతరం పట్టణంలో ఆమె మృతదేహానికి అంతమ యాత్ర నిర్వహించి దక్షిణ శివారు ప్రాంతంలోని హిందూ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంతమ యాత్రలో పట్టణంలోని పలువురు ప్రముఖులు, ప్రజలు, బంధుమిత్రులు పాల్గొన్నారు. -
మహిళ మెడలో సరుడు చోరీ
కావలిఅర్బన్ : అద్దెకు ఇల్లు ఉందా అంటూ అడుగుతూ ఓ మహిళ మెడలోని 6 సవర్ల సరుడును తెంచుకెళ్లిన సంఘటన శుక్రవారం రాత్రి స్థానిక చింతంవారి వీధిలో జరిగింది. ఒకటో పట్టణ పోలీసుల కథనం మేరకు.. చింతంవారి వీధికి చెందిన మద్దిన సీతమ్మ బోగోలు మండలం కోవూరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పీహెచ్‌ఎన్‌గా ఉద్యోగం చేస్తుంది. ఆమె ఇంటికి బైక్‌పై వచ్చిన ఓ యువకుడు ఇంట్లో ఉన్న ఆమెను పిలిచి అద్దెకు ఇల్లు కావాలని అడిగాడు. ఇంటి ముందు గేటు వద్దకు చేరుకున్న ఆమె ఇక్కడ ఇల్లు లేవని చెప్పింది. ఇంతలో అతను ఫోన్లో మాట్లాడుతూ తన వద్ద ఉన్న ఓ స్లిప్‌ను చూపించి ఈ అడ్రస్ చూడమని ఆమెతో చెప్పాడు. ఆ కాగితం తీసుకుని చూస్తుండగానే ఒక్కసారిగా ఆమె మెడలోని సరుడును లాక్కుని వెళ్లాడు. హఠా™Œ lపరిణామం నుంచి తెరుకుని కేకలు వేసే సరికి చుట్టుపక్కల వాళ్లు చేరుకున్నారు. ఇంతలోనే దుండగుడు బైక్‌పై ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె నివాసానికి చేరుకుని విచారించారు. చామనఛాయ రంగులో బొద్దుగా ఉంటాడని ఆమె ఆనవాళ్లు తెలిపింది. బంగారం విలువ సుమారు రూ.1.25 లక్షలు ఉంటుందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు కిందపడి వివాహిత ఆత్మహత్య
కావలిఅర్బన్ : కుటుంబ కలహాలతో ఓ వివాహిత రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన స్థానిక ముసునూరు సమీపంలో రైలు పట్టాలపై గురువారం జరిగింది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. జలదంకికి చెందిన ప్రభాకర్, పి.శారద (35) దంపతులు కొంతకాలం నుంచి స్థానిక ముసునూరు రామ్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. పిల్లలు లేని కారణంగా ఓ బాలికను పెంచుకుంటున్నారు. అయితే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్థాపానికి గురైన ఆమె పక్కనే ఉన్న రైలుపట్టాల వద్దకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహానికి స్థానిక ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఆస్పత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత ఆత్మహత్య, కావలి -
పెళ్లయి రెండు వారాలు కాకుండానే..
బైక్ అదుపు తప్పి నవ వరుడు దుర్మరణం కావలిరూరల్: పెళ్లై రెండు వారాలైనా కాలేదు. బైక్ అదుపు ఓ నవ వరుడు దుర్మరణం చెందాడు.ఈ సంఘటన శనివారం నెల్లూరు, ప్రకాశం సరిహద్దు చేవూరు వద్ద జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం భీమవరానికి చెందిన చంద్రగిరి గోవిందు, సుబ్బలక్షమ్మ కుమారుడు వంశీ (21)కి కావలి రూరల్ మండలం రుద్రకోటకు చెందిన మేనమామ కూతురు రమ్యతో గత నెల 20వతేదీన వివాహమైంది. శనివారం రుద్రకోటలో ఉన్న తన భార్యను బంధువులతో కారులో భీమవరం పంపించాడు. అనంతరం తాను ఒంటరిగా బైక్‌పై బయలుదేరాడు. చేవూరు వద్ద ఎదురుగా వస్తున్న కుక్కను తప్పించబోయి బైక్ అదుపు తప్పి పడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న గుర్తుతెలియని కారు వంశీ నడుము మీదుగా ఎక్కి వెళ్లడంతో నడుము భాగం నుజ్జు నుజ్జు అయింది. అటుగా వెళ్తున్న ఒంగోలు అంబులెన్సు వారు తీవ్రంగా గాయపడిన వంశీని చూసి కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన ఏరియా ఆసుపత్రి వైద్యులు అప్పటికే అతను మృతి చెందాడని నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో ఉంచారు. సమాచారం అందుక్నున మృతుడి కుటుంబæులు ఏరియా ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కావలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కావలిలో విషాదం : నృత్యకళాకారుడి ఆత్మహత్య
నెల్లూరు : నెల్లూరు జిల్లా కావలిలో విషాదం చోటుచేసుకుంది. జాతీయ నృత్యకళాకారుడు అవినాశ్ సాయి అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం సాయంత్రం ఉరేసుకుని తనువు చాలించాడు. దీనిపై స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అతని ఆత్మహత్యకు గల కారణాలతో పాటు ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
సముద్రంలో బోటుబోల్తా
నడిసంద్రంలో ప్రమాదం ప్రాణాలతో బయటపడిన ఐదుగురు మత్స్యకారులు ధ్వంసమైన బోటు కొట్టుకుపోయిన వలలు రూ.2 లక్షల మేర నష్టం కావలిరూరల్: సముద్రంలో చేపల వేట సాగించేందుకు వెళ్లిన బోటు బోల్తాపడింది. నడిసంద్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో అందులోని ఐదుగురు మత్స్యకారులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన మండలంలోని తుమ్మలపెంట పంచాయతీ చిన్నరాముడుపాళెంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. బాధితుల కథనం మేరకు.. మండలంలోని చిన్నరాముడుపాళెంకుS చెందిన కోడూరు శ్రీనివాసులు, కోడూరు బాబు, కోడూరు వెంకటరమణ, మామిళ్ల శ్రీనివాసులు, కోడూరు ప్రసాద్ ఫైబర్ బోటులో చేపల వేటకోసం సముద్రంలోకి వెళ్లారు. శుక్రవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో అలల తాకిడికి సముద్రంలో బోటు బోల్తా పడింది. దీంతో బోటు ధ్వంసం కాగా, వలలు అలలకు కొట్టుకుని పోయాయి. బోటులో ఉన్న ఐదుగురు మత్స్యకారులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. సుమారు రూ. 2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. సహాయం కోసం కలెక్టరుకు విజ్ఞప్తి బోటు ప్రమాదంలో సురక్షితంగా బయటపడిన మత్యకారులు శుక్రవారం కలెక్టరు ముత్యాలరాజును కలిసి ప్రమాద వివరాలను తెలియజేశారు. తాము నిరుపేదలమని, వేటే తమ జీవనాధారమని తలా కొంత అప్పులు చేసి బోటును ఏర్పాటు చేసుకొని వేటకు వెళ్లి జీవిస్తున్నామన్నారు. రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తరపున సహాయం చేసి తమను ఆదుకోవాలి కలెక్టరుకు విజ్ఞప్తి చేశారు. అనంతరం మత్యశాఖ జేడీ, ఏడీ, ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సాయం కోరారు. ఎమ్మెల్యే రామిరెడ్డి పరామర్శ : బోటు ప్రమాదం జరిగిందని తెలియగానే కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి బాధిత మత్యకారులను ఫోన్లో పరామర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. సురక్షితంగా బయటపడినందుకు సంతోషం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రభుత్వం తరపున సహాయం అందేలా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
కావలిఅర్బన్ : డిష్ ప్లగ్ సరి చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన స్థానిక చంద్రబాబునగర్ కాలనీలో గురువారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కాలనీకి చెందిన బాబు జలదంకి మండల తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్నాడు. ఆయన భార్య వరమ్మ(38) ఇంట్లో డిష్ సక్రమంగా పనిచేయకపోవడంతో వైరును సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురైంది. గమనించిన పక్కింటి మహిళ ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆమె కూడా షాక్‌కు గురైంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు విద్యుత్‌ను నిలిపి వేసి 108 వాహన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. విద్యుశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. ఆమె మృతితో భర్త, కుమారులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.