పుష్కరాలకు విపత్తుల నిర్వహణ బందం | nss candidates went to pushkaralu | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు విపత్తుల నిర్వహణ బందం

Published Wed, Aug 10 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

nss candidates went to pushkaralu

కావలిఅర్బన్‌ : ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కష్ణా పుష్కరాలకు కావలి నుంచి విపత్తుల నిర్వహణ బందం తరలివెళ్లింది. స్థానిక రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో అంబులెన్స్‌తో పాటు 5 మంది సభ్యులతో కూడిన బందం బుధవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుంచి బయలుదేరింది. ఈ వాహనాన్ని ఆర్డీఓ లక్ష్మీనరసింహం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్‌ అధ్యక్షుడు,  ఆర్డీఓ మాట్లాడుతూ ఈ బందం సభ్యులు ప్రాథమిక చికిత్స, విపత్తుల నిర్వహణలో శిక్షణ పొందినవారని తెలిపారు. వీరు రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో సేవలు అందిస్తున్నారన్నారు. బందంలో బీద లక్ష్మీనంద, మొగళ్లపల్లి సాయిగుప్త, డి.నబికేత్, కాకుమాని ప్రీతమ్‌శెట్టి, డాకారపు పుశ్యమిత్రలున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ కార్యదర్శి డి.రవిప్రకాష్, సెంట్రల్‌ బ్యాంకు డైరెక్టర్‌ డి.సుధీర్‌నాయుడు పాల్గొన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement