ఆయన విసిరేసిన డబ్బుకు పచ్చపార్టీ టిక్కెట్ ఇచ్చింది. అదే కావరంతో ఎన్నికల్లో గెలుపు కోసం ఓటర్లకు డబ్బులు వెదజల్లారు. డబ్బుంటే ఏదైనా నా దాసోహం అవుతుందనుకున్న ఆ పచ్చనేత అహంకారానికి నియోజకవర్గ ప్రజలు తెలివిగా సమాధానమిచ్చాని టాక్. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల మనసులో నిలవాలని ఓటింగ్‌తో ఆయనకు బుద్ధి చెప్పారని స్తోంది. అంతేకాదు ఆ పచ్చనేత బెదిరింపులకు భయపడేది లేదంటోన్న ఆ నియోజకవర్గం ఎక్కడుంది ?
2024 ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని విపక్షకూటమి చేయని ప్రయత్నం లేదు. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో మాఫియాడాన్‌గా పేరున్న కావ్య కృష్ణారెడ్డికి టిక్కెట్ ఇచ్చింది. ఎప్పుడూ ప్రజల కష్టాలను కానీ, నియోజవర్గంలోని అభివృద్ధి గురించి కానీ ఈయన గారు పట్టించుకున్నది లేదు..చేసింది కూడా ఏమీ లేదు. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ఏం చేస్తామన్నది కూడా ఓటర్లకు ఈయన చెప్పింది కూడా లేదు.
నామమాత్రంగా ప్రచారాన్ని ముగించి పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్నప్పుడు కుట్ర రాజకీయాలు మొదలెట్టాడు. ఎన్నికల్లో గెలవాలి..అధికారం అందుకోవాలన్న తాపత్రయతంతో ఓటర్లను కొనేయాలని డిసైడ్ అయ్యారు. అనుచరులతో డబ్బులు పంపిణీ చేశారు. ఓటుకు రెండు వేలు చొప్పున పంచారు. పోలింగ్ రోజున కూడా ఈ ఓటుకు నోటు యవ్వారం నడిచినట్లు సమాచారం.
కావలి నియోజకవర్గంలో 2 లక్షల 3853 ఓట్లు ఉండగా.. వాటిల్లో లక్షా 98 వేల ఓట్లు పోలయ్యాయి. 97,916 ఓట్లు పురుషులు, లక్ష ఓట్లు మహిళలు వేశారు. గత ఎన్నికల కంటే ఈసారి ఆరు శాతం అధికంగా పోలింగ్ నమోదయింది.
ఈ భారీ పోలింగ్‌ను చూసి కావ్యకృష్ణారెడ్డి మైండ్ బ్లాక్ అయ్యిందని సమాచారం. సర్కార్ సానుకూల ఓటు పోటెత్తిందనే విషయం తెలియడానికి ఆయనకు ఎంతో సమయం పట్టలేదు. తన దగ్గర నోట్లు తీసుకొని ఓటు మాత్రం ఫ్యాన్‌కు గుద్దారని తెలుసుకుని రగిలిపోయారు.
అనుచరులను పంపి ఓటర్ల నుంచి తిరిగి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నించడమే కాదు బెదిరింపులకు దిగిన కాల్ రికార్డింగ్స్ బయటకొచ్చాయి. ఈ వ్యవహారంపై వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సంక్షేమపాలనను మరోసారి జనం కోరుకుంటూ తీర్పునివ్వడాన్ని చంద్రబాబు కూటమి జీర్ణించుకోలేకపోతోందని ఆరోపించారు.
వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో మరోసారి కావలిలో గెలవనున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రజలతో మమేకమై సమస్యలను పరిష్కరించే నేత కావడం వల్లే ఆయన గెలవబోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment