
సాక్షి, నెల్లూరు: కావలి తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై మాజీ ఇన్‌ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైల్లో ఉంటే టపాసులు కాల్చిన నేతలకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దగదర్తి మండలంలో తన వర్గాన్ని కొందరు ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని చంద్రబాబు,లోకేష్ వద్దే తేల్చుకుంటానని కార్యకర్తల సమావేశంలో మాలేపాటి వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం రూ.17 కోట్లు ఖర్చు పెట్టానంటూ మాలేపాటి వ్యాఖ్యానించారు.
జనసేనలో లుకలుకలు
మరోవైపు, ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేనలో లుకలుకలు బయటపడ్డాయి. నెల్లూరు సిటీ జనసేన నేత వేములపాటి అజయ్ కుమార్‌పై వెంకటగిరి జనసేన నేత వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు సిటీ పాయింట్ ఆప్ కాంటాక్ట్‌గా ఉన్న వేములపాటి అజయ్ కుమార్ పెత్తనం చేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఉమ్మడి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు జనసేన ఇంచార్జ్‌లకు గౌరవం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో జెండా మోసిన తనను పార్టీకి దూరం చేయాలని అజయ్ కుమార్ చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: కాదంబరి కోరాలే గానీ..
Comments
Please login to add a commentAdd a comment