హౌరా ఎక్స్ప్రెస్కు తప్పిన ముప్పు | Howrah Express accident at kavali in nellore district | Sakshi
Sakshi News home page

హౌరా ఎక్స్ప్రెస్కు తప్పిన ముప్పు

Published Sun, Sep 22 2013 8:18 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

Howrah Express accident at kavali in nellore district

కన్యాకుమారి నుంచి హౌరా వెళ్తున్న హౌరా ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా కావలి సమీపంలో  ఈ రోజు తెల్లవారుజామున హౌరా ఎక్స్ప్రెస్ ఆవులను ఢీ కొట్టింది. అనంతరం ఆ రైలు పట్టాలు తప్పింది. రైలులో ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. ఈ ఘటనతో నెల్లూరు వైపు వచ్చే పలు రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. హౌరా ఎక్స్ప్రెస్ ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. రైళ్ల రాకపోకలను పునరుద్దరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.  అయితే హౌర ఎక్స్ప్రెస్ రైలు ఢీ కొన్న ఘటనలో 12 ఆవులు విగత జీవులు అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement