బెంగళూరు, కాకినాడ మధ్య నడిచే శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌ను కావలి రైల్వే స్టేషన్‌లో నిలిపేందుకు(హాల్ట్) రైల్వే శాఖ అంగీకరించింది.
సాక్షి, న్యూఢిల్లీ: బెంగళూరు, కాకినాడ మధ్య నడిచే శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌ను కావలి రైల్వే స్టేషన్‌లో నిలిపేందుకు(హాల్ట్) రైల్వే శాఖ అంగీకరించింది. వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇందు కోసం రైల్వే శాఖకు పలుమార్లు విన్నవించడంతో ఆ ప్రయత్నాలు సఫలమయ్యాయి.