halt
-
వందేభారత్‌కు ఏలూరులో హాల్ట్
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం– సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ (20708/20707) ఎక్స్‌ప్రెస్ రైలుకు ఏలూరు స్టేషన్లో ఒక నిమిషం హాల్టింగ్ సదుపాయం కల్పించినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈనెల 25 నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందేభారత్ ఉదయం 9.49 గంటలకు ఏలూరు స్టేషన్ చేరుకుని, 9.50 గంటలకు బయలుదేరుతుంది. అదేవిధంగా 26 నుంచి విశాఖపట్నం వెళ్లే రైలు సాయంత్రం 5.54 గంటలకు ఏలూరు స్టేషన్ చేరుకుని, 5.55 గంటలకు బయలుదేరి వెళుతుంది. -
ఆ.. 9 రైల్వే స్టేషన్లలో మరిన్ని రైళ్లకు హాల్ట్
సాక్షి, అమరావతి: సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను రాష్ట్రంలో మరో 9 రైల్వే స్టేషన్లలో ఆపాలని (హాల్ట్) రైల్వే శాఖ నిర్ణయించింది. దీర్ఘకాలికంగా ఉన్న ఈ డిమాండ్‌పై కేంద్ర రైల్వే శాఖ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని బొబ్బిలి, దువ్వాడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, నడికుడి, సూళ్లూరుపేట, డోర్నకల్, పీలేరు, కుప్పం రైల్వే స్టేషన్లలో పలు రైళ్లను ఆపాలని నిర్ణయించారు. ఆ వివరాలు ఇలా .. బొబ్బిలి: యశ్వంత్‌పూర్– హతియా ఎక్స్‌ప్రెస్ (12835), యశ్వంత్‌పూర్– టాటా నగర్(12889), హతియా– ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ (22837 – 22838) దువ్వాడ: శంకర్పల్లి– ముంబై ఎక్స్‌ప్రెస్ (18519 , 18520), విశాఖపట్నం– హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ (12803, 12804) పిడుగురాళ్ల: (1) ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ (12603) (2) భువనేశ్వర్– సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (17015), నాగర్సోల్–నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్(17232), సికింద్రాబాద్–తిరుపతి ఎక్స్‌ప్రెస్ (12733) సత్తెనపల్లి: భువనేశ్వర్– సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (17015), నాగర్సోల్–నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ (17232), ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ (12603) నడికుడి: సికింద్రాబాద్– తిరుపతి ఎక్స్‌ప్రెస్ (12733), ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ (12603), భువనేశ్వర్– సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్(17015), నాగర్సోల్–నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ (17232) సూళ్లూరుపేట: అళప్పుజా–ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్ (13352) పీలేరు: నాగర్‌కోయిల్ – ముంబై ఎక్స్‌ప్రెస్ (16340, 16339) , కాచిగూడ–మధురై ఎక్స్‌ప్రెస్ (17615, 17616) కుప్పం: చెన్నై–శిరిడీ ఎక్స్‌ప్రెస్ (22601, 22602) డోర్న్కల్: లింగంపల్లి – కాకినాడ ఎక్స్‌ప్రెస్ (12737), 12738), మచిలీపట్నం– బీదర్ ఎక్స్‌ప్రెస్ (12749, 12750). -
ఇదేం విచిత్రం.. కిలో మీటర్ వెనక్కి నడిచిన రైలు.. ఎందుకంటే?
కేరళలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. స్టేషన్లో ఆగాల్సిన రైలు ఆగకుండా ముందుకెళ్లింది. కొంత దూరం వెళ్లిన తర్వాత విషయం తెలుసుకున్నలోకోపైలట్ దాదాపు కిలోమీటర్ వరకు రైలును వెనక్కి నడిపి ప్రయాణికులను దింపాడు. ఈ వింత సంఘటన అలప్పుజ జిల్లాలో సోమవారం ఉదయం 7.45 గంటలకు చోటుచేసుకుంది. షోరనూర్ నుంచి వేనాడ్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు మావెలిక్కర, చెంగన్నూర్ మధ్యనున్న చెరియానాడ్ రైల్వే స్టేషన్లో ఆగాల్సి ఉంది. కానీ రైలు ఆపకుండా ముందుకు వెళ్లిపోయింది. వెంటనే అటు స్టేషన్లో రైలు ఎక్కాల్సినవాళ్లు.. ఇటు రైలు నుంచి దిగాల్సిన ప్రయాణికులు ఆందోళన చెందారు. కాసేపటికి లోకో పైలట్‌కు వెనక స్టేషన్లో ప్రయాణికులు ఉన్న విషయం గుర్తొచ్చింది. దీంతో రైలును వెనక్కి నడిపాడు. 700 మీటర్లు రైలును వెనక్కిపోనిచ్చి స్టేషన్లో ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. కాగా ప్రయాణికులు ఇబ్బంది పడినట్లు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రైల్వే అధికారులు తెలిపారు. అయినా రైలు సరైన సమయంలో గమ్యస్థానానికి చేరుకుందని వెల్లడించారు. అయితే చేర్యానాడ్ స్టేషన్లో సిగ్నల్ లేదా స్టేషన్ మాస్టర్ లేకపోవడంతో రైలు ఆగకుండా వెళ్లిపోయి ఉందని, ఇది లోకో పైలట్‌ని తప్పిదంగా అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అతని నుంచి వివరణ కోరనున్నట్లు పేర్కొన్నారు. స్టేషన్లో ట్రైన్ ఆపకపోవడానికి కారణం ఏంటనే విషయంపై విచారిస్తామని చెప్పారు. చదవండి: Vande Bharat: వడగళ్లు, పిడుగుపడి దెబ్బతిన్న వందేభారత్ -
ఆ రైళ్లను ఆపండి.. రైల్వే బోర్డు ఛైర్మన్‌కు ఎంపీ భరత్ విజ్ఞప్తి
సాక్షి, ఢిల్లీ: రాజమండ్రి, కొవ్వూరు రైల్వే స్టేషన్లలో పలు ప్రధానమైన రైళ్లు హాల్టులు, స్టాప్లకు అనుమతి ఉత్తర్వులు జారీ చేయాలని రైల్వే బోర్డు ఛైర్మన్ అండ్ సీఈవో వీకే త్రిపాఠిని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ కోరారు. ఢిల్లీలో రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవోలను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. రాజమండ్రి నగర ప్రాధాన్యత, సుదూర ప్రాంతాల నుండి నిత్యం ఇక్కడకు వచ్చే వ్యాపార, వాణిజ్య, యాత్రికులకు కావలసిన రైళ్లు అందుబాటులో లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారని ఎంపీ భరత్ త్రిపాఠికి తెలిపారు. హౌరా టు శ్రీ సత్య సాయి నిలయం ఎక్స్‌ప్రెస్, భువనేశ్వరం టు రామేశ్వరం ఎక్స్‌ప్రెస్, భువనేశ్వరం - పూణే ఎక్స్‌ప్రెస్, చెన్నై-జాల్పిగురి సూపర్-ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కామాక్య యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్, పాండిచ్చేరి హెచ్ డబ్ల్యూ హెచ్ ఎక్స్‌ప్రెస్‌లు హాల్ట్స్, స్టాప్స్‌కు అనుమతి కోరారు. విమానాశ్రయం, ఓఎన్జీ బేస్ కాంప్లెక్స్, ఏపీ పేపర్ మిల్స్, జీఎస్కే హార్లిక్స్, మూడు గ్యాస్ పవర్ ప్రాజెక్ట్స్ తదితర అనేక పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు కూడా రాజమండ్రికి చేరువలోనే ఉందన్నారు. విశాఖపట్నం- విజయవాడ నగరాలకు మధ్యలో ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన కేంద్రంగా రాజమండ్రి నగరం అన్ని రంగాలలోనూ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. టూరిజం హబ్ గా శరవేగంగా రాజమండ్రి, పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. అయితే ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి వచ్చే యాత్రికులకు, టూరిస్టులకు, వ్యాపార, వాణిజ్య, వివిధ రంగాల వారికి అనువైన విధంగా రైళ్లు సదుపాయం లేకపోవడంతో చాలా కష్టంగా ఉంటోందని రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవో త్రిపాఠికి వివరించినట్టు ఎంపీ భరత్ తెలిపారు. అలాగే కొవ్వూరు రైల్వే స్టేషన్లో కొన్ని రైళ్లకు హాల్ట్స్, స్టాప్స్ ఆపివేశారని, వాటిని కూడా పునరుద్ధరించాలని త్రిపాఠిని కోరినట్లు ఎంపీ భరత్ తెలిపారు. బొకారో, సింహాద్రి, తిరుమల, తిరుపతి-పూరి, సర్కార్, కాకినాడ- తిరుపతి, మచిలీపట్నం- విశాఖ, రాయగడ-గుంటూరు, బిలాస్పూర్ ఎక్స్‌ప్రెస్ లను పునరుద్ధరించాల్సిందిగా ఎంపీ భరత్ కోరారు. కొవ్వూరు, గోపాలపురం, తాళ్ళపూడి, పోలవరం మండలాలకు చెందిన సుమారు 60 గ్రామాల ప్రజలు కొవ్వూరు రైల్వే స్టేషను నుండి ప్రయాణం చేయాలని, అటువంటిది రైళ్ల హాల్ట్స్, స్టాప్స్ లేకపోవడంతో మరో 15 కిలోమీటర్లు అదనపు దూరం ప్రయాణించి రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు రావలసి వస్తోందన్నారు. నిలిచిపోయిన రైళ్లను పునరుద్ధరించి, ఆరు నెలలు పరిశీలించాలని.. అప్పటికీ రైల్వే శాఖకు తగిన ఆదాయ వనరులు రాకుంటే మీ నిర్ణయం మేరకు చర్యలు తీసుకోవచ్చని త్రిపాఠికి ఎంపీ భరత్ సూచించారు. అలాగే అనపర్తి, నిడదవోలులో జన్మభూమి ఎక్స్‌ప్రెస్, రాజమండ్రి నుండి లోకల్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు కొనసాగించమని కోరినట్టు ఎంపీ భారత్ వివరించారు. తన అభ్యర్థనలపై రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవో త్రిపాఠి సానుకూలంగా స్పందించారని ఎంపీ భరత్ తెలిపారు. చదవండి: చంద్రబాబు ‘ఆఖరు మాటలు’ దేనికి సంకేతం? -
రిలయన్స్ డీల్‌కు బ్రేక్ : బియానీకి భారీ ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: అమెజాన్‌తో న్యాయపోరాటంలో ఫ్యూచర్ గ్రూప్‌నకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. రిలయన్స్ రిటైల్‌తో రూ.24,713 కోట్ల ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లవద్దని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. గ్రూప్ కంపెనీల్లో వాటాల విక్రయానికి సంబంధించి అమెజాన్ విబేధాలకు సంబంధించి సింగపూర్ ఎమర్జన్సీ ఆర్బిట్రేషన్ (ఈఏ) 2020 అక్టోబర్ 25న ఇచ్చిన ఉత్తర్వులను ఫ్యూచర్ గ్రూప్ కావాలనే నిర్లక్ష్యం చేసినట్లు స్పష్టమవుతోందని 134 పేజీల తీర్పులో న్యాయస్థానం పేర్కొంది.(మాల్యా, మోదీ, మెహెల్‌కు నిర్మలాజీ షాక్) కిశోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ సింగపూర్ ఆర్బిట్రేటర్ ఆదేశాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందని, ఈ ఒప్పందంపై తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించినట్లు జస్టిస్ జెఆర్ మిధా ధర్మాసనం పేర్కొంది. ఫ్యూచర్ గ్రూపుకు సంబంధించిన బియానీ, ఇతరుల ఆస్తులను అటాచ్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఫ్యూచర్ గ్రూప్ ఈ కేసుకు సంబంధించి లేవనెత్తిన అభ్యంతరాలన్నింటినీ తోసిపుచ్చుతూ ఫ్యూచర్ గ్రూప్ సంస్థ డైరెక్టర్లపై రూ. 20 లక్షల ‘కాస్ట్’ను విధించింది. ఢిల్లీ కేటగిరీలో సీనియర్ సిటిజన్లు, పేదలకు వ్యాక్సినేషన్ వినియోగించే విధంగా రెండు వారాల్లో రూ. 20 లక్షల కాస్ట్ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయక నిధిలో డిపాజిట్ చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 28వ తేదీన ఈ కేసు విషయంలో స్వయంగా హాజరుకావలని ప్రమోటర్ బియానీ, ఇతర డైరెక్టర్లను ఆదేశించింది. వారి ఆస్తుల జప్తునకూ ఆదేశాలు జారీచేసింది. వారి ఆస్తుల వివరాలను నెల రోజుల్లో అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని స్పష్టం చేసింది. సింగపూర్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను పట్టించుకోనందుకు మూడు నెలలు తక్కువకాకుండా జైలులో ఎందుకు ఉంచకోడదని ప్రశి్నస్తూ, సమాధానానికి రెండు వారాల గడువిచి్చంది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా వేసింది. -
సాంకేతిక లోపం : ట్రేడర్లలో కలవరం
సాక్షి, ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లో ఒక్కసారిగా ట్రేడింగ్ నిలిచిపోవడం కలకలం రేపింది. సాంకేతిక లోపాల కారణంగా స్టాక్ మార్కెట్లో (ఎన్ఎస్ఈ) ట్రేడింగ్ నిలిచిపోయింది. ఎన్ఎస్ఈ ఎఫ్అండ్ఓలో ఉదయం 11:40 నిమిషాల నుంచి ట్రేడింగ్ ఆగిపోయింది. దీంతో క్యాష్ మార్కెట్లోనూ ఎన్ఎస్ఈ ట్రేడింగ్ ఆపివేసింది. దీనిపై స్పందించిన ఎన్ఎస్ఈ ప్రస్తుతం సర్వర్‌ను రీస్టార్ట్ చేశామని, ట్రేడింగ్ మళ్ళీ ఎప్పుడు ప్రారంభమయ్యేది తెలియజేస్తామని వెల్లడించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రేడర్లలో తీవ్ర గందరగోళం నెలకొంది. మరోవైపు అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న ట్రేడర్లలో తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. అటు ఆయా ట్రేడింగ్ ఏజెన్సీలు కూడా ఇన్వెస్టర్లను అప్రమత్తం చేశాయి. అయితే బీఎస్ఇ అన్ని విభాగాలలో సాధారణ ట్రేడింగ్ కొనసాగుతోంది. ఎన్ఎస్ఇ ప్రీ-ఓపెనింగ్ సెషన్ మధ్యాహ్నం 1 గంటలకు, మధ్యాహ్నం 1:15 నుండి సాధారణ ట్రేడింగ్ ప్రారంభమవుతుందని తాజాగా ప్రకటించింది. Trading is halted on NSE across brokers. We are waiting for it to come back online. For equity orders, you can use BSE. https://t.co/j0o1SKr7sp — Zerodha (@zerodhaonline) February 24, 2021 People waiting for #Nifty tick to update #StockMarket #nse pic.twitter.com/wp4HhCSGcY — The Wolverine (@KEEP_IT_UPER) February 24, 2021 -
కరోనా ఎఫెక్ట్: ఇక ఆ కార్లు ఉండవు
సాక్షి, ముంబై: అసలే సంక్షోభంలో చిక్కుకున్న ఆటో పరిశ్రమను కరోనా వైరస్ మరింత దెబ్బతీసింది. లాక్డౌన్ కాలంలో అమ్మకాలు అసలే లేకపోవడంతో ఆదాయాలు క్షీణించి కుదేలయ్యాయి. దీంతో హోండా ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తమ రెండు ప్లాంట్లలో ఒకదానిలో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గ్రేటర్ నోయిడా ప్లాంట్ వద్ద హోండా వాహనాల ఉత్పత్తిని నిలిపివేసింది. అంతేకాదు గ్రేటర్ నోయిడా ప్లాంట్‌లో తయారయ్యే హోండా పాపులర్ కార్లు హోండా సివిక్, సీఆర్-వీ కార్లు ఇకపై ఇండియాలో లభ్యంకావని వెల్లడించింది. భారీ పెట్టుబడి అవసరం కనుక ఈ రెండు కార్లను నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది. బహుల జనాదరణ పొందిన హోండా సివిక్ ,హోండా సీఆర్-వీరెండు గ్లోబల్ మోడల్స్‌ను నిలిపివేయడం తమకు చాలాకష్టమైన నిర్ణయమని హెచ్‌సీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ,డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాజేష్ గోయెల్ పేర్కొన్నారు. అయితే రాబోయే 15 సంవత్సరాలకు ఈ రెండు కార్ల యజమానులకు అన్ని విధాల తమ సహాయ సహకారాల్ని అందిస్తామన్నారు. తాజా నిర్ణయంతో హోండా పోర్ట్‌ఫోలియోలో కాంపాక్ట్ సెడాన్ అమేజ్, మిడ్-సైజ్ సెడాన్ హోండా సిటీ, సబ్-4 ఎమ్ ఎస్యువి డబ్ల్యుఆర్-వీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ జాజ్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. నోయిడా ప్లాంట్ పెద్ద హోండా వాహనాలు ఉత్పత్తి అవుతుండగా, రాజస్థాన్‌లోని రెండవ తపుకర ప్లాంట్ చిన్న, హై-స్పీడ్ కార్లు తయారవుతున్నాయి. హోండా సిటీ ఉత్పత్తిని తపుకరలోని ప్లాంట్‌కు మార్చనుంది. -
స్టెరిలైట్ ప్లాంట్ విస్తరణకు హైకోర్టు బ్రేక్
సాక్షి, చెన్నై: తమిళనాడులో తూత్తుకుడిలో స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ నిర్మాణంపై మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా గత 100 రోజులుగా జరుగుతున్న నిరసన, ఆందోళన హింసాత్మకంగా మారడంపై కోర్టు గురువారం స్పందించింది. నిర్మాణ విస్తరణ పనులను నిలిపివేయాల్సిందిగా మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. వివాదాస్పద పారిశ్రామిక యూనిట్ ప్రతిపాదిత విస్తరణ పనులను నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టు లోని మదురై బెంచ్ ఆదేశించింది. ప్లాంట్ నిర్మాణానికి ప్రజల అనుమతి పొందాలని తెలిపింది. ప్రాజెక్టుకు అనుమతినిచ్చేముందు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కేంద్రానికి సూచించింది. ఈ మేరకు తాజా పిటిషన్ దాఖలు చేయాల్సింది వేదాంత కంపెనీనీ ఆదేశించింది. దీంతోపాటు పోలీస్ కాల్పుల ఘటనపై నివేదికను సమర్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హోం మంత్రిత్వ శాఖను కోరింది. మరోవైపు తూత్తుకూడిలో పోలీసుల కాల్పుల ఘటనపై విచారణకు రిటైర్డ్ జడ్జి అరుణ జగదీశన్‌ను నియమిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఆందోళనకారులపై పోలీసుల కాల్పుల ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి న్యాయ విచారణకు ఆదేశించారు. మృతులు ఒక్కొక్కరికీ 10లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. అటు కేంద్రం కూడా ఈ వ్యవహారంపై ఒక సమగ్ర నివేదికను సమర్పించాల్సిందిగా రాష్ట్రాన్ని కోరింది. కాగా వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్ యూనిట్ విస్తరణ ప్రతిపాదనల్ని వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన పోలీసు కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు, ఇతర నాయకులు పోలీసుల దమనకాండపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. -
జీవచ్ఛవంలా...
రోడ్డు ప్రమాదంతో ఛిద్రమైన జీవితం మాట తప్ప శరీర స్పర్శ కోల్పోయిన వైనం ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు కళ్లముందు ఆడుతూ పాడుతూ పెరిగి పెద్దదైన కూతురికి పెళ్లి చేశారు. ఆమె ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తోందని ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. అయితే ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. ఓ శుభకార్యానికి వెళ్తుండగా చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం... కుమార్తె జీవితాన్ని ఛిద్రం చేసింది. మాట తప్ప శరీరానికి స్పర్శలేకుండా పోయి.. మంచానికే పరిమితమైంది. రూ. లక్షలు వెచ్చించి చికిత్స చేయించినా నయంకాకపోవడంతో చివరకు జీవచ్ఛవంలా మారిపోయింది. ప్రస్తుతం వైద్యం చేయించేందుకు డబ్బుల్లేక, ఉన్న పిల్లలకు చదువు చెప్పించలేక ఆపన్నహస్తం కోసం నిరుపేద తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ధర్మవరంలోని హౌసింగ్ కార్యాలయం సమీపంలో నివసిస్తున్న నార్పల నాగిరెడ్డి, అనసూయమ్మ దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తె లక్ష్మికి 17 ఏళ్ల క్రితం నార్పలకు చెందిన ప్రభాకరరెడ్డితో వివాహం జరిపించారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. నార్పలలోని ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా ప్రభాకర్‌రెడ్డి, ఇంటి వద్దనే టైలరింగ్ చేస్తూ లక్ష్మి కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చారు. తిరుపతికి వెళ్తూ... లక్ష్మి తమ్ముడు హేమసుందర్‌రెడ్డి కుమారుడి పుట్టు వెంట్రుకలు తిరుపతిలో తీయించేందుకు 2011 నవంబర్ 26న కుటుంబసభ్యులందరూ ఒకే వాహనంలో బయలుదేరారు. రాత్రి పూట ప్రయాణించే సమయంలో యూటర్న్ ఉన్న రోడ్డును డ్రైవర్ గమనించకపోవడంతో వాహనం అదుపు తప్పి ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొంది. ఘటనలో నాగిరెడ్డి, అనసూయమ్మ, లక్ష్మి, ఆమె భర్త ప్రభాకరరెడ్డి, బంధువు హనుమంతరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. లక్ష్మికి మెడపై నరాలు దెబ్బతిని, శరీరంలో చలనం లేకుండా పోయింది. అప్పటి నుంచి అనంతపురం, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో చికిత్సలు చేయించారు. దాదాపు రూ. 40 లక్షల వరకూ ఖర్చు చేసి తల్లిదండ్రులు చికిత్సలు చేయించారు. ఆయినా లక్ష్మిలో ఏ మార్పురాలేదు. దీంతో ఆమె మంచానికే పరిమితమైపోయింది. తలకు గాయాలు నయమైపోవడంతో ప్రభాకరరెడ్డి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతను తిరిగి చూడలేదు. భార్యాపిల్లల బాగోగుల గురించి ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో లక్ష్మి పోషణ భారం తల్లిదండ్రులపై పడింది. మనవడు చరణ్‌తేజ్, మనవరాలు కీర్తిని చదివించడంతోపాటు కూతురు లక్ష్మికి చికిత్సలు చేయిస్తూ వస్తున్నారు. పొలం అమ్మిన డబ్బుతో.. ధర్మవరం డివిజన్ పరిధిలోని విద్యుత్‌శాఖలో హెల్పర్‌గా పనిచేసిన నాగిరెడ్డి.. తన ఉద్యోగ విరమణ అనంతరం వచ్చిన పీఎఫ్ డబ్బు రూ. 15 లక్షలను కూతురు వైద్యం కోసం ఖర్చు చేశాడు. అదీ చాలకపోవడంతో చెన్నేకొత్తపల్లి సమీపంలో ఉన్న ఐదు ఎకరాల భూమిని రూ. 10 లక్షలకు అమ్మి చికిత్స చేయించారు. ఇంకా బంధువుల వద్ద అప్పులు చేశారు. మూడేళ్లు ఆస్పత్రుల్లోనే.... ప్రమాదానికి గురైన తర్వాత మూడేళ్ల పాటు బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో లక్ష్మిని ఉంచి చికిత్స చేయించారు. క్రమేణ ఖర్చు పెరిగిపోతుండడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చివరకు నెలకు రూ. 10 వేలు వెచ్చించి ఏడాది పాటు ఇద్దరు వైద్యులతో ఫిజియోథెరఫీ చేయించారు. చేతుల్లో చిన్నపాటి కదలిక వచ్చినా.. ఉపయోగం లేకుండా పోయింది. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు.. లక్ష్మికి చికిత్స చేయించేందుకు ప్రస్తుతం డబ్బుల్లేక నాగిరెడ్డి దంపతులు అప్పు చేస్తున్నారు. ఆమెకు వైద్యం చేయించేందుకే ఇబ్బంది పడుతున్న తమకు పిల్లల చదువులు అదనపు భారంగా మారాయి. తాము బతికుండగానే కుమార్తెను మాములు మనిషిగా చూడాలనే తపన వారిలో నానాటికీ పెరిగిపోతోంది. దేవుడు చిన్నచూపు చూసి తాము ముందుగానే చనిపోతే చిన్న పిల్లలతో తమ కూతురు ఎలా జీవిస్తోందోనన్న వేదన వారిని మరింత కుంగదీస్తోంది. ఎవరైనా పెద్ద డాక్టర్లు, ప్రభుత్వం స్పందించి తమ కూతురు లక్ష్మిని మాములు మనిషిగా చేయాలని వృద్ధ దంపతులు కోరుకుంటున్నారు. చికిత్స కోసం దాతలు సహకరించాలని వేడుకుంటున్నారు. సాయం చేయదలిస్తే.. పేరు : నార్పల నాగిరెడ్డి బ్యాంక్ ఖాతా నం. : 11095747799 బ్యాంక్ శాఖ : స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ధర్మవరం, అనంతపురం జిల్లా ఐఎఫ్ఎస్ కోడ్ : ఎస్బీఐఎన్0000250 ఫోన్ : 99855 60894 -
డబుల్ డెక్కర్ రైలుకు గూడెంలో హాల్ట్
తాడేపల్లిగూడెం : తిరుపతి–విశాఖపట్టణం మధ్య త్వరలో ప్రారంభమయ్యే డబుల్ డెక్కర్ రైలుకు తాడేపల్లిగూడెంలో హాల్ట్ కల్పించారు. ఈనెల 30న కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు విజయవాడలో రైలును ప్రారంభించనున్నట్టు బీజేపీ నేతలు తెలిపారు. స్థానిక వాసవీ ఆడిటోరియంలో ఆదివారం బీజేపీ నాయకులు యెగ్గిన నాగబాబు, గమిని సుబ్బారావు తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు. మంత్రి మాణిక్యాలరావు చొరవతో ఈ రైలుకు హాల్ట్ సౌకర్యం కల్పించినట్టు వారు తెలిపారు. రైలు సమయాలను అధికారికంగా త్వరగా ప్రకటిస్తారన్నారు. సమావేశంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు చలంచర్ల మురళి, వబిలిశెట్టి నటరాజ్, మంత్రి కార్యాలయ పీఆర్వో చిట్యాల రాంబాబు పాల్గొన్నారు. -
7 నుంచి నూజివీడులో జన్మభూమి హాల్ట్
రాజమహేంద్రవరం : విశాఖపట్నం- సికింద్రాబాద్‌ల మధ్య తిరిగే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 12806/12805 రైలుకు ప్రయోగాత్మకంగా ఈ నెల 7 వ తేదీ నుంచి 6 నెలల పాటు నూజివీడులో హాల్ట్ ఇవ్వనున్నట్టు రాజమహేంద్రవరం కమర్షియల్ ఇన్స్పెక్టర్ కళ్యాణ్‌కుమార్ గురువారం తెలిపారు. విశాఖపట్నం వైపునుంచి వచ్చే రైలు నూజివీడు రైల్వేస్టేషన్లో ఉదయం 10.44 గంటలకు ఆగి 10.45 గంటలకు బయలు దేరుతుందన్నారు. అదే విధంగా సికింద్రాబాద్ నుంచి వచ్చే రైలు సాయంత్రం 14.13 (2గంటల13నిమషాల)కు ఆగి 14.14 (2గంటల13 నిముషాలు)కు బయలుదేరుతుందన్నారు. -
‘ప్రైవేటు’ విశృంఖలతకు సుప్రీం కళ్లెం
సందర్భం ప్రైవేటు విద్యాసంస్థల ప్రవేశాలు, ఫీజులు వారి ఇష్టానుసారమే అనడాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. మెరిట్ మాత్రమే ఉన్నత ప్రామాణికమని, నీట్ ప్రైవేటు సంస్థల ప్రాథమిక హక్కులకు భంగకరం కాదని, అది రాజ్యాంగ బద్ధమని స్పష్టీకరించింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తాయని ఆశిద్దాం. జాతి ఔన్నత్యానికి వెన్నె ముక విద్యే. కానీ దాన్ని ఒక వ్యాపారంగా మార్చడంలో ప్రభుత్వాలు, న్యాయస్థా నాలు, మరీ ముఖ్యంగా విద్యా సంస్థలు తమ వంతు పాత్రను పోషించాయి. మొత్తం విద్యా వ్యవస్థ దారుణంగా దిగజారి పోయింది. సుప్రీంకోర్టు ఇటీ వల వెలువరించిన ‘నీట్’ (నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్) తీర్పు నేపథ్యంలో ఒకసారి ఈ పరిస్థితిని పరికిద్దాం. ఒకప్పుడు కేపటేషన్ ఫీజు వసూలు చేయడం తీవ్ర నేరం. మన రాష్ట్రంలో దీన్ని అరికట్టడానికి ఒక చట్టం ఉంది. కోర్టు తీర్పుల ఫలితంగా అది నిర్వీర్యం అయింది. ఆ చట్టం ప్రకారం, ఒకప్పుడు వైద్య, ఇంజ నీరింగ్ ప్రవేశాలకు ఒకే ఎంట్రన్స్ ఉండేది. అందరికీ ర్యాంకులు ఇచ్చేవారు. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలన్నిటిలోనూ ప్రవేశాలకు ఆ ర్యాంకులే ప్రాతిపదిక. కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా ఉండేవి. సీట్ల కేటాయింపును కన్వీనరే నిర్వహించే వారు, ఫీజులను ప్రభుత్వమే నిర్ణయించేది. ఇది చాలా కాలం బాగానే పనిచేసింది. ఉన్నిక్రిష్ణన్ (1993) కేసు సందర్భంగా సుప్రీం కోర్టు ఈ విధానం దేశవ్యాపితంగా అమలయ్యేలా చేసింది. అప్పటి నుంచి ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్ని క్రిష్ణన్ కేసును తిరగ తోడటానికి తీవ్ర ప్రయత్నాలు చేశాయి. వివిధ కేసుల్లో వివిధ హైకోర్టులు రకరకాలుగా తీర్పులు చెప్పాయి. కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు అనుకూలంగా వ్యాఖ్యానిస్తే, మరికొన్ని పై తీర్పుని సమ ర్థించాయి. ఫీజుల వసూళ్ళలో వైవిధ్యం వల్ల మేనేజ్ మెంట్ కోటాలో చేరిన విద్యార్థులు, కన్వీనర్ కోటా విద్యార్థుల ఫీజును భరించాల్సి వస్తుందనేది యాజమా న్యాల ముఖ్య వాదన. కానీ, కన్వీనర్ కోటాలో చేరే విద్యార్థులు మెరిట్ ప్రాతిపదికన సీట్లు పొందేవారు. వారి ఫీజు ప్రభుత్వ కాలేజీల ఫీజులతో సమానంగా ఉండేది. మేనేజ్మెంట్ కోటాలో చేరే వారు అటువంటి మెరిట్ లేనివారు, వారు ఫీజు ఎక్కువగా చెల్లించాల్సి వచ్చేది. దీన్నే అసంబద్ధమనేవారు! 2002 బీఎంఏ పాయ్ కేసులో సుప్రీం కోర్టు ఎట్టకేలకు ఈ వాదనకు ఆమోద ముద్ర వేసింది, ఉన్ని క్రిష్ణన్ కేసు ఈ మేరకు రాజ్యాంగబద్ధం కాదని తీర్పు నిచ్చింది. ఇస్లామిక్ అకాడమీ (బాంబే మోడరన్ స్కూల్ 2004), పీఏ ఇనాందార్ (2005) కేసులలో సుప్రీం కోర్టు ప్రేవేటు విద్యాసంస్థల యాజమాన్యాల వాదనను సమ ర్థించాయే తప్ప, అసలు సమస్య వైపు చూడలేదు. మెరిట్ ఉండాలంటూనే, అందుకు త గిన ప్రాతిపదికను రూపొందించలేదు. ఇది మొత్తం విద్యారంగం రూపునే మార్చివేసింది. ప్రైవేటు కాలేజీల వ్యవహారాలలో ప్రభుత్వ జోక్యం ఉండరాదనడంతో ప్రవేశ పరీక్షలు, అధ్యాపకుల నియామకాలు ప్రైవేటు కాలేజీలే నిర్వహిం చుకోవాల్సి వచ్చింది. దీంతో ప్రైవేటు విద్యాసంస్థలపై ప్రభుత్వ నియంత్రణ తగ్గిపోయి, విద్యాపరమైన వ్యవ హారాలకే పరిమితమైంది. ప్రైవేటు రంగంలో దిగజారిన ప్రమాణాలు, సరైన విద్యా వసతుల లేమి, అంతులేని ఫీజులు కలసి ‘మెరిట్’ను పాతర వేశాయి. ప్రభుత్వాలు నిర్లిప్తంగా విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేశాయి. ఏమైతేనేం విద్యారంగం తీవ్రంగా దెబ్బతింది. మెరిట్‌కు విలువ లేకుండా పోయింది. ఫీజులు మెరిట్ ఉన్నవాళ్లకు అందుబాటులో లేకుండా పోయాయి. ముఖ్యంగా వైద్య విద్య వెల కోట్లకు చేరింది. మెరిట్ ఉన్న వాళ్లను బయట ఉంచి, లేనివాళ్లకు తలుపులు తెరిచారు. దీన్ని ఏదో మేరకు నియంత్రించాలనే 2007లో కేంద్రం నీట్‌ను ముందుకు తెచ్చింది. దేశ వ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని సంక ల్పించింది. దీంతో ప్రైవేటు సంస్థలు నీట్ ప్రవేశ పరీక్ష తమకు వర్తించదని, ఇది గత సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని, తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవ డమని, రాజ్యాంగబద్ధం కాదని దీన్ని సవాలు చేశాయి. వివిధ హైకోర్టుల్లోని అన్ని కేసులను తమవద్దకే బదిలీ చేయించుకుని సుప్రీంకోర్టు అన్నిటినీ కలిపి విచారించి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ కేసులో 18.7.2013న తీర్పును వెల్లడించింది. నీట్ ప్రైవేట్ కాలేజీలకు వర్తించ దని, అది వారి హక్కులలో జోక్యం చేసుకోవడమేనని తీర్పునిచ్చింది. నీట్, వివిధ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షలను రద్దు చేయజాలదని మెజారిటీ తీర్పు చెప్పింది. ఈ తీర్పునే ఇటీవల సుప్రీం కోర్టు (11.4.2016)న వెనక్కు తీసుకొని, రాజ్యాంగ ధర్మాసనం ముందు పునర్విచారణకు ఆదేశించింది. రాజ్యాంగ ధర్మాసనం 2.5.2016న తన తీర్పును వెల్లడించింది. ప్రైవేటు విద్యాసంస్థల కళాశాలల ప్రవే శాలు, ఫీజులు వారి ఇష్టానుసారమే అనడాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ వాదన ఇంతకు ముందటి సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉందని తేల్చింది. మెరిట్ మాత్రమే ఉన్నత ప్రామాణికమని, దీన్ని ఎట్టి పరిస్థితులలో దిగజార్చేది లేదని స్పష్టం చేసింది. అదే విధంగా కేపిటేషన్ ఫీజు విపరీతంగా వసూలు చేయ టాన్ని సమర్థించబోమని చెప్పింది. నీట్ ప్రవేశ పరీక్ష చట్టం, నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం కాదని, ప్రైవేటు సంస్థల ప్రాథమిక హక్కులను భంగపరచడం లేదని తేల్చింది. నీట్ రాజ్యాంగబద్ధమని స్పష్టీకరించింది. ఫీజు లను నియంత్రించవచ్చునని చెప్తూ మార్గదర్శకాలు ఇచ్చింది. సుమారు దశాబ్దం పైగా కొనసాగిన అనిశ్చిత పరిస్థితికి ఈ తీర్పు తెరదించింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు, వాటి నిర్వహణ రంగాలు పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తారని ఆశిద్దాం. అదే విధంగా ప్రైవేటు విద్యా సంస్థలు కూడా బాధ్యతగా ఉంటాయని ఆశించవచ్చునా? - ఎ. సత్యప్రసాద్ వ్యాసకర్త మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఈమెయిల్ : asphyd@icloud.com -
కావలిలో ఆగనున్న శేషాద్రి ఎక్స్‌ప్రెస్
సాక్షి, న్యూఢిల్లీ: బెంగళూరు, కాకినాడ మధ్య నడిచే శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌ను కావలి రైల్వే స్టేషన్లో నిలిపేందుకు(హాల్ట్) రైల్వే శాఖ అంగీకరించింది. వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇందు కోసం రైల్వే శాఖకు పలుమార్లు విన్నవించడంతో ఆ ప్రయత్నాలు సఫలమయ్యాయి. -
'జన్మభూమి'ని బహిష్కరించిన గ్రామస్తులు
డీ. హీరేహళ్ (అనంతరం జిల్లా) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి కార్యక్రమాన్ని ఒక గ్రామస్తులు బహిష్కరించారు. ఈ సంఘటన శనివారం అనంతపురం జిల్లా డీ. హీరేహళ్ మండలం మలపనగుడి గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. మలపనగుడి గ్రామంలో జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వెళ్లిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మా సమస్యలను పరిష్కరించకుండా ఇప్పుడు వచ్చి జన్మభూమి అంటే ఎలా అని గ్రామస్తులు నిలదీస్తున్నారు.