7 నుంచి నూజివీడులో జన్మభూమి హాల్ట్ | janmabhumi express train halt in nuzvid railway station | Sakshi
Sakshi News home page

7 నుంచి నూజివీడులో జన్మభూమి హాల్ట్

Published Fri, Jul 1 2016 8:28 AM | Last Updated on Mon, Sep 4 2017 3:54 AM

janmabhumi express train halt in nuzvid railway station

రాజమహేంద్రవరం : విశాఖపట్నం- సికింద్రాబాద్‌ల మధ్య తిరిగే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 12806/12805 రైలుకు ప్రయోగాత్మకంగా ఈ నెల 7 వ తేదీ నుంచి 6 నెలల పాటు నూజివీడులో హాల్ట్ ఇవ్వనున్నట్టు రాజమహేంద్రవరం కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ కళ్యాణ్‌కుమార్ గురువారం తెలిపారు.

విశాఖపట్నం వైపునుంచి వచ్చే రైలు నూజివీడు రైల్వేస్టేషన్‌లో ఉదయం 10.44 గంటలకు ఆగి 10.45 గంటలకు బయలు దేరుతుందన్నారు. అదే విధంగా సికింద్రాబాద్ నుంచి వచ్చే రైలు సాయంత్రం 14.13 (2గంటల13నిమషాల)కు ఆగి 14.14 (2గంటల13 నిముషాలు)కు బయలుదేరుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement