ఆ.. 9 రైల్వే స్టేషన్లలో మరిన్ని రైళ్లకు హాల్ట్‌  | Halt for more trains at 9 railway stations | Sakshi
Sakshi News home page

ఆ.. 9 రైల్వే స్టేషన్లలో మరిన్ని రైళ్లకు హాల్ట్‌ 

Published Wed, Jul 19 2023 4:48 AM | Last Updated on Wed, Jul 19 2023 4:48 AM

Halt for more trains at 9 railway stations - Sakshi

సాక్షి, అమరావతి: సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను రాష్ట్రంలో మరో 9 రైల్వే స్టేషన్లలో ఆపాలని (హాల్ట్‌) రైల్వే శాఖ నిర్ణయించింది. దీర్ఘకాలికంగా ఉన్న ఈ డిమాండ్‌పై కేంద్ర రైల్వే శాఖ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని బొబ్బిలి, దువ్వాడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, నడికుడి, సూళ్లూరుపేట, డోర్నకల్, పీలేరు, కుప్పం రైల్వే స్టేషన్లలో పలు రైళ్లను ఆపాలని నిర్ణయించారు. ఆ వివరాలు ఇలా ..  

బొబ్బిలి: యశ్వంత్‌పూర్‌– హతియా ఎక్స్‌ప్రెస్‌ (12835), యశ్వంత్‌పూర్‌– టాటా నగర్‌(12889), హతియా– ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌ (22837 – 22838)  
దువ్వాడ: శంకర్‌పల్లి– ముంబై ఎక్స్‌ప్రెస్‌ (18519 , 18520), విశాఖపట్నం– హజ్ర­త్‌ నిజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌ (12803, 12804)  
పిడుగురాళ్ల:  (1) ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ – హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (12603) (2) భువ­నేశ్వ­ర్‌– సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (17015), నాగర్‌సోల్‌–నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌­(17232), సికింద్రాబాద్‌–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ (12733) 
సత్తెనపల్లి: భువనేశ్వర్‌– సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (17015), నాగర్‌సోల్‌–నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (17232), ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ – హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (12603) 
నడికుడి: సికింద్రాబాద్‌– తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ (12733), ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ – హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (12603), భువనేశ్వర్‌– సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌(17015), నాగర్‌సోల్‌–నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (17232)  
సూళ్లూరుపేట: అళప్పుజా–ధన్‌బాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (13352)              
పీలేరు: నాగర్‌కోయిల్‌ – ముంబై ఎక్స్‌ప్రెస్‌  (16340, 16339) , కాచిగూడ–మధురై ఎక్స్‌ప్రెస్‌ (17615, 17616) 
కుప్పం: చెన్నై–శిరిడీ ఎక్స్‌ప్రెస్‌ (22601, 22602) 
డోర్న్‌కల్‌: లింగంపల్లి – కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ (12737), 12738), మచిలీపట్నం– బీదర్‌ ఎక్స్‌ప్రెస్‌ (12749, 12750).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement