
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం– సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ (20708/20707) ఎక్స్‌ప్రెస్ రైలుకు ఏలూరు స్టేషన్‌లో ఒక నిమిషం హాల్టింగ్ సదుపాయం కల్పించినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
ఈనెల 25 నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందేభారత్ ఉదయం 9.49 గంటలకు ఏలూరు స్టేషన్ చేరుకుని, 9.50 గంటలకు బయలుదేరుతుంది. అదేవిధంగా 26 నుంచి విశాఖపట్నం వెళ్లే రైలు సాయంత్రం 5.54 గంటలకు ఏలూరు స్టేషన్ చేరుకుని, 5.55 గంటలకు బయలుదేరి వెళుతుంది.