కేరళలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. స్టేషన్‌లో ఆగాల్సిన రైలు ఆగకుండా ముందుకెళ్లింది. కొంత దూరం వెళ్లిన తర్వాత విషయం తెలుసుకున్నలోకోపైలట్ దాదాపు కిలోమీటర్ వరకు రైలును వెనక్కి నడిపి ప్రయాణికులను దింపాడు. ఈ వింత సంఘటన అలప్పుజ జిల్లాలో సోమవారం ఉదయం 7.45 గంటలకు చోటుచేసుకుంది.
షోరనూర్ నుంచి వేనాడ్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు మావెలిక్కర, చెంగన్నూర్ మధ్యనున్న చెరియానాడ్ రైల్వే స్టేషన్‌లో ఆగాల్సి ఉంది. కానీ రైలు ఆపకుండా ముందుకు వెళ్లిపోయింది. వెంటనే అటు స్టేషన్‌లో రైలు ఎక్కాల్సినవాళ్లు.. ఇటు రైలు నుంచి దిగాల్సిన ప్రయాణికులు ఆందోళన చెందారు. కాసేపటికి లోకో పైలట్‌కు వెనక స్టేషన్‌లో ప్రయాణికులు ఉన్న విషయం గుర్తొచ్చింది. దీంతో రైలును వెనక్కి నడిపాడు. 700 మీటర్లు రైలును వెనక్కిపోనిచ్చి స్టేషన్‌లో ప్రయాణికులను ఎక్కించుకున్నాడు.
కాగా ప్రయాణికులు ఇబ్బంది పడినట్లు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రైల్వే అధికారులు తెలిపారు. అయినా రైలు సరైన సమయంలో గమ్యస్థానానికి చేరుకుందని వెల్లడించారు. అయితే చేర్యానాడ్ స్టేషన్‌లో సిగ్నల్ లేదా స్టేషన్ మాస్టర్ లేకపోవడంతో రైలు ఆగకుండా వెళ్లిపోయి ఉందని, ఇది లోకో పైలట్‌ని తప్పిదంగా అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అతని నుంచి వివరణ కోరనున్నట్లు పేర్కొన్నారు. స్టేషన్‌లో ట్రైన్ ఆపకపోవడానికి కారణం ఏంటనే విషయంపై విచారిస్తామని చెప్పారు.
చదవండి: Vande Bharat: వడగళ్లు, పిడుగుపడి దెబ్బతిన్న వందేభారత్
Comments
Please login to add a commentAdd a comment