న్యూఢిల్లీ: ఓ ట్రైన్ లోకో పైలెట్ అప్రమత్తంతో పెను ప్రమాదమే తప్పింది. రైల్వే ట్రాక్‌పై గొడుగు కింద ఆద మరిచి నిద్రపోతున్న ఓ వ్యక్తి ప్రాణాల నుంచి బయటపడ్డాడు.
ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి నిద్రిస్తున్నాడు. అదే సమయంలో అటు నుంచి వస్తున్న ఓ ట్రైన్ లోకో పైలెట్ ట్రాక్‌పై నిద్రుస్తున్న వ్యక్తిని చూసి వెంటనే ట్రైన్ ఆపాడు.
అనంతరం ట్రైన్ దిగి సదరు వ్యక్తిని నిద్ర లేపే ప్రయత్నం చేశాడు. ఆదమరిచి నిద్రపోతున్న వ్యక్తికి మెలుకువ వచ్చిన వెంటనే పక్కకు వెళ్లాడు. ఆ ఘటనలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో లోకో పైలట్ తన రైలును ఆపిన తర్వాత వ్యక్తి వద్దకు వెళుతున్న దృశ్యాల్ని చూడొచ్చు.
ఇక ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించలేదని, నిద్రపోయేందుకు అనువైన ప్రదేశం రైల్వే ట్రాక్ అని భావించి నిద్రపోయినట్లు తెలుస్తోంది. ఆ వీడియోపై ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని అభిప్రాయం వ్యక్తంచేస్తుండగా.. మరో యూజర్ ఈ విషయంపై తీవ్రమైన విచారణ జరిపి సరైన రైల్వే భద్రతా నిబంధనలను అమలు చేయాలని కోరాడు.
A person was sleeping on the railway track with an umbrella. Seeing this, the loco pilot stopped the train, Then he woke him up and removed him from the track. Then the train moved forward in Prayagraj UP
pic.twitter.com/OKzOpHJeih— Ghar Ke Kalesh (@gharkekalesh) August 25, 2024
Comments
Please login to add a commentAdd a comment