రైలు ఢీకొని ముగ్గురు మహిళలు మృతి | Three Women Died After Being Hit by Train | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని ముగ్గురు మహిళలు మృతి

Sep 15 2024 8:25 AM | Updated on Sep 15 2024 8:25 AM

Three Women Died After Being Hit by Train

కాసర్‌గోడ్‌: కేరళలోని కాసర్‌గోడ్‌లో హృదయ విదారక  ఉదంతం చోటుచేసుకుంది. కంజనగడ్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ముగ్గురు మహిళలు మృతి చెందారు. మృతులు దక్షిణ కొట్టాయం జిల్లా చింగవనం వాసులుగా పోలీసులు గుర్తించారు.

వీరు ఇక్కడికి ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన బృందంలోని వారని పోలీసులు తెలిపారు. రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫారమ్‌పైకి వెళ్లేందుకు వారు పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఆ సమయంలో సూపర్‌ఫాస్ట్‌ రైలు ఢీకొనడంతో ఆ ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ ఉదంతంపై విచారణ కొనసాగుతోందని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు  పేర్కొన్నారు.

ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దిగువ సియాంగ్ జిల్లాలో రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో 52 ఏళ్ల వ్యక్తి మృతి చెందగా, ఒక చిన్నారికి గాయాలయ్యాయి. దిమోవ్ సమీపంలోని పాలే వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ గణేష్ హజారికా తెలిపారు. మృతుడిని ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ సబ్ ఇన్‌స్పెక్టర్ రిగో రిబాగా గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: గుళికల ప్యాకెట్‌ను తెచ్చిన కోతి.. టీ పొడి అనుకుని..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement