సాంకేతిక లోపం : ట్రేడర్లలో కలవరం | Trading Halted On NSE Due To Technical Glitch | Sakshi
Sakshi News home page

సాంకేతిక లోపం : ట్రేడర్లలో కలవరం

Published Wed, Feb 24 2021 12:24 PM | Last Updated on Wed, Feb 24 2021 2:04 PM

Trading Halted On NSE Due To Technical Glitch - Sakshi

సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌ మార్కెట్లో ఒక్కసారిగా ట్రేడింగ్‌ నిలిచిపోవడం కలకలం రేపింది. సాంకేతిక లోపాల కారణంగా స్టాక్‌ మార్కెట్లో (ఎన్‌ఎస్‌ఈ) ట్రేడింగ్‌ నిలిచిపోయింది. ఎన్‌ఎస్‌ఈ ఎఫ్‌అండ్‌ఓలో ఉదయం 11:40 నిమిషాల నుంచి ట్రేడింగ్‌ ఆగిపోయింది. దీంతో క్యాష్‌ మార్కెట్లోనూ ఎన్‌ఎస్‌ఈ ట్రేడింగ్‌ ఆపివేసింది. దీనిపై స్పందించిన ఎన్‌ఎస్‌ఈ ప్రస్తుతం సర్వర్‌ను రీస్టార్ట్ చేశామని, ట్రేడింగ్‌ మళ్ళీ ఎప్పుడు ప్రారంభమయ్యేది తెలియజేస్తామని  వెల్లడించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రేడర్లలో తీవ్ర గందరగోళం నెలకొంది. మరోవైపు అప్‌డేట్‌ కోసం ఎదురుచూస్తున్న ట్రేడర్లలో తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో మీమ్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. అటు ఆయా ట్రేడింగ్‌ ఏజెన్సీలు కూడా ఇన్వెస్టర్లను అప్రమత‍్తం చేశాయి. అయితే బీఎస్‌ఇ అన్ని విభాగాలలో సాధారణ ట్రేడింగ్ కొనసాగుతోంది.

ఎన్‌ఎస్‌ఇ ప్రీ-ఓపెనింగ్ సెషన్ మధ్యాహ్నం 1 గంటలకు, మధ్యాహ్నం 1:15 నుండి సాధారణ ట్రేడింగ్ ప్రారంభమవుతుందని తాజాగా ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement