technical glitch
-
అమెరికాలో నిలిచిపోయిన విమానాలు.. కారణం ఇదే!
క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. ఈ తరుణంలో యూఎస్‌లో.. అమెరికన్ ఎయిర్‌లైన్స్ (American Airlines) తన అన్ని విమానాలను నిలిపివేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.విమాన సేవలను నిలిపివేయడానికి సాంకేతిక సమస్యలే కారణమని అమెరికన్ ఎయిర్‌లైన్స్ చెబుతోంది. అయితే కొందరు సైబర్ దాడి వల్ల ఈ పరిస్థితి నెలకొని ఉండవచ్చని చెబుతున్నారు.క్రిస్మస్ (Christmas) పండుగకు ముందు ఇలా జరగడంతో.. పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఒకరు 'మేము ఇంటికి వెళ్లాలా వద్దా చెప్పండి. విమానాశ్రయంలో గంటల తరబడి వేచి ఉండేలా చేయకండి' అని అన్నారు.మీరు మీ ఇళ్లకు సురక్షితంగా వెళ్లేందుకు మా బృందం పనిచేస్తోంది. మీ సహనానికి ధన్యవాదాలు అంటూ.. అమెరికన్ ఎయిర్‌లైన్స్ నెటిజన్ ప్రశ్నకు రిప్లై ఇచ్చింది.Our team is working to get this rectified so that you can be safely on your way to your family. Your continued patience is appreciated.— americanair (@AmericanAir) December 24, 2024 -
జెరోధాలో సమస్య!.. కోర్టుకెళ్తా అంటున్న యూజర్
పాపులర్ స్టాక్ బ్రోకరేజ్ ప్లాట్‌ఫామ్ 'జెరోధా'లో మళ్ళీ సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన ఆర్డర్లకు సంబంధించిన సాంకేతిక లోపాల గురించి సోమవారం బహుళ జెరోధా వినియోగదారులు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు.''జెరోధా వల్ల 10 లక్షలు నష్టపోయాం. ఇది కష్టపడి సంపాదించిన డబ్బు. నేను నా డబ్బును తిరిగి పొందాలనుకుంటున్నాను. దీనికోసం కోర్టును ఆశ్రయిస్తాను'' అని ఒక వినియోగదారు చెప్పారు. జెరోధాలో సమస్య తలెత్తినట్లు బ్రోకర్ కూడా అంగీకరించారు.ఈ సమస్య ఇప్పుడు పూర్తిగా పరిష్కరించాము. కొత్త ఆర్డర్ల స్థితి ఇప్పుడు అప్డేట్ చేయబడుతోంది. మేము పాత ఆర్డర్ల స్థితిని అప్డేట్ చేయడానికి పని చేస్తున్నాము. మీకు కలిగిన అసౌకర్యానికి జెరోధా క్షమాపణలు చెప్పింది.జీరోధాలో ఇలాంటి సమస్య తలెత్తడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికి ఆరు సార్లు ఇలాంటి సమస్యను యూజర్లు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌లో ఆర్డర్ ప్లేస్‌మెంట్‌కు సంబంధించి సాంకేతిక లోపం ఏర్పడింది. 2023లోనే, Zerodha కైట్ యాప్‌లో లాగిన్ చేయడం , ఆర్డర్లు మరియు పొజిషన్ల ప్రదర్శన అలాగే ఆర్డర్ ప్లేస్మెంట్లకు సంబంధించిన సమస్యలలో సాంకేతిక లోపాలను సంస్థ అంగీకరించింది.#zerodha stuck. My orders not getting executed. Will take you to court if I lose any single penny pic.twitter.com/oSy17lg32H— Rashshad Rasheed (@rashshadrasheed) July 8, 2024 -
రూ. 83 లకే విమాన టికెట్: అదిరిపోయే ట్విస్ట్ ఏమిటంటే..!
పండుగల సందర్భంగా చాలా విమానయాన సంస్థలు తక్కువ ధరల్లో విమాన టికెట్లను అందుబాటులో ఉంచుతాయి. ఈ క్రమంలోనే ఒక డాలరు కంటే (రూ. 83) తక్కువకే దిగి రావడం వైరల్‌గా మారింది. అదీ కొన్ని ఖరీదైన రూట్లలో కూడా కేవలం రూ. 114లకే విమాన టికెట్లు అందుబాటులోకి రావడంతో జనం ఎగబడ్డారు. తొలుత ఫేక్ వెబ్సైట్ అని కొంత తటపటాయించారు. కానీ అది ప్రముఖ వెబ్సైట్ అని ధృవీకరించుకున్న తరువాత టికెట్లను భారీగా కొనుగోలు చేసేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. అంతేకాదు డాలరు కంటే తక్కువ ధరకే విమాన టికెట్లు అంటూ బుకింగ్ స్క్రీన్ షాట్లతో సోషల్ మీడియాలో హోరెత్తించారు. దీంతో విషయం తెలిసిన సంస్థ రంగంలోకి దిగింది. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. చైనాలోని సదరన్ ఎయిర్‌లైన్స్ వెబ్సైట్లో విమాన ఛార్జీలు ఉన్నదానికంటే తక్కువకే దర్శనమిచ్చాయి. గాంగ్జూ ప్రావిన్స్ కేంద్రంగా పనిచేసే చైనా సదరన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన వెబ్సైట్లో దాదాపు 2 గంటలపాటు టెక్నికల్ సమస్య ఏర్పడింది. ఈ లోపం కారణంగా చెంగ్డూ నుండి షాంఘై వంటి కొన్ని రూట్లు 1.37 డాలర్లకంటే (రూ. 114) తక్కువ ధరల్ని ప్రదర్శించాయి. ఎయిర్‌లైన్ యాప్, వివిధ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫారమ్లలోకూడాఇలానే కనిపించింది. చైనాలో అత్యంత రద్దీగా ఉండే ఆన్లైన్ షాపింగ్ కాలం కావడంతో కొనుగోలు దారులు క్యూ కట్టారు. అయినా చెల్లుతాయి అసాధారణ రద్దీతోపాటు ఈ వార్త సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన సంస్థ టెక్నికల్ సమస్యను ఆలస్యంగా గుర్తించింది. ట్విస్ట్ ఏంటంటే ధరలతో సంబంధం లేకుండా, సాంకేతిక లోపం సమయంలో కొనుగోలు చేసిన అన్ని టిక్కెట్లూ చెల్లుతాయని ప్రయాణికులకు హామీ ఇవ్వడం విశేషంగా నిలిచింది. ఈ మేరకు చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ అధికారిక వీబో సోషల్ మీడియా ఖాతాలో స్పందించింది. అయితే గతంలో జపాన్‌కు చెందిన ఆల్ నిప్పన్ ఎయిర్వేస్లో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. కానీ తప్పుగా ప్రాసెస్ అయిన టికెట్లు చెల్లవని, సంబంధిత టికెట్ల సొమ్మును వాపసు ఇస్తామని ప్రకటించింది. -
బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం
-
హైదరాబాద్ నుంచి బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం..
ముంబై: శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ బయలుదేరిన ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం తలెత్తటంతో విమానాన్ని అత్యవసరంగా ముంబైలో ల్యాండింగ్ చేశారు అధికారులు. విమానంలోని యెల్లో హైడ్రాలిక్ సిస్టమ్ పని చేయకపోవడంతో ముంబైకి మళ్లించినట్లు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్(డీజీసీఏ) అంధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి దుబాయికి శనివారం సాయంత్రం 143 మంది ప్రయాణికులతో బయలుదేరింది ఎయిరిండియా ఏ320 వీటీ-ఈఎక్స్‌వీ విమానం. సాంకేతిక సమస్యను గుర్తించి ముంబైకి మళ్లించారు. ముంబై విమానాశ్రయంలో సుపరక్షితంగా ల్యాండ్ అయినట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. విమానంలో ఏర్పడిన సమస్యను సంబంధిత సిబ్బంది పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. అయితే, సాంకేతిక సమస్యల కారణంగా విమానాలు దారి మళ్లించడం కొత్తేమీ కాదు. డిసెంబర్ 2వ తేదీన కన్నూర్ నుంచి దోహా వెళ్తున్న ఇండో విమానం 6ఈ-1715ని ముంబైకి మళ్లించారు. ప్రయాణికులను మరో విమానంలో గమ్యం చేర్చినట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: మధుమేహం పెరుగుదలలో చైనా, భారత్ పోటాపోటీ -
స్పైస్‌జెట్ నిర్వాకం: క్యాబిన్లో పొగలు, దేవుడికి మొక్కుకోండి! వణికిపోయిన ప్రయాణీకులు
సాక్షి,హైదరాబాద్: వరుస సాంకేతిక లోపాల సంఘటనలతో రెగ్యులేటరీ చర్యలను ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్‌కు సంబంధించి మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానం గాల్లో ఉండగానే క్యాబిన్లో పొగలు కమ్ముకోవడంతో ప్రయాణీకులు వణికిపోయారు. చివరికి హైదరాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండ్ కావడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. (అమెజాన్ దివాలీ సేల్: శాంసంగ్ 5జీ ఫోన్‌పై 40 వేల తగ్గింపు) గోవా-హైదరాబాద్ SG 3735 విమానంలో అక్టోబర్ 12న బుధవారం ఈ ఉదంతం చోటు చేసుకుంది. అయితే ఇంత జరిగినా ఏమీ జరగలేదన్నట్టుగా వివరాలను గోప్యంగా ఉంచడం వివాదం రేపింది. “Q400 విమానం సురకక్షితంగా ల్యాండ్ అయింది.. ప్రయాణికులు సురక్షితంగా దిగిపోయారు” అని స్పైస్‌జెట్ సెలవిచ్చింది. అయితే ఈ ఘటనపై ప్రయాణీకుల అనుభవాలు మాత్రం భయంకరంగా ఉన్నాయి. దీంతో ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ విచారణకు అదేశించింది. ఈ ఘటనలో ఒక ప్రయాణికురాలికి గాయాలు కాగా, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని వైద్య కేంద్రానికి తరలించినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఊపిరి ఆడడం లేదని ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్‌లోని ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసినట్టు వెల్లడించాయి. హైదరాబాద్బాద్కు ఐటీ ఉద్యోగి శ్రీకాంత్ తనకెదురైన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.తన ఫ్రెండ్స్‌తో కలిసి ఫస్ట్‌టైం విమానం ట్రిప్‌కు బయలుదేరారు శ్రీకాంత్. ఇంతలోఅకస్మాత్తుగా ముందు క్యాబిన్‌లోనూ,ఆ తరువాత విమానంలోనూ పొగలు వ్యాపించాయి. దేవుడికి మొక్కుకోమని చెప్పడం చాలా బాధకలిగించిందని చెప్పారు. తనతోపాటు ప్రయాణీకులంతా ఒక్కసారిగా దిగ్గ్ర్భాంతికి లోనయ్యామని, చాలామంది ప్రాణ భయంతో కేకలు పెట్టారని వెల్లడించారు. “వాష్‌రూమ్‌లో ఏదో జరిగింది. సిబ్బంది హడావిడిగా, చిన్నగా మాట్లాడుకుంటూ కనిపించారు. మరో 20 నిమిషాల్లో మా చుట్టూ పొగలు అలుముకున్నాయి. ఇంతలో లైట్లు వేశారు. మాట్లాడొద్దని చెప్పారంటూ” మరొక ప్రయాణీకుడు అనిల్ తన అనుభవాన్ని షేర్ చేశారు. ఎమర్జెన్సీ డోర్ తెరుచుకున్నాక "జంప్ అండ్ రన్" అంటూ అరిచారని మరొకరు పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఫోటోలను తొలగించమని ఎయిర్‌లైన్ సిబ్బంది బలవంతం చేసారట. దీనికి నిరాకరించడంతో తన ఫోన్ కూడా లాక్కున్నారని శ్రీకాంత్ వాపోయారు. కాగా ఈ ఏడాది ఇప్పటికే ఎనిమిది వరుస సాంకేతిక లోపాలకు సంబంధించిన ఘటనలతో స్పైస్‌జెట్ విమానాలపై డీజీసీఏ ఆంక్షలు విధించింది. 50 శాతం విమానాలు మాత్రమే నడపాలన్న ఆదేశాలను ఇటీవల మరో నెలపాటు పొడిగించింది. @narendramodi @PMOIndia @flyspicejet @PilotSpicejet @SpiceJetRBLX @JM_Scindia Respected sir or to whomsoever it may concern. Night we were returning to hyd from goa within the ✈️ (Spicejet),suddenly there was smoke all around inside the plane starting from nagpur to hyderabad... pic.twitter.com/zZa9OUmJib — Srikanth Mulupala (@SrikanthMulupal) October 13, 2022 -
ఎఫ్బీలో జుకర్‌బర్గ్‌కు భారీ షాక్, కష్టాల్లో మెటా
న్యూఢిల్లీ: మెటా సీఈవో, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ పౌండర్ మార్క్ జుకర్ బర్గ్‌కు భారీ షాక్ తగిలింది. ఆయన సొంత ప్లాట్‌ఫాంలోనే ఊహించని ఝలక్ తగిలింది. ఒక్కసారిగా 118 లక్షల ఫాలోవర్లను కోల్సోయారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులను ప్రభావితం చేసే బగ్ కారణంగా కొన్ని సెకన్లలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఫేస్బుక్లో జుకర్‌బర్గ్‌కు 119 మిలియన్ల (11.9 కోట్ల)మంది ఫాలోవర్లు ఉండగా అకస్మాత్తుగా అది కాస్తా 10వేల కిందికి (9920) పడి పోవడం సంచలనం రేపింది. మరోవైపు జుకర్‌బర్గ్‌తో పాటు పలువురు సెలబ్రిటీల పాలోవర్ల సంఖ్య కూడా లక్షల్లో తగ్గిపోవడం కలకలం రేపింది. ముఖ్యంగా ప్రముఖ రచయత్రి తస్లిమా నస్రీన్ ట్వీట్ చేశారు.ఫేస్బుక్ సునామీతో తన ఫాలోవర్లు కూడా ఒక్కమారుగా 9లక్షల నుంచి 9వేలకు పడిపోయారంటూ మీడియా కథనాన్ని షేర్ చేశారు. అంతేకాదు తనకు ఫేస్బుక్ కామెడీ అంటే చాలా ఇష్టం అంటూ ఆమె ట్వీట్ చేయడం విశేషం. తర్వాత కొన్ని గంటల్లో ఈ లోపాన్ని కంపెనీ సరిచేయడంతో యథాతథంగా ఆయా సెలబ్రిటీల ఫాలోవర్లు కనిపించారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో లోపాన్ని త్వరగా గుర్తించి మెటా పరిస్థితిని సరిదిద్దే పనిలో ఉన్నామని, సాంకేతికత లోపాలే కారణమని మెటా తెలిపింది. అసౌకర్యానికి క్షమాపణలు తెలిపింది. అయితే, పొరపాటు ఎలా జరిగిందనే దానిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కాగా మెటా వర్స్ సక్సెస్‌లో ఇబ్బందులు పడుతున్న మోటాకు తాజాగా ఫాలోవర్ల కౌంట్ తగ్గిపోవడంతో మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇది ఇలా ఉంటే ఉక్రెయిన్‌లో రష్యన్ మిలిటరీకి వ్యతిరేకంగా హింసకు పిలుపునిచ్చే పోస్ట్‌లను మెటా అనుమతిస్తోందని రష్యా ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌ను ఉగ్రవాదులు, తీవ్రవాదుల జాబితాలో చేరుస్తూ ఆర్థిక పర్యవేక్షణ ఏజెన్సీ రోస్ఫిన్‌మోనిటరింగ్ ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, లింక్డ్ఇన్ సీఈవొ ర్యాన్ రోస్లాన్స్కీతో సహా అనేక మంది అమెరికన్ పౌరులపై క్రెమ్లిన్ విధించిన ఆంక్షలలో భాగంగా జుకర్‌బర్గ్ రష్యాలోకి ప్రవేశించకుండా నిషేధం ఇప్పటికే అమల్లో ఉంది. .@facebook created a tsunami that wiped away my almost 900,000 followers and left only 9000 something on the shore: @taslimanasreen. Several users of @Meta's #facebook are complaining losing majority of their #followers. read more here. #MarkZuckerberghttps://t.co/QbxBSgMvId — The Telegraph (@ttindia) October 12, 2022 -
Hyderabad Metro: ప్రయాణికుల సంఖ్య పెరిగినా అవే సాంకేతిక ఇబ్బందులు
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇటీవల గణేష్ నిమజ్జనం సందర్భంగా రైళ్లలో రద్దీ నాలుగు లక్షల మార్కును దాటి.. ప్రస్తుతం దాదాపు అదే స్థాయిలో కొనసాగుతోంది. కానీ.. మెట్రో రైళ్లు తరచూ మందగిస్తున్నాయి. కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక లోపాలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా నాంపల్లి– లక్డీకాపూల్ మార్గంలో ట్రాక్‌కు సంబంధించి సాధారణ నిర్వహణ, మరమ్మతులో భాగంగా గ్రౌటింగ్ పనులు జరుగుతుండడంతో రైళ్ల వేగం అకస్మాత్తుగా 15 కేఎంపీహెచ్‌కు పడిపోవడం గమనార్హం. మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. సాంకేతిక చిక్కులు.. ► సాధారణంగా మెట్రో రైళ్ల వేగం 50–60 కేఎంపీహెచ్ మధ్యన ఉంటుంది. ఒక్కసారిగా రైళ్ల మందగమనంతో సమయానికి గమ్యస్థానానికి చేరుకుందామన్న ప్రయాణికుల అంచనాలు తప్పుతున్నాయి. రైళ్లు కిక్కిరిసి ఉంటున్న నేపథ్యంలో అకస్మాత్తుగా రైళ్ల వేగం పడిపోయిన ప్రతిసారీ ఏం జరిగిందోనని ప్రయాణికుల్లో ఆందోళన, గందరగోళం నెలకొంటోంది. ► నగర మెట్రో రైళ్లలో డ్రైవర్ అవసరం అంతగా లేని కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థను వినియోగిస్తున్నారు. వాతావరణ మార్పులు, ఒక్కసారిగా వాయు కాలుష్యం పెరిగిన సమయంలో ఈ టెక్నాలజీలో తరచూ లోపాలు తలెత్తుతున్నాయి. ఉన్నపళంగా రైళ్లు పట్టాలపై నిలిచిపోవడం, వేగం తగ్గడం తదితర సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సాంకేతికతను మన నగర పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేపట్టాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రద్దీ పెరుగుతోంది.. ప్రస్తుతం నగరంలో అన్నిరకాల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు పుంజుకోవడంతో రైళ్లలో రద్దీ కోవిడ్‌కు ముందున్న స్థాయిలో నాలుగు లక్షలకు చేరువైంది. అత్యధికంగా ఎల్బీనగర్– మియాపూర్ రూట్లో నిత్యం రెండు లక్షల మంది జర్నీ చేస్తున్నారు. ఐటీ కంపెనీల్లో కార్యకలాపాలు ప్రారంభం కావడంతో నాగోల్– రాయదుర్గం రూట్లోనూ రద్దీ 1.75 లక్షల మేర ఉంది. జేబీఎస్– ఎంజీబీఎస్ రూట్లో రద్దీ నిత్యం సరాసరిన 25 వేల మేర ఉంది. పండగలు, సెలవురోజుల్లో మూడు మార్గాల్లో కలిపి ప్రయాణికుల రద్దీ అదనంగా మరో 30 వేల 50 వేల వరకు ఉంటుందని మెట్రో వర్గాలు తెలిపాయి. (క్లిక్ చేయండి: ఫార్ములా– ఈ పనులు రయ్..రయ్) -
గో ఫస్ట్ విమానానికి తప్పిన పెనుముప్పు.. రెండు రోజుల్లో మూడోసారి
సాక్షి, ఢిల్లీ: గో ఫస్ట్ విమానానికి పెను ముప్పు తప్పింది. బుధవారం.. ఢిల్లీ నుంచి గౌహతి వెళ్తుండగా విమానం విండ్ షీల్డ్ పగిలింది. దీంతో విమానాన్ని జైపూర్‌కు మళ్లించినట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. రెండు రోజుల్లో గో ఫస్ట్ విమానంలో సాంకేతిక లోపం సంభవించడం ఇది మూడోసారి. చదవండి: సైకో భర్త చిత్రహింసలు.. భార్యకు అశ్లీల వీడియోలు చూపిస్తూ.. ఇటీవలి కాలంలో విమానాల్లో సాంకేతిక లోపాలు వరుసగా తలెత్తుతున్నాయి. మంగళవారం కూడా విమానయాన సంస్థ గోఫస్ట్‌కు చెందిన రెండు విమానాల్లో ఒకేసారి ఇంజన్ సమస్యలు కలకలం రేపింది. శ్రీనగర్-ఢిల్లీ, ముంబై-లేహ్ గోఫస్ట్ విమానాల్లో ఇంజన్లలో సమస్య ఏర్పడ్డాయి దీంతో రెండు విమానాలను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీనిపై సివిల్ ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ విచారణ చేపట్టింది. -
గాల్లో ఉండగానే ఇంజన్ లోపాలు, ఒకేసారి రెండు విమానాల్లో
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో విమానాల్లో సాంకేతిక లోపాలు వరుసగా తలెత్తుతున్నాయి. తాజాగా విమానయాన సంస్థ గోఫస్ట్‌కు చెందిన రెండు విమానాల్లో ఒకేసారి ఇంజన్ సమస్యలు కలకలం రేపింది. శ్రీనగర్-ఢిల్లీ, ముంబై-లేహ్ గోఫస్ట్ విమానాల్లో ఇంజన్లలో సమస్య ఏర్పడిన ఉదంతం మంగళవారం చోటుచేసుకుంది. దీంతో రెండు విమానాలను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీనిపై సివిల్ ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ విచారణ చేపట్టింది. తొలుత గోఫస్ట్ ముంబై-లేహ్ విమానంలో ఇంజన్ నంబర్ 2లో లోపం కనిపించడంతో గమనించిన సిబ్బంది ఢిల్లీకి మళ్లించారని డీజీసీఏ అధికారులు తెలిపారు. ఆ తరువాత మరో విమానం గాల్లో ఉండగానే సమస్య ఏర్పడింది. శ్రీనగర్-ఢిల్లీ విమానం నంబర్- 2 ఇంజన్లో లోపాన్ని గుర్తించడంతో దీన్ని తిరిగి శ్రీనగర్‌కు మళ్లించారు. రెండు ఘటనల్లోనూ ప్రయాణీకులు,న సిబ్బంది క్షేమంగా ఉండటం భారీ ఉపశమనం కలిగించింది. దీనిపై విచారణ జరుగుతోందని, డీజీసీఏ క్లియరెన్స్ వచ్చిన తరువాతే విమానాలు తిరిగి సేవలను ప్రారంభిస్తాయని అధికారులు తెలిపారు. కాగా దేశీయ విమానాల్లో వరుస లోపాల నేపథ్యంలో విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భద్రతా పర్యవేక్షణ నిమిత్తం విమానయాన సంస్థలు, ఇతర మంత్రిత్వ శాఖ, డీజీసీఏ అధికారులతో పలు సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
ఇన్ఫోసిస్ ఇదేం బాగాలేదు.. మళ్లీ మళ్లీ అదే పొరపాటా..
న్యూఢిల్లీ: ట్యాక్స్ రిటర్న్‌లకు సంబంధించిన ఆదాయ పన్ను విభాగం కొత్త పోర్టల్‌లో మళ్లీ సమస్యలు మొదలయ్యాయి. కొత్త వెబ్సైట్ అందుబాటులోకి వచ్చి మంగళవారానికి ఏడాది పూర్తయ్యింది. సరిగ్గా అదే సమయానికి మళ్లీ సమస్యలు తలెత్తడం గమనార్హం. పోర్టల్‌లోకి లాగిన్ కాలేకపోతున్నామని, సెర్చ్ ఆప్షన్ సరిగ్గా పని చేయడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురై ఉంటుందనే సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో సమస్యలను సత్వరం పరిష్కరించాలంటూ పోర్టల్‌ను రూపొందించిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు సూచించినట్లు ఐటీ విభాగం పేర్కొంది. హ్యాక్ కాలేదు ‘ఈ–ఫైలింగ్ వెబ్సైట్లో సెర్చ్ ఆప్షన్ పనితీరుకి సంబంధించిన సమస్యలు మా దృష్టికి వచ్చాయి. పరిష్కరించాలంటూ ఇన్ఫోసిస్‌కు సూచించాము. సమస్య సత్వర పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు ఇన్ఫీ కూడా తెలిపింది‘ అని ఐటీ విభాగం మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో ట్వీట్ చేసింది. వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురికాలేదని, డేటా చౌర్యమేమీ జరగలేదని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ట్యాక్స్ పోర్టల్‌లో సమస్యలు తలెత్తడం ఇదే మొదటిసారి కాదు. సరిగ్గా ఏడాది పన్ను రిటర్నుల ఫైలింగ్‌ను సులభతరం చేసే ఉద్దేశ్యంతో కొత్త పోర్టల్‌ను రూపొందించే కాంట్రాక్టును ఇన్ఫోసిస్ 2019లో దక్కించుకుంది. దీన్ని 2021 జూన్ 7న ఆవిష్కరించారు. కానీ అందుబాటులోకి వచ్చిన రోజు నుంచీ అనేక సందర్భాల్లో సమస్యలు వస్తూనే ఉన్నాయి. దీంతో ట్యాక్స్ రిటర్నుల దాఖలు గడువును కూడా ప్రభుత్వం పొడగించాల్సి వచ్చింది. చదవండి: తగ్గేదేలే అంటున్న ఇన్ఫోసిస్.. ఏం జరగబోతోంది? -
ఒక్కరోజులో 24.39 లక్షలు.. ఒక్క గంటలో 2.79 లక్షలు.. ఐటీ ఫైలింగ్‌లో రికార్డ్ !
ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు విషయంలో డిసెంబరు 30న రికార్డు చోటు చేసుకుంది. ఐటీ రిటర్న్స్‌కి చివరి తేదీ సమీపించడంతో భారీ స్పందన వచ్చింది. డిసెంబరు 30వ తేదిన ఒక్క రోజులేనే దేశవ్యాప్తంగా 24.39 లక్షల మంది ఐటీ రిటర్న్ దాఖలు చేశారు. ఇందులో చివరి గంటలో ఏకంగా అయితే 2.79 లక్షల ఫైళ్లు దాఖలయినట్టు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. 2021 డిసెంబరు 30 ఇప్పటి వరకు మొత్తం 5.34 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ సమర్పించారు. కాగా డిసెంబరు 31తో ఐటీ దాఖలకు గడువు ముగిసిపోతుంది. More than 5.34 crore Income Tax Returns for AY 2021-22 filed till 8pm today. This includes 24.39 lakh #ITRs filed today itself with 2.79 lakh #ITRs filed in the last one hour. Hope you have filed yours too! If not, please file by the due date ie 31st December, 2021. — Income Tax India (@IncomeTaxIndia) December 30, 2021 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్ని హామీలు ఇచ్చినా.. హెచ్చరికలు జారీ చేసినా ఐటీ రిటర్న్స్ ఈ ఫైలింగ్‌లో సమస్యలు తొలగిపోవడం లేదు. పదే పదే సాంకేతిక సమస్యలు (ఎర్రర్స్) ఎదురవుతున్నాయి. చివరి తేది సమీపించడంతో భారీ సంఖ్యలో ఐటీ రిటర్న్స్ కోసం ఈ ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ అయ్యారు. వీరిలో చాలా మంది టెక్నికల్ గ్లిచెస్తో తాము విసిగిపోయామంటూ ట్వీట్లు చేశారు. Tax filing deadline and #CAs erupting in anger about @Infosys and #TaxPortal. Most are great devotees of @narendramodi Is @FinMinIndia @nsitharaman listening?? A tax portal that doesn't work despite public admonishment @NandanNilekani https://t.co/5MvAo2qetG — Sucheta Dalal (@suchetadalal) December 30, 2021 చదవండి:జీఎస్టీ పరిహారం మరో ఐదేళ్లు పొడిగించండి -
200 కోట్ల యూజర్లకు పెను ప్రమాదం..! గూగుల్ హెచ్చరిక..!
Google Warns 2 Billion Users Of Update That Could Break Websites Worldwide: ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల క్రోమ్ యూజర్లకు పెనుప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని గూగుల్ హెచ్చరించింది. రాబోయే క్రోమ్ బ్రౌజర్ అప్డేట్ ప్రపంచవ్యాప్తంగా అనేక వెబ్సైట్లను విచ్ఛిన్నం చేసే అవకాశం ఉందని గూగుల్ యూజర్లకు హెచ్చరిక జారీ చేసింది. అంతుచక్కని సమస్య.! పరిష్కారమే లేదు..! టెక్ దిగ్గజం గూగుల్ తన క్రోమియంబగ్ ట్రాకర్ బ్లాగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. రాబోయే అనిశ్చితికి ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారమే లేకపోవచ్చునని గూగుల్ అభిప్రాయపడింది. కాగా తన వంతుగా సమస్యను పరిష్కరించేందుకు గూగుల్ ప్రయత్నాలను చేస్తోనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఏ వెబ్సైట్లకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయనే విషయం అస్పష్టంగా ఉంది. అలర్ట్‌గా ఉండడమే..! సమస్య పరిష్కారమయ్యేంత వరకు క్రోమ్ యూజర్లు ఇతర బ్రౌజర్స్‌ను వాడాలని ఫోర్బ్స్ తన నివేదికలో పేర్కొంది. క్రోమ్ యూజర్లు అలర్ట్‌గా ఉండడమే మంచిదని తెలిపింది. వచ్చే నెలలో క్రోమ్ యూజర్లకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెర్షన్స్‌తో సమస్య..! ఫోర్భ్స్ ప్రకారం...గూగుల్ క్రోమ్ వెర్షన్స్‌లో సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్రోమ్ బ్రౌజర్ 96 వెర్షన్లో ఉంది. అయితే గూగుల్ మరిన్ని ఫీచర్స్‌ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు ‘క్రోమ్ కానరీ’ బ్రౌజర్‌ను గూగుల్ టెస్ట్ చేస్తోంది. ఇది ప్రారంభ యాక్సెస్ డెవలపర్ బిల్డ్. ఇప్పుడు ఇది వెర్షన్ 99లో ఉంది. ఎప్పుడైతే బ్రౌజర్ వెర్షన్ 100కి చేరుకుంటే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ గ్లిచ్‌తో ప్రభావితమైన వెబ్సైట్లు స్పష్టంగా లోడ్ అవడం ఆగిపోతాయని ఫోర్బ్స్ పేర్కొంది. దీనికి కారణం ఈ వెబ్సైట్లు యూజర్లు సైట్‌ను సందర్శించే సమయంలో క్రోమ్ వెర్షన్‌ను తనిఖీ చేస్తాయి. అయితే ప్రోఫెషనల్ వెబ్సైట్ డిజైనర్ డూడా వంటి డిజైన్ సాఫ్ట్వేర్ మొదటి రెండు అంకెలను మాత్రమే తనిఖీ చేస్తుంది. ఈ సమయంలో క్రోమ్ బ్రౌజర్ వెర్షన్ 100కు యాక్సెస్ ఉండే అవకాశాలు తక్కువగా ఉండనున్నాయి. గూగుల్ ప్రయత్నాలు..! ఈ గ్లిచ్ ప్రభావాలను నివారించడానికి హ్యాకింగ్ వంటి ప్రక్రియలతో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గూగుల్ ప్రయత్నాలను చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఆయా వెబ్సైట్లను సందర్శించేటప్పడు వెర్షన్ 100 స్థానంలో రెండంకెల వెర్షన్ పొందేలా గూగుల్ ప్రయోగాలు చేస్తోంది. చదవండి: అమెరికా టెక్ దిగ్గజాలకు చుక్కలు చూపిస్తున్న రష్యా..! -
ఎలన్‌మస్క్ ఎందుకిలా జరుగుతోంది? టెస్లా కార్లలో సాంకేతిక సమస్యలు
ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ప్రపంచ రారాజుగా ఉన్న టెస్లాకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. సాంకేతిక సమస్యల కారణంగా టెస్లా కారు ఓనర్లు చిక్కులు ఎదుర్కొంటున్నారు. దీంతో తమ సమస్యలకు పరిష్కారం చూపాలంటూ కారు యజమానులు టెస్లా యజమాని ఎలన్‌మస్క్‌ని డిమాండ్ చేస్తున్నారు. పని చేయని యాప్ టెస్లా కంపెనీ నుంచి మార్కెట్లో మోడల్ 3 వై, మోడల్ ఎస్, ఎస్ ప్లెయిడ్ కార్లు మార్కెట్లో విపరీతంగా అమ్ముడయ్యాయి. యూరప్, అమెరికా మార్కెట్లో టెస్లా కార్ల అమ్మకాలు జోరుమీదున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే ప్రయత్నంలో భాగంగా టెస్లా కార్లకు మొబైల్యాప్ రూపంలో డిజిటల్ కీస్‌ని అమర్చారు. అంటే టెస్లా యాప్ ద్వారా కారును డోర్స్ ఓపెన్ చేయడం, కారును స్టార్ చేయడం తదితర కంట్రోల్స్ అన్నీ ఈ మొబైల్ యాప్ ద్వారానే కంట్రోల్ చేయోచ్చు. ఇబ్బందులు గత కొంత కాలంగా ఈ యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయి. తరచుగా యాప్ మోరాయిస్తోంది. దీంతో యూజర్లు టెస్లా కారును వినియోగించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. కారు పక్కనే ఉండి గంటల తరబడి డోర్ ఓపెన్ చేసేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ట్రాఫిక్ వల్లే మొదట ఈ సమస్య కెనడాలో ఎక్కువగా కనిపించగా ఆ తర్వాత అమెరికాలోనూ ఈ సమస్య వెలుగు చూసింది. ఇటీవల మొబైల్యాప్కి అప్డేట్ని టెస్లా రిలీజ్ చేసింది. అప్పటి నుంచి ఈ సమస్య ఉత్పన్నమైనట్టు యూజర్లు అంటున్నారు. మరోవైపు నెట్వర్క్ ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఈ సమస్య వచ్చిందని త్వరలో పరిష్కరిస్తామని టెస్లా తరఫున ఎలన్‌మస్క్ బదులిచ్చారు. చదవండి:ఇక టెస్లా పని అయిపోయినట్లే.. రంగంలోకి మెర్సిడెస్ బెంజ్! -
ఆర్థికమంత్రి హెచ్చరికలు.. ఒత్తిడిలో ఇన్ఫోసిస్.. నేడు ఆఖరు!
Infosys-Income Tax Portal: కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ఇన్‌కంట్యాక్స్ పోర్టల్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలు ఇన్ఫోసిస్‌కి కొత్త చిక్కులు తెచ్చి పెట్టాయి. సామాన్య ట్యాక్స్ పేయర్ల నుంచి ఆర్థిక మంత్రి వరకు ప్రతీ ఒక్కరు పోర్టల్‌లో ఇబ్బందులపై ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. దీంతో ఇన్ఫోసిస్‌పై ఒత్తిడి పెరిగింది. నేడే ఆఖరు ఆన్లైన్లో ఇన్‌కం ట్యాక్స్ చెల్లింపులు చేయవచ్చంటూ కేంద్రం గొప్పగా ప్రకటించింది. అందుకు తగ్గట్టే పోర్టల్‌ని 2021 జూన్ 7న ప్రారంభించింది. అయితే తొలి రోజు నుంచే ఇ ఫైలింగ్ పోర్టల్ ద్వారా పన్ను చెల్లింపులు చేయడం కత్తి మీద సాములా మారింది. చీటికి మాటికి సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. త్వరలో సమస్యలు పరిష్కరిస్తామటూ ఆర్థిక మంత్రి పలు మార్లు ప్రకటించారు. కానీ రెండు నెలలు గడిచినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఆగస్టు 19న ఇన్పోసిస్ సీఈవో సలీల్ పరేఖ్‌ని ఢిల్లీకి పిలిపించారు మంత్రి నిర్మలా సీతారామన్. సెప్టెంబరు 15వ తేదీలోగా ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలంటూ గట్టిగా చెప్పారు. 750 మంది నిపుణులు ఐటీ పోర్టల్‌లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు 750 మంది నిపుణులు మూడు వారాలుగా అహర్నిషలు పని చేస్తున్నారు. ఇన్ఫోసిస్ సీనియర్ అధికారి ప్రవీణ్‌రావు దగ్గకరుండి ఈ పనులు పర్యవేక్షిస్తున్నారు. సెప్టెంబరు 15తో అయినా ఐటీ పోర్టల్‌లో సమస్యలు పరిష్కారం అవుతాయా ? లేద మరోసారి పాత కథనే పునరావృతం అవుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో సాంకేతిక లోపాలు తరచుగా రావడం, అది దేశ ప్రజల దృష్టిని ఆకర్షించడం ఇన్ఫోసిస్‌కి ఇబ్బందిగా మారింది. 2019లో ప్రారంభం గతంలో ఆధార్ కార్డుకు సంబంధించిన టెక్నికల్ వర్క్ ఇన్ఫోసిస్ ఆధ్వర్యంలోనే జరిగింది. దీంతో ఇ ఫైలింగ్ పోర్టల్ రూపొందించే బాధ్యతలను కేంద్రం ఇన్ఫోసిస్‌కి 2019లో అప్పగించింది. ప్రస్తుతం ఇ ఫైలింగ్ పోర్టల్‌లో చాలా సమస్యలు కొలిక్కి వచ్చాయని ఇన్ఫోసిస్ అంటోంది. చదవండి: ఐటీ పోర్టల్‌ను వీడని సమస్యలు -
స్టాక్ ఎక్సేంజీలపై సెబీ కన్నెర్ర !
ముంబై: స్టాక్ ఎక్సేంజీల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంపై సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కన్నెర్ర చేసింది. ట్రేడింగ్ విషయంలో సాంకేతిక ఇబ్బందుల పేరుతో ఇన్వెస్టర్లను ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. నాలుగు గంటలకు మించి టెక్నికల్ గ్లిచెస్ కొనసాగితే భారీగా జరిమానాలు విధిస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను జారీ చేసింది. రంగంలోకి సెబీ నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో 2021 ఫిబ్రవరి 24న టెక్నికల్ ఇష్యూస్‌తో 4 గంటల పాటు ట్రేడింగ్ నిలిచి పోయింది. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు ఇబ్బందులు పడ్డారు. దీంతో స్టాక్ ఎక్స్ఛేంజీలు, క్లియరింగ్ కార్పొరేషన్స్, డిపాజిటరీలులకు కీలక ఆదేశాలు సెబీ జారీ చేసింది. టెక్నికల్ సమస్యలు తలెత్తితే రోజుకు కనిష్టంగా లక్ష రూపాయల నుంచి గరిష్టంగా రూ.2 కోట్ల వరకు జరిమానా విధిస్తామంది. అంతేకాదు ఎమ్ఐఐల మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసరు(సీటీఓ)ల వార్షిక వేతనంలో 10 శాతం వరకు కోత పెడతామని తేల్చి చెప్పింది. టెక్నికల్ ఇష్యూస్‌పై సెబీ రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్స్ - ఒకటి లేదా ఎక్కువ కీలక వ్యవస్థల్లో టెక్నికల్ గ్లిచెస్ వస్తే 30 నిమిషాల్లోగా పరిష్కరించాలి. లేదంటే గంటలోగా దానిని ‘డిజాస్టర్’గా ప్రకటించాలి. - డిజాస్టర్ ప్రకటనను వెల్లడించడంలో ఆలస్యమైతే రెండు ఆర్థిక సంవత్సరాల స్టాండలోన్ నికర లాభంలో సగటున 10 శాతం లేదా రూ.2 కోట్లు, ఇందులో ఏది ఎక్కువైతే దాని ప్రాతిపదికన అపరాధ రుసుము కట్టాల్సి ఉంటుంది. ఉన్నతాధికారులూ తమ వార్షిక వేతనంలో 10 శాతం చొప్పున చెల్లించాలి. - సంఘటన జరిగిన తర్వాత 75 నిమిషాల నుంచి 3 గంటల్లోపు సాధారణ పరిస్థితులను నెలకొల్పాలి. లేదంటే ఎమ్‌ఐఐలు రూ.50 లక్షలు జరిమాన చెల్లించాలి. మూడు గంటలకు మించి టెక్నికల్ అవాంతరాలు కొనసాగితే కోటి రూపాయల జరిమాన కట్టాలి. - సాంకేతిక సమస్యలను సరైన సమయంలో పరిష్కరించకపోతే రోజుకు రూ.2 లక్షల నుంచి 25 లక్షల వరకు జరిమాన. - 24 గంటల్లోగా జరిగిన ఘటనలపై ప్రాథమిక నివేదిక సమర్పించాలి. - సాంకేతిక అవాంతరానికి కారణాలను వెల్లడించే కాంప్రహెన్సివ్ రూట్‌కాజ్ అనాలసిస్(ఆర్సీఏ) నివేదికను 21 రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. ఆలసమ్యమైతే జరిమాన. - నిర్దేశించిన గడువులోగా నివేదికలు ఇవ్వకపోతే... ఆ తర్వాత వచ్చే ఒక్కో వర్కింగ్‌డేకు లక్ష రూపాయల వంతున అపరాధ రుసుము చెల్లించాలి. -
సాంకేతిక లోపం : ట్రేడర్లలో కలవరం
సాక్షి, ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లో ఒక్కసారిగా ట్రేడింగ్ నిలిచిపోవడం కలకలం రేపింది. సాంకేతిక లోపాల కారణంగా స్టాక్ మార్కెట్లో (ఎన్ఎస్ఈ) ట్రేడింగ్ నిలిచిపోయింది. ఎన్ఎస్ఈ ఎఫ్అండ్ఓలో ఉదయం 11:40 నిమిషాల నుంచి ట్రేడింగ్ ఆగిపోయింది. దీంతో క్యాష్ మార్కెట్లోనూ ఎన్ఎస్ఈ ట్రేడింగ్ ఆపివేసింది. దీనిపై స్పందించిన ఎన్ఎస్ఈ ప్రస్తుతం సర్వర్‌ను రీస్టార్ట్ చేశామని, ట్రేడింగ్ మళ్ళీ ఎప్పుడు ప్రారంభమయ్యేది తెలియజేస్తామని వెల్లడించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రేడర్లలో తీవ్ర గందరగోళం నెలకొంది. మరోవైపు అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న ట్రేడర్లలో తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. అటు ఆయా ట్రేడింగ్ ఏజెన్సీలు కూడా ఇన్వెస్టర్లను అప్రమత్తం చేశాయి. అయితే బీఎస్ఇ అన్ని విభాగాలలో సాధారణ ట్రేడింగ్ కొనసాగుతోంది. ఎన్ఎస్ఇ ప్రీ-ఓపెనింగ్ సెషన్ మధ్యాహ్నం 1 గంటలకు, మధ్యాహ్నం 1:15 నుండి సాధారణ ట్రేడింగ్ ప్రారంభమవుతుందని తాజాగా ప్రకటించింది. Trading is halted on NSE across brokers. We are waiting for it to come back online. For equity orders, you can use BSE. https://t.co/j0o1SKr7sp — Zerodha (@zerodhaonline) February 24, 2021 People waiting for #Nifty tick to update #StockMarket #nse pic.twitter.com/wp4HhCSGcY — The Wolverine (@KEEP_IT_UPER) February 24, 2021 -
రన్‌వేపై నిలిచిపోయిన విమానం: కలకలం
సాక్షి, లక్నో: సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం రన్‌వే పై నిలిచిపోవడం కలకలం రేపింది. లక్నో నుంచి రియాద్ వెళ్లాల్సిన సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం రన్‌వే పై నిలిచిపోయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం అర్థాంతరంగా రన్‌వే పైనే నిలిచిపోయింది. ఈ సంఘటనతో కొన్ని విమానాలను దారి మళ్లించడం తోపాటు, మరికొన్ని సర్వీసులను నిలిపివేశారు. దీంతో సిబ్బంది, ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. లక్నో-రియాద్ విమానం గాల్లోకి ఎగిరే క్రమంలో రన్‌వేపైనే నిలిచిపోయింది. ఈ సంఘటనతో విమానాశ్రాయానికి వచ్చి వెళ్లే పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధికారులు ఆరు విమానాలను ఢిల్లీకి మళ్లించారు. టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న మరో మూడు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే విమాన సిబ్బంది, ప్రయాణికులంతా సురక్షితంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
ఎన్ఎస్ఈకి ఏమైంది?
ముంబై: దలాల్‌స్ట్రీట్‌లో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా సోమవారం ఉదయం ట్రేడింగ్ ఆరంభంలోనే ఎన్ఎస్ఈ రేట్లు అప్‌గ్రేడ్ కావడంలేదని మార్కెట్ వర్గాలు గుర్తించాయి. దీంతో అటు ట్రేడర్లు, ఇటు బ్రోకరేజ్ సంస్థల్లో కలవరం మొదలైంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో భారీ సాంకేతిక లోపం తలెత్తిందని సంబంధిత వర్గాలు ప్రకటించాయి. దీంతో రికార్డు లాభాలతో స్టాక్‌మార్కెట్ల మొదలైందన్న ఇన్వెస్టర్ల ఆనందంతో క్షణాల్లో మాయమైపోయింది. మరోవైపు దీనిపై స్పందించిన ఎన్ఎస్ఈ సాంకేతిక సమస్య తలెత్తిందని, పరస్థితిని సమీక్షిస్తున్నామని పేర్కొంది. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించి ట్రేడింగ్నుకొనసాగించనున్నామని ప్రకటించింది. సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి డేటా గ్లిచ్ కారణంగానే ఎన్ఎస్ఇ బిజినెస్‌లో ఆటంకం ఏర్పడిందని ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమాచారం అందించింది. ఒక ఎక్సంజ్లో నిలిపివేత, మరో ఎక్సేంజ్‌లో ట్రేడింగ్ కొనసాగే పరిస్థితిని ఇకముందెన్నడూ చూడలేదని ఎనలిస్టులు భావిస్తున్నారు. దాదాపురెండున్నర గంటలు పాటు ట్రేడింగ్ నిలిచి పోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. అయితే ఇప్పటికే రెండు సార్లు మార్కెట్లను పున: ప్రారంభించినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. మళ్లీ అదే సమస్య ఉత్పన్న కావడంతో ఎన్ఎస్టీ ట్రేడింగ్‌ను నిలిపిశారు. తిరిగి 12.30 తిరిగి ప్రారంభించనున్నామని ఎన్ఎస్ఈ వర్గాలు ప్రకటించాయి. శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ సారైనా ఎన్ఎస్ఈ ట్రేడింగ్ ప్రారంభం అవుతుందా? అయితే.. ట్రేడంగ్ సమయాన్ని పొడిగిస్తారా? హెడ్జింగ్ పాల్పడిన ట్రేడర్ల పరిస్థితి ఏమిటి? వారికి స్పెషల్ విండో సదుపాయం ఏమైనా కల్పిస్తారా అనేది ప్రస్తుతానికి అస్పష్టం. మరోవైపు ఈ వాల్టికి ఎన్ఎస్ఈ ట్రేడింగ్ నిలివేయనుందని నీట్ ప్రకటించింది. దీంతో ట్రేడర్లలో మరింత కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే అలాంటిదేమీ లేదని, త్వరలోనే ప్రారంభమవుతుందని వివరణ ఇచ్చింది. అటు ఎన్ఎస్ఈ నెలకొన్న గందరగోళ పరిస్థితిపై మార్కెట్ రెగ్యులేటర్ సెబికూడా పరిశీలిస్తోంది. అత్యున్నత అధికారులతో పరిస్థితిని అంచనా వేయిస్తోంది. అంతేకాదు ఈ వ్యవహారాన్నికూడా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి కూడా సెబీ తీసుకెళ్లింది. దీంతో దీనిపై ఒక నివేదిక సమర్పించాలని సెబీని, ఎన్ఎస్ఈని ఆర్థికమంత్రిత్వ శాఖ ఆదేశించింది. అటు తాము ట్రేడింగ్ కొనసాగిస్తామని బీఎస్ఈ చెప్పింది. దీంతో బీఎస్ఈలో ట్రేడింగ్ కొనసాగుతోంది. 2010లో ఇలాంటి పరిస్థితి బీఎస్ఈలో ఏర్పడింది. దీంతో 12గం.నుంచి- 2.30 బీఎస్ఈలో ట్రేడింగ్‌ను నిలిపివేశారు టెక్నికల్ 2011లో ఎల్ఎస్ఈ 4 నాలుగు గంటలపాటు నిలిపివేశారు. 2012లో కేవలం కొద్దినిమిషాలు పాటు ఎన్ఎస్ఈలో సమస్య ఏర్పడినట్టు సమాచారం.