ఎన్‌ఎస్‌ఈకి ఏమైంది?
ముంబై: దలాల్‌స్ట్రీట్‌లో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా సోమవారం ఉదయం ట్రేడింగ్ ఆరంభంలోనే ఎన్‌ఎస్‌ఈ రేట్లు అప్‌గ్రేడ్ కావడంలేదని మార్కెట్ వర్గాలు గుర్తించాయి. దీంతో అటు ట్రేడర్లు, ఇటు బ్రోకరేజ్ సంస్థల్లో కలవరం మొదలైంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో భారీ సాంకేతిక లోపం తలెత్తిందని సంబంధిత వర్గాలు ప్రకటించాయి. దీంతో రికార్డు లాభాలతో స్టాక్‌మార్కెట్ల మొదలైందన్న ఇన్వెస్టర్ల ఆనందంతో క్షణాల్లో మాయమైపోయింది.
మరోవైపు దీనిపై స్పందించిన ఎన్‌ఎస్‌ఈ సాంకేతిక సమస్య తలెత్తిందని, పరస్థితిని సమీక్షిస్తున్నామని పేర్కొంది. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించి ట్రేడింగ్‌నుకొనసాగించనున్నామని ప్రకటించింది. సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి డేటా గ్లిచ్ కారణంగానే ఎన్ఎస్ఇ బిజినెస్‌లో ఆటంకం ఏర్పడిందని ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమాచారం అందించింది.
ఒక ఎక్సంజ్‌లో నిలిపివేత, మరో ఎక్సేంజ్‌లో ట్రేడింగ్ కొనసాగే పరిస్థితిని ఇకముందెన్నడూ చూడలేదని ఎనలిస్టులు భావిస్తున్నారు. దాదాపురెండున్నర గంటలు పాటు ట్రేడింగ్ నిలిచి పోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.
అయితే ఇప్పటికే రెండు సార్లు మార్కెట్లను పున: ప్రారంభించినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. మళ్లీ అదే సమస్య ఉత‍్పన్న కావడంతో ఎన్‌ఎస్‌టీ ట్రేడింగ్‌ను నిలిపిశారు. తిరిగి 12.30 తిరిగి ప్రారంభించనున్నామని ఎన్‌ఎస్‌ఈ వర్గాలు ప్రకటించాయి. శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ సారైనా ఎన్‌ఎస్‌ఈ ట్రేడింగ్ ప్రారంభం అవుతుందా? అయితే.. ట్రేడంగ్ సమయాన్ని పొడిగిస్తారా? హెడ్జింగ్ పాల్పడిన ట్రేడర్ల పరిస్థితి ఏమిటి? వారికి స్పెషల్ విండో సదుపాయం ఏమైనా కల్పిస్తారా అనేది ప్రస్తుతానికి అస్పష్టం.
మరోవైపు ఈ వాల్టికి ఎన్‌ఎస్‌ఈ ట్రేడింగ్ నిలివేయనుందని నీట్ ప్రకటించింది. దీంతో ట్రేడర్లలో మరింత కన్‌ఫ్యూజన్ నెలకొంది. అయితే అలాంటిదేమీ లేదని, త్వరలోనే ప్రారంభమవుతుందని వివరణ ఇచ్చింది. అటు ఎన్‌ఎస్‌ఈ నెలకొన‍్న గందరగోళ పరిస్థితిపై మార్కెట్ రెగ్యులేటర్ సెబికూడా పరిశీలిస్తోంది. అత్యున్నత అధికారులతో పరిస్థితిని అంచనా వేయిస్తోంది. అంతేకాదు ఈ వ్యవహారాన్నికూడా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి కూడా సెబీ తీసుకెళ్లింది. దీంతో దీనిపై ఒక నివేదిక సమర్పించాలని సెబీని, ఎన్‌ఎస్‌ఈని ఆర్థికమంత్రిత్వ శాఖ ఆదేశించింది.
అటు తాము ట్రేడింగ్ కొనసాగిస్తామని బీఎస్‌ఈ చెప్పింది. దీంతో బీఎస్‌ఈలో ట్రేడింగ్ కొనసాగుతోంది. 2010లో ఇలాంటి పరిస్థితి బీఎస్‌ఈలో ఏర్పడింది. దీంతో 12గం.నుంచి- 2.30 బీఎస్‌ఈలో ట్రేడింగ్‌ను నిలిపివేశారు టెక్నికల్ 2011లో ఎల్‌ఎస్‌ఈ 4 నాలుగు గంటలపాటు నిలిపివేశారు. 2012లో కేవలం కొద్దినిమిషాలు పాటు ఎన్‌ఎస్‌ఈలో సమస్య ఏర్పడినట్టు సమాచారం.