![Air India Aircraft From Hyderabad To Dubai Was Diverted To Mumbai - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/18/AirIndia-flight.jpg.webp?itok=cbe7zV3B)
ముంబై: శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ బయలుదేరిన ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం తలెత్తటంతో విమానాన్ని అత్యవసరంగా ముంబైలో ల్యాండింగ్ చేశారు అధికారులు. విమానంలోని యెల్లో హైడ్రాలిక్ సిస్టమ్ పని చేయకపోవడంతో ముంబైకి మళ్లించినట్లు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్(డీజీసీఏ) అంధికారులు తెలిపారు.
హైదరాబాద్ నుంచి దుబాయికి శనివారం సాయంత్రం 143 మంది ప్రయాణికులతో బయలుదేరింది ఎయిరిండియా ఏ320 వీటీ-ఈఎక్స్‌వీ విమానం. సాంకేతిక సమస్యను గుర్తించి ముంబైకి మళ్లించారు. ముంబై విమానాశ్రయంలో సుపరక్షితంగా ల్యాండ్ అయినట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. విమానంలో ఏర్పడిన సమస్యను సంబంధిత సిబ్బంది పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. అయితే, సాంకేతిక సమస్యల కారణంగా విమానాలు దారి మళ్లించడం కొత్తేమీ కాదు. డిసెంబర్ 2వ తేదీన కన్నూర్ నుంచి దోహా వెళ్తున్న ఇండో విమానం 6ఈ-1715ని ముంబైకి మళ్లించారు. ప్రయాణికులను మరో విమానంలో గమ్యం చేర్చినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: మధుమేహం పెరుగుదలలో చైనా, భారత్ పోటాపోటీ
Comments
Please login to add a commentAdd a comment