dubai flight
-
బాంబు బెదిరింపుల వేళ.. విమానంలో పేలుడు పదార్థాలు
ఢిల్లీ: దేశంలో వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్న వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తాజాగా ఓ విమానంలో పేలుడు పదార్థాలు లభించడం తీవ్ర కలకలం సృష్టించింది. దుబాయ్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో క్యాట్రిడ్జ్(పేలుడు పదార్థం) దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది.వివరాల ప్రకారం.. అక్టోబర్ 27వ తేదీన దుబాయ్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానం చేరుకుంది. ప్రయాణీకులందరూ విమానం దిగిన తర్వాత విమానంలోని ఓ సీటులో క్యాట్రిడ్జ్‌ను సిబ్బంది గుర్తించారు. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా సంస్థలకు చెందిన అధికారులు మాట్లాడుతూ.. ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI916 సీటు జేబులో క్యాట్రిడ్జ్(పేలుడు పదార్థం) దొరికింది. అయితే, అప్పటికే ప్రయాణికులంతా సురక్షితంగా దిగారు. భద్రతా ప్రొటోకాల్‌ను పాటిస్తూ ఈ విషయంపై ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు పోలుసులు కూడా వెల్లడించారు.ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో విమానాలు, స్కూల్స్, హోటల్స్‌కు బాంబు బెదిరింపు కాల్స్ పెరిగిన విషయం తెలిసిందే. పలువురు ఆకతాయిలు.. ఫేర్ బెదిరింపు కాల్స్ చేయడంతో ఈ ఘటనపై అధికారులు, పోలీసులు కూడా దృష్టిసారించారు. ఇక, గడిచిన 20 రోజుల్లో మొత్తం 600కుపైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు రాగా.. అవన్నీ ఫేక్ అని తేలింది. ఈ బెదిరింపులన్నీ సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇలాంటి బెదిరింపులపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది."One ammunition cartridge was found in the pocket of a seat of our flight AI916 after it had landed from Dubai at Delhi on 27 October 2024 and all passengers had safely disembarked. A complaint was immediately lodged with the Airport Police by Air India strictly adhering to the… pic.twitter.com/INwG7Kf9K5— ANI (@ANI) November 2, 2024 -
తమిళనాడు: ఎమిరేట్స్ విమానానికి తప్పిన ప్రమాదం
సాక్షి, చెన్నై: తమిళనాడు ఎమిరేట్స్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యే సమయానికి విమానం నుంచి పొగలు రావడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే నిలిపివేశారు. దీంతో, ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.వివరాల ప్రకారం.. చెన్నై విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి ఎయిర్‌పోర్టు నుంచి విమానం టేకాఫ్ అయ్యే సమయానికి ఫ్లైట్ వింగ్స్ భాగం నుంచి పొగ రావడం కనిపించింది. దీంతో, అప్రమత్తమైన పైలట్ విమానాన్ని అక్కడే నిలిపివేశారు.ఈ క్రమంలో అలర్ట్ అయిన విమాన సిబ్బంది, టెక్నికల్ టీమ్ విమానాన్ని పరిశీలించి ప్రమాదాన్ని గుర్తించారు. పది నిమిషాల సమయంలో పొగ ఆగిపోయినట్టు అధికారులు తెలిపారు. అయితే, పొగ రావడానికి గల కారణాలను సిబ్బంది వెల్లడించలేదు. దీంతో, ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. ఇక, రాత్రి 9:15 గంటలకు దుబాయ్ వెళ్లాల్సిన విమానం నాలుగు గంటలు ఆలస్యంగా అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత టేకాఫ్ అయినట్టు సమాచారం. ఇక, ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 320 మంది ప్రయాణీకులు ఉన్నారు.ఇది కూడా చదవండి: తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం -
Delhi: దుబాయ్- ఢిల్లీ ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపు ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెకాఫ్‌కు రెడీగా ఉన్న దుబాయ్ విమానంలో బాంబు ఉందంటూ మెయిల్ వచ్చింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపట్టారు.ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరాగాంధీ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం సృష్టించింది. కాగా, సోమవారం ఉదయం 9:35 గంటల సమయంలో దుబాయ్‌కి వెళ్లేందుకు విమానం ఢిల్లీ ఎయిర్‌ఫోర్ట్‌లో సిద్ధంగా ఉంది. కాసేపట్లో టేకాఫ్ అవుతుందనంగ.. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ ఆఫీస్, ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌కి విమానంలో బాంబు ఉందంటూ కొందరు వ్యక్తులు బెదిరింపు మెయిల్ పంపారు అని మంగళవారం తెలిపారు. On 17th June at 9:35 am an email was received in DIAL (Delhi International Airport Limited) office, IGI Airport with the threat of a bomb inside a Delhi to Dubai flight. Accordingly necessary legal action has been taken and nothing suspicious was found: Delhi Police— ANI (@ANI) June 18, 2024 ఇక, బెదిరింపు మెయిల్‌తో ప్రొటోకాల్ ప్రకారం.. విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు చెప్పారు. అయితే, తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ కనిపించలేదని వెల్లడించారు. అది బూటకపు మెయిల్ అని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఇదే జూన్ నెలలో ఢిల్లీ నుంచి కెనడా వెళ్తున్న ఎయిర్ కెనడా విమానానికి కూడా బాంబు బెదిరింపు బెయిల్ వచ్చింది. అది కూడా ఫేక్ అని తేలింది. ఈ ఘటనలో ఫేక్ మెయిల్ పంపిన వ్యక్తిని యూపీకి చెందిన మైనర్‌గా గుర్తించారు. అనంతరం, కౌన్సిలింగ్ ఇచ్చారు. -
హైదరాబాద్ నుంచి బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం..
ముంబై: శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ బయలుదేరిన ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం తలెత్తటంతో విమానాన్ని అత్యవసరంగా ముంబైలో ల్యాండింగ్ చేశారు అధికారులు. విమానంలోని యెల్లో హైడ్రాలిక్ సిస్టమ్ పని చేయకపోవడంతో ముంబైకి మళ్లించినట్లు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్(డీజీసీఏ) అంధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి దుబాయికి శనివారం సాయంత్రం 143 మంది ప్రయాణికులతో బయలుదేరింది ఎయిరిండియా ఏ320 వీటీ-ఈఎక్స్‌వీ విమానం. సాంకేతిక సమస్యను గుర్తించి ముంబైకి మళ్లించారు. ముంబై విమానాశ్రయంలో సుపరక్షితంగా ల్యాండ్ అయినట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. విమానంలో ఏర్పడిన సమస్యను సంబంధిత సిబ్బంది పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. అయితే, సాంకేతిక సమస్యల కారణంగా విమానాలు దారి మళ్లించడం కొత్తేమీ కాదు. డిసెంబర్ 2వ తేదీన కన్నూర్ నుంచి దోహా వెళ్తున్న ఇండో విమానం 6ఈ-1715ని ముంబైకి మళ్లించారు. ప్రయాణికులను మరో విమానంలో గమ్యం చేర్చినట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: మధుమేహం పెరుగుదలలో చైనా, భారత్ పోటాపోటీ -
సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఎయిర్‌హెస్టెస్.. ఆమె ఏం చేసిందంటే?
ఎయిర్‌హెస్టెస్ ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది.. విమాన ప్రయాణీకులకు వెల్కమ్ చెప్పడం, లోపల అతిథి మర్యాదలు చేయడం. కాగా, ఓ మహిళా ఎయిర్‌హెస్టెస్‌కు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. దుబాయ్‌కు వెళ్తున్న ఎమిరేట్స్ విమానంలోకి ఎక్కేందుకు ఓ చిన్నపిల్లవాడు పాస్‌పోర్టు, వీసాతో వెళ్లాడు. ఇంతలో విమానం గేటు వద్ద ఓ ఎయిర్‌హెస్టెస్.. అతని చేతిలోని బోర్డింగ్ పాస్ తీసుకొని కౌగిలించుకుంది. వెంటనే అతడిని హత్తుకుని చిరునవ్వుతో స్వాగతం పలికింది. ఎందుకంటే ఆ విమానం ఎక్కిన ప్యాసింజర్.. సదరు ఎయిర్‌హోస్టెస్ కుమారుడు కావడమే. ఆ తర్వాత వెనక్కు తిరిగి కెమెరా వైపు చేతులు ఊపుతూ లోపలకు వెళ్లాడు. View this post on Instagram A post shared by V E E (@flygirl_trigirl) ఈ వీడియోను షేర్ చేసిన సదరు ఎయిర్‌హోస్టెస్..‘నా జీవితంలో విమానంలోకి ఆహ్వానించిన అతి పెద్ద వీఐపీ’ అంటూ కామెంట్స్ చేశారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. బావోద్వేగానికి గురువుతున్నట్టు తెలిపారు. View this post on Instagram A post shared by V E E (@flygirl_trigirl) -
ఆకాశంలో ఐదు గంటలు
తాము ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. దీంతో మనకొద్దు అని దిగివెళ్లిపోయే వీలులేదు. ఎందుకంటే వారంతా ప్రయాణిస్తున్నది ఆకాశంలో. తమకు తాముగా భూమిపై కాలుపెట్టే పరిస్థితి లేదు. అంతా పైలట్ దయాదాక్షిణ్యాలపై అధారపడి ఉం ది. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఐదు గంటలపాటు ఆకాశంలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు తిరుచ్చి– దుబాయ్ విమాన ప్రయాణికులు. సాక్షి ప్రతినిధి, చెన్నై: తిరుచ్చిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానం ప్రతిరోజూ దుబాయ్‌లో బయలుదేరి రాత్రి 12.05 గంటలకు తిరుచ్చిరాపపల్లికి చేరుకుంటుంది. మరలా ప్రయాణికులను ఎక్కించుకుని దుబాయ్‌కి బయలుదేరుతుంది. యథావిధిగా గురువారం రాత్రి 120 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి తిరుచ్చి చేరుకుంది. తిరుచ్చిలో 130 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో శుక్రవారం తెల్లవారుజాము 1.20 గంటలకు దుబాయ్‌కి బయలుదేరింది. కంట్రోలు రూం ఆదేశాల ప్రకారం తిరుచ్చి–పుదుక్కోట్టై రోడ్డు ప్రహరీగోడ వైపున పశ్చిమ దిశగా టేకాఫ్ తీసుకోవడానికి ముందు రన్‌వేలోనే తూర్పు దిశకు వెళ్లి మరల పశ్చిమ దిశకు మరల్చి రన్‌వేలో సగం దూరం వేగంగా నడిపి టేకాఫ్ తీసుకోవాలి. అయితే సదరు విమానం రన్‌వే ముగిసేచోట టేకాఫ్ చేయడంతో అక్కడి పదకొండు టవర్లలో నాలుగింటిని ఢీకొట్టింది. అదే తీరులో ముందుకు ఎగురుతుండగా విమానం వెనుకనున్న రెండుచక్రాలు 9 అడుగుల ప్రహరీగోడను ఢీకొట్టాయి. ఈ కారణంగా ప్రహరీగోడ పాక్షికంగానూ, టవర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే విమాన కిందిభాగం ధ్వంసమై కొన్ని శిథిలాలు కిందపడిపోయినట్లు సమాచారం. అయితే విమాన రెండుచక్రాలకు ఏమీకాలేదు. ఇంత జరిగినా ఏమాత్రం చలించని పైలట్ విఘ్నేష్‌కుమార్ దుబాయ్ వైపు విమానాన్ని పరుగులు పెట్టించాడు. విమానం భారీగా కుదుపులకు లోనుకావడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఏమైందని ప్రశ్నిస్తే ఎయిర్‌హోస్టెస్ ఏదో సర్దిచెప్పారు. విమాన విధ్వంస దృశ్యాలను సీసీ కెమెరాల్లో చేసిన తిరుచ్చి కంట్రోలు రూంఅధికారులు పైలట్‌ను సంప్రదించగా విమానానికి ఏమీ కాలేదు, దుబాయ్ వెళుతున్నా అని బదులిచ్చాడు. విమానం స్వల్ప ప్రమాదానికి లోనైందని తిరుచ్చి కంట్రోలు రూం అధికారులు దుబాయ్ కంట్రోలు రూంకు సమాచారం ఇవ్వడంతో ఇక్కడ ల్యాండ్ అయ్యేందుకు వీలులేదు, మరేదైనా జరిగితే మాకు తలనొప్పని వారు స్పష్టం చేశారు. దీంతో తిరుచ్చి అధికారులు ముంబయి విమానాశ్రయ కంట్రోలు రూంను సంప్రదించి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి పొందారు. దీంతో ఏమైందో తెలియక ముంబయి విమానాశ్రయంలో కలకలం రేగింది. తిరుచ్చి అధికారులు పైలట్‌కు ఫోన్ చేసి వెంటనే ముంబయి విమానాశ్రయంలో దిగాల్సిందిగా ఆదేశించారు. అప్పటికే విమానం దుబాయ్ దేశంలో సముద్రంపై ఎగురుతోంది. ఈ విమానం దుబాయ్‌కి మరో 45 నిమిషాల్లో చేరుతామనగా వెనక్కుమళ్లి శుక్రవారం ఉదయం 6.10 గంటలకు ముంబయి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. దుబాయ్ విమానం లాండ్ అయ్యేవరకు ముంబయి, తిరుచ్చి కంట్రోలు రూం అధికారులు, ప్రయాణికులు తీవ్ర ఉత్కంఠ పరిస్థితిని ఎదుర్కొన్నారు. దుబాయ్ విమానంలోని 130 మంది ప్రయాణికులకు బస ఏర్పాటు చేసి ఉదయం 10.40 గంటలకు మరో విమానంలో పంపారు. రుజువైతే లైసెన్సు రద్దు: తిరుచ్చి విమానాశ్రయ అధికారి గుణశేఖరన్ మీడియాతో మాట్లాడుతూ విమానం టవర్‌కు ఢీకొనగానే కంట్రోలు రూంలో అలారం వినిపించిందని అన్నారు. దీంతో పైలట్‌ను ఫోన్లో సంప్రదించగా విమానానికి ఏమీ కాలేదని బదులిచ్చాడు. ముంబయిలో అత్యవసర లాండింగ్ చేయాలని ఆదేశించామని తెలిపారు. ఈ సంఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏవియేషన్ విచారణకు ఆదేశించిందని, ఈ విచారణ బృందంలో తాను సభ్యుడిగా ఉన్నానని చెప్పారు. పైలెట్ తప్పిదం ఉన్నట్టు విచారణలో తేలితే అతడి లైసెన్సును రద్దు చేస్తామని తెలిపారు. అదే జరిగి ఉంటే.. విమానాశ్రయానికి అనుకునే తిరుచ్చిరాపల్లి–పుదుక్కోట్టై రహదారిని నిర్మించారు. ఈ రహదారిలో 24 గంటలు పెద్ద సంఖ్యలో వాహనాల రద్దీ ఉంటుంది. ఐదు నిమిషాలకు ఒకసారి పుదుక్కోట్టై బస్సు వెళుతుంటుంది. ప్రహరీని ఢీకొన్న సమయంలో ఏదైనా వాహనం వెళుతుండినట్లయితే విమానం ముందు భాగం సదరు వాహనాన్ని ఢీకొని పెద్ద ప్రమాదం చోటుచేసుకుని ఉండేది. అదృష్టవశాత్తు ఎలాంటి వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. -
టేకాఫ్ అవుతూ గోడను ఢీకొట్టింది
సాక్షి ప్రతినిధి, చెన్నై: తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ విమానానికి భారీ ముప్పు తప్పింది. తిరుచ్చి నుంచి గురువారం అర్ధరాత్రి 1.30 గంటలప్పుడు దుబాయ్ వెళ్లేందుకు ఎయిరిండియాకు చెందిన ఐఎక్స్–611 విమానం బయలుదేరింది. టేకాఫ్ అవుతుండగా.. పైలట్లకు ల్యాండింగ్ సమయంలో సూచనలు ఇచ్చేందుకు విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఓ పెద్ద పరికరాన్ని విమానం ఢీకొంది. ఆ తర్వాత విమానం ప్రహరీ గోడను కూడా స్వల్పంగా తాకింది. ఈ ఘటనలతో విమానం కుదుపులకులోనై ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అటు విమానం చక్రం, ముందుభాగం స్వల్పంగా ధ్వంసమయ్యాయి. 50 అడుగుల ఎత్తున్న ప్రహారీ గోడ, దానిపై ఉన్న కంచె కూడా దెబ్బతిన్నాయి. ఘటన జరిగిన సమయంలో విమానంలో 130 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉండగా ఎవ్వరికీ ఏమీ కాలేదు. విమానంలో కూడా అన్ని పరికరాలూ సవ్యంగానే పనిచేస్తున్నాయనీ, ఇబ్బందేమీ లేదని పైలట్లు చెప్పడంతో విమానం అలాగే దుబాయ్ వెళ్లేందుకు అధికారులు అనుమతించారు. ప్రమాదం జరిగిన విషయాన్ని దుబాయ్ విమానాశ్రయానికి చేరవేయడంతో విమానం దెబ్బతిన్నందున తాము ల్యాండింగ్‌కు అనుమతించబోమని అక్కడి అధికారులు తేల్చి చెప్పారు. దీంతో విమానాన్ని తెల్లవారుజామున 5.45 ప్రాంతంలో ముంబైకి తరలించి, అక్కడ ప్రయాణికులను మరో విమానంలోకి ఎక్కించి 10.40 గంటలకు దుబాయ్‌కి పంపారు. ప్రమాదానికి కారణం సాంకేతిక సమస్యనా లేక పైలట్ల నిర్లక్ష్యమా అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించిందనీ, దర్యాప్తు పూర్తయ్యే వరకు పైలట్లను ఎయిరిండియా విధుల నుంచి తప్పించిందని తిరుచిరాపల్లి విమానాశ్రయ డైరెక్టర్ గుణశేఖరన్ చెప్పారు. -
ఎయిర్‌పోర్ట్‌లో భారీగా ఎర్రచందనం పౌడర్ స్వాధీనం
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అమీర్ అహ్మద్ అనే వ్యక్తి నుంచి కస్టమ్స్ అధికారులు శుక్రవారం 37 కేజీల ఎర్రచందనం పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అమీర్ అహ్మద్ శుక్రవారం ఉదయం దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నాడు. ఆ క్రమంలో అతడి లగేజీలో అక్రమంగా ఉంచి 37 కేజీల ఎర్రచందనం పౌడర్‌ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అనంతరం ఆ ఫౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు అహ్మద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా విచారిస్తున్నారు.