Emirates Air Hostess Welcomes Her Son On Dubai Flight - Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా ట్రెండింగ్‌లో ఎయిర్‌హెస్టెస్.. ఆమె ఏం చేసిందంటే?

Published Fri, Sep 2 2022 8:03 PM | Last Updated on Fri, Sep 2 2022 9:21 PM

Emirates Air Hostess Welcomes Her Son On Dubai Flight - Sakshi

ఎయిర్‌హెస్టెస్ ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది.. విమాన ప్రయాణీకులకు వెల్‌కమ్‌ చెప్పడం, లోపల అతిథి మర్యాదలు చేయడం. కాగా, ఓ మహిళా ఎయిర్‌హెస్టెస్‌కు చెందిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. దుబాయ్‌కు వెళ్తున్న ఎమిరేట్స్‌ విమానంలోకి ఎక్కేందుకు ఓ చిన్నపిల్లవాడు పాస్‌పోర్టు, వీసాతో వెళ్లాడు. ఇంతలో విమానం గేటు వద్ద ఓ ఎయిర్‌హెస్టెస్.. అతని చేతిలోని బోర్డింగ్ పాస్ తీసుకొని కౌగిలించుకుంది. వెంటనే అతడిని హత్తుకుని చిరునవ్వుతో స్వాగతం పలికింది. ఎందుకంటే ఆ విమానం ఎక్కిన ప్యాసింజర్.. సదరు ఎయిర్‌హోస్టెస్ కుమారుడు కావడమే. ఆ తర్వాత వెనక్కు తిరిగి కెమెరా వైపు చేతులు ఊపుతూ లోపలకు వెళ్లాడు.

ఈ వీడియోను షేర్‌ చేసిన సదరు ఎయిర్‌హోస్టెస్‌..‘నా జీవితంలో విమానంలోకి ఆహ్వానించిన అతి పెద్ద వీఐపీ’ అంటూ కామెంట్స్‌ చేశారు. కాగా, ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. బావోద్వేగానికి గురువుతున్నట్టు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement