emirates flight
-
సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఎయిర్‌హెస్టెస్.. ఆమె ఏం చేసిందంటే?
ఎయిర్‌హెస్టెస్ ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది.. విమాన ప్రయాణీకులకు వెల్కమ్ చెప్పడం, లోపల అతిథి మర్యాదలు చేయడం. కాగా, ఓ మహిళా ఎయిర్‌హెస్టెస్‌కు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. దుబాయ్‌కు వెళ్తున్న ఎమిరేట్స్ విమానంలోకి ఎక్కేందుకు ఓ చిన్నపిల్లవాడు పాస్‌పోర్టు, వీసాతో వెళ్లాడు. ఇంతలో విమానం గేటు వద్ద ఓ ఎయిర్‌హెస్టెస్.. అతని చేతిలోని బోర్డింగ్ పాస్ తీసుకొని కౌగిలించుకుంది. వెంటనే అతడిని హత్తుకుని చిరునవ్వుతో స్వాగతం పలికింది. ఎందుకంటే ఆ విమానం ఎక్కిన ప్యాసింజర్.. సదరు ఎయిర్‌హోస్టెస్ కుమారుడు కావడమే. ఆ తర్వాత వెనక్కు తిరిగి కెమెరా వైపు చేతులు ఊపుతూ లోపలకు వెళ్లాడు. View this post on Instagram A post shared by V E E (@flygirl_trigirl) ఈ వీడియోను షేర్ చేసిన సదరు ఎయిర్‌హోస్టెస్..‘నా జీవితంలో విమానంలోకి ఆహ్వానించిన అతి పెద్ద వీఐపీ’ అంటూ కామెంట్స్ చేశారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. బావోద్వేగానికి గురువుతున్నట్టు తెలిపారు. View this post on Instagram A post shared by V E E (@flygirl_trigirl) -
ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ విమానం.. మొదటిసారిగా ఆ నగరానికి!
సాక్షి, బెంగళూరు: అతిపెద్ద ప్రయాణికుల విమానం ఎమిరేట్స్ ఎయిర్‌బస్–ఏ380 బెంగళూరుకు నేరుగా సేవలను అందించనుంది. అక్టోబర్ 30న దుబాయ్ నుంచి వచ్చి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగనుంది. 2014 నుంచి ముంబైకి సర్వీసులను అందిస్తోంది. 72.75 మీటర్ల పొడవు, 24.45 మీటర్ల ఎత్తు కలిగిన ఈ విమానంలో గరిష్టంగా 853 మంది ప్రయాణించవచ్చు. ఒకసారి 3 వేల సూట్‌కేసులను తరలించే సామర్థ్యం ఈ విమానానికి ఉంది. అక్టోబర్ 30 నుంచి ప్రతి రోజూ బెంగళూరు నుంచి దుబాయ్‌కి విమానం రాకపోకలు సాగిస్తుందని ఎమిరేట్స్ సంస్థ వెల్లడించింది. ఈ విమానంలో మూడు తరగతుల (ఎకానమీ, బిజినెస్, ఫస్ట్‌క్లాస్) ప్రయాణికులు ప్రయాణం చేయవచ్చు. బోయింగ్–777తో పోలిస్తే 45 శాతం అధిక మంది ప్రయాణించవచ్చు. ప్రపంచంలోని 30 విమానాశ్రయాలకు ఎయిర్‌బస్–ఏ380 తన సేవలను అందిస్తుంది. చదవండి: Wipro Salary Hikes: విప్రో ఉద్యోగులకు శుభవార్త! -
ల్యాండింగ్.. షేకింగ్
-
ల్యాండింగ్.. షేకింగ్
బెర్లిన్ : విమానంలో ప్రయాణించడం.. నిజంగా ఒక అనుభూతి. మేఘాలను తాకుతూ, నీలి గగనాలను అందుకుంటూ గాల్లో తేలియాడుతూ చేసే ప్రయాణంపై అందరికీ మక్కువే. వేల అడుగుల ఎత్తులో ప్రయాణించే లోహ విహంగం చిన్న కుదుపుకు గురయితే.. ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో ప్రమాదాలకు గురయితే.. జరిగే ప్రమాదాన్ని ఊహించలేం.ఘిదిగో సరిగ్గా ఇటువంటి ఘటనే.. ఒకటి జర్మనీలో 'సోమవారం జరిగింది. ఎమిరేట్స్ ఈకే 55 ఫ్లయిట్ మంగళవారం దుబాయ్ నుంచి జర్మనీకి బయలు దేరింది. ఏ380 రకానికి చెందిన ఈ భారీ విమానంలో 600 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణమంతా సుఖంగానే జరిగింది.. జర్మనీ చేరిన ఫ్లయిట్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌కు సిద్ధమవుతోంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి లభించాక రన్ వే మీదకు వచ్చింది. సరిగ్గా ఈ సమయంలోనే శక్తివంతమైన గాలులు విమానాన్ని తాకాయి. ఎంతగా అంటే 600 మంది ప్రయాణికులతో ఉన్న భారీ విమానం.. గాల్లో కదిలిపోయేంతగా గాలులు వీచాయి. రన్ వే మీదకు దిగిన విమానం.. కొన్ని క్షణాల పాటు.. అటూఇటూ..ఊగిపోయింది. మొత్తానికి పైలెట్ల అనుభవం.. ప్రయాణికుల అదృష్టం కలిసి ఎటవంటి ప్రమాదం లేకుండా విమానం నేలను తాకింది. అయితే ఈ ఘటననంతా ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇప్పటివరకూ ఈ వీడియోను 9.9 లక్షల మంది చూశారు. -
విమానంలో ఆమె ఎంత పనిచేసింది!
మాస్కో: అనూహ్య దృశ్యం మొబైల్ కెమెరా కంటపడింది. ఓ బోయింగ్ విమానంలో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న వ్యక్తి సరదాగా తన ఫోన్‌తో చుట్టూ వీడియో తీస్తుండగా షాకింగ్ ఘటన దానికి చిక్కింది. ఎవరో తాగి మిగిల్చిన మద్యాన్ని విమాన సిబ్బందికి చెందిన మహిళా సహాయకురాలు ఒకరు తిరిగి బాటిల్లో నింపుతున్న దృశ్యం అందులో రికార్డయింది. ఆ దృశ్యాన్ని అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా పెద్ద మొత్తంలో వైరల్ అయింది. చూసేందుకే చాలా ఏవగింపు కలిగిస్తోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. యెజెనీ కేయుమోవ్ అనే వ్యక్తి రష్యా నుంచి దుబాయ్‌కి ఎమిరేట్స్ ఏ 380 అనే విమానంలో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో తన మొబైల్ కెమెరాతో విమానంలో కూర్చొని చుట్టూ వీడియో తీశాడు. అదే సమయంలో ఆయన వెనుకాలే ఉన్న చాంబర్లో తాగి వదిలేసిన మద్యాన్ని తిరిగి బాటిల్ నింపుతున్న దృశ్యం రికార్డయింది. దీనిని సదరు వ్యక్తి ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా హవ్వా ఎమిరేట్స్ సంస్థ ఇలా ఎప్పటి నుంచి చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి పనిచేస్తున్న సిబ్బందిని కచ్చితంగా హెచ్చరించాలని డిమాండ్ చేస్తున్నారు. -
ప్యాంటుకు ప్రత్యేక పాకెట్స్!
బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ఏర్పాటు విమానాశ్రయంలో 952 గ్రాముల బంగారం స్వాధీనం సాక్షి, హైదరాబాద్: దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమ రవాణా చేయడానికి నిర్ణయించుకున్న వ్యక్తి తెలివిగా వ్యవహరిం చాడు. తన ప్యాంటుకు ప్రత్యేకంగా జేబులు ఏర్పాటు చేయించుకున్నాడు. వాటిలో 952 గ్రాముల బంగారాన్ని బిస్కెట్ల రూపంలో సర్ది తీసుకువచ్చాడు. సమాచారం అందుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ దాడి చేసి పట్టుకున్నాయి. దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమానంలో వచ్చిన స్మగ్లర్ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగాడు. ఇతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు తనిఖీ చేసి ప్యాంటు లోపలి భాగంలో ఏర్పాటు చేసుకున్న రహస్య జేబులు గుర్తించారు. వాటిలో ఉన్న 952 గ్రాముల బరువున్న 9 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీని రూ.27.9 లక్షలుగా నిర్ధారించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. -
విమానంలో పాము కలకలం
దుబాయ్: విమానంలో పాము దర్శనమిచ్చింది. విమాన సిబ్బంది దీనిని గుర్తించారు. దీంతో ఒమన్ నుంచి దుబాయ్ వరకు వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానాన్ని ఆపేశారు. సోమవారం ఉదయం మస్కట్ నుంచి బయలుదేరాల్సిన ఎమిరేట్స్‌కు చెందిన ఈకే0863 విమానంలో వస్తువులు పెట్టే కార్గో విభాగం చోట సిబ్బందికి పాము కనిపించింది. అయితే, అప్పటికే ఇంకా ప్రయాణీకులు విమానం ఎక్కలేదు. దీంతో ఆ విమానాన్ని అప్పటికప్పుడు రద్దు చేసి అందులో సోదాలు నిర్వహించి పామును పట్టుకున్నారు. అనంతరం కొన్ని గంటల ఆలస్యం తర్వాత ఆ విమానం దుబాయ్‌కు చేరుకుంది. అయితే అందులో దొరికిన పాము ఏ జాతిదనే విషయం మాత్రం అధికారులు చెప్పలేదు. గతంలో కూడా ఇలా విమానాల్లో పాములు కనిపించి గందరగోళ పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. -
గ'ఘన' విహారం
గాల్లో... అదీ మేఘాల్లో రివ్వు రివ్వున దూసుకెళుతూంటే ఎలా ఉంటుందంటారూ? ఊహూ... విమానంలో కూర్చొని కాదండీ. భుజానికి ఓ జెట్ప్యాక్ తగిలించుకుని వెళితే? ఏమో మాకేం తెలుస్తుంది అంటారా? అరుుతే ఓకే. కానీ ఆ థ్రిల్ ఎలా ఉంటుంది పక్క ఫొటోలో ఉన్న వారికి మాత్రం బాగా తెలుసండోయ్! జెట్మన్లు దుబాయికి చెందిన ముగ్గురు ఈ మధ్యనే ఫ్రాన్‌సలో ఓ అబ్బురపరిచే విన్యాసం చేశారు. ఫ్రాన్స్ వాయుసేన విమానాలు ఒక నిర్ణీత పద్ధతి (ఫార్మేషన్) ప్రకారం వెళుతూంటే... ఈ ముగ్గురు కూడా ఆ విమానాలను ఫాలో అయ్యారు. ఇలా చేయడం ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అట. నాలుగు వేల అడుగుల ఎత్తులో గంటకు 260 కిలోమీటర్ల వేగంతో ఈ ప్రయాణం సాగింది. వాయు సేన విమానాలు గాల్లోకి ఎగసిన వెంటనే జెట్మ్యాన్ టీమ్ సభ్యులు హెలికాప్టర్ల అంచుల మీద నిలబడి గాల్లోకి ఎగిరారు. కొంచెం ఎత్తుకు వెళ్లిన తరువాత విమానాలు ఫార్మేషన్లో ప్రయాణించడం మొదలైంది. ఆ వెంటనే హెలికాప్టర్ల నుంచి కిందకు దూకేసిన జెట్మ్యాన్ టీమ్ సభ్యులు విమానాల వెంబడే ప్రయాణించడం మొదలుపెట్టారు. ఒక్కో సభ్యుడు జెట్ కార్ పీ400 ఇంజిన్లతో కూడిన జెట్‌ప్యాక్‌ను తగిలించుకుని తొమ్మిది నిమిషాలపాటు ప్రయాణించడం విశేషం. హెలికాప్టర్ల అంచున నిలబడి సాహస ప్రయాణానికి సిద్ధమవుతూ... గత ఏడాది ఇదే బృందం ఎమిరేట్స్ విమానం వెంబడి జెట్‌ప్యాక్‌లతో ప్రయాణించి రికార్డు సృష్టించింది. ఇందులో గొప్పేముంది అని తీసిపారేయొద్దు. అటు జెట్ పెలైట్లు... ఇటు జెట్మ్యాన్ సభ్యులు - ఇద్దరూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన విషయమిది. ఏ మాత్రం లెక్క తప్పినా... ఇద్దరికీ ప్రమాదమే. జెట్మ్యాన్ సభ్యులు కేవలం తమ శరీర కదలికల ద్వారా మాత్రమే తమ స్థానాన్ని అటూ ఇటూ చేయగలగడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. హెలికాప్టర్ల నుంచి గగనంలో దూకేసిన జెట్మ్యాన్ సభ్యులు -
ప్రమాదం ముంచుకొస్తుంటే లగేజీల గొడవెందుకు?
దుబాయ్: దూకండి... దూకండి... బయటకు దూకండి! లగేజీని వదిలేయండి...ముందు మీరు బయటపడండి, బయటకు జారిపోండి! తిరువనంతపురం నుంచి దూబాయ్‌కి చేరుకున్న ఎమిరేట్స్ విమానం బుధవారం విమానాశ్రయంలో క్రాష్ ల్యాండ్ అయినప్పుడు ఫ్లైట్ అటెండెంట్ ప్రయాణికులను ఉద్దేశించి చేసిన హెచ్చరికలు ఇవి. ఓ పక్క ప్రమాదం ముంచుకొస్తున్నా ప్రయాణికులు మాత్రం తమ లగేజీలను వెంట తీసుకెళ్లేందుకే ప్రయత్నించిన విషయం తెల్సిందే. కొంత మంది తమ ఖరీదైన లాప్టాప్ల గురించి వెతుక్కోవడం కూడా ఓ వీడియో ఫుటేజ్‌లో కనిపించింది. ఇలాంటి విపత్కర సమయాల్లో 90 సెకండ్లలో విమానం నుంచి ప్రయాణికులను ఖాళీ చేయించడం విమానం సిబ్బంది బాధ్యత. ఎందుకు ఇలా 90 సెకండ్లలోనే ఖాళీ చేయించాల్సి ఉంటుందంటే. ఆ తర్వాత విమానంలో మంటలు తీవ్రమవుతాయనే విషయాన్ని పలు అధ్యయనాల ద్వారా వెల్లడైనట్లు వైమానిక నిపుణుడు ఆశ్లీ న్యూన్స్ తెలిపారు. అందుకనే ఎమిరేట్స్ విమాన సిబ్బంది నిర్దేశిత సమయంలో ప్రయాణికులను ఖాళీ చేయించేందుకు అవసరమైన హెచ్చరికలు చేస్తూ వచ్చారు. చివరకు తమ లగేజీలను తీసుకొని ప్రయాణికులు విమానాన్ని ఖాళీ చేశారు. అందుకు నిమిషంపైనే పట్టింది. రన్‌వేపై జారిపోతున్న విమానం ఇంజన్ నుంచి మంటలు చెలరేగడం కూడా 1.23 సెకండ్ల వీడియో ఫుటేజ్‌లో కనిపించింది. అంటే అర నిమిషం లేటైనా ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలేసేవే. ఇలా ప్రాణం మీదకు వచ్చినప్పుడు కూడా మానవులు తమ బ్యాగ్‌లు, లాప్‌ట్యాప్‌లు, పాస్‌పోర్టులు, పర్సులు, ఇంటి తాళం చేతుల కోసం ఎందుకు వెతుకుతారు? ప్రాణంకన్నా వస్తువులపై మమకారం ఎక్కువా? ఒక్క ఎమిరేట్స్ విమానం విషయంలోనే ఇది జరగలేదు. గతేడాది సెప్టెంబర్ నెలలో బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన విమానం లాస్ వెగాస్ విమానాశ్రయంలో అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు కూడా ప్రయాణికులు ఇలాగే వ్యవహరించారు. 2013, జూలై నెలలో ఆసియాన విమానం శాన్ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో క్రాష్ ల్యాండింగ్‌కు గురైనప్పుడు కూడా ప్రయాణికులు తమ లగేజ్ల కోసం ఇలాగే వెంపర్లాడడం కనిపించింది. మానవుడి నైజమే ఇంత! అని ఒక్కమాటలో సమాధానం చెప్పవచ్చునేమోగానీ ఈ విషయంలో మానవ మేథస్సుపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితులను కంప్యూటర్ ద్వారా విశ్లేషించడం సాధ్యం కాదు. ఎందుకంటే జీవన్మరణ సమస్యను అందులో సృష్టించలేం. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఎమిరేట్స్ విమానం ఫుటేజ్ వైమానిక సిబ్బంది ‘సేఫ్టీ డ్రిల్స్’కు ఎంతో ఉపయోగపడగలదు. ఇక ముందు ప్రయాణికులకు కూడా ఎలాంటి శిక్షణ ఇవ్వాలో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. -
ప్రమాదం ముంచుకొస్తుంటే లగేజీల గొడవెందుకు?
-
ప్రాణాలు పోతున్నా.. ల్యాప్‌టాప్‌ల కోసం ఆగారు!
ఒకవైపు విమానం క్రాష్ ల్యాండింగ్ అవుతోంది. ఏ క్షణంలోనైనా ఎంతటి ప్రమాదం అయినా జరగొచ్చని, వెంటనే బయటకు వెళ్లిపోవాలని విమాన సిబ్బంది చెబుతున్నారు. అయినా చాలామంది ప్రయాణికులు పైన కేబిన్లలో ఉన్న తమ బ్యాగుల గురించి కాసేపు ఆగిపోయారట. ముఖ్యంగా కొంతమంది అయితే ల్యాప్‌టాప్.. ల్యాప్‌టాప్ అని అరవడం కూడా ఈ ఘటనపై తాజాగా బయటకు వచ్చిన వీడియోలో వినిపించింది. దుబాయ్ విమానాశ్రయంలో కొచ్చి నుంచి వెళ్లిన ఎమిరేట్స్ విమానం క్రాష్ ల్యాండ్ కావడం, అందులోని ప్రయాణికులు అంతా త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడటం తెలిసిందే. ప్రయాణికులు బయటకు రావడానికి ముందు తీసిన ఒక వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రచారం అవుతోంది. ఆ వీడియోలో... ఎమర్జెన్సీ చూట్లు ఉపయోగించి బయటకు వెళ్లిపోవాలని సిబ్బంది గట్టిగా చెప్పడం వినిపించింది. కాసేపటికి విమానం ముక్కలుగా విడిపోవడం, మంటలు రావడం కూడా వీడియోలో ఉంది. విమానంలో మొత్తం 300 మందికి పైగా ఉండగా, చాలామంది కేరళీయులే. పారాచూట్ తీసుకుని స్లైడ్ మీదుగా దూకాలని విమానంలోని మహిళా అటెండెంటు గట్టిగా అరిచి మరీ చెప్పింది. అయినా కూడా ప్రయాణికుల్లో కొంతమంది మాత్రం ప్రాణాలు కాపాడుకోవడం కంటే తమ విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లడానికే ప్రాధాన్యం ఇచ్చారు. -
ఆ నిమిషమే..300 మంది ప్రాణాలు కాపాడింది
-
విమానం క్రాష్ ల్యాండ్.. తప్పిన పెనుముప్పు!
► తిరువనంతపురం-దుబాయ్ విమానానికి తప్పిన ముప్పు ► అత్యవసర ల్యాండింగ్.. దట్టంగా అలుముకున్న పొగలు ► 300 మందిని క్షేమంగా బయటకు పంపిన సహాయక సిబ్బంది ► ప్రయాణికుల్లో 226 మంది భారతీయులే ► కాసేపటికే పేలిన విమానం.. ► అగ్నిమాపక సిబ్బందిలో ఒకరు మృతి.. ► గేర్లు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణం! దుబాయ్: అది ఈకే 521 ఎమిరేట్స్ విమానం.. 282 మంది ప్రయాణికులు.. 18 మంది సిబ్బందితో తిరువనంతపురం నుంచి దుబాయ్ బయల్దేరింది.. ఎయిర్‌పోర్టు వచ్చేసింది.. రన్‌వేపై క్రాష్ ల్యాండ్ అయింది.. ఇంతలో ఒక్కసారిగా దట్టమైన పొగలు.. ప్రయాణికుల గుండెలు జారిపోయాయి.. ఇక అంతే అనుకున్నారు.. కానీ విమానాశ్రయ సిబ్బంది హుటాహుటిన స్పందించారు.. విమానాన్ని చుట్టుముట్టి నిమిషాల వ్యవధిలో అందరినీ దింపేశారు.. వారంతా అలా దిగారో లేదో విమానం భగ్గున మండుతూ పేలిపోయింది.. కొద్ది క్షణాలు ఆలస్యమైనా ఘోర ప్రమాదం జరిగిపోయేది..! ప్రాణాలతో బయటపడ్డామని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నా వారిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది ఒకరు మృతి చెందారు. బుధవారం జరిగిన ఈ హఠాత్పరిణామంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. గేర్లు ఫెయిల్ అయ్యాయా? కేరళలోని తిరువనంతపురం నుంచి ఎమిరేట్స్‌కు చెందిన విమానం (బోయింగ్ 777-300) బుధవారం ఉదయం 10.19 గంటలకు దుబాయ్‌కి బయల్దేరింది. మధ్యాహ్నం 12.50 గంటలకు దుబాయ్‌లో దిగాల్సి ఉంది. ఇందులో ప్రయాణిస్తున్న 282 మంది ప్రయాణికుల్లో ఏడుగురు చిన్న పిల్లలు సహా 74 మంది విదేశీయులు ఉన్నారు. విదేశీయుల్లో బ్రిటన్‌కు చెందినవారు 24 మంది, యూఏఈకు చెందినవారు 11 మంది, అమెరికా, సౌదీ అరేబియాకు చెందినవారు ఆరుగురు చొప్పున ఉన్నారు. మిగతావారిలో ఎక్కువ మంది కేరళకు చెందినవారున్నారు. అసలు ప్రమాదానికి కారణం ఏంటన్నది అధికారికంగా వెల్లడించలేదు. అయితే విమానం దిగే సమయంలో గేర్లు పనిచేయకుండా పోయాయని, ఫలితంగా విమానం రన్‌వేపై జారుకుంటూ పోయిందని, కాసేపటికే పేలిందని స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాదంతో విమానాశ్రయం నిండా దట్టమైన పొగ అలుముకుంది. ఎయిర్‌పోర్టులోని అత్యవసర బృందాలు, అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించి సహాయక చర్యలకు దిగారు. హుటాహుటిన ప్రయాణికులను కిందకు దింపేశారు. ప్రమాదం నుంచి ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా బయటపడ్డారని విమానాశ్రయ వర్గాలు ప్రకటించాయి. అయితే పొగ కారణంగా కొందరు స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. వారిలో 10 మందికి చికిత్స అందించి పంపించారు. పొగ ప్రభావానికి ఎక్కువగా గురి కావడంతో ఒక వ్యక్తిని మాత్రం హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన విమానం ఎమిరేట్స్ సంస్థలో 13 ఏళ్ల నుంచి సర్వీసులు అందిస్తోంది. ప్రమాదం నేపథ్యంలో దుబాయ్ ఎయిర్‌పోర్టు నుంచి మొత్తం 21 విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇందులో రెండు విమానాలు భారత్‌కు రావాల్సినవి కూడా ఉన్నాయి. మరికొన్ని విమానాలను దారి మళ్లించారు. ఒక నిమిషం ఆలస్యమైతే.. ‘‘విమాన ప్రయాణికుల్లో ఎక్కువమంది కేరళవారే. విమానం బయల్దేరిన సమయంలో ఎలాంటి సమస్యా లేదు. సాంకేతిక సమస్య ఉందంటూ ఎలాంటి ప్రకటన చేయలేదు. విమానం ల్యాండ్ అయ్యాక కొద్దిగా ముందుకు కదిలి నేలను ఢీకొంది. విమానంలో పొగ రావడంతో ఏదో అయిందని అర్థమైంది. ఇంకో నిమిషం విమానంలో ఉండుంటే భారీ ప్రమాదం జరిగేది..’’ అని సాయి భాస్కర్ అనే ప్రయాణికుడు వెల్లడించారు. అత్యవసర ద్వారాల నుంచి దూకిన కొందరు ప్రయాణికులు గాయపడ్డారని ఆయన చెప్పారు. తనతో పాటు భార్యా పిల్లలు కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నామని షాజీ అనే మరో ప్రయాణికుడు చెప్పాడు. -
పైలట్ చివర్లో ఆ విషయం చెప్పారు
దుబాయ్: తిరువనంతపురం-దుబాయ్ ఎమిరేట్స్ విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో 300 మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.. బుధవారం దుబాయ్ విమానాశ్రయంలో ఈ విమానం క్రాష్ ల్యాండ్ అయిన దృశ్యాలు చూస్తే ఎంతపెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారో తెలుస్తుంది.. విమానం నుంచి దట్టంగా పొగలు వస్తుండగా అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అయితే ప్రమాదంలో చిక్కుకున్నారన్న విషయం విమాన ప్రయాణికులకు చివరకు వరకు తెలియదట. విమానం క్రాష్ ల్యాండ్ కావడానికి కొన్ని నిమిషాల ముందు పైలట్ ఈ విషయం చెప్పారని ప్రయాణికులు చెప్పారు. విమానం దుబాయ్ దగ్గరకు చేరుకుందని, ల్యాండింగ్ గేర్‌లో సమస్య వచ్చిందని, దీంతో అత్యవసర ల్యాండింగ్ చేస్తున్నట్టు పైలట్ ప్రకటించారని ప్రయాణికులు తెలిపారు. కొన్ని నిమిషాల తర్వాత విమానం ల్యాండ్ అయిందని చెప్పారు. వెంటనే విమానం ఎమర్జెన్సీ డోర్లు అన్నీ తెరిచి నిమిషాల్లో ప్రయాణికులను సురక్షితంగా బయటకుపంపారని తెలిపారు. విమానంలో 282 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బంది ఉండగా, వీరిలో 226 మంది భారతీయులు ఉన్నారు. -
ఎమిరెట్స్ విమానం క్రాష్ ల్యాండ్..!
-
త్రుటిలో తప్పిన విమానాల ఢీ
న్యూఢిల్లీ: అది సోమవారం.. వేకువజాము.. ముంబైపై ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈకే-706 నిండుగా ప్రయాణికులతో వెళుతోంది అదే సమయంలో ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ విమానం ఈవై-622 ఎదురుగా దూసుకొస్తోంది. వాటి మధ్య దూరం కేవలం కొన్ని కిలోమీటర్లే. మరో 25-30 సెకన్లలో అవి ఢీకొని భారీ విధ్వంసం, ప్రాణ నష్టం జరగడం ఖాయం. ఇంతలో ముంబై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సిబ్బంది దీనిని గుర్తించారు. వెంటనే ఒక విమానానికి అత్యవసర సందేశం పంపారు. దీంతో ఆ విమానం దిశ మార్చుకోవడంతో...కొద్ది సెకన్లలో భారీ ప్రమాదం తప్పింది. ఎమిరేట్స్ విమానం దుబాయ్ నుంచి సీషెల్స్‌కు వెళుతుండగా, ఎతిహాద్ విమానం సీషెల్స్ నుంచి అబుదాబి వెళుతోంది. ఈ ఉదంతంపై విచారణ చేపట్టారు. -
పొగమంచుతో విమానాల రాకపోకలకు అంతరాయం
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయాన్ని గురువారం ఉదయం దట్టమైన పొగమంచు కప్పేసింది. దాంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయ అధికారులు దుబాయ్ నుంచి హైదరాబాద్ రావల్సిన ఎమిరేట్స్ ఈకె 524 విమానాన్ని చెన్నైకి మళ్లించారు. అలాగే హైదరాబాద్ నుంచి బయల్దేరాల్సిన పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. మరోవైపు ఎయిర్ ఇండియా విమానం రెండు గంటల ఆలస్యంగా బయలుదేరనుంది. -
విమానంలో మంటలు, తప్పిన ముప్పు
బోస్టన్: దుబాయ్-బోస్టన్ విమానానికి ప్రమాదం తప్పింది. ఇంజిన్ నుంచి వ్యాపించిన మంటలను వెంటనే అదుపు చేయడంతో ముప్పు తప్పింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలు దేరిన ఎమిరేట్స్ బోయింగ్ 777-300 విమానం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో లండన్ లో దిగింది. విమానం కిందకు దిగేసమయంలో ఇంజిన్ నుంచి స్వల్పంగా మంటలు వ్యాపించాయి. వెంటనే స్పందించిన విమానాశ్రయ సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో 349 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. వీరంతా సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. -
ఎమిరేట్స్ విమానం అత్యవసర ల్యాండింగ్
ఆస్ట్రేలియా నుంచి దుబాయ్ వెళ్తున్న ఎమిరేట్స్ విమానం మంగళవారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలోని ఓ ప్రయాణికుడికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆ విషయాన్ని విమాన సిబ్బందికి తెలియజేశాడు. దాంతో వారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులను సంప్రదించారు. విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు ఎమిరేట్స్ విమానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. ఎయిర్‌పోర్ట్‌లో అప్పటికే సిద్ధంగా ఉంచిన అంబులెన్స్‌లో గుండె పోటు వచ్చిన ప్రయాణికుడ్ని నగరంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.