బెర్లిన్ : విమానంలో ప్రయాణించడం.. నిజంగా ఒక అనుభూతి. మేఘాలను తాకుతూ, నీలి గగనాలను అందుకుంటూ గాల్లో తేలియాడుతూ చేసే ప్రయాణంపై అందరికీ మక్కువే. వేల అడుగుల ఎత్తులో ప్రయాణించే లోహ విహంగం చిన్న కుదుపుకు గురయితే.. ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో ప్రమాదాలకు గురయితే.. జరిగే ప్రమాదాన్ని ఊహించలేం.ఘిదిగో సరిగ్గా ఇటువంటి ఘటనే.. ఒకటి జర‍్మనీలో 'సోమవారం జరిగింది.
ఎమిరేట్స్ ఈకే 55 ఫ్లయిట్ మంగళవారం దుబాయ్ నుంచి జర్మనీకి బయలు దేరింది. ఏ380 రకానికి చెందిన ఈ భారీ విమానంలో 600 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణమంతా సుఖంగానే జరిగింది.. జర్మనీ చేరిన ఫ్లయిట్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌కు సిద్ధమవుతోంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి లభించాక రన్ వే మీదకు వచ్చింది. సరిగ్గా ఈ సమయంలోనే శక్తివంతమైన గాలులు విమానాన్ని తాకాయి. ఎంతగా అంటే 600 మంది ప్రయాణికులతో ఉన్న భారీ విమానం.. గాల్లో కదిలిపోయేంతగా గాలులు వీచాయి. రన్ వే మీదకు దిగిన విమానం.. కొన్ని క్షణాల పాటు.. అటూఇటూ..ఊగిపోయింది.
మొత్తానికి పైలెట్ల అనుభవం.. ప్రయాణికుల అదృష్టం కలిసి ఎటవంటి ప్రమాదం లేకుండా విమానం నేలను తాకింది. అయితే ఈ ఘటననంతా ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటివరకూ ఈ వీడియోను 9.9 లక్షల మంది చూశారు.
Comments
Please login to add a commentAdd a comment