
ఎమిరేట్స్ విమానం అత్యవసర ల్యాండింగ్
ఆస్ట్రేలియా నుంచి దుబాయ్ వెళ్తున్న ఎమిరేట్స్ విమానం మంగళవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలోని ఓ ప్రయాణికుడికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆ విషయాన్ని విమాన సిబ్బందికి తెలియజేశాడు. దాంతో వారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులను సంప్రదించారు. విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు ఎమిరేట్స్ విమానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ఎయిర్పోర్ట్లో అప్పటికే సిద్ధంగా ఉంచిన అంబులెన్స్లో గుండె పోటు వచ్చిన ప్రయాణికుడ్ని నగరంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.