ఎయిర్‌ ఏషియా విమానం అత్యవసర ల్యాండింగ్‌ | Air Asia Flight Emergency Landing At Shamshabad Airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ ఏషియా విమానానికి తప్పిన ముప్పు

Published Tue, May 26 2020 5:26 PM | Last Updated on Tue, May 26 2020 5:58 PM

Air Asia Flight Emergency Landing At Shamshabad Airport - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జైపూర్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఎయిర్‌ ఏషియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసరంగా ల్యాండింగ్‌ అయింది. మంగళవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. ఎ-320 విమానం పైలట్‌‌ ఒక ఇంజిన్‌లో ఫ్యూయల్‌ లీకేజీని గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా దానిని నిలిపివేసి.. ఒకే ఇంజిన్‌పై రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండింగ్‌ చేశారు. విమానంలో 76 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎ-320 విమానంలో సాంకేతిక లోపంపై స్పందించిన ఏయిర్‌ ఏషియా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు సహకరిస్తామని తెలిపింది. పైలట్ల‌ చాకచక్యంతో ప్రమాదం తప్పిందని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement