air asia flight
-
ఎ- 320 ఎయిర్ ఏషియా విమానానికి తప్పిన ముప్పు
-
ఎయిర్ ఏషియా విమానం అత్యవసర ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్: జైపూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఏషియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. మంగళవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. ఎ-320 విమానం పైలట్ ఒక ఇంజిన్‌లో ఫ్యూయల్ లీకేజీని గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా దానిని నిలిపివేసి.. ఒకే ఇంజిన్‌పై రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో 76 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎ-320 విమానంలో సాంకేతిక లోపంపై స్పందించిన ఏయిర్ ఏషియా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు సహకరిస్తామని తెలిపింది. పైలట్ల చాకచక్యంతో ప్రమాదం తప్పిందని పేర్కొంది. -
విమానం పేలుస్తానని మహిళ బెదిరింపు
కోల్‌కతా: బాంబులతో విమానాన్ని పేలుస్తానని ఓ ప్రయాణికురాలు బెదిరించడంతో ముంబైకి వెళ్తున్న విమానం వెనుదిరిగి కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకుంది. 114 మంది ప్రయాణికులతో ఉన్న ఎయి ర్ ఏషియా విమానం శనివారం రాత్రి 9.57 గంటలకు కోల్‌కతా విమానాశ్రయం నుంచి బయలుదేరింది. కొద్దిసేపటికే అందులోని ఓ ప్రయాణికురాలు విమాన సిబ్బ ందికి ఓ నోట్‌ను అందించింది. తన వద్ద బాం బులున్నాయని, వాటిని పేల్చేస్తానని అందులో ఉంది. పైలట్ వెంటనే విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)కి చేరవేశారు. ఏటీ సీ ఆదేశాల మేరకు విమానాన్ని తిరిగి కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చాడు. ఆమె వద్ద కానీ, విమానంలో కానీ ఎక్కడా బాంబులు లేవని సోదాల అనంతరం భద్రతాధికారులు నిర్ధారించారు. ఆ ప్రయాణికురాలు మత్తులో ఉన్నట్లు తేలిందని తెలిపారు. -
విమానం టాయిలెట్లో మృతపిండం
న్యూఢిల్లీ: గువాహటి నుంచి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఏసియా విమానం టాయిలెట్లో మృత పిండం కనిపించడం ప్రయాణికులను విస్మయానికి గురిచేసింది. పిండం వయసు దాదాపు ఆరు నెలలు ఉండొచ్చని సమాచారం. విమాన టాయిలెట్లో పేపర్లలో చుట్టి ఉన్న పిండాన్ని గమనించిన సిబ్బంది.. ఈ పని ఎవరు చేశారో చెప్పాలంటూ మహిళా ప్రయాణికులను ప్రశ్నిస్తుండగా తనకు గర్భస్రావం అయినట్లు 19 ఏళ్ల వయసున్న తైక్వాండో క్రీడాకారిణి వెల్లడించింది. ఆమె ఓ టోర్నమెంట్ కోసం గురువారం తన కోచ్‌తో కలసి దక్షిణ కొరియా వెళ్లాల్సి ఉంది. టాయిలెట్లో సిబ్బంది సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా, పిండం కనిపించిందని ఎయిర్ ఏసియా అధికారులు తెలిపారు. పోలీసులు పిండాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి, క్రీడాకారిణికి ఆసుపత్రిలో చికిత్స ఇప్పిస్తున్నారు. అయితే ఆమె గర్భంతో ఉన్న విషయమే తనకు తెలియదనీ, విమానమెక్కే ముందు విమానయాన సంస్థకు సమర్పించిన వివరాల్లోనూ ఈ విషయం లేదని ఆమె కోచ్ చెప్పారు. -
ఇవే చివరి క్షణాలనుకున్నాం..!
సిడ్నీ: దాదాపు 32 వేల అడుగు ఎత్తులో ప్రయాణిస్తున్న ఆ విమానం ఒక్కసారిగా 10 వేల అడుగులు నిట్టనిలువుగా కిందకు దూసుకెళ్లడంతో సిబ్బంది, అందులోని ప్రయాణికులు మృత్యుభయంతో వణికిపోయారు. కిందకు దూసుకెళ్లిన వేగానికి క్యాబిన్లో పీడనం తగ్గడంతో సీలింగ్ నుంచి ఆక్సిజన్ మాస్కులు కిందకు పడడం వారి భయాన్ని రెట్టింపు చేసింది. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కొందరు హాహాకారాలు .. మరికొందరు ప్రార్థనలు మొదలుపెట్టారు. విపత్తు సమయంలో ధైర్యం చెప్పాల్సిన సిబ్బందే చేతులెత్తేయడంతో ప్రయాణికులు ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. కొందరు ఆక్సిజన్ మాస్క్‌లు ధరించి కుర్చీల్లో బిగుసుకుపోయారు. చివరి క్షణాలివేనన్న నిర్ధారణకు వచ్చారు. ఆదివారం ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి 151 మందితో ఇండోనేసియా బయల్దేరిన ఎయిర్ ఏసియా విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఫైలట్ చాకచక్యంతో విమానాన్ని దగ్గరిలోని పెర్త్ నగరంలో దించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానం టేకాఫ్ అయిన 25 నిమిషాల అనంతరం ఈ సంఘటన జరిగింది. దీని పట్ల ఏయిర్ ఏసియా క్షమాపణలు చెప్పింది. ఒక ప్రయాణికురాలు ఆ భయంకర అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ‘చివరి సారిగా నా ఫోన్ నుంచి ఇంటికి మెసేజ్ పంపాను. మేమందరం దాదాపుగా ఒకరికొకరు గుడ్‌బై చెప్పుకున్నాం’ అని చెప్పారు. -
మలేసియా వెళ్లాల్సిన విమానం మెల్ బోర్న్ వెళ్లింది!
సిడ్నీ: సిడ్నీ నగరం నుంచి మలేసియాకు బయల్దేరిన ఎయిర్ ఏషియా ఎక్స్ విమానం పైలట్ తప్పిదంతో వేరే ప్రాంతంలో ల్యాండ్ అయింది. విమానంలో సరైన ప్రాంతంలో పైలట్ కూర్చొకపోవడమే ఇందుకు ప్రధానకారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు.. విమానాన్ని కౌలాలంపూర్ వైపు మలిచే సమయంలో గాలి ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు విమానం తప్పుదోవలో వెళ్తున్నట్లు హెచ్చరికలు జారీ చేశాయని తెలిపారు. సిబ్బంది సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయగా పరిస్థితి మరింత జఠిలమైనట్లు వివరించారు. దీంతో పైలట్ విమానాన్ని మెల్ బోర్న్ లో ల్యాండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ మేనేజ్ మెంట్ సిస్టం, గైడెన్స్ సిస్టంలలో తప్పిదాల కారణంగానే ఇలా జరిగిందని చెప్పారు. సిబ్బంది తప్పిదాలను సరిదిద్దే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు. ఈ విషయాన్ని ఎయిర్ ఏషియా మిగతా పైలట్లతో పంచుకుందని వెల్లడించారు. దీని ద్వారా కొత్త తరహా ట్రైనింగ్ మాడ్యూల్ ను కూడా అభివృద్ధి చేసుకున్నట్లు వివరించారు. -
మలేషియా - విశాఖ: డైరెక్ట్ విమానం!
చవక విమానయానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఎయిర్ ఏషియా సంస్థ ఇప్పుడు నేరుగా విశాఖపట్నం నుంచి మలేషియాకు, అటు నుంచి ఇటు విమానాలు నడపడం ప్రారంభించనుంది. వారానికి మూడుసార్లు ఈ విమానాలు నడుస్తాయి. మే 7వ తేదీన ఈ విమానాల రాకపోకలు మొదలవుతాయి. దీంతోపాటు మరో రెండు మార్గాల్లో కూడా విమానాలు నడుస్తాయి. కౌలాలంపూర్ నుంచి విశాఖపట్నానికి రూ. 4వేలకే టికెట్ అంటూ ప్రమోషనల్ ఆఫర్‌ను ఎయిరేషియా ప్రకటించింది. మే 7 నుంచి 2016 మార్చి 26 వరకు చేసే ప్రయాణాలకు మంగళవారం నుంచి మార్చి 22 వరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. -
ఎయిర్ ఏసియా బ్లాక్ బాక్స్ స్వాధీనం
జావా సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఏషియా విమానం బ్లాక్ బాక్సును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని విచారణ నిమిత్తం పంపినట్లు సార్ (ఎస్ఏఆర్) ఆపరేషన్స్ డైరెక్టర్ సుప్రియాది తెలిపారు. జాతీయ రవాణా భద్రతా కమిటీ చీఫ్ ద్వారా సమాచారం అందిందని, బ్లాక్ బాక్స్ తన చుట్టూ 20 మీటర్ల పరిధిలో జరిగిన విషయాలను రికార్డు చేస్తుందని ఆయన చెప్పారు. బ్లాకు బాక్సులో డాటా రికార్డర్, వాయిస్ రికార్డర్ అనే రెండు విభాగాలు ఉంటాయి. బాక్సుల బ్యాటరీల్లో 30 రోజుల వరకు సమాచారం నిల్వ ఉంటుంది. విమానం తోక భాగంలో ఉండే బ్లాక్ బాక్స్ లో పైలట్ల సంభాషణలు, ఇతర సమాచారం రికార్డు అవుతాయి. కనుక ప్రమాద వివరాలు త్వరలోనే వెలుగు చూస్తాయని అధికారులు భావిస్తున్నారు. విమానంలో ఉన్న మొత్తం 162 మంది ప్రయాణికుల్లో ఇంతవరకు 48 మంది మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాల ఆచూకీ కనుగొనేందుకు ఇండొనేషియా రవాణా మంత్రి ఇగ్నేసియస్ జోనన్ నిధులను కేటాయించారు. -
ఎయిర్ ఏషియా విమాన ప్రమాదం