విమానంలో ఆమె ఎంత పనిచేసింది! | Passengers spot flight attendant pouring champagne BACK into the bottle | Sakshi
Sakshi News home page

విమానంలో ఆమె ఎంత పనిచేసింది!

Published Fri, Jul 14 2017 5:14 PM | Last Updated on Tue, Sep 5 2017 4:02 PM

విమానంలో ఆమె ఎంత పనిచేసింది!

విమానంలో ఆమె ఎంత పనిచేసింది!

మాస్కో: అనూహ్య దృశ్యం మొబైల్‌ కెమెరా కంటపడింది. ఓ బోయింగ్‌ విమానంలో బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణిస్తున్న వ్యక్తి సరదాగా తన ఫోన్‌తో చుట్టూ వీడియో తీస్తుండగా షాకింగ్‌ ఘటన దానికి చిక్కింది. ఎవరో తాగి మిగిల్చిన మద్యాన్ని విమాన సిబ్బందికి చెందిన మహిళా సహాయకురాలు ఒకరు తిరిగి బాటిల్‌లో నింపుతున్న దృశ్యం అందులో రికార్డయింది. ఆ దృశ్యాన్ని అతడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా పెద్ద మొత్తంలో వైరల్‌ అయింది. చూసేందుకే చాలా ఏవగింపు కలిగిస్తోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. యెజెనీ కేయుమోవ్‌ అనే వ్యక్తి రష్యా నుంచి దుబాయ్‌కి ఎమిరేట్స్‌ ఏ 380 అనే విమానంలో బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో తన మొబైల్‌ కెమెరాతో విమానంలో కూర్చొని చుట్టూ వీడియో తీశాడు. అదే సమయంలో ఆయన వెనుకాలే ఉన్న చాంబర్‌లో తాగి వదిలేసిన మద్యాన్ని తిరిగి బాటిల్‌ నింపుతున్న దృశ్యం రికార్డయింది. దీనిని సదరు వ్యక్తి ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా హవ్వా ఎమిరేట్స్‌ సంస్థ ఇలా ఎప్పటి నుంచి చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి పనిచేస్తున్న సిబ్బందిని కచ్చితంగా హెచ్చరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement