ఎన్నో సవాళ్ళను అధిగమించి ఎడిల్‌వీస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ & సీఈఓ స్థాయికి ఎదిగిన 'రాధికా గుప్తా' పెట్టుబడికి సంబంధించిన విషయాలను గురించి చెబుతూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ఒక ఈవెంట్‌లో పాల్గొన్న ఈమె, మహిళల ఆర్ధిక సామర్థ్యాన్ని వివరిస్తూ.. వారు మారాల్సిన సమయం వచ్చిందని అన్నారు.
మహిళలు చాలా కాలంగా తమ కుటుంబాలకు ఆర్థిక సారథులుగా ఉన్నారు. కానీ చాలా మంది ఇప్పటికీ సొంత పెట్టుబడులకు సంబంధించిన బాధ్యత తీసుకోవడానికి మాత్రమే వెనుకాడుతున్నారని రాధికా గుప్తా పేర్కొన్నారు. పొదుపు విషయంలో ఆరితేరిన మహిళలు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని గురించి వివరించారు.
అమ్మలు, అమ్మమ్మలు.. ఇలా తరాలుగా ఇళ్లకు సీఎఫ్ఓలుగా వ్యవహరిస్తున్నారు. ఈ విధానం మారాలి. డబ్బు నిర్వహణకు పురుషులకు అవుట్‌సోర్సింగ్ చేయడం ఆపేయండి. పొదుపుచేసే వారి నుంచి పెట్టుబడిదారులుగా మారండి. ఇది కష్టమైన పని కాదు. సవాళ్లు ఎదుర్కుంటేనే.. జీవితంలో ఉన్నతస్థాయికి చేరుతారని చెబుతూ.. సవాళ్లు బయట నుంచి రావు. మనం అంతర్గతంగా ఎదుర్కొనేదే అతి పెద్ద సవాలు అని రాధికా గుప్తా అన్నారు.
ఇదీ చదవండి: రెండో ఆదాయంపై కన్నేసిన సినీతారలు: అందరి చూపు అటువైపే..
మీపై మీరు నమ్మకాన్ని ఉంచుకోండి, మీ ఆలోచనలకు కార్యరూపం దాల్చండి అని.. ఆమె మహిళలకు సూచనలు చేశారు. మహిళలు సహజంగా మల్టీటాస్కింగ్ చేయగల సమర్థులు. ఇంట్లోనే భార్యగా, తల్లిగా, కోడలిగా ఇలా ఎన్నో బాధ్యతలను నిర్వరించే మహిళ.. అన్ని రంగాల్లోనూ సులభంగా రాణించగలదని రాధికా గుప్తా వెల్లడించారు. ఇకపోతే రాధికా గుప్తా సారథ్యంలో ఎడెల్‌వీస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2017 మార్చిలో రూ. 6,500 కోట్లుగా ఉన్న కంపెనీ అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ జూలై 2024 నాటికి రూ. 1.40 లక్షల కోట్లకు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment