edelweiss mutual fund company
-
మహిళలు ఇలా మారాలి: రాధికా గుప్తా సూచనలు
ఎన్నో సవాళ్ళను అధిగమించి ఎడిల్వీస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ & సీఈఓ స్థాయికి ఎదిగిన 'రాధికా గుప్తా' పెట్టుబడికి సంబంధించిన విషయాలను గురించి చెబుతూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ఒక ఈవెంట్లో పాల్గొన్న ఈమె, మహిళల ఆర్ధిక సామర్థ్యాన్ని వివరిస్తూ.. వారు మారాల్సిన సమయం వచ్చిందని అన్నారు.మహిళలు చాలా కాలంగా తమ కుటుంబాలకు ఆర్థిక సారథులుగా ఉన్నారు. కానీ చాలా మంది ఇప్పటికీ సొంత పెట్టుబడులకు సంబంధించిన బాధ్యత తీసుకోవడానికి మాత్రమే వెనుకాడుతున్నారని రాధికా గుప్తా పేర్కొన్నారు. పొదుపు విషయంలో ఆరితేరిన మహిళలు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని గురించి వివరించారు.అమ్మలు, అమ్మమ్మలు.. ఇలా తరాలుగా ఇళ్లకు సీఎఫ్ఓలుగా వ్యవహరిస్తున్నారు. ఈ విధానం మారాలి. డబ్బు నిర్వహణకు పురుషులకు అవుట్సోర్సింగ్ చేయడం ఆపేయండి. పొదుపుచేసే వారి నుంచి పెట్టుబడిదారులుగా మారండి. ఇది కష్టమైన పని కాదు. సవాళ్లు ఎదుర్కుంటేనే.. జీవితంలో ఉన్నతస్థాయికి చేరుతారని చెబుతూ.. సవాళ్లు బయట నుంచి రావు. మనం అంతర్గతంగా ఎదుర్కొనేదే అతి పెద్ద సవాలు అని రాధికా గుప్తా అన్నారు.ఇదీ చదవండి: రెండో ఆదాయంపై కన్నేసిన సినీతారలు: అందరి చూపు అటువైపే..మీపై మీరు నమ్మకాన్ని ఉంచుకోండి, మీ ఆలోచనలకు కార్యరూపం దాల్చండి అని.. ఆమె మహిళలకు సూచనలు చేశారు. మహిళలు సహజంగా మల్టీటాస్కింగ్ చేయగల సమర్థులు. ఇంట్లోనే భార్యగా, తల్లిగా, కోడలిగా ఇలా ఎన్నో బాధ్యతలను నిర్వరించే మహిళ.. అన్ని రంగాల్లోనూ సులభంగా రాణించగలదని రాధికా గుప్తా వెల్లడించారు. ఇకపోతే రాధికా గుప్తా సారథ్యంలో ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2017 మార్చిలో రూ. 6,500 కోట్లుగా ఉన్న కంపెనీ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ జూలై 2024 నాటికి రూ. 1.40 లక్షల కోట్లకు పెరిగింది. -
అందుకే లగ్జరీ కారు కొనలేదు: ఎడెల్వీస్ సీఈఓ
నెలకు లక్ష రూపాయలు సంపాదించేవారు కూడా ఓ ఖరీదైన కారు కొనేస్తున్నారు. అయితే కోట్ల రూపాయల డబ్బు ఉన్నప్పటికీ లగ్జరీ కారు కొనుగోలు చేయని వారు ఇప్పటికీ చాలామందే ఉన్నారు. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ అండ్ ఎండీ 'రాధికా గుప్తా'.రాధికా గుప్తా ఎందుకు లగ్జరీ కారును కొనుగోలు చేయలేదు అనే ప్రశ్నకు ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు. బోనస్ పొందిన ప్రతిసారీ.. లగ్జరీ కారును కొనొచ్చు. కానీ కారు అనేది విలువ తగ్గిపోయే ఆస్తి. ఒక కారును కొనుగోలు చేసి మళ్ళీ విక్రయించాలంటే సుమారు 30 శాతం నష్టాన్ని చూడాల్సి వస్తుంది. కాబట్టి విలువ తగ్గిపోయే ఆస్తి మీద నేను పెట్టుబడి పెట్టను అని ఆమె వెల్లడించారు.ఇదీ చదవండి: రాత్రిని పగలుగా మార్చేయండిలా.. తాను జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. ఎన్నో సంఘటనల ద్వారా పాఠాలు నేర్చుకున్నట్లు వివరించారు. 18 ఏళ్ల వయసులో కాలేజీ చదువు పూర్తయినప్పుడు.. చాలామంది మీ దగ్గర ఫ్యాన్సీ బ్యాగ్ లేదా అని అడిగారు. ఆ మాటలు నన్ను కొంత బాధించాయి. ఇప్పుడు కూడా ఎందుకు ఇన్నోవా ఉపయోగిస్తున్నావు? అని అడుగుతున్నారు. కానీ నా జీవితం.. నా ఇష్టం. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని స్పష్టం చేసారు. -
అస్సలు బాధపడకండి..! వ్యాపారవేత్త రాధిక గుప్తా సలహా!
ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈవో రాధికా గుప్తా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పుట్టుకతోనే శారీరక లోపంతో పుట్టి, అనేక రకాల అవహేళనలను ఎదుర్కొంది. డెలివరీ సమయంలో చిన్న సమస్య కారణంగా రాధిక మెడ కొద్దిగా వంగింది. అంతేకాకుండా ఒక కంటిలో లోపం ఏర్పడింది. అయినా అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవడమే కాదు విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. (పిల్లి కోసం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత) పెన్సిల్వేనియాలో కంప్యూటర్సైన్స్లో పట్టభద్రురాలైన రాధిక ఉద్యోగం కోసం ప్రయత్నించగా దాదాపు 7 సార్లు రిజెక్ట్ అయిందనీ, దీంతో ఆత్మహత్య చేసు కోవాలనే ఆలోచన కూడా వచ్చిందని స్వయంగా రాధిక ఒకసారి చెప్పారు. దీంతో ఏదైనా సాధించాలనే పట్టుదలతో భర్త, స్నేహితులతో కలిసి ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీని ప్రారంభించింది. కొనేళ్లకు ఈ కంపెనీని ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ ఆల్టర్నేటివ్ ఈక్విటీకి చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్‌గా ఉన్నారు, ఆమె భర్త నలిన్ మోనిజ్. వీరికి 2022లోఒక కుమారుడుపుట్టాడు. View this post on Instagram A post shared by Radhika Gupta (@iamradhikagupta) షార్క్ ట్యాంక్ ఇండియా-3లో న్యాయనిర్ణేతగా ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అండగా నిలుస్తున్నారు. అంట్రప్రెన్యూర్స్ ఎకోప్రెన్యూర్స్ ఫ్యాషన్ సస్టైనబుల్ ఉండటమేకాదు అందంగా సౌకర్యవంతంగా ఉంటుంది.. అరటి, పైనాపిల్, జనపనార ఆకులు, కాండంతో డెనిమ్స్, టీ షర్టులు చీరలు రూపొందించే సంస్థలో పెట్టు బడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అలాగే మండే మోటివేషన్ అంటూఇన్స్టాలో ముఖ్యంగా ఉద్యోగం చేసే తల్లుల కోసం కొన్ని సలహాలు సూచనలు అందించారు. ఈ సందర్బంగా తన తల్లి ఇచ్చిన విలువైన సలహాను ఆమె పంచుకున్నారు. తన చేతుల్లో తన బిడ్డను పట్టుకున్న ఫోటోను పోస్ట్ చేసిన ఆమె ఉద్యోగినులుగా పనిలో తలమునకలై పిల్లల గురించి, మీ గురించి పట్టించు కోలేకపోతున్నామని బాధపడుతున్నారా.. దీన్ని గుర్తుంచుకోండి అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. మాతృత్వ బాధ్యతలతో పాటు కెరీర్‌ను బ్యాలెన్స్ చేయడం కష్టతరమైందే కానీ..దేనికీ బాధపడాల్సిన అవసరం లేదు.. జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ, కరియర్‌ను కొనసాగించా లన్నారు. ‘‘ఏ తల్లీ చెడ్డ తల్లి కాదని అమ్మ చెప్పింది. పదవారు, ధనవంతులు, విద్యావంతులు, చదువుకోనివారు, పని చేసేవారు, పని చేయకనివారు.. ఇలా ఎవరైనా అమ్మ అమ్మే.. ప్రతీ తల్లి తన బిడ్డకు మంచి చేయాలనే కోరుకుంటుంది’’ రాధిక గుప్తా అలాగే అటు తల్లి, ఇటు వ్యాపారవేత్తగా ఉంటూనే, రియాలిటీ షోలను కూడా ఎలా మేనేజ్ చేస్తున్నదీ గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆమె వివరించారు. తాను ఎక్కడికి వెళ్లినా, ప్రెపెస కాన్ఫరెన్స్‌లలో కూడా కుమారుడు తనతో పాటు ఉంటాడని, షార్క్ ట్యాంక్సెట్లలో ఎక్కువ సమయం ఉంటాడని కూడా వెల్లడించా రామె. మాతృత్వం మహిళల సవాళ్లను స్వీకరించే సామర్థ్యానికి అడ్డుకోకూడదని తాను భావిస్తానన్నారు. మహిళలకు పెళ్లి, పిల్లలు తరువాత కరియర్లో బ్రేక్ వస్తుంది. ప్రసూతి సెలవు తరువాత మళ్లీ ఉద్యోగంలోకి రావడం అనేది మానసికంగా కొంత ఇబ్బంది కరమైన పరిస్థితే. పసిబిడ్డల్ని వదిలి వెళుతున్నామనే బాధ ఒకవైపు, ఉద్యోగంలో రాణించాలనే ఒక పట్టుదల ఒకవైపు వారిని స్థిరంగా ఉండనీయవు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో కొంతమంది తల్లులు ఉద్యోగాలకు దూరమవుతున్నారు. -
అంతర్జాతీయ పెట్టుబడులకు ద్వారాలు
న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ఫండ్స్‌కు సంబంధించి తాజా పెట్టుబడులను పలు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అనుమతిస్తున్నాయి. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్, మిరే అస్సెట్ మ్యూచువల్ ఫండ్, ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ ఇలా అనుమతించిన వాటిల్లో ఉన్నాయి. ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ ఏడు అంతర్జాతీయ పథకాలను నిర్వహిస్తుండగా, అన్నింటిలోకి చందాలను సోమవారం నుంచి స్వీకరిస్తోంది. స్విచ్ ఇన్ లేదా లంప్సమ్ లావాదేవీలను అనుమతిస్తోంది. డెట్ మ్యూచువల్ ఫండ్‌పై పన్ను ప్రయోజనాలు ఏప్రిల్ 1 నుంచి మారిపోతున్నాయి. దీంతో మార్చి 31లోపు ప్రస్తుత పన్ను ప్రయోజనం నుంచి లబ్ధి పొందాలనుకునే వారికి అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టు ఎడెల్వీజ్ ఏఎంసీ ప్రొడక్ట్ హెడ్ నిరంజన్ అవస్థి తెలిపారు. ఇక మిరే అస్సెట్ మ్యూచువల్ ఫండ్ మూడు ఇంటర్నేషనల్ ఈటీఎఫ్‌లు, వీటికి సంబంధించిన ఫండ్ ఆఫ్ ఫండ్‌ల్లోకి లంప్సమ్ పెట్టబడులను మార్చి 27 నుంచి అనుమతిస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుత సిప్‌లు, సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ)లను సైతం మార్చి 29 నుంచి తెరుస్తున్నట్టు.. తాజా సిప్‌లు, ఎస్టీపీలను మాత్రం అనుమతించడం లేదని స్పష్టం చేసింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మూడు విదేశీ మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి లంప్సమ్ పెట్టుబడులను అనుమతిస్తోంది. పరిమితులు.. ‘‘తాజా పెట్టుబడుల స్వీకరణకు సంబంధించి పరిమితులు ఉన్నాయి. సెబీ విదేశీ పెట్టుబడుల పరిమితులకు అనుగుణంగా ఈ పథకాల్లో తిరిగి భవిష్యత్తులోనూ పెట్టుబడులను నిలిపివేయవచ్చు’’ అని మిరే అస్సెట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఈటీఎఫ్ హెడ్ సిద్ధార్థ శ్రీవాస్తవ తెలిపారు. విదేశీ స్టాక్స్‌లో దేశీ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ 7 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు సెబీ పరిమితి విధించింది. గతేడాది జనవరి నాటికి ఫండ్స్ మొత్తం పెట్టుబడులు ఈ పరిమితికి చేరడంతో తాజా పెట్టుబడులు స్వీకరించొద్దని ఆదేశించింది. 2022 జూన్‌లో తాజా పెట్టుబడులకు మళ్లీ అనుమతించింది. -
దీర్ఘకాలిక పెట్టుబడులకు చాన్స్!
న్యూఢిల్లీ: దీర్ఘకాలిక పెట్టుబడులకు వీలు కల్పిస్తున్న భారత్ మొట్టమొదటి కార్పొరేట్ బాండ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్– భారత్ బాండ్ ఈటీఎఫ్ నాల్గవ విడతను ప్రభుత్వం శుక్రవారం నుండి ప్రారంభించనుంది. ఈటీఎఫ్ కొత్త ఫండ్ ఆఫర్ డిసెంబర్ 2న ప్రారంభమవుతుందని, డిసెంబర్ 8న సబ్‌స్క్రిప్షన్‌కు గడువు ముగుస్తుందని ఫండ్‌ను నిర్వహించే ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. సేకరించిన నిధులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) మూలధన వ్యయాల కోసం వినియోగిస్తారు. రూ.4,000 కోట్ల వరకూ సమీకణ.. ఈ కొత్త భారత్ బాండ్ ఈటీఎఫ్ ఏప్రిల్ 2033లో మెచ్యూర్ అవుతుంది. నాల్గవ విడతలో ఈ కొత్త సిరీస్ ద్వారా, రూ. 4,000 కోట్ల గ్రీన్ షూ ఎంపికతో (ఓవర్ అలాట్ మెంట్ ఆఫర్) రూ. 1,000 కోట్ల ప్రారంభ మొత్తాన్ని సేకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వం మూడో విడతను రూ. 1,000 కోట్ల బేస్ ఇష్యూ పరిమాణంతో ప్రారంభించింది. 6,200 కోట్ల విలువైన బిడ్లు రావడంతో ఇది 6.2 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ అయింది. భారత్ బాండ్ ఈటీఎఫ్ 2019లో ప్రారంభమైంది. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రూ. 12,400 కోట్లను సమీకరించడంలో సహాయపడింది. రెండు, మూడో విడతల్లో వరుసగా రూ.11,000 కోట్లు, రూ.6,200 కోట్ల సమీకరణలు జరిగాయి. ఈటీఎఫ్ తన మూడు ఆఫర్లలో ఇప్పటివరకు రూ.29,600 కోట్లు సమీకరించింది. మరిన్ని విశేషాలు ఇవీ.. ► భారత్ బాండ్ ఈటీఎఫ్ ప్రభుత్వ రంగ కంపెనీల ‘ఎఎఎ’ రేటెడ్ బాండ్లలో మాత్రమే పెట్టుబడి పెడుతుంది. ► 2019లో ప్రారంభించినప్పటి నుండి, ఈటీఎఫ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ (ఏయూఎం) విలువ రూ. 50,000 కోట్ల మార్కును దాటింది. ► ఇప్పటివరకు, భారత్ బాండ్ ఈటీఎఫ్ ఐదు మెచ్యూరిటీలతో ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరాలు వరుసగా 2023, 2025, 2030, 2031, 2032గా ఉన్నాయి. డిసెంబర్ 2 నుంచి ప్రారంభం కానున్న ఇష్యూకు మెచ్యూరిటీ సమయం 2033 ఏప్రిల్. భారీ స్పందన.. భారత్ బాండ్ ఈటీఎఫ్ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి అన్ని వర్గాల పెట్టుబడిదారుల నుండి మంచి ప్రతిస్పందనను సంపాదించింది. భారత్ బాండ్ ప్రభుత్వ రంగ సంస్థల బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి, భారతదేశ వృద్ధి బాటకు పటిష్టత ఇవ్వడానికి పెట్టుబడిదారులందరికీ ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని సృష్టించింది – తుహిన్ కాంత పాండే, దీపం కార్యదర్శి లక్ష్యాల ప్రకారం.. మెచ్యూరిటీ ఎంపిక ఎడెల్వీస్ మూచువల్ ఫండ్ భారత్ బాండ్ ఈటీఎఫ్‌ను ప్రారంభించిన తర్వాత టార్గెట్ (లక్ష్యాలకు అనుగుణంగా) మెచ్యూరిటీ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టే వర్గం ఉత్సాహభరిత రీతిలో వేగంతో పెరుగుతోంది. దీర్ఘకాలిక రుణంలో పెట్టుబడులకు ఈ ఫండ్ సౌలభ్యంగా ఉంది. భారత్ బాండ్ ఈటీఎఫ్ ఇప్పుడు ఆరు మెచ్యూరిటీలను కలిగి ఉంది. 2023 నుండి 2033 వరకు పెట్టుబడిదారులు తమ పెట్టుబడి లక్ష్యాల ప్రకారం సరైన మెచ్యూరిటీని ఎంచుకోవడానికి ఇది వీలు కల్పిస్తోంది. – రాధికా గుప్తా, ఎడెల్వీస్ ఫండ్ ఎండీ, సీఈఓ -
భారత్ బాండ్ ఈటీఎఫ్ హవా: రెండేళ్లలో అనూహ్య వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ బాండ్ ఈటీఎఫ్‌ల పరిధిలోని నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) రెండున్నరేళ్లలోనే రికార్డు స్థాయికి చేరాయి. రూ.50,000 కోట్ల మార్క్‌ను అధిగమించాయి. వీటి నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ ఈ వివరాలను ప్రకటించింది. 2019 డిసెంబర్లో భారత్ బాండ్ ఈటీఎఫ్ మొదటి విడత ఇష్యూ రావడం గమనార్హం. అప్పటి నుంచి ఐదు ఇష్యూలు పూర్తయ్యాయి. వీటి మెచ్యూరిటీ 2023, 2025, 2030, 2031, 2031లో తీరనుంది. ‘‘ప్రభుత్వరంగ సంస్థల ఆర్థిక బలం, ఇన్వెస్టర్లలో వాటి పట్ల ఉన్న విశ్వాసానికి భారత్ బాండ్ ఈటీఎఫ్‌ల విజయం నిదర్శనం. మన తొలి డెట్ ఈటీఎఫ్ అద్భుత విజయం సాధించడం పట్ల సంతోషంగా ఉంది’’అని కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో పనిచేసే దీపమ్ కార్యదర్శి తుహిన్‌కాంత పాండే తెలిపారు. ఏఏఏ రెటెడ్ కలిగిన ప్రభుత్వరంగ కంపెనీలతో కూడిన నిఫ్టీ భారత్ బాండ్ సూచీల్లో భారత్ బాండ్ ఈటీఎఫ్‌లు ఇన్వెస్ట్ చేస్తాయి. భారత్ బాండ్ ఈటీఎఫ్‌ల ఘన విజయంతో ఇతర అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు 2019 తర్వాత సుమారు 30 వరకు టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్‌ను తీసుకు రావడం గమనార్హం. ప్యాసివ్ డెట్ విభాగంలో రూ.60వేల కోట్ల ఏయూఎంతో ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ అగ్రగామిగా చేరుకోవడానికి భారత్ బాండ్ ఈటీఎఫ్‌లు దోహదపడ్డాయి. -
ఎడెల్వీస్ నుంచి 2 టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్
ఎడెల్వీస్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ కొత్తగా మరో రెండు టార్గెట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్స్‌ను ఆవిష్కరించింది. క్రిసిల్ ఐబీఎక్స్ 50:50 గిల్ట్ ప్లస్ ఎస్డీఎల్ ఏప్రిల్ 2037 ఇండెక్స్ ఫండ్‌తో పాటు 2027 జూన్‌లో మెచ్యూర్ అయ్యే ఫండ్ వీటిలో ఉన్నాయి. ఈ తరహా ఫండ్స్‌లో 15 ఏళ్ల సుదీర్ఘ మెచ్యూరిటీతో ఫండ్‌ను ప్రవేశపెట్టడం దేశీయంగా ఇదే ప్రథమమని సంస్థ ఎండీ రాధికా గుప్తా తెలిపారు. ఈ ఫండ్లు ప్రధానంగా భారత ప్రభుత్వ బాండ్లు (ఐజీబీ), రాష్ట్ర అభివృద్ధి రుణాల్లో (ఎస్డీఎల్) ఇన్వెస్ట్ చేస్తాయి. 2037 ఇండెక్స్ ఫండ్ అక్టోబర్ 6న, 2027 ఇండెక్స్ ఫండ్ అక్టోబర్ 11న ముగుస్తాయి. రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. -
అడుగడుగనా అవమానాలే.. అన్నిచోట్ల తిరస్కరణే.. కానీ ఇప్పుడు
దేశ చరిత్రలో అతి పిన్న వయస్సులో ఓ కార్పొరేట్ కంపెనీకి సీఈవోగా నియమితులైన మహిళగా సంచలనం సృష్టించారు రాధిక గుప్తా. స్టాక్‌మార్కెట్ సర్వీసెస్ అందించే ఎడిల్వైజ్ ఎంఎఫ్ సంస్థకు సీఈవోగా ఎన్నికైనప్పుడు ఆమె వయస్సు కేవలం 33 ఏళ్లు. ఇలాంటి అదృష్టం ఉండాలంటే ఎంతో పెట్టిపుట్టాలని అనుకుంటారు. రాధిక గుప్తా కూడా అలాగే పెట్టి పుట్టింది అయితే అందం, ఐశ్వర్యంతో కాదు అవమనాలు, అవకరణాలతో ఆమె పుట్టి పెరిగింది. జీవితంలో తొలి అడుగు నుంచి ఎదురవుతున్న అవమానాలు ఎదుర్కొంటూ ఆమె సాగిస్తున్న విజయ ప్రస్థానం... రాధికగుప్తా తండ్రి విదేశీ సర్వీసుల్లో పని చేశారు. రాధిక గుప్త తల్లి గొప్ప అందగత్తె, స్కూల్ టీచరుగా పని చేసే వారు. తండ్రి వృత్తిరీత్యా రాధిక బాల్యం, విద్యాభాస్యం అంతా ఢిల్లీ , పాకిస్తాన్, అమెరికా, నైజీరియాలలో జరిగింది. కానీ రాధికకు పుట్టుకతోనే మెడలు కొంచె వంకరగా ఉండేవి. మాట్లాడుతున్నప్పుడు, కదులుతున్నప్పుడు అబ్నార్మల్గా కనిపిచేంది. దీంతో ఏ కొత్త ప్రాంతానికి వెళ్లినా ఆమెను వింతగా చూసేవారు. సౌందర్యవతైన ఆమె తల్లితో పోలిక తెస్తూ సూటిపోటీ మాటలతో రాధికగుప్తా మనసును గాయపరిచేవారు. ‘అంత అందమైన మహిళకి ఇలాంటి అమ్మాయి పుట్టడమేంటీ’ అంటూ ఆమె ముందే కామెంట్లు చేసేవారు. పైగా తండ్రి వృత్తిరీత్యా వివిధ దేశాల్లో ఉండాల్సి రావడం ఆమె మాట్లాడే భాష స్థానికుల భాషలా కాకుండా ఇండియన్ యాసలో ఉండటం ఆమెకు కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. రాధిక భాషను వెక్కిరిస్తూ కామెడీ కార్టూన్ క్యారెక్టర్ల పేర్లతో నిత్యం నరకం చూపించే మిత్ర బృందం రాధిక వెంట పడేది. కేరాఫ్ పరాజయం అడుగడుగునా అవమానాలు, చీత్కారపు చూపుల కారణంగా రాధికగుప్తాలో ఆత్మన్యూనతా భావం వయసుతో పాటే పెరిగిపోతూ వచ్చింది. డిగ్రీ పట్టా పుచ్చుకుని బయటకు వచ్చినా ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఆమెను వదల్లేదు. అమెరికాలో ఉద్యోగ వేటలో ఉంటూ ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా పరాజయమే పలకరించేంది. అలా ఓ సందర్భంగా వరుసగా ఆరు ఇంటర్యూల్లో ఆమెను వద్దుపొమన్నారు. ఎందుకీ జీవితం చిన్నతనం నుంచి వెంటాడిన అవమానాలు, పెద్దయ్యాక ఎంతకీ వదలని అపజయాలతో మానసికంగా కుంగుబాటుకు గురైంది రాధిక గుప్త. ఓరోజు ఆలోచనల ఒత్తిడి తట్టుకోలేక తానుండే గది కిటీలోంచి దూకి చనిపోవాలని డిసైడ్ అయ్యింది. చివరి ప్రయత్నంగా తన స్నేహితురాలికి తన బాధను చెప్పుకుని తనువు చాలించాలనుకుంది. అప్పుడు ఆమె వయస్సు 22 ఏళ్లు. ఆఖరి ప్రయత్నం రాధిక గుప్తా మానసిక పరిస్థితి గమనించిన ఆమె స్నేహితురాలు వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లింది. కొన్నాళ్లుగా అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో మరో ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఇక తన జీవితంలో ఇదే ఆఖరి ఇంటర్వ్యూ.. మళ్లీ ఏ ఇంటర్వ్యూకి హాజరుకావొద్దనే లక్ష్యంతో రాధిక వెళ్లింది. ఈసారి ఆమె పట్టుదల ముందు అవమానాలు, దెప్పిపొడుపులు తలవంచాయి. అలా మెకెన్సీ కంపెనీలో ఉద్యోగం సాధించింది. మరోసారి పాతికేళ్ల జీవితం ప్రస్థానంలో దాదాపు 22 ఏళ్లు అవమానాలు, కన్నీళ్లు దిగమింగుతూ వచ్చి... అప్పుడప్పుడే ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకుపోతున్న రాధిక గుప్తాకు మరోసారి షాక్ తగిలింది. 2008లో ఏర్పడిన ప్రపంచ ఆర్థిక మందగమనంతో అనేక కంపెనీలు కుదేలయ్యాయి. రాధిక మీద కూడా ఆ ప్రభావం చూపింది. భారీ నష్టాల నుంచి తప్పించుకున్నా అమెరికాలో కట్టుకున్న కలల కోట కూలిపోయింది. భారత్‌కి రాక రెసిషన్ టైమ్‌లోనే నళిన్ మోనిజ్‌తో రాధికకు పరిచయం అయ్యింది. ఇద్దరు ఆర్థిక రంగంలో నిపుణులు. దీంతో ఒకరి మీద ఆధారపడకుండా వాళ్లిద్దరు కలిసి అసెట్ మేనేజ్మెంట్ సర్వీసులు సొంతంగా ఇండియాలో ప్రారంభించారు. ఆ తర్వాత మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అనతి కాలంలోనే ఈ దంపతుల పేరు మార్కెట్లో మార్మోగిపోయింది. దీంతో ఎడిల్వైజ్ అనే భారీ సంస్థ రాధికగుప్తా కంపెనీలో భారీ పెట్టుబడులు పెట్టి సొంతం చేసుకుంది. నీకు ఏం తక్కువ? ఎడిల్వైజ్ కంపెనీకి కొత్తగా బాస్‌గా ఎవరిని నియమించాలనే చర్చలు తీవ్రంగా జరుగుతున్న రోజుల్లో రాధిక గుప్తాకి ఆమె భర్త నుంచి ఊహించని ప్రతిపాదన ఎదురైంది. కొత్త సీఈవో నువ్వే ఎందుకు కాకూడంటూ ఆమె భర్త ప్రశ్నించాడు. ఈ కంపెనీకి మరింత ఎత్తులకు తీసుకెళ్లే తెలివితేటలు, సామర్థ్యం నీకున్నాయంటూ ఆమెపై నమ్మకం చూపించాడు. జీవితంలో ఎక్కువ కాలం అవమానాలు, ఛీత్కారాలే ఎక్కువగా ఎదుర్కొన్న రాధికకు భర్త మాటలు టానిక్‌లా పని చేశాయి. సీఈవోగా రికార్డ్ భర్త అందించిన ప్రోత్సాహంతో ఎడిల్వైజ్ మేనేజ్మెంట్ను నేరుగా కలుసుకుని సీఈవో పోస్టు పట్ల తనకు ఆసక్తి ఉన్నట్టు ధైర్యంగా చెప్పింది రాధిక. ఒక సీఈవోగా తనకు అనుభవం లేకపోయినా కంపెనీని మరింత ఎత్తులకు తీసుకెళ్లాలనే తపన ఉందంటూ ఆత్మవిశ్వాసం చూపించింది. ఇది జరిగిన రెండుమూడు నెలల తర్వాత 33 ఏళ్ల వయస్సుల్లో ఎడిల్వైజ్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీకి రాధికా గుప్తా సీఈవోగా ఎంపికై రికార్డు సృష్టించింది. ఇప్పటికీ ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, లేడీ ఎంట్రీప్యూనర్లకు రోల్‌మోడల్‌గా నిలుస్తోంది. అదే నా ప్రత్యేకత ఒకప్పుడు వంకరగా ఉన్న నా మెడ నాకో పెద్ద అవకరంలా అనిపించేంది. నాలోని లోపాన్ని ఎత్తి చూపుతూ ఎవరైనా ఏమైనా అంటే కుమిలిపోయేదాన్ని. ఆత్మవిశ్వాసం సన్నగిల్లేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అవును...? మెడ వంకర అన్నది నాలోని ప్రత్యేకత. మరీ మీలో ప్రత్యేకత ఏం ఉందంటూ ఎదురు ప్రశ్నించే స్థాయికి చేరుకున్నాను. అందుకే ఆమె జీవిత అనుభవాలతో లిమిట్లెస్ అనే పుస్తకాన్ని రాస్తున్నారు. అంతేకాదు ఆత్మన్యూనతతో బాధపడే వారిలో స్ఫూర్తి రగిలించేందుకు క్రమం తప్పకుండా తన అనుభవాలు వివిధ వేదికల మీద పంచుకుంటూ ఉంటారు. చదవండి: రూ.3.5 కోట్ల జీతం బాగుంది కానీ జాబ్ బోరుకొడుతోంది! -
ఎడల్వైజ్ కొత్త ఈక్విటీ పథకం
ఎడల్వైజ్ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ స్కీం- నిఫ్టీ ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 24న ప్రారంభమయ్యే ఈ న్యూ ఫండ్ ఆఫర్ మే 5తో ముగుస్తుంది. ఈ పథకం ద్వారా సేకరించిన మొత్తాన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా 101 నుంచి 300లోపు ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఓపెన్ ఎండెడ్ కేటగిరీలోకి వచ్చే ఈ పథకంలో కనీస ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని రూ.10,000గా నిర్ణయించారు.