నెలకు లక్ష రూపాయలు సంపాదించేవారు కూడా ఓ ఖరీదైన కారు కొనేస్తున్నారు. అయితే కోట్ల రూపాయల డబ్బు ఉన్నప్పటికీ లగ్జరీ కారు కొనుగోలు చేయని వారు ఇప్పటికీ చాలామందే ఉన్నారు. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ అండ్ ఎండీ 'రాధికా గుప్తా'.
రాధికా గుప్తా ఎందుకు లగ్జరీ కారును కొనుగోలు చేయలేదు అనే ప్రశ్నకు ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు. బోనస్ పొందిన ప్రతిసారీ.. లగ్జరీ కారును కొనొచ్చు. కానీ కారు అనేది విలువ తగ్గిపోయే ఆస్తి. ఒక కారును కొనుగోలు చేసి మళ్ళీ విక్రయించాలంటే సుమారు 30 శాతం నష్టాన్ని చూడాల్సి వస్తుంది. కాబట్టి విలువ తగ్గిపోయే ఆస్తి మీద నేను పెట్టుబడి పెట్టను అని ఆమె వెల్లడించారు.
ఇదీ చదవండి: రాత్రిని పగలుగా మార్చేయండిలా..
తాను జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. ఎన్నో సంఘటనల ద్వారా పాఠాలు నేర్చుకున్నట్లు వివరించారు. 18 ఏళ్ల వయసులో కాలేజీ చదువు పూర్తయినప్పుడు.. చాలామంది మీ దగ్గర ఫ్యాన్సీ బ్యాగ్ లేదా అని అడిగారు. ఆ మాటలు నన్ను కొంత బాధించాయి. ఇప్పుడు కూడా ఎందుకు ఇన్నోవా ఉపయోగిస్తున్నావు? అని అడుగుతున్నారు. కానీ నా జీవితం.. నా ఇష్టం. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని స్పష్టం చేసారు.
Comments
Please login to add a commentAdd a comment