Edelweiss
-
కట్టండి జరిమానా.. రాధికా గుప్తాకు షాకిచ్చిన సెబీ
ఎడెల్వీస్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సీఈఓ రాధికా గుప్తాకు మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ షాకిచ్చింది. మ్యూచువల్ ఫండ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కంపెనీతోపాటు దాని సీఈఓ రాధికా గుప్తా, ఫండ్ మేనేజర్ త్రిదీప్ భట్టాచార్యపై మొత్తం రూ.16 లక్షల జరిమానా విధించింది.సెబీ విడుదల చేసిన ఆదేశాల ప్రకారం.. మొత్తం రూ.16 లక్షల జరిమానాలో విడిగా ఎడెల్వీస్ అసెట్ మేనేజ్మెంట్పై రూ. 8 లక్షలు, సీఈవో రాధికా గుప్తా, ఫండ్ మేనేజర్ భట్టాచార్యలకు చెరో రూ. 4 లక్షలు చొప్పున జరిమానా విధించింది. ఈ పెనాల్టీలను 45 రోజుల్లోగా చెల్లించాలని సెబీ ఆదేశించింది.ఇదీ చదవండి: ట్రేడింగ్ చేస్తున్నారా? ఆర్బీఐ హెచ్చరికఫోకస్డ్ ఫండ్స్ స్పష్టంగా (ట్రూ-టు-లేబుల్) ఉంటున్నాయా.. లేదా అనేదానిపై సెబీ పరిశ్రమవ్యాప్త సమీక్ష చేపట్టింది. ఇందులో ఎడెల్వీస్ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ (EFEF) 88 రోజులలో 'గరిష్టంగా 30 స్టాక్‌లలో పెట్టుబడి పెట్టే ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం' నిబంధనను ఉల్లంఘించినట్లు సెబీ గుర్తించింది. -
అందుకే లగ్జరీ కారు కొనలేదు: ఎడెల్వీస్ సీఈఓ
నెలకు లక్ష రూపాయలు సంపాదించేవారు కూడా ఓ ఖరీదైన కారు కొనేస్తున్నారు. అయితే కోట్ల రూపాయల డబ్బు ఉన్నప్పటికీ లగ్జరీ కారు కొనుగోలు చేయని వారు ఇప్పటికీ చాలామందే ఉన్నారు. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ అండ్ ఎండీ 'రాధికా గుప్తా'.రాధికా గుప్తా ఎందుకు లగ్జరీ కారును కొనుగోలు చేయలేదు అనే ప్రశ్నకు ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు. బోనస్ పొందిన ప్రతిసారీ.. లగ్జరీ కారును కొనొచ్చు. కానీ కారు అనేది విలువ తగ్గిపోయే ఆస్తి. ఒక కారును కొనుగోలు చేసి మళ్ళీ విక్రయించాలంటే సుమారు 30 శాతం నష్టాన్ని చూడాల్సి వస్తుంది. కాబట్టి విలువ తగ్గిపోయే ఆస్తి మీద నేను పెట్టుబడి పెట్టను అని ఆమె వెల్లడించారు.ఇదీ చదవండి: రాత్రిని పగలుగా మార్చేయండిలా.. తాను జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. ఎన్నో సంఘటనల ద్వారా పాఠాలు నేర్చుకున్నట్లు వివరించారు. 18 ఏళ్ల వయసులో కాలేజీ చదువు పూర్తయినప్పుడు.. చాలామంది మీ దగ్గర ఫ్యాన్సీ బ్యాగ్ లేదా అని అడిగారు. ఆ మాటలు నన్ను కొంత బాధించాయి. ఇప్పుడు కూడా ఎందుకు ఇన్నోవా ఉపయోగిస్తున్నావు? అని అడుగుతున్నారు. కానీ నా జీవితం.. నా ఇష్టం. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని స్పష్టం చేసారు. -
ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఎడెల్వీస్ ఏఆర్సీ చీఫ్‌గా 'ఆర్కే బన్సాల్' రిజెక్ట్
ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా 'రాజ్‌కుమార్ బన్సాల్'ను మళ్ళీ నియమించాలనే ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తిరస్కరించింది.రాజ్‌కుమార్ బన్సాల్ ఏప్రిల్ 2018లో ఎడెల్వీస్ ఏఆర్‌సీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా చేరారు. సుమారు మూడు దశాబ్దాలపాటు బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్న ఈయన.. ఐడీబీఐ బ్యాంక్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల.. ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు ఇప్పటి వరకు 8.2 శాతం క్షీణించాయి. -
అదిరిపోయే లాభాలు ఇస్తున్న మ్యూచువల్ ఫండ్
-
‘కనీసం రూ.100 చెల్లించలేకపోతున్నాం’.. మాకు వారితోనే పోటీ: ఎడిల్విస్ సీఈఓ
మనం చేస్తున్న చిన్న మొత్తాల పొదుపే భవిష్యత్తులో ఆర్థిక అవసరాలను తీర్చే సాధనంగా మారుతుంది. పొదుపు చేయకపోతే జీవితంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందనే విషయం అందరికీ తెలుసు. కానీ క్రమశిక్షణతో దాన్ని నిజంగా అనుసరిస్తూ ప్రతినెల కొంత మదుపుచేసే వారు చాలా తక్కువగా ఉంటారు. కొన్నేళ్ల కిందట ఎంతోమంది రోజువారీ సంపాదిస్తున్న కొద్దిమొత్తంలోనే ఖర్చు చేసి తోచినంత పొదుపు చేసేవారు. కానీ ప్రస్తుతం జీవన ప్రమాణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్భాటాలకుపోయి ఉన్నదంతా ఖర్చుచేసి నెలాఖరుకు చేతిలో డబ్బులేక తిరిగి అప్పు చేయాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. ‘ఒకప్పటి తరం బతకడానికి చాలా కష్టపడే వారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆదాయాలు పెరిగాయి. ఇప్పటి తరానికి ఆదాయానికి కొదవ లేదు. కానీ వారిలో పొదుపు చేయాలన్న భావన కనిపించడం లేదు’అని ఎడిల్విస్ మ్యూచువల్ ఫండ్స్ సీఈఓ, ఎండీ రాధికా గుప్తా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు స్విగ్గీ, జొమాటో, నెట్‌ఫ్లిక్స్‌తోనే పోటీ అంటున్నారు. ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థకు అధినేత ఎందుకు అలా అన్నారో తెలుసుకుందాం. బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు శంతను దేశ్‌పాండే ‘ది బార్బర్షాప్ విత్ శంతను’ పేరుతో ఒక పాడ్‌కాస్ట్‌ను నిర్వహిస్తున్నారు. ఇటీవల అందులో రాధికా గుప్తా మాట్లాడారు. యువతకు డబ్బు పొదుపు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ స్విగ్గీ, జొమాటో, నెట్‌ఫ్లిక్స్ వంటి కంపెనీలతో పోటీ పడుతోందంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదీ చదవండి: ఈ రోజు బంగారం ధరలు ఎంతంటే? ‘నెలకు రూ.50వేలు-రూ.60 వేలు సంపాదిస్తున్నవారు అందులో నెలనెలా ఎంతో కొంత పొదుపు చేయండి. చాలా మంది సరిపడా సంపాదించలేకపోతున్నారు. సంపాదిస్తున్న దానిలో కనీసం రూ.100 క్రమానుగత పెట్టుబడిలో ఇన్వెస్ట్ చేయలేకపోతున్నామని చాలామంది చెప్తారు. కానీ వారు నెట్‌ఫ్లిక్స్ కోసం నెలకు రూ.100 కడుతుంటారు. దేశంలో ఓటీటీ ప్లాట్‌ఫాంలతోపాటు స్విగ్గీ, జొమాటోకు 40 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. కానీ మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీలో కేవలం 4 కోట్ల మంది మాత్రమే పెట్టుబడి పెడుతున్నారు. ఆ 40 కోట్ల మంది నిత్యం చేస్తున్న ఖర్చులో కొంత మదుపు చేస్తే భవిష్యత్తులో వారి తర్వాతి తరాలకు ఎంతో మేలు జరుగుతుంది. అందుకే స్విగ్గీ, జొమాటోతోనే మా పోటీ’ అని రాధికా గుప్తా అన్నారు. -
ఇన్ఫీ నారాయణ మూర్తికి, రాధికా గుప్తా స్ట్రాంగ్ కౌంటర్
70 Hour Week Remark controversy: వారానికి 70 గంటల పనిపై ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. యువత వారానికి 70 గంటలు కచ్చితంగా పని చేయాలన్న వ్యాఖ్యలపై అటు నెటిజన్లు నుంచి ఇటు పలు టెక్ దిగ్గజాల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఈ క్రమంలో ఎడిల్వీస్ సీఎండీ రాధికా గుప్తా స్పందించారు. భారతీయ మహిళలు దశాబ్దాల తరపడి 70 గంటలకు మించి పనిచేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదంటూ విచారం వ్యక్తం చేశారు. ఇంటి పని, ఆఫీసు పనిని బ్యాలెన్స్ చేసుకోవడంతోపాటు, తరువాతి తరం పిల్లలభవిష్యత్‌ను సక్రమంగా తీర్చిదిద్దుతూ చాలామంది భారతీయ మహిళలు 70 గంటల కంటే ఎక్కువే శక్తికి మించి పని చేస్తున్నారని రాధికా గుప్తా గుర్తు చేశారు. దశాబ్దాల తరబడి చిరునవ్వుతో ఓవర్ టైంని డిమాండ్ చేయకుండానూ అదనపుభారాన్ని మోస్తూనే ఉన్నారు. కానీ విచిత్రంగా దాన్ని ఎవరూ గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌పై చాలామంది సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా ప్రముఖ బిజినెస్ ఎనలిస్ట్ లతా వెంకటేష్ స్పందిస్తూ నిజానికి, తన భర్త, తానూ కూడా తమ కుమారుడి పెంపకంలో చాలా సాయం చేశారు. అలాగే ముంబై లాంటి మహానగరాల్లో పనికంటే మనం అందరం ఎక్కువ గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది అంటూ పరోక్షంగా మూర్తి వ్యాఖ్యలకు కౌంటర్‌గా ట్వీట్ చేశారు. అవును అమ్మకు ఆదివారం లేదు.. వారాంతంలో కూడా పనిచేయాలని ఒకరు, ఆఫీస్ పని లేకపోయినా కూడా భారతీ మహిళలు కుటుంబ పోషణ కోసం వారానికి 72 గంటలకు పైగానే పని చేస్తున్నారు. చాలా కరెక్ట్‌గా చెప్పారు..అలుపెరుగని ఆడవారి శ్రమను ఎవరూ గుర్తించడం లేదంటూ ఆమె ట్వీట్ చేశారు. ఇప్పటికైనా వారి కమిట్మెంట్ను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు మరో యూజర్. అందరికంటే ముందు లేచేది అమ్మ.. అందరికంటే చివర్లో తినేది అమ్మే.. ఆఖరికి చివరగా నిద్రపోయేదీ అమ్మే అంటూ ఒక యూజర్ కమెంట్ చేశారు. పితృస్వామ్యం అంతరించేంత వరకు ఈ వివక్ష పోదు. వెస్ట్రన్‌లో కూడా పూర్తి సమయం ఉద్యోగం చేసే మహిళలు ఇంట్లో బానిసలుగా ఉన్నారు. వీకెండ్లో పురుషులంతా పార్టీలు చేసుకుంటారు. అమ్మాయిలను అబ్బాయిలతో సమానంగా చూసే వరకు...ఏదీ మారదు మరోయూజర్ వ్యాఖ్యానించారు. Between offices and homes, many Indian women have been working many more than seventy hour weeks to build India (through our work) and the next generation of Indians (our children). For years and decades. With a smile, and without a demand for overtime. Funnily, no one has… — Radhika Gupta (@iRadhikaGupta) October 29, 2023 కాగా ఇన్ఫోసిస్ మాజీ సీఈవో మోహన్‌దాస్ పాయ్‌తో నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సందర్భంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీగా మన దేశం కూడా ఆర్థికంగా పుంజుకోవాలంటే యువత వారానికి 70 గంటలు తప్పనిసరిగా పనిచేయాలని నారాయణ మూర్తి సూచించారంటూ మీడియాలో పలు కథనాలు వెలు వడ్డాయి. దీంతో నెటిజన్లు చాలావరకు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే భవిష్ అగర్వాల్, జేఎస్‌డబ్ల్యూ సజ్జన్‌సిందాల్ సహా కొంతమంది పరిశ్రమ దిగ్గజాలు ఇన్ఫీ మూర్తికి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. Infosys employee pic.twitter.com/FN8y5BgGTu — Gabbar (@GabbbarSingh) October 28, 2023 -
ఇలా ఇన్వెస్ట్ చేస్తే.. అధిక ప్రయోజనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటికే మార్కెట్లు కొంత మేర ర్యాలీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా వచ్చే ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధి వరకూ మార్కెట్లలో ఇన్వెస్టర్లు విడతలవారీగా, కొద్దికొద్దిగా ఇన్వెస్ట్ చేయడాన్ని పరిశీలించవచ్చని ఎడెల్వీజ్ మ్యుచువల్ ఫండ్ సీఐవో (ఈక్విటీస్) త్రిదీప్ భట్టాచార్య సూచించారు. పడినప్పుడల్లా కొనుగోలు చేసే విధానాన్ని పాటించవచ్చన్నారు. గత కొద్ది నెలలుగా ర్యాలీ చేసిన కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌పై అసంబద్ధ మైన స్థాయిలో ఆసక్తి నెలకొందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వివిధ స్థాయుల క్యాపిటలైజేషన్ గల స్టాక్స్‌లో మదుపు చేసే మల్టీక్యాప్ ఫండ్స్‌లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక ప్రయోజనాలు పొందేందుకు ఆస్కారం ఉంటుందని భట్టాచార్య చెప్పారు. కొత్తగా ఎడెల్వీజ్ మల్టీక్యాప్ ఫండ్ ఎన్ఎఫ్వో బుధవారం (సెప్టెంబర్ 4) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. అక్టోబర్ 18 వరకు ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. వచ్చే 3-4 ఏళ్లు ప్రధానంగా అయిదు థీమ్స్ మార్కెట్లకు దన్నుగా నిల్చే అవకాశం ఉందని భట్టాచార్య తెలిపారు. తయారీ రంగం, ఆర్థిక సేవలకు సంబంధించి రుణాల విభాగం, డిఫెన్స్, రియల్ ఎస్టేట్ మొదలైనవి వీటిలో ఉంటాయని భట్టాచార్య పేర్కొన్నారు. ఆదాయాల్లో విదేశీ మార్కెట్ల వాటా ఎక్కువగా ఉన్న రంగాల సంస్థలపై అండర్‌వెయిట్‌గా ఉన్నామని ఆయన చెప్పారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ఎడెల్వీస్ నుంచి 2 టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్
ఎడెల్వీస్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ కొత్తగా మరో రెండు టార్గెట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్స్‌ను ఆవిష్కరించింది. క్రిసిల్ ఐబీఎక్స్ 50:50 గిల్ట్ ప్లస్ ఎస్డీఎల్ ఏప్రిల్ 2037 ఇండెక్స్ ఫండ్‌తో పాటు 2027 జూన్‌లో మెచ్యూర్ అయ్యే ఫండ్ వీటిలో ఉన్నాయి. ఈ తరహా ఫండ్స్‌లో 15 ఏళ్ల సుదీర్ఘ మెచ్యూరిటీతో ఫండ్‌ను ప్రవేశపెట్టడం దేశీయంగా ఇదే ప్రథమమని సంస్థ ఎండీ రాధికా గుప్తా తెలిపారు. ఈ ఫండ్లు ప్రధానంగా భారత ప్రభుత్వ బాండ్లు (ఐజీబీ), రాష్ట్ర అభివృద్ధి రుణాల్లో (ఎస్డీఎల్) ఇన్వెస్ట్ చేస్తాయి. 2037 ఇండెక్స్ ఫండ్ అక్టోబర్ 6న, 2027 ఇండెక్స్ ఫండ్ అక్టోబర్ 11న ముగుస్తాయి. రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. -
అమెరికాకి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన మంత్రి.. మెచ్చుకుంటున్న సీఈవోలు
రష్యా, భారత్‌ల మధ్య సంబంధాలపై వెస్ట్రన్ మీడియా, అమెరికా అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ అద్భుతమైన సమాధానం ఇచ్చారంటూ పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ మెచ్చుకున్నారు. భారత వైఖరిరి అంతర్జాతీయంగా సమర్థంగా ముందుకు తీసుకెళ్తున్న జైశంకర్‌కి కావాల్సినంత ప్రచారం ఎందుకు లభించడం లేదంటూ ప్రశ్నించారు. శేఖర్ శర్మ వెలిబుచ్చిన అభిప్రాయంతో ఏకీభవించారు ఎడిల్వైజ్ సీఈవో రాధికా గుప్తా. విపత్కర పరిస్థితులను ఆత్మ విశ్వాసంతో ఎలా ఎదుర్కొవాలో చెప్పేందుకు ఈ సంభాషణ మాస్టర్ క్లాస్ అంటూ రాధికా గుప్తా అభిప్రాయపడింది. ఉక్రెయిన్ యుద్ధం వేళ రష్యాతో భారత సంబంధాలపై అమెరికా మొదటి నుంచి ఆడిపోసుకుంటోంది. ఉక్రెయిన్, రష్యాల మధ్య శతృత్వం పెచ్చరిల్లడానికి స్వయంగా తానే కారణమై ఉండీ కూడా నిత్యం ఇతర దేశాల వైపు తప్పులు నెట్టేందుకు ప్రయత్నిస్తోంది. రష్యాతో భారత అంటకాగుతోందంటూ పదేపదే విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధికారులకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు విదేశాంగ మంత్రి జై శంకర్. అమెరికా మంత్రులతో జరిగిన టూ ప్లస్ టూ సమావేశంలో మంత్రి జై శంకర్ మాట్లాడుతూ కేవలం మధ్యాహ్నం వేళ యూరప్ దేశాలను రష్యా నుంచి ఎంత ఆయిల్ దిగుమతి చేసుకుంటాయో అంతకంటే తక్కువ ఆయిల్‌ని ఇండియా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుందంటూ కౌంటర్ ఇచ్చారు. భారత్ యుద్ధానికి వ్యతిరేకమని, చర్చల ద్వారా ఇరు దేశాలు శాంతి కోసం ప్రయత్నించాలంటూ ఇప్పటికే అనేక వేదికల మీద భారత్ చెప్పిందంటూ భారత వైఖరికి పునరుద్ఘాటించారు జై శంకర్. Ye 🙋🏻♂️ I wonder why there are not enough articles & twitter threads on his skills to manage tough situations and profound answers. — Vijay Shekhar Sharma (@vijayshekhar) April 13, 2022 Yes! Master class on communication and handling prickly situations with confidence. — Radhika Gupta (@iRadhikaGupta) April 13, 2022 -
నెటిజన్లను కదిలిస్తోన్న రాధిక గుప్తా పోస్టు
స్టాక్ మార్కెట్ బ్రోకరేజీ కంపెనీ ఎడిల్వైజ్ ఎండీ, సీఈవో రాధికాగుప్తా ఇటీవల ట్విట్టర్లో చేసిన పోస్టుకు నెట్టింట విపరీతమైన స్పందన వస్తోంది. తన దృష్టిలో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే వివరిస్తూ ఇటీవల రాధికగుప్తా ట్విట్టర్లో ఓ పాతకాలం నాటి బ్యాగ్ ఫోటోను షేర్ చేశారు. ఈ బ్యాగు నాకెంతో ప్రత్యేకం. పదిహేనేళ్ల కిందట నా మొదటి జీతంతో మొదటిసారిగా కొనుక్కున్న బ్యాగ్ ఇది. నా సంపాదన, నా ఇష్టం, నాకు నచ్చిన వస్తువు... పుస్తకాల్లో చెప్పని ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఇదే. డబ్బు అనేది నంబర్లలో ఉండదు, ఒకరితో పోటీ పడటంతో ఉండదు. అదొక ఎమోషన్ అంటూ తన అభిప్రాయం వెల్లడించారు రాధిక గుప్తా. రాధిక గుప్తా ట్వీట్‌కు నెటిజన్లు, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు, ఉద్యోగుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఓ ఐసీఐసీఐ ఉద్యోగి తన అభిప్రాయం చెబుతూ.. ఎనిమిది నెలల పాటు ఐసీఐసీఐలో జాబ్ చేశాక.. కూడబెట్టిన సొమ్ముతో బేసిక్ ఫోన్ కొనుక్కున్నానని.. ఆ తర్వాత అనేక వస్తువులు కొన్నా.. ఆ ఫోన్ తనకు ఎప్పటికీ ప్రత్యేకం అంటూ చెప్పుకొచ్చాడు. మరో నెటిజన్ నా మొదది సంపాదన నుంచి 100 డాలర్లు మా అమ్మకు పంపించానని.. ఇప్పటికీ అమ్మ ఆ వంద డాలర్లు దాచి ఉంచిందంటూ ఎమోషన్ పోస్ట్ చేశారు. ఇలాంటి పోస్టులు వచ్చి పడుతూనే ఉన్నాయి. సంపాదన, సక్సెస్, ఇండిపెండెన్స్‌కి అసలైన అర్థాలను పట్టి చూపుతున్నాయి. Money is not just a number, nor is it a contest. It is emotional, earned to be invested yes but ultimately enjoyed. A special money memory is this 15y old handbag, my first fun purchase from my own salary. It speaks to me about financial independence in a way no book can! pic.twitter.com/wxijZ0PJup — Radhika Gupta (@iRadhikaGupta) April 10, 2022 ఓ స్టాక్ బ్రోకరేజ్ కంపెనీ స్థాపించి దాని సక్సెస్‌ఫుల్‌గా నిలబెట్టారు రాధిక గుప్తా. ఒక బ్రొకరేజ్ సంస్థగా ఏ స్టాక్స్ కొనాలి, ఏ స్టాక్స్‌ని అమ్మాలంటూ నిత్యం సూచనలు చేస్తుంటారు. అలాంటి రాధిక గుప్తా నుంచి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది నంబర్లలో ఉండదు ఎమోషన్లో ఉంటుందని పేర్కొనడం నెటిజన్లు విపరీతంగా ఆకర్షిస్తోంది. చదవండి: ఆ విషయాన్ని బోర్డు చూసుకుంటుంది,'అష్నీర్' నిధుల దుర్వినియోగంపై సమీర్! -
ఎన్ఐఐటీ టెక్- ఎడిల్వీజ్.. షేర్ల జోరు
ముందురోజు హైజంప్ చేసిన దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాట పట్టాయి. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా సాఫ్ట్వేర్ సేవల మధ్యస్థాయి కంపెనీ ఎన్ఐఐటీ టెక్నాలజీస్, ఎడిల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. ఎన్ఐఐటీ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఎన్ఐఐటీ టెక్నాలజీస్ నికర లాభం 30 శాతం క్షీణించి రూ. 80 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 5 శాతం తక్కువగా రూ. 1057 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 9 శాతం వెనకడుగుతో రూ. 181 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 17.1 శాతంగా నమోదయ్యాయి. ఈ కాలంలో 18.6 కోట్ల డాలర్ల విలువైన కాంట్రాక్టులను కుదుర్చుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. క్యూ2(జులై-సెప్టెంబర్)లో ఆదాయంలో 7 శాతం వృద్ధిని అందుకోగలమని కంపెనీ అంచనా వేస్తోంది. ఇదే విధంగా మార్జిన్లు 1.5 శాతం బలపడగలవని భావిస్తోంది. సానుకూల గైడెన్స్ నేపథ్యంలో ఎన్ఐఐటీ టెక్నాలజీస్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6 శాతం దూసుకెళ్లి రూ. 1871 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1894 వరకూ ఎగసింది. ఎడిల్వీజ్ ఫైనాన్షియల్ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ చేపట్టనున్న పబ్లిక్ ఇష్యూకి సంబంధించి ఎడిల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డెలాయిట్.. అడ్వయిజర్స్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ప్రీఐపీవో లావాదేవీల అడ్వయిజర్‌గా డెలాయట్ తోపాటు..ఎడిల్వీజ్ ఫైనాన్షియల్‌ను ఎల్ఐసీ ఎంపిక చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎడిల్వీజ్ ఫైనాన్షియల్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. వెరసి ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 78 సమీపంలో ఫ్రీజయ్యింది. -
రిలయన్స్‌కు షాకిచ్చిన బ్రోకరేజ్‌లు
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలైన సీఎల్ఎస్ఏ, ఎడెల్వీజ్లు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు షాక్‌నిచ్చాయి. నిఫ్టీ ఇండెక్స్‌ను ముందుండి నడిపిస్తున్న రిలయన్స్ షేరుకు డౌన్‌గ్రేడ్ రేటింగ్‌ను కేటాయించాయి. మార్చి కనిష్టస్థాయి రూ.867.82 నుంచి రిలయన్స్ షేరు 150శాతం ర్యాలీ చేసి ఇటీవల రూ.2000 స్థాయిని అందుకుంది. ‘‘నిధుల సమీకరణ, రుణాన్ని తగ్గించుకోవడం, వ్యాపారాల వాల్యూ అన్‌లాక్ కావడంతో షేరు అధికంగా ర్యాలీ చేసింది. వాల్యూయేషన్లు అధికంగా ఉన్నాయి. ఈ పరిణామాలు అప్రమత్తతకు సంకేతాలు’’ అని రెండు బ్రోకరేజ్ సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఇప్పుడు రిలయన్స్ షేరుపై ఆయా బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణలను చూద్దాం... ఎడెల్వీజ్ బ్రోకరేజ్: రిలయన్స్ షేరుకు ‘‘హోల్డ్’’ రేటింగ్‌ను కేటాయించింది. టార్గెట్ ధరను రూ.2105గా నిర్ణయించింది. రుణాలను తగ్గించుకోవడం, అసెట్ మోనిటైజేషన్, వ్యాపారంలో డిజిటల్ మూమెంట్ తదితర అంశాలు షేరును రూ.2000స్థాయిని అందుకునేందుకు తోడ్పడినట్లు ఎడెల్వీజ్ బ్రోకరేజ్ తెలిపింది. రిలయన్స్ షేరు ఏడాది ప్రైజ్ -టు -ఎర్నింగ్స్ 47.2రెట్ల నిష్పత్తి వద్ద ట్రేడ్ అవుతోందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఈ విలువ వాస్తవ విలువ కంటే అధికంగా ఉందని తెలిపింది. షేరు ధర పతనం ఒక క్రమపద్ధతిలో ఉంటుందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఈ బ్రోకరేజ్ సంస్థ 2016 నుంచి రిలయన్స్ షేరుపై పాజిటివ్‌గానే ఉంది. ఈ 4ఏళ్లలో షేరు 400శాతం ర్యాలీ చేసింది. సీఎల్ఎస్ఏ బ్రోకరేజ్: రిలయన్స్ షేరు రేటింగ్‌ను ‘‘అవుట్‌ఫెర్‌ఫామ్’’ నుంచి ‘‘బై’’కు కుదించింది. అయితే టార్గెట్ ధరను మాత్రం రూ.2,250కి పెంచింది. ఈ టార్గెట్ ధర షేరు ప్రస్తుత ధరకు అతి దగ్గరలో ఉంది. మార్చి 2022 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 220 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తుంది. అయితే షేరు ర్యాలీ స్వల్పకాలంలో ఆగిపోతుందని విశ్వసిస్తుంది. గడిచిన 4ఏళ్లలో షేరు 400శాతానికి పైగా ర్యాలీ చేసింది. 4నెలల్లో 150శాతం ర్యాలీ చేసింది. ఇప్పుడు స్టాక్ ర్యాలీ కొంతకాలం పాటు ఆగిపోవచ్చని సీఎల్ఎస్ఏ తన నివేదికలో తెలిపింది. -
నిఫ్టీ 40శాతం బౌన్స్ బ్యాక్‌కు 3కారణాలు
ఆర్థిక మందగమన భయాలు, కరోనా కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో నిఫ్టీ ఇండెక్స్ మార్చి 24న 7,511 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. మార్చి కనిష్టం నుంచి ఇండెక్స్ ఇటీవల 40 శాతం రికవరిని సాధించింది. ఇండెక్స్ ఈ స్థాయిలో బౌన్స్‌బ్యాక్ కావడానికి 3 కారణాలున్నాయని ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ ఆదిత్య నరైన్ చెబుతున్నారు. ఇప్పుడు ఆ 3కారణాలేంటో చూద్దాం...! మొదటి కారణం: అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, మహా మాంద్యంలాంటి సంక్షోభ సమయాల్లో పతనం తర్వాత మార్కెట్లలో సహేతుకమైన బౌన్స్‌బ్యాక్ ఉందని చరిత్ర చెబుతోంది. తక్షణ అవుట్‌లుక్ పేలవంగా ఉన్నప్పటికీ .., చారిత్రాత్మక సంఘటన పునరావృతానికే మార్కెట్ మొగ్గుచూపింది. స్టాక్టులు పరిస్థితులకు తగ్గట్లు స్పందిస్తే వాటికి కచ్చితంగా కొనుగోలు మద్దతు ఉంటుందని అర్థమవుతోంది. రెండో కారణం: ఆర్థిక మందగమనం, కరోనా వైరస్ ప్రభావాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వ్యవస్థల్లోకి పెద్ద మొత్తంలో డబ్బును విడుదల చేశాయి. సాధారణంగా ఇలాంటి సందర్భంలో మొదట నిధులు బ్యాంకుల రుణాల్లోకి చేరుకోవాలి తర్వాత ఈక్విటీ మార్కెట్లోకి వెళ్లాలి. ప్రస్తుత పరిస్థితుల్లో నిధులు నేరుగా మార్కెట్లోకి వెళుతున్నాయి. ఫలితంగా ఈక్విటీ మార్కెట్లు లాభపడుతున్నాయి. మూడో కారణం: దాదాపు రెండున్నర నెలల తర్వాత దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతానికి కొన్ని ప్రాంతాల్లో ఉత్పత్తి 50శాతంగానూ, మరికొన్ని ప్రాంతాల్లో 70శాతంగా ఉంది. వ్యవస్థ కొద్దిరోజుల తర్వాత తిరిగి సరఫరాను చూస్తుంది. వ్యవస్థలో సరఫరా తిరిగి ప్రారంభం కావడం మార్కెట్‌కు కలిసొచ్చింది. -
సెప్టెంబర్ వరకూ తనఖా షేర్ల విక్రయం ఉండదు
న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు ఊరట లభించింది. ప్రమోటర్ తనఖా పెట్టిన షేర్లను ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ విక్రయించకుండా రుణదాతలతో ఒక ఒప్పందాన్ని రిలయన్స్ గ్రూప్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి రుణదాతల్లో దాదాపు 90 శాతం సంస్థలు అంగీకరించాయి. ఈ ఒప్పందంలో భాగంగా రుణదాతలకు గడువు ప్రకారమే వడ్డీ, అసలు చెల్లింపులను రిలయన్స్ గ్రూప్.. జరుపుతుంది. అంతే కాకుండా రిలయన్స్ పవర్లో రిలయన్స్గ్రూప్నకు నేరుగా ఉన్న 30 శాతం వాటాలో పాక్షిక వాటాను సంస్థాగత ఇన్వెస్టర్లకు విక్రయించడం కోసం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లను నియమించింది. ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు త్వరలో రోడ్‌షోలను నిర్వహిస్తారు. రిలయన్స్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకున్న రుణదాతల్లో టెంపుల్టన్ ఎమ్ఎఫ్, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా ఎమ్ఎఫ్, ఇండియాబుల్స్ ఎమ్ఎఫ్, ఇండస్ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్‌లు ఉన్నాయి. కాగా తనఖా షేర్లు విక్రయించకుండా యథాతథ ఒప్పందం కుదిరినందుకు రుణదాతలకు రిలయన్స్ గ్రూప్ ధన్యవాదాలు తెలిపింది. తమపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞులమని రిలయన్స్ గ్రూప్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఇటీవల రిలయన్స్ గ్రూప్ షేర్లు భారీగా పతనమైన విషయం తెలిసిందే. ఈ పతనం కారణంగా తనఖా పెట్టిన షేర్ల విలువ బాగా తగ్గినప్పటికీ, రుణదాతలు తనఖా షేర్లను విక్రయించబోమని తాజా ఒప్పందం ద్వారా అభయం ఇచ్చాయి. ఎడెల్వీజ్కు బకాయి రూ.150 కోట్లు తనఖా పెట్టిన షేర్లను ఎల్ అండ్ టీ ఫైనాన్స్, ఎడెల్వీజ్ సంస్థలు అన్యాయంగా కావాలని ఓపెన్ మార్కెట్లో విక్రయించాయని, ఫలితంగా తమ కంపెనీల షేర్ల విలువలు భారీగా పడిపోయాయని రిలయన్స్ గ్రూప్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను ఈ ఇరు కంపెనీలు ఖండించాయి. తనఖా ఒప్పందం ప్రకారమే షేర్లను విక్రయించామని, ఎలాంటి దురుద్దేశం లేదని ఎడెల్వీజ్ పేర్కొంది. కాగా క్యాపిటల్ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఎడెల్‌వీజ్‌ను తక్షణం నిషేధించాలని కూడా సెబీని రిలయన్స్ గ్రూప్ కోరింది. కాగా రిలయన్స్ గ్రూప్ ఎడెల్వీజ్ సంస్థకు రూ.150 కోట్ల రుణం చెల్లించాల్సి ఉండగా, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ రుణం పూర్తిగా తీరిపోయింది. -
ర్యాంక్‌తో పాటు బ్రాండ్ వాల్యూ పెరిగింది
మేజర్ టోర్నీలన్నింటిలో సత్తా చాటుతున్న భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు.. ర్యాంక్ తో పాటు బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగింది. ఇటీవల విజయాలతో ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్న ఈ బ్యాడ్మింటన్ స్టార్.. పెద్ద సంఖ్యలో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఓ వ్యాపార ప్రకటన కోసం 12కోట్ల రూపాయల ఒప్పందం సైనాను వరించింది. ఏడాదికి 4 కోట్ల రూపాయలు ఆమెకు ఇవ్వనున్నారు. టాప్ క్రికెటర్ల తర్వాత ఇంత భారీ మొత్తానికి డీల్ కుదుర్చుకున్న తొలి క్రీడాకారిణి సైనానే కావడం విశేషం. ధోనీ, విరాట్ కొహ్లీ వంటి స్టార్ క్రికెటర్లకు మాత్రమే ఇలాంటి ఒప్పందాలు వస్తాయవని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్ వర్గాల కథనం మేరకు ధోనీ ఒక బ్రాండ్ ప్రచారం కోసం ఏడాదికి 8 నుంచి 10 కోట్లు తీసుకుంటుండగా.. విరాట్ కొహ్లీ 6-7 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే మూడేళ్లలో సైనా ఎండార్స్మెంట్ల ద్వారా భారీ మొత్తంలో డబ్బు ఆర్జించనుంది. నిన్న మొన్నటి వరకూ దాదాపు 10 ఎండార్స్ మెంట్స్ ద్వారా ఏడాదికి 5 నుంచి 7 కోట్ల రూపాయలు సంపాదిస్తున్న సైనా బ్రాండ్ వాల్యూ ఇటీవల అనూహ్యంగా పెరిగింది. హెర్బల్ లైఫ్, స్టార్ స్పోర్ట్స్, గోద్రేజ్, ఇమానీ, సహారా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐయోడెక్స్ వంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న సైనా.. ఎడెల్ వీస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనుంది. మరో వైపు ఈ ప్రపంచ నెంబర్ వన్ షట్లర్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్లాన్ చేస్తోంది. ప్రైజ్ మనీ, వాణిజ్య ఒప్పందాల ద్వారా వచ్చిన డబ్బుతో బిజినెస్ చేయాలని యోచిస్తోంది. అయితే తనకు బ్యాడ్మింటన్ తప్ప మరో విషయం తెలియదని.. వ్యాపార విషయాలన్నీ తన తండ్రి చూసుకుంటారని వివరించింది. తాను డబ్బుల గురించి ఆలోచించనని.. తన దృష్టి అంతా ఆటమీదే ఉందని చెప్పింది. -
మోడీ ఎఫెక్ట్ తో 29 వేలకు సెన్సెక్స్!
ముంబై: నరేంద్రమోడీ ఎఫెక్ట్ తో డిసెంబర్ చివరికల్లా సెన్సెక్స్ 29 వేల, నిఫ్టీ 9 వేల పాయింట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. భవిష్యత్ లో కూడా సెన్సెక్స్ పై మోడీ ప్రభావం ఉంటుందని ఎడెల్వీస్ బ్రోకింగ్ సంస్థ వెల్లడించింది. బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా నరేంద్రమోడీ ఎంపికైన తర్వాత నుంచి స్టాక్ మార్కెట్ సూచీలు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే సెన్సెక్స్ 24, 121 పాయింట్లకు చేరుకుంది. గత కొద్దికాలంగా ప్రధాన సూచీలు జీవితకాలపు గరిష్టస్థాయిలో కొనసాగుతున్నాయి. విదేశీ సంస్థాగత మదపుదారులు నిధులు మార్కెట్ లోకి కొనసాగితే స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కొనసాగే అవకాశముంటుందని అభిప్రాయపడ్డుతున్నారు.