ఆర్థిక మందగమన భయాలు, కరోనా కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో నిఫ్టీ ఇండెక్స్ మార్చి 24న 7,511 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. మార్చి కనిష్టం నుంచి ఇండెక్స్ ఇటీవల 40 శాతం రికవరిని సాధించింది. ఇండెక్స్ ఈ స్థాయిలో బౌన్స్‌బ్యాక్ కావడానికి 3 కారణాలున్నాయని ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ ఆదిత్య నరైన్ చెబుతున్నారు. ఇప్పుడు ఆ 3కారణాలేంటో చూద్దాం...!
మొదటి కారణం: అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, మహా మాంద్యంలాంటి సంక్షోభ సమయాల్లో పతనం తర్వాత మార్కెట్లలో సహేతుకమైన బౌన్స్‌బ్యాక్ ఉందని చరిత్ర చెబుతోంది. తక్షణ అవుట్‌లుక్ పేలవంగా ఉన్నప్పటికీ .., చారిత్రాత్మక సంఘటన పునరావృతానికే మార్కెట్ మొగ్గుచూపింది. స్టాక్టులు పరిస్థితులకు తగ్గట్లు స్పందిస్తే వాటికి కచ్చితంగా కొనుగోలు మద్దతు ఉంటుందని అర్థమవుతోంది.
రెండో కారణం: ఆర్థిక మందగమనం, కరోనా వైరస్ ప్రభావాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వ్యవస్థల్లోకి పెద్ద మొత్తంలో డబ్బును విడుదల చేశాయి. సాధారణంగా ఇలాంటి సందర్భంలో మొదట నిధులు బ్యాంకుల రుణాల్లోకి చేరుకోవాలి తర్వాత ఈక్విటీ మార్కెట్లోకి వెళ్లాలి. ప్రస్తుత పరిస్థితుల్లో నిధులు నేరుగా మార్కెట్లోకి వెళుతున్నాయి. ఫలితంగా ఈక్విటీ మార్కెట్లు లాభపడుతున్నాయి.
మూడో కారణం: దాదాపు రెండున్నర నెలల తర్వాత దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతానికి కొన్ని ప్రాంతాల్లో ఉత్పత్తి 50శాతంగానూ, మరికొన్ని ప్రాంతాల్లో 70శాతంగా ఉంది. వ్యవస్థ కొద్దిరోజుల తర్వాత తిరిగి సరఫరాను చూస్తుంది. వ్యవస్థలో సరఫరా తిరిగి ప్రారంభం కావడం మార్కెట్‌కు కలిసొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment