
మంగళవారం ఉదయం.. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 291.61 పాయింట్లు లేదా 0.40 శాతం నష్టంతో.. 72,794.33 వద్ద, నిఫ్టీ 126.10 పాయింట్లు లేదా 0.57 శాతం నష్టంతో.. 21,993.20 వద్ద సాగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, ట్రంప్ విధించిన సుంకాలు ఈ రోజు నుంచి అమలులోకి రావడం వంటివి.. స్టాక్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి.
బోహ్రా ఇండస్ట్రీస్, కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్, ఇండోకో రెమెడీస్, రూబీ మిల్స్, అనుపమ రసాయన్ ఇండియా వంటి కంపెనీలు లాభాల్లో సాగుతున్నాయి. యూనిఇన్ఫో టెలికాం సర్వీసెస్ లిమిటెడ్, మనోరమ ఇండస్ట్రీస్, మంగళం డ్రగ్స్, లాంకోర్ హోల్డింగ్స్, NR అగర్వాల్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు నష్టాల్లో సాగుతున్నాయి.
ట్రంప్ సుంకాల ఎఫెక్ట్
చైనా ఉత్పత్తులపైన ఇప్పటికే ఉన్న 10 శాతం సుంకాన్ని, 20 శాతానికి పెంచుతూ.. దీనికి సంబంధించిన సంబంధించిన ఉత్తర్వులపై సంతకం కూడా చేశారు. మెక్సికో, కెనడా దిగుమతులపై విదించనున్న 25 శాతం సుంకాల విషయంలో ఎలాంటి మార్పు లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇవి మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).

Comments
Please login to add a commentAdd a comment