
ఉదయ 9:20 గంటలకు లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 10:10 గంటలకు నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 368.28 పాయింట్ల నష్టంతో 72,829.82 పాయింట్ల వద్ద, నిఫ్టీ 94.75 పాయింట్ల నష్టంతో.. 22,029.95 వద్ద సాగుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం శుభారంభం పలికాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 418.78 పాయింట్లు లేదా 0.52 శాతం లాభంతో.. 73580.80 వద్ద, నిఫ్టీ 132.00 పాయింట్లు లేదా 0.60 శాతం లాభంతో.. 22,256.70 వద్ద సాగుతున్నాయి.
బోహ్రా ఇండస్ట్రీస్, కాఫీ డే ఎంటర్‌ప్రైజ్, రూబీ మిల్స్, రానా షుగర్స్, ఇమామి పేపర్ మిల్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఇంటర్నేషనల్ జెమ్మాలజీ ఇన్స్టిట్యూట్ ఇండియా, కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మనోరమ ఇండస్ట్రీస్, కర్మ ఎనర్జీ, హాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్, సువెన్ ఫార్మాస్యూటికల్స్ వంటివి నష్టాలను చవి చూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).

Comments
Please login to add a commentAdd a comment