ఎడెల్వీస్‌ నుంచి 2 టార్గెట్‌ మెచ్యూరిటీ ఫండ్స్‌ | Edelweiss CRISIL IBX 50:50 Gilt Plus SDL June 2027 Index Fund Direct | Sakshi
Sakshi News home page

ఎడెల్వీస్‌ నుంచి 2 టార్గెట్‌ మెచ్యూరిటీ ఫండ్స్‌

Published Mon, Oct 3 2022 5:50 AM | Last Updated on Mon, Oct 3 2022 5:50 AM

Edelweiss CRISIL IBX 50:50 Gilt Plus SDL June 2027 Index Fund Direct - Sakshi

ఎడెల్వీస్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ కొత్తగా మరో రెండు టార్గెట్‌ మెచ్యూరిటీ ఇండెక్స్‌ ఫండ్స్‌ను ఆవిష్కరించింది. క్రిసిల్‌ ఐబీఎక్స్‌ 50:50 గిల్ట్‌ ప్లస్‌ ఎస్‌డీఎల్‌ ఏప్రిల్‌ 2037 ఇండెక్స్‌ ఫండ్‌తో పాటు 2027 జూన్‌లో మెచ్యూర్‌ అయ్యే ఫండ్‌ వీటిలో ఉన్నాయి. ఈ తరహా ఫండ్స్‌లో 15 ఏళ్ల సుదీర్ఘ మెచ్యూరిటీతో ఫండ్‌ను ప్రవేశపెట్టడం దేశీయంగా ఇదే ప్రథమమని సంస్థ ఎండీ రాధికా గుప్తా తెలిపారు. ఈ ఫండ్‌లు ప్రధానంగా భారత ప్రభుత్వ బాండ్లు (ఐజీబీ), రాష్ట్ర అభివృద్ధి రుణాల్లో (ఎస్‌డీఎల్‌) ఇన్వెస్ట్‌ చేస్తాయి. 2037 ఇండెక్స్‌ ఫండ్‌ అక్టోబర్‌ 6న, 2027 ఇండెక్స్‌ ఫండ్‌ అక్టోబర్‌ 11న ముగుస్తాయి. రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement