స్టాక్ మార్కెట్ బ్రోకరేజీ కంపెనీ ఎడిల్‌వైజ్ ఎండీ, సీఈవో రాధికాగుప్తా ఇటీవల ట్విట్టర్‌లో చేసిన పోస్టుకు నెట్టింట విపరీతమైన స్పందన వస్తోంది. తన దృష్టిలో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే వివరిస్తూ ఇటీవల రాధికగుప్తా ట్విట్టర్‌లో ఓ పాతకాలం నాటి బ్యాగ్ ఫోటోను షేర్ చేశారు.
ఈ బ్యాగు నాకెంతో ప్రత్యేకం. పదిహేనేళ్ల కిందట నా మొదటి జీతంతో మొదటిసారిగా కొనుక్కున్న బ్యాగ్ ఇది. నా సంపాదన, నా ఇష్టం, నాకు నచ్చిన వస్తువు... పుస్తకాల్లో చెప్పని ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఇదే. డబ్బు అనేది నంబర్లలో ఉండదు, ఒకరితో పోటీ పడటంతో ఉండదు. అదొక ఎమోషన్ అంటూ తన అభిప్రాయం వెల్లడించారు రాధిక గుప్తా.
రాధిక గుప్తా ట్వీట్‌కు నెటిజన్లు, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు, ఉద్యోగుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఓ ఐసీఐసీఐ ఉద్యోగి తన అభిప్రాయం చెబుతూ.. ఎనిమిది నెలల పాటు ఐసీఐసీఐలో జాబ్ చేశాక.. కూడబెట్టిన సొమ్ముతో బేసిక్ ఫోన్ కొనుక్కున్నానని.. ఆ తర్వాత అనేక వస్తువులు కొన్నా.. ఆ ఫోన్ తనకు ఎప్పటికీ ప్రత్యేకం అంటూ చెప్పుకొచ్చాడు. మరో నెటిజన్ నా మొదది సంపాదన నుంచి 100 డాలర్లు మా అమ్మకు పంపించానని.. ఇప్పటికీ అమ్మ ఆ వంద డాలర్లు దాచి ఉంచిందంటూ ఎమోషన్ పోస్ట్ చేశారు. ఇలాంటి పోస్టులు వచ్చి పడుతూనే ఉన్నాయి. సంపాదన, సక్సెస్, ఇండిపెండెన్స్‌కి అసలైన అర్థాలను పట్టి చూపుతున్నాయి.
Money is not just a number, nor is it a contest. It is emotional, earned to be invested yes but ultimately enjoyed.
— Radhika Gupta (@iRadhikaGupta) April 10, 2022
A special money memory is this 15y old handbag, my first fun purchase from my own salary. It speaks to me about financial independence in a way no book can! pic.twitter.com/wxijZ0PJup
ఓ స్టాక్ బ్రోకరేజ్ కంపెనీ స్థాపించి దాని సక్సెస్‌ఫుల్‌గా నిలబెట్టారు రాధిక గుప్తా. ఒక బ్రొకరేజ్ సంస్థగా ఏ స్టాక్స్ కొనాలి, ఏ స్టాక్స్‌ని అమ్మాలంటూ నిత్యం సూచనలు చేస్తుంటారు. అలాంటి రాధిక గుప్తా నుంచి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది నంబర్లలో ఉండదు ఎమోషన్‌లో ఉంటుందని పేర్కొనడం నెటిజన్లు విపరీతంగా ఆకర్షిస్తోంది.
చదవండి: ఆ విషయాన్ని బోర్డు చూసుకుంటుంది,'అష్నీర్' నిధుల దుర్వినియోగంపై సమీర్!
Comments
Please login to add a commentAdd a comment