ఎడెల్వీస్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ సీఈఓ రాధికా గుప్తాకు మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ షాకిచ్చింది. మ్యూచువల్ ఫండ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కంపెనీతోపాటు దాని సీఈఓ రాధికా గుప్తా, ఫండ్ మేనేజర్ త్రిదీప్ భట్టాచార్యపై మొత్తం రూ.16 లక్షల జరిమానా విధించింది.
సెబీ విడుదల చేసిన ఆదేశాల ప్రకారం.. మొత్తం రూ.16 లక్షల జరిమానాలో విడిగా ఎడెల్వీస్ అసెట్ మేనేజ్‌మెంట్‌పై రూ. 8 లక్షలు, సీఈవో రాధికా గుప్తా, ఫండ్ మేనేజర్ భట్టాచార్యలకు చెరో రూ. 4 లక్షలు చొప్పున జరిమానా విధించింది. ఈ పెనాల్టీలను 45 రోజుల్లోగా చెల్లించాలని సెబీ ఆదేశించింది.
ఇదీ చదవండి: ట్రేడింగ్ చేస్తున్నారా? ఆర్బీఐ హెచ్చరిక
ఫోకస్డ్ ఫండ్స్ స్పష్టంగా (ట్రూ-టు-లేబుల్) ఉంటున్నాయా.. లేదా అనేదానిపై సెబీ పరిశ్రమవ్యాప్త సమీక్ష చేపట్టింది. ఇందులో ఎడెల్వీస్ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ (EFEF) 88 రోజులలో 'గరిష్టంగా 30 స్టాక్‌లలో పెట్టుబడి పెట్టే ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం' నిబంధనను ఉల్లంఘించినట్లు సెబీ గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment