తిరువనంతపురం నుంచి బయలుదేరిన ఎమిరెట్స్ విమానం దుబాయ్‌లో పెనుప్రమాదానికి గురైంది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ విమానం దిగుబోతుండగా క్రాష్ ల్యాండ్ అయి.. పొగలు, మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగలు అలుముకున్నాయి. అయితే, అదృష్టవశాత్తు.. పెనుముప్పు, ప్రాణహాని తప్పింది. పైలట్ల అప్రమత్తత వల్ల ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గురైన విమానం నుంచి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.