శంషాబాద్ విమానాశ్రయాన్ని గురువారం ఉదయం దట్టమైన పొగమంచు కప్పేసింది. దాంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయాన్ని గురువారం ఉదయం దట్టమైన పొగమంచు కప్పేసింది. దాంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయ అధికారులు దుబాయ్ నుంచి హైదరాబాద్ రావల్సిన ఎమిరేట్స్ ఈకె 524 విమానాన్ని చెన్నైకి మళ్లించారు. అలాగే హైదరాబాద్ నుంచి బయల్దేరాల్సిన పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. మరోవైపు ఎయిర్ ఇండియా విమానం రెండు గంటల ఆలస్యంగా బయలుదేరనుంది.