
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్(పాత చిత్రం)
సాక్షి, హైదరాబాద్: పెథాయ్ ప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. హైదరాబాద్ నగర శివార్లలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలించకపోవడంతో హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన పలు విమానాలు ఆలస్యంగా నుడుస్తున్నాయి. మరికొన్నింటిని బెంగళూరుకు మళ్లించారు.