
న్యూఢిల్లీ: ఈరోజు (సోమవారం) ఢిల్లీ ప్రజలు తెల్లవారుజామున నిద్ర నుంచి లేస్తూనే భూకంప ప్రభావానికి లోనయ్యారు. భయంతో వణికిపోతూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 5 గంటల 36 నిముషాలకు సుమారు 55 సెకెన్లపాటు ఢిల్లీలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.0గా నమోదయ్యింది. భూకంపం వచ్చిన సమయంలో తమకు ఎదురైన అనుభవాలను పలువురు ట్వట్‌ల ద్వారా పంచుకున్నారు.
Earthquake in Delhi NCR pic.twitter.com/XQwyhc8PvI
— Navneet K Singh (@Navneet_K_Singh) February 17, 2025
‘ఎక్స్’ ప్లాట్‌ఫారంపై నవనీత్ సింగ్ అనే యూజర్ భూకంపం సమయంలో తమ ఇంటిలో కదులుతున్న ఫ్యానుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. మరో యూజర్ బాంబు పేలిందని అనుకున్నామని రాశారు.
You know it's a massive one when it forces you out of your sleep and out of bed. #earthquake
— Sarah Waris (@swaris16) February 17, 2025
@swaris16 అనే యూజర్ ‘ఆ సమయంలో వచ్చిన భారీ శబ్ధం నిద్ర ఎగిరిపోయేలా చేసింది’ అని రాశారు. దీనిని చూసిన ఒక యూజర్ ‘ఆ శబ్ధం ఉలిక్కిపడేలా చేసిందని’ పేర్కొన్నారు.
Severe #earthquake tremors in #Delhi at 0537 am
I was in hospital. Yet to evacuate all a patients down. Told those who can walk to go down— Anish K Gupta (@optionurol) February 17, 2025
అనిష్ అనే యూజర్ ‘ఢిల్లీలో ఉదయం 05:37కు తీవ్రమైన ప్రకంపన వచ్చింది. ఆ సమయంలో నేను ఆస్పత్రిలో ఉన్నాను. ఇక్కడి సిబ్బంది అందరినీ బయటకు పంపించివేశారు’ అని రాశారు.
Very strong earthquake for a couple of seconds here in delhi. The whole society is up!
— Worah | #WalkingInDelhi (@psychedelhic) February 17, 2025
ఇంకొక యూజర్ ‘ఢిల్లీలో కొద్ది సెకెన్లపాటు భూకంపం వచ్చింది. సొసైటీలోని వారంతా ఉలిక్కిపడ్డారు’ అని రాశారు. మరొకరు ‘ఇది భయానక అనుభవం’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment