AirIndia Flight
-
‘నవంబరు 1-19 వరకు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించొద్దు’
దేశంలో విమానలకు గత కొన్ని రోజులుగా వరుసగా బాంబు బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాల వేళ ఖలిస్థానీ వేర్పాటువాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ.. విమానాలకు సంబంధి హెచ్చరికలు చేయడం తీవ్ర కలకలం రేపింది. నవంబరు 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని గురుపత్వంత్ సింగ్ ప్రయాణికులను హెచ్చరించాడు.భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు కావొస్తున్న సందర్భంగా ఎయిర్ ఇండియా విమానాలపై దాడి జరిగే అవకాశం ఉందని, కావును ఆయా తేదీల్లో ఆ సంస్థ విమానాల్లో ప్రయాణించొద్దంటూ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నాడు. కాగా సిక్కుల ఫర్ జస్టిస్ (ఎస్జేఎఫ్) వ్యవస్థాపకుడైన పన్నూ ఇలాంటి హెచ్చరికలు చేయడం ఇది మొదటి సారి కాదు. గతేడాది కూడా నవంబర్ నెలలోనే ఇలాంటి బెదిరింపులే చేశాడు. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించొద్దని సూచించాడు. లేని పక్షంలో మీ ప్రాణాలకు ముప్పు ఉంటుందని హెచ్చరించాడు. ‘నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దని సిక్కు ప్రజలను కోరుతున్నాం. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ ఇండియాను దిగ్బంధిస్తాం. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దు. లేదంటే మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది’ అని పేర్కొన్నాడు.అంతేగాక నవంబరు 19న దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆ రోజు మూతపడుతుందని, దాని పేరు కూడా మార్చేస్తామని గతేడాది అతడు ఓ వీడియోలో హెచ్చరించాడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (ఉపా) కింద భారత ప్రభుత్వం పన్నూను 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇతడికి కెనడాతోపాటు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. -
ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు
-
ఎయిరిండియా విమానంలో బాంబు?
ఎయిరిండియా విమానంలో బాంబు ఉందని బెదిరింపు సమాచారం రావడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముంబై నుంచి న్యూయార్క్‌కు వెళ్లే ఎయిరిండియా ఇండియా విమానాన్ని వెంటనే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించారు. అప్పటికే అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ పోలీసులు అవసరమైన భద్రతా చర్యలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు సమాచారం అందింది. అప్పటికే విమానం టేకాఫ్ అవ్వడంతో పైలట్‌కు సమాచారం అందించి వెంటనే విమానాన్ని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(ఐజీఐ)కు మళ్లించాం. అప్పటికే ఎయిర్‌పోర్ట్‌లో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అంబులెన్స్ సదుపాయాలు ఏర్పాటు చేశాం. విమానం ఎయిర్పోర్ట్ చేరిన వెంటనే ప్యాసింజర్లను సురక్షితంగా వేరేచోటుకు చేరవేశాం. భద్రతా సిబ్బంది విమానంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ విమానం న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ బాంబు బెదిరింపు సమాచారం ఎవరు పంపారు..ఎక్కడి నుంచి తమకు సమాచారం వచ్చిందో మాత్రం ఇంకా తెలియరాలేదు.ఇదీ చదవండి: ఇంట్లో ఎంత బంగారం ఉండాలంటే..ఇటీవల తిరుచిరాపల్లి నుంచి షార్జా వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంతో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో టేకాఫ్ అయిన విమానం వీల్స్ లోపలికి ముడుచుకోలేదు. హైడ్రాలిక్స్ సమస్య కారణంగా ఇలా జరిగినట్లు తెలిసింది. వెంటనే పైలట్ గ్రౌండ్ సిబ్బందికి సమాచారం అందించారు. దాదాపు రెండు గంటలు గాల్లో ఉన్న విమానాన్ని సురక్షితంగా తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేసి చర్యలు చేపట్టారు. -
శంషాబాద్: ఎయిరిండియా ప్రయాణికుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం సాయంత్రం ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానాన్ని హఠాత్తుగా రద్దు చేయడంతో ప్రయాణికులు అందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం(91879)లో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే బోర్డింగ్ అనంతరం ఫ్లైట్ రద్దు అయినట్లు ప్రకటించారు. రెండు గంటలుగా ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు పడ్డ ప్రయాణికులు.. చివరకు ఆందోళనకు దిగారు. విమానంలో మొత్తం 147 ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై అదనపు సమాచారం అందాల్సి ఉంది. -
ఎయిర్ఇండియా బాహుబలి!
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా వాకిట్లోకి మరో కొత్త విమానం వచ్చి చేరింది. అతిపెద్ద బాడీ కలిగిన ఏ350-900 సర్వీస్ శనివారం ఎయిర్ ఇండియాతో జతైంది. యూరప్‌కు చెందిన విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ రూపొందించిన ఈ సర్వీసు దిల్లీలోని ఇందీరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి వైడ్‌బాడీ విమాన సర్వీసును నిర్వహిస్తున్న సంస్థల్లో ఎయిర్ ఇండియానే మొదటిది కావడం విశేషం. దీంతోపాటు వచ్చే మార్చిలోగా మరో 5 విమానాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటించింది. మొత్తం 20 ఏ350-900 సర్వీసులను ఆర్డర్ చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ ఏడాది మొదట్లో ఎయిర్ ఇండియా 40 ఏ350ఎస్ విమానాలు, 40 ఏ350-900, ఏ350-1000 ఎయిర్క్రాఫ్ట్లతోపాటు 140 చిన్న సైజు ఏ321, 70 ఏ320 నియో విమానాలకు ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎయిర్ ఇండియా A350-900 విమానం కాన్ఫిగరేషన్లు.. క్యాబిన్లో మెరుగైన సౌలభ్యం కోసం ఫ్లాట్ బెడ్లతో 28 ప్రైవేట్ బిజినెస్ క్లాస్ సూట్లు ఉన్నాయి. అదనంగా 24 ప్రీమియం ఎకానమీ సీట్లు ఉన్నాయి. క్యాబిన్లో 264 ఎకానమీ క్లాస్ సీట్లున్నాయి. అన్ని తరగతుల్లో హైడెఫినిషన్ స్క్రీన్లు అందుబాటులో ఉంచారు. సుమారు ఇందులో 320 మంది ప్రయాణించవచ్చు. క్రూ సిబ్బంది ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇటీవల రూపొందించిన కొత్త యూనిఫామ్‌లో కనిపించనున్నారు. ఎయిర్ ఇండియా A350 జనవరి 2024లో వాణిజ్య సేవలను ప్రారంభించనుంది. ప్రాథమికంగా ఈ సర్వీస్ కొన్నిరోజులు దేశీయంగా సేవలందిస్తుందని సంస్థ ప్రకటించింది. ఆ తర్వాత విదేశాల్లోని ఇతర ప్రాంతాలకు దీని సేవలను విస్తరించనున్నారు. ఏటా వెయ్యి కోట్లు ఆదా భారతీయ వైమానిక దళం అధీనంలో ఉన్న గగనతలాన్ని వినియోగించుకోవడం వల్ల విమానయాన సంస్థలకు ఏటా వెయ్యి కోట్ల రూపాయల వరకు ఆదా కానున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశీయంగా వినియోగిస్తున్న గగనతలంలో 30 శాతం వైమానిక దళం అధీనంలో ఉంది. ఈ గగనతలాన్ని వినియోగించుకోవడం వల్ల విమానం నడిచే సమయం తగ్గనుందని, చమురు వినిమయం, ఉద్గారాలు మరింత తగ్గుతాయని మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ నెల 18 నాటికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) 1,562 మంది కమర్షియల్ పైలెట్లకు లైసెన్స్‌లు జారీ చేసింది. వైమానిక దళం వినియోగిస్తున్న ఏరోస్పేస్లో 40 శాతం వృథాగా ఉందని పేర్కొంది. ఇదీ చదవండి: వారాంతపు సెలవులపై అభిప్రాయం మార్చుకున్న బిల్‌గేట్స్ -
ఎయిరిండియా నడి విమానంలో మలమూత్రవిసర్జన.. అరెస్ట్
ముంబై: విమాన ప్రయాణికుల అనుచిత/అభ్యంతరకర ప్రవర్తనల ఘటనలు ఈమధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లోకి ఎక్కుతున్నాయి. తాజాగా గగనతలంలో ఉన్న ఎయిరిండియా విమానంలో.. అదీ నడి విమానంలో ఓ ప్రయాణికుడు మలమూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో తీవ్ర ఇబ్బందికి గురైన ప్రయాణికులు ఆందోళన చేపట్టగా.. సదరు ప్రయాణికుడిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. సోమవారం పోలీసులు రిలీజ్ చేసిన ఎఫ్ఐఆర్లో.. జూన్ 24వ తేదీన ముంబై-ఢిల్లీకి చెందిన ఎయిరిండియా విమానం ఏఐసీ 866 ప్రయాణంలో ఉంది. అయితే.. విమానం తొమ్మిదో వరుసలో సీట్ నెంబర్ 17ఎఫ్‌లో కూర్చున్న రామ్ సింగ్ అనే ప్రయాణికుడు ఈ పని చేశాడు. మద్యం మత్తులోనే అతను ఈ చర్యకు దిగాడు. అతని చర్యతో ప్రయాణికులు ఇబ్బంది పడి.. సిబ్బంది వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. అతని అనుచిత ప్రవర్తన గుర్తించిన విమాన సిబ్బంది హెచ్చరించడంతో పాటు పైలట్ ఇన్ కమాండోకు సమాచారం అందించారు. వెంటనే సమాచారం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లగా.. దిగగానే రామ్‌సింగ్ ఎయిరిండియా భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. ఐపీసీలోని సెక్షన్లు 294, 510 ప్రకారం అతనిపై కేసు నమోదు అయ్యింది. ఇదీ చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో పూరీ జగన్నాథుడు.. తీవ్ర దుమారం -
విశాఖలో ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
ఎయిర్ఇండియా నిర్లక్ష్యం.. ఆఖరి నిమిషంలో విమానం రద్దు
సాక్షి, విశాఖ: ఎయిర్ఇండియా నిర్లక్ష్య వైఖరి మరోసారి వెలుగుచూసింది. గతంలో పలుమార్లు అప్పటికప్పుడు విమాన సర్వీసులను రద్దు చేసి ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఎయిర్ఇండియా.. తాజాగా మరోసారి ఉన్నపళంగా విమాన సర్వీస్‌ను రద్దు చేసింది. శనివారం విశాఖ నుండి ఢిల్లీ వెళ్లవలసిన సర్వీసును ఆకస్మికంగా రద్దు చేసింది ఎయిర్ఇండియా విమానాయాన సంస్థ. దాంతో ప్రయాణికుల్లో ఒక్కసారిగా ఆందోళన రేకెత్తింది. సుమారు 20 మంది ప్యాసింజర్లు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రి 9 గంటలకు బయల్దేరాల్సిన ఫ్లైట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో సదరు ప్రయాణికులు మెయిల్‌కు సమాచారం ఇవ్వడంలో కూడా జాప్యం చేసింది.ఆఖరి నిమిషంలో సమాచారం ఇవ్వడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
క్షమాపణలు చెప్పిన ఎయిరిండియా
ఢిల్లీ: సాంకేతిక సమస్యతో రష్యాకు విమానం దారి మళ్లింపు, అక్కడ మారుమూల ప్రాంతంలో అరకోర సౌకర్యాల నడుమ పడిగాపులు పడిన వ్యవహారంపై ఎయిరిండియా స్పందించింది. ప్రయాణికులందరికీ క్షమాపణలు తెలియజేస్తూ.. వాళ్ల టికెట్ డబ్బులను తిరిగి ఇవ్వడంతో పాటు బోనస్‌గా ట్రావెల్ వౌచర్లను ఇస్తామని ప్రకటించింది. మంగళవారం న్యూఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తున్న క్రమంలో ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 777 ఎయిర్‌క్రాఫ్ట్‌లోని ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో 216 మంది ప్యాసింజర్లు, 16 మంది సిబ్బందితో కూడిన విమానాన్ని రష్యా మగడాన్ ఎయిర్‌పోర్ట్‌కు తరలించారు. మాస్కో నుంచి 10వేల కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం. మారుమూల పట్టణం కావడంతో అరకోర సౌకర్యాలతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే దాదాపు 36 గంటల తర్వాత.. ప్రత్యామ్నాయ విమానం అక్కడికి చేరుకుని ఈ ఉదయం శాన్ ఫ్రాన్సిస్కోకు ప్రయాణికులను చేర్చింది. ఈ పరిణామంపై క్షమాపణలు చెబుతూ ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ & గ్రౌండ్ హ్యాండిలింగ్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి, అంతరాయానికి క్షమాపణలు చెబుతున్నామని, టికెట్ ఎమౌంట్‌ను రిఫండ్ చేయడంతో పాటు ట్రావెల్ వౌచర్లను స్వీకరించాలంటూ మనస్ఫూర్తిగా క్షమాపలంటూ ప్రకటనలో పేర్కొన్నారాయన. ఇక ఈ పరిణామంపై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. -
రష్యా నుంచి.. మరో ఎయిరిండియా విమానంలో తరలింపు
రష్యా: సాంకేతిక లోపం కారణంగా అత్యవసర పరిస్థితుల్లో రష్యా మగడాన్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ లోని ప్యాసింజర్లు మరియు సిబ్బందిని శాన్ ఫ్రాన్సిస్కో చేరవేసేందుకు ప్రత్యామ్నాయంగా మరో ఫ్లైట్ ను ఏర్పాటు చేసింది ఎయిర్ ఇండియా. ఈ ఫ్లైట్ రష్యా మగడాన్ ఎయిర్ పోర్టు నుంచి శాన్ ఫ్రాన్సిస్కో ప్రయాణమైనట్లుగా ఎయిర్ ఇండియా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ప్రయాణికుల అవస్థలు.. ఢిల్లీ నుండి శాన్ ఫ్రాన్సిస్కో ప్రయాణమైన ఎయిర్ ఇండియా ఫ్లైట్ బోయింగ్ 777 కు గగనతలంలో ఏర్పడిన చిన్న సాంకేతిక లోపం కారణంగా రష్యాలోని మగడాన్ ఎయిర్ పోర్టులో ఎమెర్జెన్సీ ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న 216 ప్రయాణికులతో పాటు 16 మంది సిబ్బందిని అప్పటికప్పుడు సమీప పట్టణంలో తాత్కాలిక వసతి ఏర్పాటు చేసింది ఎయిర్ ఇండియా. అయితే.. అక్కడ వారికి సరైన సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. మరో గత్యంతరం లేక నేల మీదే నిద్రకు ఉపక్రమించారు. దీనికి సంబంధించిన కథనాలు సోషల్ మీడియా, మీడియాలోనూ వైరల్ అయ్యాయి. దీంతో ఎయిరిండియా నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ప్రత్యామ్నాయ ఫ్లైట్ ఏర్పాటు చేయడంతో ప్రయాణికులందరికీ ఊరట కలిగింది. ఫ్లైట్ బయలుదేరింది.. ఈ నేపథ్యంలో రష్యా మగడాన్ ఎయిర్ పోర్టు నుండి బయలుదేరిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసిన ఎయిర్ ఇండియా సాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్టులో ఈ ఫ్లైట్ లోని పాసింజర్లకు మరోసారి ఎటువంటి అసౌకర్యం కలగకుండా రిసీవ్ చేసుకునేందుకు అక్కడి ఎయిర్ పోర్టులో సహాయక సిబ్బంది సంఖ్యను పెంచి వారిని అప్రమత్తం చేసినట్లు కూడా వెల్లడించింది. UPDATE: AIR INDIA FLIGHT AI173D TAKES OFF FOR SAN FRANCISCO FROM MAGADAN Flight AI173D from Magadan, Russia (GDX) is now airborne for San Francisco (SFO), carrying all passengers and crew. The flight departed GDX at 1027 Hours on 08 June 2023 (local time) and is expected to… — Air India (@airindia) June 7, 2023 -
ఎయిరిండియా విమానం రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండ్
ఢిల్లీ: ఎయిరిండియాకు చెందిన విమానం రష్యాలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. భారత కాలమానం ప్రకారం ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఆ విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో విమానంలో 216 మంది ప్రయాణికులు, 16 మంది ఎయిర్ఇండియా సిబ్బంది ఉన్నారు. ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో ఢిల్లీ నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్లాల్సిన విమానాన్ని దారి మళ్లించామని, రష్యా మగడాన్ ఎయిర్‌పోర్ట్‌లో అది సురక్షితంగానే ల్యాండ్ అయినట్లు ఎయిరిండియా ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ప్రయాణికులు ఎలాంటి అంతరాయం లేకుండా తమ తమ గమ్యస్థానాలు చేర్చేందుకు వీలైనంత త్వరగా కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. Air India flight AI173 operating from Delhi to San Francisco developed a technical issue with one of its engines. The flight with 216 passengers and 16 crew was diverted and landed safely at Magadan airport in Russia. The passengers are being provided with all support on ground… https://t.co/Sq6RmNzbea — ANI (@ANI) June 6, 2023 -
ఆయిల్ లీక్.. ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
న్యూఢిల్లీ: అమెరికా నెవార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం స్వీడన్ స్టాక్‌హోమ్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక లోపంతో ఇంజిన్ నుంచి ఆయిల్ లీక్ కావడం వల్ల విమానాన్ని స్వీడన్‌కు దారిమళ్లించాల్సి వచ్చింది. ఫ్లైట్‌లో మొత్తం 300 మంది ప్రయాణికులున్నారు. అయితే విమానంలో అందరూ సురక్షితంగానే ఉన్నారని, స్టాక్‌హోం విమానాశ్రయానికి ఫైర్ ఇంజిన్లకు కూడా తరలించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆయిల్ లీక్ కారణంగా విమానం రెండో ఇంజిన్ ఆగిపోయిందని, అందుకే అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని డీజీసీఏ సీనియర్ అధికారి చెప్పారు. సమస్యను గుర్తించామని, ఇన్స్పెక్షన్ జరుగుతోందని పేర్కొన్నారు. సోమవారం కూడా న్యూయార్క్ నుంచి ఢిల్లీ రావాల్సిన విమానం లండన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా దీన్ని దారిమళ్లించారు. చదవండి: స్నూపింగ్ కేసు: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు భారీ షాక్.. -
విమానంలో అందరిముందే ప్రియురాలికి లవ్ ప్రపోజ్
-
Viral Video: విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌కు సర్ప్రైజ్ లవ్ ప్రపోజ్
ప్రేమ అనేది ఒక మధురానుభూతి. రెండు జీవితాలను ఒక్కటి చేస్తుంది. ప్రేమలో పడిన వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఏదో ఒక సమయంలో అయినా ఎవరో ఒకరి మనసును దోచుకునే ఉంటారు. లవ్‌లో పడటం సహజమే. కానీ, ఆ ప్రేమను వ్యక్తపరచడం మాత్రం అంత తేలికైన వ్యవహారం కాదు. మన ప్రేమను అంగీకరిస్తారా.ఛీ కొడతారా అనే టెన్షన్ మనుసును మెలిపెడుతుంటుంది. అందుకే ప్రపోజ్ చేయడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తుంటారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఢిఫరెంట్ పద్దతుల్లో తమ చెలికి మనసులో మాటను చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి కూడా ఇలాంటి ఆలోచనే చేశాడు. ఏకంగా విమానంలో ప్రియురాలికి లవ్ ప్రపోజ్ చేశాడు. వివరాలు.. జనవరి రెండో తేదిన ఓ యువతి ముంబైకు విమానంలో ప్రయాణించింది. ఆమె ఎయిర్ ఇండియాలో ప్రయాణిస్తున్నట్లు తెలుసుకున్న ప్రియుడు కూడా అదే విమానంలో టికెట్ బుక్ చేసుకున్నాడు. తన ప్రేయసికి వినూత్నంగా ప్రపోజ్ చేయాలని భావించి ఇందుకు విమాన సిబ్బంది సాయం కోరాడు. విమానం టేకాఫ్ అయ్యాక ఓ చార్ట్ పట్టుకొని మెల్లగా ప్రియురాలు కూర్చున్న సీట్ వద్దకు వచ్చాడు. చదవండి: ప్రేమలో పడ్డారు సరే, ‘831 224’ అని ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా? ఆమె దగ్గరకు చేరుకున్న తర్వాత ఫేస్ మాస్క్ తీసి నవ్వాడు. ఊహించని సర్ప్రైజ్తో షాక్ అయిన యువతి అసలు ఏం జరుగుతుందో నమ్మలేకపోతుంది. అతడు కొన్ని ఫోటోలతోపాటు ‘నేను ఎప్పటికీ నీతో జీవించాలనుకుంటున్నాను.. నువ్వు కూడా నాతో కలిసి జీవిస్తావా’ అని రాసి ఉన్న చార్ట్‌ను ఆమెకు చూపించాడు. అది చూసిన యువతి ఆశ్చర్యపోతుంది. వెంటనే తన సీట్ నుంచి లేచి యువతి ముందుకు రావడంతో ఆ వ్యక్తి తన మొకాలిపై కూర్చొని వెంట తెచ్చిన బాక్స్ నుంచి రింగ్ తీసి ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా ఆనందంతో ఆ వ్యక్తిని కౌగిలించుకొని అతని చెంపై ముద్దు పెట్టింది. విమానంలోని మిగతా ప్రయాణికులు చప్పట్లతో ఈ జంటను అభినందించారు. ఇక దీన్నంతటిని తోటి ప్రయాణికుడు వీడియో తీశాడు. ఈ వీడియోను రమేష్ కొట్నానా అనే వ్యక్తి లింక్డ్ఇన్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఇది నెటిజన్ల హృదయాలను హత్తుకుంటుంది. ‘చూడచక్కని జంట.. ఎంతో అద్భుతంగా ప్రపోజ్ చేశాడు.. నిజమైన ప్రేమ’ అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా గత కొన్ని రోజులుగా ఎయిర్ ఇండియా తరుచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే విమానాల్లో మూత్ర విసర్జన సంఘటనలు చోటుచేసుకున్న తరుణంలో ఈ వీడియో క్లిప్ వెలుగు చూడటం విశేషం. -
ఆ ప్రబుద్ధుడి ఉద్యోగం ఊడింది
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో మహిళపై మూత్రవిసర్జన చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబైవాసి శంకర్ మిశ్రాపై అతడు పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం వేటు వేసింది. ఉద్యోగంలోనుంచి తొలగించింది. శంకర్ మిశ్రా వెల్స్ ఫార్గో అనే బహుళజాతి సంస్థలో ఇండియా చాప్టర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నాడు. తమ సంస్థలో పనిచేసే సిబ్బంది వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ హుందాగా ప్రవర్తించాలని తాము కోరుకుంటున్నామని వెల్స్ ఫార్గో్గ ఒక ప్రకటనలో వెల్లడించింది. శంకర్ మిశ్రా చేసిన పని తమకు తలవంపులు తెచ్చిందని పేర్కొంది. కేసు పెట్టొద్దని వేడుకున్నాడు విమానంలో ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన ఘటనలో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనకు తీవ్ర అవమానం జరిగిందని, నిందితుడి ముఖం చూడాలంటే అసహ్యం వేసిందని బాధితురాలు వెల్లడించారు. కేసు పెట్టొద్దని వేడుకున్నాడని, క్షమాపణ కోరాడని చెప్పారు. -
నెల రోజుల్లో రెండో ఘటన.. ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో మరో దారుణం ..
న్యూడిల్లీ: న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన తెలిసిందే. గత ఏడాది నవంబర్ 26న జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ దారుణం మరవకముందే అదే ఎయిర్ ఇండియా విమానంలో తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. పారిస్- ఢిల్లీ విమానంలో తాగిన మత్తులో ఓ వ్యక్తి మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై మూత్ర విజర్జన చేశాడు. ఈ దిగ్భ్రాంతికర ఘటన డిసెంబర్ 6న ఎయిర్ ఇండియా విమానం 142లో చోటుచేసుకుంది. విమానం ఉదయం 9.40 గంటలకు ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వడంతో ఈ విషయంపై పైలెట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించాడు. ప్రయాణికుడు మద్యం సేవించి ఉండటం వల్ల క్యాబిన్ సిబ్బంది సూచలను పాటించలేదని అతడు పేర్కొన్నారు. అనంతరం అతను తోటి మహిళా ప్యాసింజర్ దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడని తెలిపారు. విమానం దిగిన వెంటనే ఈ నీచానికి పాల్పడిన వ్యక్తిని ఎయిర్ పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తన అసభ్య ప్రవర్తనపై ప్రయాణికుడు రాతపూర్వక క్షమాపణ తెలిపాడు. దీంతో ఇద్దరుప్రయాణికులు పరస్పర రాజీ కుదుర్చుకోవడంతో అతనిపై చర్యలు తీసుకోకుండా విడిచిపెట్టారు. కాగా నెల రోజుల వ్యవధిలోనే రెండు ఘటనలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకుముందు అమెరికాలోని న్యూయర్క్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో మద్యం మత్తులో ఉన్న 70 ఏళ్ల వృద్ధుడు.. సీట్లో కూర్చున్న ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. దీంతో విమానంలో తనకు జరిగిన అవమానంపై బాధితురాలు ఎయిర్ ఇండియా అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. అధికారులు ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వృద్ధుడిపై కేసు నమోదయ్యింది. అయితే విమానం ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత నిందితుడిని ఎయిర్ ఇండియా సిబ్బంది పట్టుకోకుండా వదిలేశారని బాధితురాలు ఆరోపించింది. ఆమెకు న్యాయం చేకూర్చేందుకు దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తామని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఎయిర్ ఇండియా నుంచి పూర్తి నివేదిక కోరామని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) స్పష్టం చేసింది. నిందితుడి కోసం గాలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీసు అధికారుల బుధవారం తెలియజేశారు. -
హైదరాబాద్ నుంచి బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం..
ముంబై: శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ బయలుదేరిన ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం తలెత్తటంతో విమానాన్ని అత్యవసరంగా ముంబైలో ల్యాండింగ్ చేశారు అధికారులు. విమానంలోని యెల్లో హైడ్రాలిక్ సిస్టమ్ పని చేయకపోవడంతో ముంబైకి మళ్లించినట్లు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్(డీజీసీఏ) అంధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి దుబాయికి శనివారం సాయంత్రం 143 మంది ప్రయాణికులతో బయలుదేరింది ఎయిరిండియా ఏ320 వీటీ-ఈఎక్స్‌వీ విమానం. సాంకేతిక సమస్యను గుర్తించి ముంబైకి మళ్లించారు. ముంబై విమానాశ్రయంలో సుపరక్షితంగా ల్యాండ్ అయినట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. విమానంలో ఏర్పడిన సమస్యను సంబంధిత సిబ్బంది పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. అయితే, సాంకేతిక సమస్యల కారణంగా విమానాలు దారి మళ్లించడం కొత్తేమీ కాదు. డిసెంబర్ 2వ తేదీన కన్నూర్ నుంచి దోహా వెళ్తున్న ఇండో విమానం 6ఈ-1715ని ముంబైకి మళ్లించారు. ప్రయాణికులను మరో విమానంలో గమ్యం చేర్చినట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: మధుమేహం పెరుగుదలలో చైనా, భారత్ పోటాపోటీ -
ఎయిర్ ఇండియా విమానంలో పాము కలకలం.. దర్యాప్తునకు డీజీసీఏ ఆదేశం
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాకు చెందిన విమానంలో పాము కనిపించడం కలకలం సృష్టించింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన బీ737-800 విమానం కేరళలోని కాలికట్ నుంచి బయలుదేరి దుబాయ్ ప్రయాణించింది. శనివారం దుబాయ్‌లో ల్యాండ్ అయిన తర్వాత కార్గో విభాగంలో పామును గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి కిందకు దించేశామని పేర్కొన్నారు. కాగా.. ఈ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. క్యాబిన్‌లోని పాము ఎలా వచ్చిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఎయిర్ ఇండియా అధికారులు వెల్లడించారు. బాధితులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్.. తప్పిన ప్రమాదం!
కోల్‌కతా: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానంలో ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురైన క్రమంలో విమానాన్ని కోల్‌కతాకు మళ్లించినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. విమానంలో మొత్తం 159 మంది ప్రయాణికులు ఉన్నారని వెల్లడించారు. ‘కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఓ ప్రయాణికుడు శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. బుధవారం సాయంత్రం 4.50 గంటల నుంచి 6.50 గంటల పాటు సుమారు 159 మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లో నిరీక్షించాల్సి వచ్చింది. ఆ తర్వాత విమానం ఢిల్లీకి బయలుదేరి వెళ్లింది. అస్వస్థతకు గురైన ప్రయాణికుడిని కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ’ అని తెలిపారు కోల్‌కతా విమానాశ్రయ అధికారులు. ఇదీ చదవండి: ‘2020లో సీట్లు తక్కువొచ్చినా సీఎం పదవి’.. బీజేపీ విమర్శలపై నితీశ్ క్లారిటీ -
ఎయిరిండియాకు ‘ప్రాధాన్యత’ ఉపసంహరణ!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసుల నిర్వహణకు సంబంధించి ఎయిరిండియాకు ఇస్తున్న ప్రాధాన్యతను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఉపసంహరించింది. ఎయిరిండియాకు ఇచ్చిన ట్రాఫిక్ హక్కులను ఇతర సంస్థలకు కేటాయించే ముందు.. కంపెనీ సమర్పించే ప్రణాళికలకు ప్రాధాన్యమిస్తామంటూ గత సర్క్యులర్‌లో పొందుపర్చిన నిబంధనను తాజాగా ఏప్రిల్ 19న జారీ చేసిన సర్క్యులర్‌లో తొలగించింది. పౌర విమాయాన రంగం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న ఏ ఎయిర్‌లైన్స్‌కైనా సదరు హక్కులను కేటాయిస్తామని పేర్కొంది. సాధారణంగా ఒక దేశ విమానయాన సంస్థలు మరో దేశానికి సర్వీసులు నడపాలంటే ఇరు దేశాలు చర్చించుకుని, ద్వైపాక్షిక విమాన సేవల ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయి. దానికి అనుగుణంగా ఆయా దేశాలు తమ ఎయిర్‌లైన్స్‌కి సర్వీసులు హక్కులను కేటాయిస్తాయి. ఎయిరిండియా ఇప్పటివరకూ ప్రభుత్వ రంగంలో ఉండటంతో ఈ హక్కుల విషయంలో దానికి ప్రాధాన్యత లభించేది. కానీ ప్రస్తుతం టాటా గ్రూప్ చేతికి వెళ్లి ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌గా మారడం వల్ల ప్రత్యేక హోదా కోల్పోయింది. -
విమానంలో ఉగ్రవాది.... హై టెన్షన్
పనాజీ: విమానంలో ఉగ్రవాది ఉన్నాడంటూ ఓ ప్రయాణికుడు హల్చల్ చేశాడు. దాంతో ప్రయాణికులు, అధికారులు తీవ్రంగా ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన గురువారం ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఎయిరింయా విమానంలో చోటు చేసుకుంది. వివరాలు.. జియా ఉల్ హక్(30) అనే వ్యక్తి తాను స్పెషల్ సెల్ అధికారిని అని.. విమానంలో టెర్రరిస్ట్ ఉన్నాడంటూ హల్చల్ చేశాడు. దాంతో ప్రయాణికులు, అధికారులు తీవ్ర టెన్షన్‌కు గురయ్యారు. ఇక డబోలిమ్ విమానాశ్రయంలో దిగిన వెంటనే అతడిని సీఐఎస్ఎఫ్ పోలీసులకు అప్పగించారు. విచారణలో జియా ఉల్ హక్కి మతి స్థిమితం సరిగా లేదని తెలిసింది. అతడు ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. స్థానిక ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతడిని పనాజీలోని మానసిక వ్యాధుల చికిత్స కేంద్రంలో చేర్చినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: కోయి గోలి నహీ చలేగా..) -
విమానంలోనే ప్రాణాలొదిలిన వ్యక్తి
తిరువనంతపురం : ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు మార్గమధ్యలోనే ప్రాణాలొదిలాడు. తిరువనంతపురం-షార్జా ఎయిరిండియా విమానంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడి వివరాలను ఇంకా గుర్తించాల్సి ఉందనీ అధికారులు తెలిపారు. ఈ విషాదం కారణంగా విమానం ఆలస్యంగా షార్జాకు బయలు దేరింది. తిరువంతనపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాత్రి 8.24 నిమిషాలకు విమానం బయలుదేరింది. ఇంతలో ఒక ప్రయాణికుడు అనారోగ్యానికి గురికావడంతో వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. కానీ అప్పటికే సదరు ప్రయాణీకుడు కన్నుమూశాడని వైద్యులు ధృవీకరించారు. ప్యాసింజర్ వివరాలను గుర్తించి, బంధువులకు సమాచారం ఇచ్చేందుకు ఎయిర్‌లైన్స్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎయిరిండియా విమానం 967 తిరువనంతపురం ప్రయాణీకులలో ఒకరు జబ్బుపడి మరణించంతో అత్యవసర ల్యాండింగ్ చేయవలసి వచ్చిందని ఎయిర్ ఇండియా ప్రతినిధి ధనుంజయ్ కుమార్ తెలిపారు. అతనికి సంబంధించిన వస్తువులను సిబ్బందికి అందజేసామన్నారు. అయితే ప్రయాణికుడి ఆకస్మిక మృతికి గల కారణాలు తెలియరాలేదన్నారు. -
ఎయిరిండియాపై మంచు లక్ష్మీ ఆగ్రహం
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాపై నటి మంచు లక్ష్మీ మండిపడ్డారు. ఎలాంటి కారణం చెప్పకుండా దాదాపు 4 గంటల పాటు తనను క్యూలైన్లో నిలబెట్టారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె తన ట్విటర్ అకౌంట్లో వరుస ట్వీట్లు చేశారు. ప్రయాణికులను ఎయిర్ ఇండియా అధికారులు కనీసం పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. దీంతో ఆహారం, నీళ్లు లేకుండా పలువురు ప్రయాణికులు పుణె ఎయిర్ పోర్టులో చిక్కుకున్నారని తెలిపారు. ‘ఎయిర్ ఇండియా విమానం బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు తొలుత బయలుదేరాల్సి ఉంది. అయితే నాలుగు గంటలైనా విమానం జాడ లేదు. మేము గట్టిగా నిలదీస్తే అక్కడి ఎయిర్ ఇండియా అధికారి జవాబు చెప్పకుండా వెళ్లిపోయాడు. మరో రెండు గంటల పాటు వేచిచూడమని చెప్పాడు. కానీ అసలు విమానం వచ్చిందా? లేదా? అనే విషయంపైనే స్పందించలేదు.చివరికి నేను హైదరాబాద్ కు ఫోన్ చేస్తే వాతావరణం బాగోలేని కారణంగానే విమానం రద్దయినట్లు తెలిసింది. అలా నాలుగు గంటల పాటు ప్రయాణికులను ఎయిర్ఇండియా టార్చర్ పెట్టింది.ప్రయాణికులను టార్చర్ పెట్టడంలో ఎయిర్ ఇండియాలో అంత ఆనందం ఎందుకుందో!’ అని మంచు లక్ష్మీ విమర్శించారు. ఈ మేరకు లక్ష్మీ వరుస ట్వీట్లు చేశారు. -
ఆకాశంలో విమానం : కాక్‌పిట్‌లో టెన్షన్
న్యూఢిల్లీ : విమానం గగనతలంలో ఉన్నప్పుడు ఏ సంఘటన జరిగినా అది అత్యంత ప్రమాదమే. విమానంలో ఉన్న ప్రయాణికులందరి ప్రాణాలు ఆ గాల్లోనే కలిసిపోతాయి. తాజాగా ఓ ఎయిరిండియా విమానం ఆకాశంలో ఎగురుతూ ఉండగానే ఓ వ్యక్తి, విమానాన్ని నియంత్రించే అత్యంత కీలకమైన వ్యవస్థ కాక్‌పిట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి తెగ రచ్చ రచ్చ చేశాడు. దీంతో ఎయిరిండియా విమానంలో తీవ్ర ఆందోళన నెలకొంది. విమానంలో ఉన్న 250 మంది ప్రయాణికులు తీవ్ర టెన్షన్‌కు గురయ్యారు. మిలాన్ నుంచి ఎయిరిండియా విమానం ఏఐ 138 న్యూఢిల్లీకి బయలుదేరింది. గుర్ప్రీత్ సింగ్ అనే ప్రయాణికుడు ఒక్కసారిగా కాక్‌పిట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. దీంతో గాల్లో ఉండగానే రూట్ మార్చేసిన విమానం తిరిగి మిలాన్ వెళ్లిపోయింది. మిలాన్‌లో ల్యాండ్ అయిన వెంటనే ఆ ప్రయాణికుడిని స్థానిక పోలీసులకు అప్పజెప్పింది. వెంటనే ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుకున్న సమయానికే మిలాన్ నుంచి ఈ విమానం టేకాఫ్ అయినప్పటికీ, ఓ విచిత్ర ప్రయాణికులు కాక్ పిట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడని ఎయిరిండియా పేర్కొంది. అప్పటికే విమానం గంటకు పైగా ప్రయాణించిందని తెలిపింది. ఈ గందరగోళంతో తిరిగి మిలాన్ వెళ్లాలని నిర్ణయించాం. ఇలా రెండు గంటల 37 నిమిషాల పాటు విమానం ఆలస్యమైంది. ఢిల్లీకి వెళ్లడానికి మళ్లీ సెక్యురిటీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే ఎయిర్‌క్రాఫ్ట్ తిరిగి బయలుదేరిందని ఎయిరిండియా ప్రకటన చేసింది. -
విమానంలో వాచిపోయేలా కుట్టిన నల్లులు, అయినా..
ముంబై : ఎయిరిండియా విమానమెక్కాలంటే.. ఇప్పుడందరూ వామ్మో అంటున్నారు. నల్లుల బెడదతో ప్రయాణికులు హడలిపోతున్నారు. అది కూడా బిజినెస్ క్లాస్‌లో అయ్యే సరికి ఎయిరిండియా తీవ్ర వివాదంలో చిక్కుకుంది. వారం క్రితం న్యూజెర్సీ నుంచి ముంబై వస్తున్న సౌమ్య శెట్టీ అనే మహిళా ప్రయాణికురాలికి నల్లులు చుక్కులు చూపించాయి. చేయి, కాలు, మెడ వాచిపోయేలా కుట్టాయి. ఆమెను మాత్రమే కాక, తన ముగ్గురు పిల్లలు నల్లుల నుంచి పడ్డ బాధ అంతా ఇంతా కాదు. ఆ మహిళా ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా ఇంటర్నెట్లో షేర్ చేసింది. నల్లులు కుట్టడం వల్ల దద్దుర్లు ఎక్కిన చేతితో కూడిన ఓ ఫోటోను, ఆమె ఎదుర్కొన్న తిప్పలను, ఎయిరిండియా నిర్లక్ష్యాన్ని ట్విటర్లో కడిగిపారేసింది. ల్యాండింగ్‌కు 30 నిమిషాల ముందు కూడా తనకు కనీసం సీట్లు మార్చుకునే అవకాశం ఇవ్వలేదని ట్విటర్ ద్వారా తన బాధను వెల్లబుచ్చుకుంది. ‘ముగ్గురు పిల్లలతో కలిసి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించడం నాకు సాయపడుతుంది అనుకున్నా. కానీ మమల్ని నల్లులు చేతిలు వాచిపోయేలా కుట్టాయి. అది చాలా బాధకరమైన రోజు. అయినప్పటికీ నేను అదే సీట్లో పడుకోవాల్సి వచ్చింది. తర్వాత రోజు ల్యాండింగ్ అయ్యే సమయంలో మా సీట్లను మార్చారు. ఇది చాలా ఘోరం! ముగ్గురు పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్న విషయం మీకు అర్థమవుతుందా?’ అంటూ ఎయిరిండియాను ఉద్దేశించి వరుస ట్వీట్లు చేసింది. అంతేకాక బిజినెస్ క్లాస్ టిక్కెట్లకు వెచ్చించిన తన మొత్తం మనీని రీఫండ్ చేయాలని ఎయిరిండియాను డిమాండ్ చేసింది. ఇదే విషయంపై మంగళవారం ఎయిరిండియా హెల్ప్‌లైన్ నెంబర్లకు కాల్ చేసి, ఈ-మెయిల్ కూడా పంపింది. కానీ ఎయిరిండియా నుంచి ఆమెకు ఎలాంటి స్పందన రాలేదు. దీంతో దగ్గర్లో ఉన్న ఎయిరిండియా ఆఫీసుకు వెళ్లి అడిగితే, తప్పుడు ఈ-మెయిల్ ఐడీకి ఫిర్యాదు పంపించినట్టు ఆమెపైనే నెట్టేశారు. అయితే టిక్కెట్ ఛార్జీ మొత్తాన్ని తాము రీఫండ్ చేయలేమంటూ ఎయిరిండియా తేల్చిచెప్పింది. కేవలం టిక్కెట్లను రద్దు చేసుకునే పెనాల్టీ ఫీజు నుంచి మాత్రమే మినహాయింపు ఇస్తామంటూ చెప్పింది. తనకు టిక్కెట్ల మొత్తం రీఫండ్ కావాలని కోరితే, ఇలా నిర్లక్ష్యపూర్వకంగా వ్యవహరించడంపై సౌమ్య మండిపడింది. తర్వాత సౌమ్య శెట్టీ మెయిల్‌కు సమాధానమిచ్చిన ఎయిరిండియా యాజమాన్యం తాము పరిహారం కానీ, రీఫండ్ గురించి కానీ ఎక్కడ తెలుపలేదని, ఎయిర్‌క్రాఫ్ట్‌లో నల్లుల ప్రవేశంపై విచారణ చేపట్టామని తెలిపింది. ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకుంటామని పేర్కొంది. సౌమ్యకు, తన పిల్లలకు ఈ నల్లులు కుట్టడం వల్ల 10వేల డాలర్ల మేర ఖర్చు అయిందని సౌమ్య భర్త కూడా ట్విటర్ ద్వారా ఈ విమానయాన సంస్థకు తెలిపాడు. దానికి బాధ్యత ఎవరంటూ కడిగిపారేశాడు. సౌమ్యకు మాత్రమే కాక, ఇదే రకమైన పరిస్థితి ఇటుఎయిరిండియా విమానంలో న్యూయార్క్ నుంచి ప్రయాణించిన మరో ప్రయాణికుడికి కూడా ఎదురవడం, ఈ విమానయాన సంస్థను మరింత ఇరకాటంలో పడేసింది.