Man Defecates Mid-Air On Mumbai-Delhi Air India Flight, Arrested - Sakshi
Sakshi News home page

ఎయిరిండియా విమానంలో తప్పతాగి.. ఫ్లోర్‌పై మలమూత్రవిసర్జన.. అరెస్ట్‌

Published Tue, Jun 27 2023 11:00 AM | Last Updated on Tue, Jun 27 2023 11:51 AM

Man Defecates Mid Air On Air India Flight Arrested - Sakshi

ముంబై: విమాన ప్రయాణికుల అనుచిత/అభ్యంతరకర ప్రవర్తనల ఘటనలు ఈమధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లోకి ఎక్కుతున్నాయి. తాజాగా గగనతలంలో ఉన్న ఎయిరిండియా విమానంలో.. అదీ నడి విమానంలో ఓ ప్రయాణికుడు మలమూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో తీవ్ర ఇబ్బందికి గురైన ప్రయాణికులు ఆందోళన చేపట్టగా.. సదరు ప్రయాణికుడిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.  
 
సోమవారం పోలీసులు రిలీజ్‌ చేసిన ఎఫ్‌ఐఆర్‌లో.. జూన్‌ 24వ తేదీన ముంబై-ఢిల్లీకి చెందిన ఎయిరిండియా విమానం ఏఐసీ 866 ప్రయాణంలో ఉంది. అయితే.. విమానం తొమ్మిదో వరుసలో సీట్‌ నెంబర్‌ 17ఎఫ్‌లో కూర్చున్న  రామ్‌ సింగ్‌ అనే ప్రయాణికుడు ఈ పని చేశాడు. మద్యం మత్తులోనే అతను ఈ చర్యకు దిగాడు. అతని చర్యతో ప్రయాణికులు ఇబ్బంది పడి.. సిబ్బంది వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. 

అతని అనుచిత ప్రవర్తన గుర్తించిన విమాన సిబ్బంది హెచ్చరించడంతో పాటు పైలట్‌ ఇన్‌ కమాండోకు సమాచారం అందించారు. వెంటనే సమాచారం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లగా.. దిగగానే రామ్‌సింగ్‌ ఎయిరిండియా భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. ఐపీసీలోని సెక్షన్లు 294, 510 ప్రకారం అతనిపై కేసు నమోదు అయ్యింది.   

ఇదీ చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో పూరీ జగన్నాథుడు.. తీవ్ర దుమారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement