Defecating
-
ఎయిరిండియా నడి విమానంలో మలమూత్రవిసర్జన.. అరెస్ట్
ముంబై: విమాన ప్రయాణికుల అనుచిత/అభ్యంతరకర ప్రవర్తనల ఘటనలు ఈమధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లోకి ఎక్కుతున్నాయి. తాజాగా గగనతలంలో ఉన్న ఎయిరిండియా విమానంలో.. అదీ నడి విమానంలో ఓ ప్రయాణికుడు మలమూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో తీవ్ర ఇబ్బందికి గురైన ప్రయాణికులు ఆందోళన చేపట్టగా.. సదరు ప్రయాణికుడిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. సోమవారం పోలీసులు రిలీజ్ చేసిన ఎఫ్ఐఆర్లో.. జూన్ 24వ తేదీన ముంబై-ఢిల్లీకి చెందిన ఎయిరిండియా విమానం ఏఐసీ 866 ప్రయాణంలో ఉంది. అయితే.. విమానం తొమ్మిదో వరుసలో సీట్ నెంబర్ 17ఎఫ్‌లో కూర్చున్న రామ్ సింగ్ అనే ప్రయాణికుడు ఈ పని చేశాడు. మద్యం మత్తులోనే అతను ఈ చర్యకు దిగాడు. అతని చర్యతో ప్రయాణికులు ఇబ్బంది పడి.. సిబ్బంది వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. అతని అనుచిత ప్రవర్తన గుర్తించిన విమాన సిబ్బంది హెచ్చరించడంతో పాటు పైలట్ ఇన్ కమాండోకు సమాచారం అందించారు. వెంటనే సమాచారం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లగా.. దిగగానే రామ్‌సింగ్ ఎయిరిండియా భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. ఐపీసీలోని సెక్షన్లు 294, 510 ప్రకారం అతనిపై కేసు నమోదు అయ్యింది. ఇదీ చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో పూరీ జగన్నాథుడు.. తీవ్ర దుమారం -
సుఖంగా తెల్లవారాలంటే...
కొందరికి ప్రతిరోజూ ఉదయమే మలవిసర్జన నరకప్రాయంగా అనిపిస్తుంటుంది. ఆ పనికాస్తా సాఫీగా సాగితే రోజంతా హాయిగా ఉంటుంది. కానీ మన జీవనశైలిలో వచ్చిన మార్పులు, ఆహారంలో జంక్‌ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వంటి అంశాలు మలబద్దకం సమస్యను మరింత పెంచుతున్నాయి. కేవలం రోజూ తినే పండ్లు ఇతర ఆహార పదార్థాలతోనే ఈ సమస్యను తేలిగ్గా అధిగమించవచ్చు. యాభై ఏళ్లు దాటిన ప్రతి పురుషుడికీ ప్రతిరోజూ 38 గ్రాములు, అదే మహిళ అయితే 25 గ్రాముల పీచు పదార్థాలు అవసరం. మన మలం పలచగా ఉండాలంటే పెద్దపేగులో నీరు ఉండాలి. పీచు ఉన్న పదార్థాలు ఆహారంలో ఉంటే గనక, ఆ ఆహారం జీర్ణమై, శరీరంలోకి ఇంకే ప్రక్రియలో... ఉన్న నీరంతా పేగులు లాగేయకుండా ఈ పీచు అడ్డు పడుతుంది. అందుకే మలం మృదువుగా ఉండి, విరేచనం సాఫీగా అవుతుంది. మనం తీసుకునే ఆహారంలో కనీసం ప్రతిరోజూ 20 - 35 గ్రాముల పీచు ఉండాలి. దానికోసం స్వాభావికంగా పీచు లభ్యమయ్యే ఈ ఐదు ఆహార పదార్థాలు మీ భోజనంలో ఉండేలా చూసుకోండి.